అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ కాన్సాస్‌లో ఓటేస్తున్న జనం
వేల మెయిల్ బ్యాలెట్ల తొలగింపునకు వినతి
తొలగిస్తే అర్హులకూ అన్యాయమన్న న్యాయస్థానం
వాషింగ్టన్: కాలిఫోర్నియాలో వేలాది మెయిల్ ఓట్లను ప్రజలకు అందకుండా చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి దేశ సుప్రీంకోర్టు చెక్ చెప్పింది. మధ్యంతర ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు కొన్ని గంటల ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కాలిఫోర్నియా డెమోక్రాట్లకు మద్దతిచ్చే రాష్ట్రమన్నది తెలిసిందే. అయితే ఈ రాష్ట్ర ఓటరు జాబితాలో దాదాపు 20 వేల మందిపై ట్రంప్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాళ్ల అమెరికా పౌరులు కాదని ఆరోపిస్తూ మెయిల్ బ్యాలెట్ అందకుండా చేయాలని చూసింది.

వారి పౌరసత్వంపై తుది నిర్ణయం వెలువడే వరకూ ఓటింగ్‌కు దూరంగా ఉంచాలని హైకోర్టును కోరింది. అయితే హైకోర్టు ఇందుకు నిరాకరించింది. జాబితాలో తప్పులున్నట్టుగా కనిపిస్తున్నా బ్యాలెట్లు అందుబాటులో లేకుండా చేయడం వల్ల చాలామంది అర్హులు ఓటుహక్కు కోల్పోతారని స్పష్టం చేసింది. అత్యవసరమైన పరిస్థితి నేపథ్యంలో ఈ నిర్ణయం వెనుక ఉన్న హేతుబద్ధతను న్యాయస్థానం వివరించలేదు. దేశవ్యాప్తంగా మెయిల్ బ్యాలెట్లను నియంత్రించేందుకు ట్రంప్ గతంలో చేసిన ప్రయత్నాలను కూడా న్యాయస్థానం అడ్డుకున్న సంగతి తెలిసిందే.


