గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. కీలక నిర్ణయాలు తీసుకున్న పాకిస్తాన్, ఒమన్! | Pakistan, Oman deepen trade ties and call for Gulf de-escalation | Sakshi
Sakshi News home page

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. కీలక నిర్ణయాలు తీసుకున్న పాకిస్తాన్, ఒమన్!

Oct 15 2026 12:05 AM | Updated on Oct 15 2026 12:07 AM

Pakistan, Oman deepen trade ties and call for Gulf de-escalation

గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పాకిస్తాన్, ఒమన్ దేశాలు కీలక భేటీ నిర్వహించాయి. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి చర్చలు, దౌత్య మార్గమే ఏకైక పరిష్కారమని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. అదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటూ వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాలు, మానవ వనరుల పెంపునకు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి.  

ఇస్లామాబాద్ వేదికగా బుధవారం (అక్టోబర్ 14, 2026) నిర్వహించిన పాకిస్తాన్ - ఒమన్ జాయింట్ మినిస్టీరియల్ కమిషన్ 8వ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యిద్ బదర్ బిన్ హమద్ బిన్ హమూద్ అల్ బుసైదీ సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

వర్తక వాణిజ్యాలు, వ్యవసాయం, చమురు-గ్యాస్, కార్మిక రంగాలు, మానవ వనరుల అభివృద్ధికై జాయింట్ వర్కింగ్ గ్రూపుల సేవలను విస్తరించేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. అదేవిధంగా ఉభయ దేశాల మధ్య పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలోనే పాకిస్తాన్ వేదికగా ప్రత్యేక బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌ను నిర్వహించనున్నారు.

ఈ చర్చల సందర్భంగా కాశ్మీర్ వివాదంపై పాకిస్తాన్ వైఖరిని, ప్రాధాన్యతలను ఒమన్ మంత్రితో ఇషాక్ దార్ పంచుకున్నారు. మరోవైపు రవాణా, ఆహార భద్రత, టెక్నాలజీ విభాగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement