తిరువనంతపురం: కేరళంలోని నాలుగు జిల్లాల్లోని పెట్రోల్ పంపుల్లో ఇథనాల్ మోతాదులపై పరీక్షలు నిర్వహించినట్టు ఆ రాష్ట్ర మంత్రి అనూప జాకబ్ సోమవారం ప్రకటించారు. కర్ణాటకలోని వేర్వేరు చోట్ల సేకరించిన పెట్రోల్ 30 శాతం వరకూ ఇథనాల్ ఉన్నట్లు అక్కడి మంత్రి ప్రకటించిన నేపథ్యంలో తామీ చర్య తీసుకున్నట్లు జాకబ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కేరళంలోనూ పెట్రోల్ కల్తీ కారణంగా వాహనాలు దెబ్బతింటున్నట్లు పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహణకు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
‘‘పెట్రోల్‌లో పరిమితికి మించి ఇథనాల్ ఉందన్న అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే వాహనాలు దెబ్బతింటున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ భయాలను పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం’’అని వివరించారు. కొన్ని òపెట్రోల్ పంపుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రభుత్వం గుర్తించిన ల్యాబ్‌లకు పంపుతామని, పది రోజుల్లో ఫలితాలు రావచ్చునని కేరళం ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్ మంత్రి అయిన జాకబ్ చెప్పారు..


