బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో రూ.39.77 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. భైరామ్‌గఢ్ ప్రాంతంలోని బాడేపల్లి అటవీ ప్రాంతంలో భూమి కింద దాచిన ఈ నగదును గుర్తించారు.
పోలీసులకు అందిన సమాచారం మేరకు డీఆర్జీ, భైరామ్‌గఢ్ పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (బీడీఎస్) సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భూమిలో పాతిపెట్టిన ఓ ఉక్కు పెట్టెను గుర్తించారు. దానిని తనిఖీ చేయగా టేపుతో చుట్టిన ప్యాకెట్లలో నగదు లభించింది. మొత్తం రూ.39 లక్షల 77 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, గతంలో చేపట్టిన వివిధ ఆపరేషన్లలో భద్రతా దళాలు రూ.7 కోట్ల 60 లక్షల 33 వేల 800 నగదుతో పాటు 8.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: కోర్టు వెలుపల హత్యాయత్నం.. కత్తులతో దాడి, కాల్పులు


