వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తానని, డెమోక్రాట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మంగళవారం న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో ఆధిపత్యం కోల్పోయే పరిస్థితి కనిపిస్తుండటంతో.. డెమోక్రాట్లతో చర్చలు జరిపి ఉమ్మడి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో తాను బరిలోనేని.. తాను బరిలో ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని కామెంట్స్ చేయడం మరో ట్విస్ట్.
ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వానికి మధ్యంతర ఎన్నికల ఫలితాలు రాజకీయ పరీక్షగా మారాయి. తాజా అంచనాల ప్రకారం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సెనెట్‌లోనూ డెమోక్రాట్లు పలు కీలక విజయాలు సాధించి ఆధిక్యం దిశగా సాగుతున్నారు. దీంతో కాంగ్రెస్‌లోని రెండు సభలపైనా పట్టు సాధించేందుకు డెమోక్రాట్లకు అవకాశం ఏర్పడింది.
🚨 BREAKING: President Trump just SPOKE OUT for the FIRST TIME after Democrats' big election win "I wasn’t on the Ballot and if I was, we would have won IN A LANDSLIDE! Thank you for your attention to this matter. President DONALD J. TRUMP" https://t.co/pSaBAdPGMa
— Eric Daugherty (@EricLDaugh) November 4, 2026
ముఖ్యంగా రిపబ్లికన్లకు బలమైన ప్రాంతాలుగా భావించే రెడ్ స్టేట్స్‌లోనూ డెమోక్రటిక్ అభ్యర్థులు విజయాలు సాధించడం ఈ ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. టెక్సాస్, కాన్సాస్, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్ల విజయాలు రిపబ్లికన్లకు రాజకీయంగా సవాలుగా మారాయి. టెక్సాస్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి జేమ్స్ తలారికో.. ట్రంప్ మద్దతున్న రిపబ్లికన్ అభ్యర్థి కెన్ పాక్స్టన్‌పై విజయం సాధించారు. తుది ఫలితాలు, కాంగ్రెస్‌లో పార్టీల బలాబలాలు పూర్తిగా ఖరారైన తర్వాతే అమెరికా రాజకీయాలపై ఈ ఎన్నికల ప్రభావం స్పష్టమవుతుంది.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం ఖరారైతే ట్రంప్ ప్రభుత్వానికి చట్టాల ఆమోదం, బడ్జెట్ నిర్ణయాలు, ఉన్నతస్థాయి నియామకాల విషయంలో ప్రతిపక్షం నుంచి సవాళ్లు ఎదురుకావచ్చు. ప్రతినిధుల సభలో ఆధిక్యం సాధిస్తే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు చేపట్టేందుకు డెమోక్రాట్లకు అవకాశం ఉంటుంది. సెనెట్‌లోనూ పట్టు సాధిస్తే అధ్యక్షుడి నియామకాలను ఆమోదించే ప్రక్రియలో కీలక పాత్ర పోషించగలరు.
ఇదీ చదవండి: నెతన్యాహుకు భారీ షాకిచ్చిన ట్రంప్


