మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు..  సీబీఐ అదుపులో ప్రధాన సూత్రధారి | Mahadev betting app promoter Sourabh Chandrakar extradited from Oman | Sakshi
Sakshi News home page

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు..  సీబీఐ అదుపులో ప్రధాన సూత్రధారి

Nov 2 2026 6:36 AM | Updated on Nov 2 2026 6:36 AM

Mahadev betting app promoter Sourabh Chandrakar extradited from Oman

న్యూఢిల్లీ: రూ.6 వేల కోట్ల మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ప్రధాన  సూత్రధారి సౌరభ్‌ చంద్రార్కర్‌ను ఒమన్‌ నుంచి తీసుకువచ్చినట్లు సీబీఐ ఆదివారం వెల్లడించింది. రెడ్‌ కార్నర్‌ నోటీసుకు స్పందించిన రాయల్‌ ఒమన్‌ పోలీసులు సౌరభ్‌ చంద్రార్కర్‌ జాడ గుర్తించి అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. సీబీఐ ప్రత్యేక బృందం ఒమన్‌ నుంచి అతడిని తీసుకువచ్చిందని, సోమవారం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని తెలిపింది.

సీబీఐ నమోదు చేసిన రెండు కేసులతోపాటు ఈడీ చార్జిషీట్‌ వేసిన ఒక కేసులో సౌరభ్‌ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని వివరించింది. ‘దేశంలోనే అతిపెద్ద బెట్టింగ్‌ సిండికేట్లలో ’మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బుక్‌’ ఒకటి, దీన్ని దేశం వెలుపల నుంచి నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది మనదేశం అంతటా విస్తరించి ఉంది. చట్ట విరుద్ధంగా క్రికెట్, ఫుట్‌బాల్, కార్డ్‌ గేమ్‌లు, ఇతర ఈవెంట్లపై చట్టవిరుద్ధంగా బెట్టింగ్‌లను నడుపుతోంది. ఈ సిండికేట్‌కు చెందిన దేశ, విదేశాల్లోని ఆస్తులను ఇప్పటికే అటాచ్‌ చేశాం’అని సీబీఐ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement