న్యూయార్క్ : అమెరికాలోని రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో ఒక చిన్నారి మీజిల్స్ (తట్టు) బారిన పడి సోమవారం మరణించింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనల నేపథ్యంలో తాజా ఘటన మరింత కలకలం రేపింది. సిరాక్యూస్ ప్రాంతంలోని లూయిస్ కౌంటీలో ఘటన చోటుచేసుకుంది. గత 30 ఏళ్లలో ఈ వ్యాధి కారణంగా నమోదైన తొలి మరణం ఇదే.
ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ తెలిపారు. ఈ మరణం ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థల్లోని సంక్షోభానికి అద్దం పడుతోందన్నారు. గత నెలలోనే గవర్నర్ హోచుల్, మీజిల్స్ వ్యాప్తిని రాష్ట్రవ్యాప్త విపత్తుగా ప్రకటించారు. 2000లో పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం అమలు చేయడం ద్వారా మశూచి వ్యాప్తిని పూర్తిగా అరికట్టారు. ఇటీవలి కాలంలో నివారణ చర్యలు తగ్గడంతో కేసులు కమ్రేపీ పెరుగుతున్నాయి. ఈ ఏడాది దేశంలో మశూచికి సంబంధించిన మూడు మరణాలు నమోదైనట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ విభాగం తెలపగా, వాస్తవానికి ఇలాంటి కేసులు చాలానే ఉన్నట్లు రాష్ట్రాలు అంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు తమ రాష్ట్రంలో మశూచికి సంబంధించిన ఆరు వరకు మరణాలు నమోదైనట్లు పెన్సిల్వేనియా తెలిపింది.
ఇదీ చదవండి: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల సత్తా
అక్టోబర్ 29 నాటికి, ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 4,852 తట్టు కేసులను CDC ధృవీకరించింది. న్యూయార్క్ రాష్ట్రంలో మొత్తం 178 కేసులు నమోదయ్యాయి. ఇవి ప్రధానంగా రాష్ట్రంలోని మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి. అధికారుల ప్రకారం 2026లో ఇక్కడ 16 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: 1271 మందికి ఉద్వాసన : మహిళా సీఈవో భావోద్వేగ లేఖ వైరల్


