ప్రోరోగ్‌లో సరికొత్త రికార్డు  | Parliament Monsoon session has remained unprorogued for 88 days | Sakshi
Sakshi News home page

ప్రోరోగ్‌లో సరికొత్త రికార్డు 

Nov 10 2026 5:55 AM | Updated on Nov 10 2026 5:55 AM

Parliament Monsoon session has remained unprorogued for 88 days

న్యూఢిల్లీ: భారత పార్లమెంటు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ యేటి వర్షాకాల సమావేశాలు ముగిసి 88 రోజులు అవుతున్నా అధికారిక ఉత్తర్వులు (ప్రోరోగ్‌) జారీ కాకపోవడం దేశ చరిత్రలో ఇది రెండోసారి. 2008లో 87 రోజులపాటు పార్లమెంట్‌ ప్రోరోగ్‌ కాలేదు. ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20వ తేదీ మొదలు కాగా.. 19 సిట్టింగ్స్‌ తరువాత లోక్‌సభ, రాజ్యసభలు రెండూ ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా (సైనిడై) పడ్డాయి. కానీ ముగిసినట్లుగా అధికారిక ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. 

దీంతో వర్షాకాల సమావేశాలను పొడిగిస్తూ ఉభయ సభలు మరోసారి సమావేశమయ్యేందుకు అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతి తక్కువ సమయం నోటీసిచ్చి పార్లమెంటును మళ్లీ సమావేశ పరిచి, మహిళ రిజర్వేషన్‌ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతోపాటే లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రస్తుత 543 స్థానాలను 850కు పెంచేందుకూ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వర్షాకాల సమావేశాలు అధికారికంగా ముగియని పరిస్థితుల్లో ప్రభుత్వం రెండు రోజుల నోటీసుతో పార్లమెంటును మళ్లీ సమావేశ పరచవచ్చు. తాజా సమావేశాల కోసమైతే 14 రోజుల నోటీసు అవసరమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement