Oman: భారత నౌకపై దాడి.. భారత నావికుడు మృతి! | Oman Coast Attack, Indian Cargo Vessel Hit By Aerial Object, One Sailor Killed And 13 Rescued, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Oman: భారత నౌకపై దాడి.. భారత నావికుడు మృతి!

Nov 3 2026 11:37 AM | Updated on Nov 3 2026 11:59 AM

Indian Seafarer Killed After Aerial Attack On Vessel Off Oman Coast

ఒమన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సముద్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న భారత నౌకపై గుర్తుతెలియని వైమానిక వస్తువు దాడి చేసింది. ఈ ఘటనలో ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. నవంబర్ 2న జరిగిన ఈ ఘటనను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ నవంబర్ 3న వెల్లడించారు.

భారత జెండాతో ప్రయాణిస్తున్న మోటరైజ్డ్ సెయిలింగ్ వెసెల్ అల్ జుసుఫీపై ఈ దాడి జరిగింది. 14 మంది భారతీయ సిబ్బందితో వెళ్తున్న ఈ నౌక ఒమన్ తీరానికి సమీపంలో ఉండగా గుర్తుతెలియని వైమానిక వస్తువు తాకింది. దీంతో నౌకలోని సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నావికుడిని గుజరాత్‌కు చెందిన గంధర్ నహీమ్ అజీజ్‌గా గుర్తించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన 13 మంది సిబ్బందిని ఒమన్ కోస్ట్‌గార్డ్ సురక్షితంగా రక్షించింది. మృతుడి కుటుంబానికి కేంద్ర మంత్రి సోనోవాల్ సంతాపం తెలిపారు.
 

ప్రమాదం నుంచి బయటపడిన 13 మంది భారతీయ నావికులకు తక్షణ సహాయం అందించేందుకు భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రాణాలతో బయటపడిన సిబ్బందిని భారత్‌కు తీసుకొచ్చేందుకు, మరణించిన నావికుడి భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సోనోవాల్ వెల్లడించారు.

ఇదీ చదవండి: గాల్లోనే ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఒకరు మృతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement