26/11 దాడులు: కసబ్‌కు శిక్షణనిచ్చిన రాక్షసుడు ఎవరు? | 26/11 Mystery: Pak Major General Sahab who Trained Ajmal Kasab | Sakshi
Sakshi News home page

26/11 దాడులు: కసబ్‌కు శిక్షణనిచ్చిన రాక్షసుడు ఎవరు?

Nov 26 2026 4:17 PM | Updated on Nov 26 2026 4:20 PM

26/11 Mystery: Pak Major General Sahab who Trained Ajmal Kasab

సాక్షి, ముంబై:  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడులకు 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైన్యంతో పాటు ఐఎస్ఐ పాత్రపై కూడా పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. కానీ కసబ్‌కు శిక్షణ ఇచ్చినట్లు చెప్పబడుతున్న ఓ మేజర్ జనరల్ గుర్తింపు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 

26/11 కేసు ఛార్జ్‌షీట్లు, విచారణ పత్రాల్లో ఆయనను ‘నిందితుడు నంబర్ 20: మేజర్ జనరల్ సాహబ్ – పేరు తెలియదు’ అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన 32 మంది నిందితుల్లో ఇప్పటికీ గుర్తింపు తెలియని వ్యక్తి ఈయనే.

ఆ దాడుల్లో పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్ విచారణ సమయంలో ఈ అధికారి గురించి వివరాలు వెల్లడించాడు. ముజఫరాబాద్‌లోని లష్కరే తోయిబా శిక్షణ శిబిరానికి ఆయన వచ్చేవారని, హఫీజ్ సయీద్, జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ ఆయనను ఆప్యాయంగా పలకరించేవారని కసబ్ తెలిపాడు.

కసబ్‌కి ఎనిమిది వారాల శిక్షణను ఈ మేజర్ జనరల్ పర్యవేక్షించారని, 2008 ఆగస్టులో మరోసారి శిబిరానికి వచ్చి ఉగ్రవాదుల సామర్థ్యాన్ని పరీక్షించారని కసబ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అంతేకాదు శిక్షణ సమయంలో లక్ష్యాలను గురిచూసి కాల్చిన తర్వాత తన వీపుపై ఆయన అభినందనగా తట్టారని కూడా తెలిపాడు.

కసబ్, డేవిడ్ హెడ్లీ వాంగ్మూలాల ఆధారంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన పలువురు అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చినా.. ఈ ‘మేజర్ జనరల్ సాహబ్’ అసలు పేరు కానీ, ఆయన ఫొటో లేదా స్కెచ్ కానీ ఇప్పటికీ అందుబాటులో లేవు.

2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఈ దాడుల్లో 26 మంది విదేశీయులు సహా మొత్తం 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు పలు ప్రాంతాల్లో దాడులు చేసి, రెండు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలోని సాధారణ ప్రజలను బందీలను చేసి సుమారు 60 గంటల పాటు భయాందోళనలు సృష్టించారు.

ఇదీ చదవండి: మావోయిస్టులు భారీగా దాచిన నగదు, బంగారం గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement