మీ పని ఎలా చేయాలో మేము చెప్పాలా? | Supreme Court expresses impatience with AP government lawyer in auto accident case | Sakshi
Sakshi News home page

మీ పని ఎలా చేయాలో మేము చెప్పాలా?

Nov 27 2026 5:34 AM | Updated on Nov 27 2026 5:34 AM

Supreme Court expresses impatience with AP government lawyer in auto accident case

ఆటో ప్రమాద కేసులో ఏపీ ప్రభుత్వ న్యాయవాదిపై సుప్రీంకోర్టు అసహనం 

సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు సమీ­పంలో 2004లో జరిగిన ఆటో ప్రమాద కేసులో ఐదుగురు ప్రతివాదులకు (2, 3, 4, 5, 6) సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) ద్వారా వ్యక్తిగతంగా నోటీసులు అందజేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సరైన చిరునామాలు అందుబాటులో లేవంటూ ప్రభుత్వ న్యాయవాది పేర్కొనడంతో.. ‘మీ పని ఎలా చేయాలో మేము చెప్పాలా?’ అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ప్రతివాదుల వాదనలు వినకుండా విచారణను పూర్తి చేయలేమని స్పష్టంచేసింది. 

ఇప్పటికే నోటీసులు అందుకున్న ప్రతివాదులను సంప్రదిస్తే మిగిలిన ప్రతివాదుల వివరాలు సులభంగా తెలుస్తాయని సూచించింది. వ్యక్తిగతంగా నోటీసులు అందజేయడంతోపాటు ఇతర మార్గాల్లోనూ ప్రతివాదులకు నోటీసులు అందించేందుకు పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి కూడా ధర్మాసనం అనుమతిచ్చింది. పిటిషనర్‌ భీమినేని పూర్ణచంద్రరావుకు లొంగిపోవాల్సిన అవసరం నుంచి ఇచ్చిన మినహాయింపును తదుపరి విచారణ వరకు పొడిగించింది.  

ఇదీ నేపథ్యం...  
కూలీలను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో బోల్తాపడిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గా­యపడ్డారు. ఈ కేసులో డ్రైవర్‌కు కింది కోర్టులు రెండేళ్ల జైలు శిక్ష విధించాయి. ఈ తీర్పును 2024లో హైకోర్టు సమర్థించినప్పటికీ, శిక్షా కాలాన్ని ఏడాదికి తగ్గించింది. వెంటనే మేజి్రస్టేట్‌ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పూర్ణచంద్రరావు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement