ఇక.. దిమాగీ నక్సల్స్‌ మిగిలారు  | Dimagi Naxals instigating people against Constitution says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఇక.. దిమాగీ నక్సల్స్‌ మిగిలారు 

Nov 10 2026 6:13 AM | Updated on Nov 10 2026 6:13 AM

Dimagi Naxals instigating people against Constitution says PM Narendra Modi

గుర్తించి ఓడించాలి: ప్రధాని మోదీ 

జవాన్లతో దీపావళి వేడుకలు 

జగదల్‌పూర్‌: దేశంలో సాయుధ మావోయిస్టులను తుడిచిపెట్టగలిగినా దిమాగీ నక్సలైట్లు వేర్వేరు రాజకీయ పార్టీల్లోకి చొరబడి ప్రజలను రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇలాంటి వారిని గుర్తించి ఓడించాలని తద్వారా దేశాన్ని రక్షించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

 ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మధ్య ఆదివారం దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మాట్లాడుతూ నక్సలిజమ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, వేర్పాటువాదులకు, నక్సలైట్ల ఫండింగ్‌పై కేంద్రం నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుందని ప్రధాని చెప్పారు. 

దేశంలో నక్సలిజమ్‌ అంతమైనట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31వ తేదీన ప్రకటించిన సంగతి తెలిసిందే. మావోయిస్టు ఉగ్రవాదం అంతం ఈ దేశం సాధించిన విజయమని, ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ సంకల్పంతోనే సాధ్యమైందని చెప్పారు. అయితే కొంతమంది దిమాగీ నక్సల్స్‌ దేశంలోని పలు సంస్థల్లో పట్టు సాధించారని అన్నారు. ఈ రోజుకు కూడా వారు ప్రజలను రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉసికొల్పుతున్నారని ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement