పాకిస్తాన్‌ కంటెంట్‌ ప్రసారం వద్దు!  | Indian Govt steps in to block Netflix Pakistani series | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ కంటెంట్‌ ప్రసారం వద్దు! 

Nov 27 2026 5:50 AM | Updated on Nov 27 2026 5:50 AM

Indian Govt steps in to block Netflix Pakistani series

నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశం 

న్యూఢిల్లీ: అనుకున్నట్లే అయ్యింది. పాకిస్తాన్‌ రూపొందించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘జో బచాయ్‌ హై సంగ్‌ సమేట్‌లో’ భారత్‌లో ప్రసారమయ్యే అవకాశాలు సన్నగిల్లాయి. పాకిస్తాన్‌కు చెందిన కంటెంట్‌ ఏదీ భారత్‌లో ప్రసారం కాకుండా జాగ్రత్త వహించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఆదేశించినట్లు అధికార వర్గాల ద్వారా తెలియడం దీనికి కారణం. 2025 మే 8న జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌కు సూచించినట్లు తెలుస్తోంది. 

భారత్‌లో పాకిస్తానీ సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో లేవని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూడా కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌ను కోరినట్లు సమాచారం.‘జో బచాయ్‌ హై సంగ్‌ సమేట్‌లో’í సిరీస్‌ ట్రైలర్‌ మంగళవారం విడుదల కాగా డిసెంబరు నెల ప్రసారం కానుంది. అయితే ఇది ఇతర దేశాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువయ్యాయి. కాగా ఈ వెబ్‌సిరీస్‌ను భారత్‌లో నిషేధించాలని కోరుతూ ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్, ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌లు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. గత ఏడాది పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం ఓటీటీలు, స్ట్రీమింగ్‌ వేదికలు పాకిస్తానీ కంటెంట్‌ను నిలిపివేయాలని కేంద్రం సూచించిన విషయాన్ని వీరు గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement