source: X
పాకిస్తాన్ స్టార్ బౌలర్ నసీమ్ షా మరోసారి గాయం బారిన పడ్డాడు. మోకాలి గాయం కారణంగా అతడు ILT20 2026 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న డెజర్ట్ వైపర్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ధ్రువీకరించాడు.
షార్జా వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో షా గాయం బారిన పడ్డాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో అతడు పాల్ వాల్టర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే వికెట్ తీసిన ఆనందాన్ని ఆస్వాదించకముందే మైదానంలో కుప్పకూలాడు. ఎడమ మోకాలిలో తీవ్ర నొప్పి రావడంతో బౌలింగ్ కొనసాగించలేక మైదానాన్ని వీడాడు.
వరుస గాయాలు
2026 ఏడాది ముగుస్తున్నా షాను గాయాల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో సైడ్ స్ట్రెయిన్ కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 తొలి అర్ధభాగానికి దూరమయ్యాడు.
ఆ గాయం నుంచి కోలుకుంటున్న సమయంలోనే మరోసారి ఎడమ మోకాలికి గాయమైంది. బౌండరీ సమీపంలో బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు మోకాలికి దెబ్బ తగలడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
ఏడు నెలల విరామం తర్వాత అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో జాతీయ జట్టులోకి తిరిగొచ్చాడు. అయితే ఆ పునరాగమనం కూడా సాఫీగా సాగలేదు. అక్టోబర్ 25న ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ట్రై సిరీస్‌లో తిరిగి గాయపడ్డాడు. తాజాగా మరోసారి గాయపడటంతో ILT20 సీజన్ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు.
ఇదీ చదవండి: IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. టీమిండియా స్టార్ ప్లేయర్‌పై వేటు?


