మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సెటైర్లు | Elon Musk Dig After Donald Trump Midterm Setback | Sakshi
Sakshi News home page

మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సెటైర్లు

Nov 4 2026 4:40 PM | Updated on Nov 4 2026 5:02 PM

Elon Musk Dig After Donald Trump Midterm Setback

వాషింగ్టన్‌ : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ పేలవ ప్రదర్శనపై అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఎన్నికలను ప్రభావితం చేసే శాటిలైట్‌ లేజర్లు తన వద్ద ఉన్నాయంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఎన్నికలను ప్రభావితం చేసే శాటిలైట్‌ లేజర్లు పని చేయలేదు  అంటూ ఎక్స్‌ వేదికగా సెటైర్లు వేశారు.

ఈ మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మస్క్ సుమారు 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం అమెరికా రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. ముఖ్యంగా సంప్రదాయ రిపబ్లికన్ల కంచుకోటగా ఉన్న టెక్సాస్‌లో డెమొక్రాట్ అభ్యర్థి జేమ్స్ తలారికో విజయం సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలతో అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల బలం పుంజుకుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు తీవ్ర సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ట్రంప్‌కు డెమోక్రాట్లతో కొత్త చిక్కులు.. ఎంతవరకు అడ్డుకట్ట వేయగలరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement