నిప్పులు చెరిగిన షాహీన్‌ అఫ్రిది.. 43 పరుగులకే 7 వికెట్లు | Shaheen Afridi Unleashes Fiery 7 Fer In Pakistan Quaid e Azam Trophy | Sakshi
Sakshi News home page

నిప్పులు చెరిగిన షాహీన్‌ అఫ్రిది.. 43 పరుగులకే 7 వికెట్లు

Nov 26 2026 8:25 PM | Updated on Nov 26 2026 8:36 PM

Shaheen Afridi Unleashes Fiery 7 Fer In Pakistan Quaid e Azam Trophy

source: X

పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టాడు. ఖైద్‌-ఎ-ఆజం ట్రోఫీ 2026లో నిప్పులు చెరిగాడు. ఫైసలాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. షాహీన్‌ ధాటికి ఫైసలాబాద్‌ 32.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది.

కాగా, 2018లో టెస్ట్‌ అరంగేట్రం చేసిన అఫ్రిది.. కొంతకాలంగా పాక్‌ పేస్‌ విభాగంలో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 2021లో అతడు అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఆ ఏడాది తొమ్మిది టెస్టుల్లో 17.06 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు.

అయితే ఆ తర్వాతి సంవత్సరాల్లో అదే స్థాయి నిలకడను కొనసాగించలేకపోయాడు. 2024లో రెండు టెస్టులు ఆడి కేవలం మూడు వికెట్లే తీశాడు. ఆతర్వాతి ఏడాది దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల్లో ఐదు వికెట్లు, బంగ్లాదేశ్‌తో జరిగిన ఒకే టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. తాజాగా దేశవాళీ ప్రదర్శన తర్వాత షాహీన్‌ టెస్ట్‌ల్లో పూర్వవైభవాన్ని సాధించాలని భావిస్తుంటాడు. 

ఇదీ చదవండి: సంచలనం సృష్టించిన సెహ్వాగ్‌ చిన్న కుమారుడు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement