మాటల మంటలు  | Kiren Rijijus Strong Reply to Mallikarjun Kharge in Rajya Sabha | Sakshi
Sakshi News home page

మాటల మంటలు 

Aug 7 2026 5:52 AM | Updated on Aug 7 2026 6:02 AM

Kiren Rijijus Strong Reply to Mallikarjun Kharge in Rajya Sabha

రాజ్యసభలో సభా కార్యక్రమాలపై ఖర్గే, రిజిజు మధ్య వాగ్వాదం 

నిలదీయడం తమ హక్కు అని స్పష్టం చేసిన ఖర్గే 

కాంగ్రెస్‌ తీరుతో సొంత ఎంపీలకే మాట్లాడే చాన్స్‌ రావట్లేదన్న రిజిజు 

హోంమంత్రి సభకు రావాలని విపక్షాల డిమాండ్‌ 

ఇరుసభల్లో గందరగోళం 

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్ష ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కీలక జాతీయ అంశాలపై రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌లను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు తప్పుబట్టారు. దీంతో ఇరుపక్షాల సభ్యులు మధ్య మాటల మంటలు చెలరేగాయి.  

రిజిజు నుంచి నేర్చుకోవాలా?: ఖర్గే 
రాజ్యసభ మొదలైన వెంటనే చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఈ సందర్భంగా జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులపై పోలీసుల దాషీ్టకం అంశంలో కేంద్ర హోంమంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అధికార పక్షం, చైర్మన్‌ అడ్డుచెప్పడంతో ఖర్గే జోక్యంచేసుకున్నారు. ప్రతిపక్షం లేవనెత్తుతున్న ప్రజా సమస్యలకు సమాధానం చెప్పకుండా నిబంధనల పేరుతో ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజా ప్రయోజనకర అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరడం ప్రతిపక్షాల రాజ్యాంగబద్ధ బాధ్యత అని గుర్తుచేశారు. సభా నియమాలను ఖర్గే పాటించడం లేదన్న రిజిజు వ్యాఖ్యలకు ఖర్గే ఘాటుగా స్పందించారు. ‘రిజిజు నుంచి మేం నేర్చుకోవాల్సి వస్తోంది. ఎప్పుడు, ఎక్కడా, ఎలా, ఏది మాట్లాడాలో మాకు తెలుసు’అని అన్నారు.  

కాంగ్రెస్‌ తీరుతో చాన్స్‌ రావట్లేదన్న రిజిజు 
ఖర్గే వ్యాఖ్యలపై రిజిజు స్పందించారు. ‘‘ప్రతిపక్ష నేత డిమాండ్లు చేస్తున్నప్పుడు సంబంధిత నిబంధనలను ప్రస్తావించకుండా కేవలం ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదు. సభను గానీ, చైర్మన్‌ను గానీ ఎవ్వరూ ఆదేశించజాలరు. కాంగ్రెస్‌లోని యువ, కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశాలు దక్కట్లేదు. ముఖ్యంగా పవన్‌ ఖేరా వంటి కొత్త సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వట్లేదు.

 సభలో చర్చలు, ప్రశ్నోత్తరాలు, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక సంభాషణ జరగాలంటే అధికార, ప్రతిపక్షాలు రెండూ పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించి సహకరించాలి’’అని రిజిజు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో నినాదాలు మార్మోగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. 

విపక్షాల వాదనలను వినండి: చైర్మన్‌ 
12 గంటలకు సభ ఆరంభమయ్యాక రాజ్యసభ చైర్మన్‌ రాధాకృష్ణన్‌ సభలో ఉన్న మంత్రి రిజిజునుద్దేశించి మాట్లాడారు. ‘‘ఇన్ని రోజులుగా విపక్షసభ్యులు హోం మంత్రి సభకు రావాలని, జంతర్‌మంతర్‌ ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌చేస్తున్నారు. వాళ్ల డిమాండ్లను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లండి. షాను సభకు రమ్మని చెప్పండి. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మీరే ’’అని రాధాకృష్ణ గుర్తుచేశారు. పోలీస్‌చర్యపై అమిత్‌ షా ప్రకటన చేయాలంటూ కాంగ్రెస్‌సహా విపక్ష పారీ్టలకు చెందిన కొందరు సభ్యులు వాకౌట్‌చేశారు. తర్వాత సైతం రాజ్యసభలో నినాదాలు కొనసాగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది.  

లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి 
లోక్‌సభ మొదలుకాగానే దశాబ్దాల క్రితం హిరోíÙమా, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడిలో మరణించిన వారికి సభ్యులు నివాళులరి్పంచారు. తర్వాత వెంటనే విపక్ష సభ్యులు పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ నినాదాలు మొదలెట్టారు. దీంతో లోక్‌సభ స్పీకర్‌ బిర్లా అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం సరికాదని సభ్యులకు సూచించారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోవడంతో లోక్‌సభలో వాయిదాలు కొనసాగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement