ఎలా కూర్చుంటున్నారు? 'ప్లీజ్‌ చెక్‌'! | Decisions are influenced by sitting posture in offices | Sakshi
Sakshi News home page

ఎలా కూర్చుంటున్నారు? 'ప్లీజ్‌ చెక్‌'!

Aug 7 2026 5:55 AM | Updated on Aug 7 2026 5:55 AM

Decisions are influenced by sitting posture in offices

ఆఫీసుల్లో కూర్చొనే భంగిమ ఆధారంగా నిర్ణయాలు ప్రభావితం

కెనడాలోని మెక్‌గిల్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో వెల్లడి

కార్యాలయాల్లో ఒక వ్యక్తి కూర్చునే లేదా నిలబడే భంగిమ వారి భావోద్వేగాలను, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని కెనడాలోని మెక్‌గిల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిటారుగా కూర్చున్న వారు రిస్క్‌ తీసుకునే పనుల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని.. ముందుకు వంగి కూర్చున్న వారి కంటే ఎక్కువ సానుకూల భావాలను వ్యక్తపరుస్తారని పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు మన మానసిక స్థితిపై శరీరం చూపే ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయని మెక్‌గిల్‌ విశ్వవిద్యాలయ సైకియాట్రీ విభాగ ప్రొఫెసర్‌ జార్జ్‌ ఆర్మోనీ తెలిపారు. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

అధ్యయనం ఇలా..
అధ్యయనంలో భాగంగా కొందరు ఉద్యోగు లను మొదట ఒక ట్యాబ్‌లో కొత్త టాస్క్‌ చేయాలని పరిశోధకులు కోరారు. ఆయా ఉద్యోగులు నిటారుగా కూర్చోవడానికి వీలు గా ట్యాబ్‌ను సర్దుబాటు చేయగల ఒక టేబుల్‌పై ఉంచారు. అలాగే మరికొందరు ఉద్యోగుల కోసం టేబుల్‌ ఎత్తును తగ్గించి వారు ముందుకు వంగి కూర్చునేలా ట్యాబ్‌ను ఉంచారు. ఇక రెండవ దశలో ఉద్యోగులకు ఒక రిస్క్‌ తీసుకునే పరీక్షను ఇచ్చారు. 

అందులో వర్చువల్‌ బెలూన్‌ను ఊదడం ద్వారా బహుమతులు గెలుచుకోవ చ్చని చెప్పారు. ఈ టాస్క్‌లో నిటారుగా కూర్చున్న వారు ఎక్కువ రిస్క్‌ తీసుకొని ఎక్కువ బహుమతులు గెలుచుకున్నారని, వారు సరైన వ్యూహంతో రిస్క్‌ తీసుకున్నారని ఆర్మోనీ వివరించారు. నిటారుగా కూర్చున్న ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు.

వర్క్‌ప్లేస్‌ ఎర్గోనామిక్స్‌ అంటే?
ఉద్యోగుల శారీరక సామర్థ్యాలు, పరిమితులకు తగినట్లుగా పని వాతావరణాన్ని, పరికరాలు, ఫర్నిచర్‌ను అమర్చే శాస్త్రం. సులభంగా చెప్పాలంటే మనిషికి పనిని మార్చడం కాకుండా మనిషికి సౌకర్యంగా ఉండేలా పనిచేసే విధానాన్ని లేదా వాతావరణాన్ని కల్పించడమే ఎర్గోనామిక్స్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement