కలర్‌ఫుల్‌ పక్షులకే కష్టాలు! | The survival of attractive colorful birds is under great threat | Sakshi
Sakshi News home page

కలర్‌ఫుల్‌ పక్షులకే కష్టాలు!

Aug 5 2026 5:01 AM | Updated on Aug 5 2026 5:01 AM

The survival of attractive colorful birds is under great threat

ఆకర్షణీయమైన రంగురంగుల పక్షుల మనుగడకే అధిక ముప్పు

అక్రమ రవాణా, అడవుల నరికివేతే ప్రధాన కారణాలు

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

ప్రకృతి ఒడిలో తిరిగే రంగురంగుల పక్షుల అందమే ఇప్పుడు వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ రంగుల పక్షులతో పోలిస్తే.. ప్రకాశవంతమైన, ఆకర్షణీ యమైన రంగుల్లో కనిపించే పక్షులకే అంతరించి పోయే ముప్పు ఎక్కువగా ఉందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు మాంటెగ్యూ నీట్‌ క్లెగ్, నటాలియా ఒకాంపొ–పెన్యులా వియత్నాంలో పక్షులను పరిశీలించే యాత్ర ద్వారా కొన్ని రంగు రంగుల పక్షులు తీవ్ర ప్రమా దంలో ఉన్నాయని, వ్యాపార వర్గాల్లో వాటికే అధిక గిరాకీ ఉందని గ్రహించారు. 

అనంతరం అంతర్జాతీయంగా పరిస్థితే మిటో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) దగ్గర ఉన్న రెడ్‌ లిస్ట్‌లోని సుమారు 4,334 పాసరీన్‌ (పాటలు పాడే) కోవకు చెందిన పక్షి జాతుల స్థితిగతులను విశ్లేషించారు. పిచ్చుకలు, బుల్‌బుల్‌ వంటి పక్షులు కూడా వాటిలో ఉన్నాయి. వారి సందేహం నిజమేనని అధ్యయనంలో తేలింది. 

అక్రమ రవాణా దెబ్బ
రంగురంగుల ఈకలున్న పక్షులకు ముప్పు పెరగ డానికి ప్రధాన కారణం మానవ ప్రలోభాలు, పెంపుడు పక్షుల అక్రమ రవాణా వ్యాపారమేనని పరిశో ధకులు విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా అరుదైన రంగురంగుల పక్షులను ఇళ్లలో పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆ పక్షులకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిందని.. దీంతో వేటగాళ్లు అడవుల నుంచి ఆకర్షణీయమైన పక్షులను పట్టుకొని అక్రమ రవాణా చేయడం వల్ల అడవుల్లో వాటి సంఖ్య వేగంగా పడిపోతోందని పరిశోధకులు పేర్కొన్నారు.

ప్రత్యేకతలే శాపం..
అడవుల నరికివేతతో పక్షుల సహజ నివాస ప్రాంతాలు వేగంగా దెబ్బతింటున్నాయి. సాధా రణ పక్షులు విభిన్న వాతావ రణాలకు సులువుగా అల వాటుపడగలవు. కానీ విభిన్న రంగులు, ప్రత్యేక ఆహార అలవాట్లుగల రంగురంగుల పక్షులు నిర్దిష్ట మైన పర్యావరణ వ్యవస్థలపైనే ఆధారపడి జీవి స్తాయి. అటువంటి నివాస ప్రాంతాలు ధ్వంసం కావడం వాటి ఉనికికే ప్రమాదకరంగా మారిందని పరిశోధకులు గుర్తించారు. 

చెట్ల జాతుల విత్తనాల వ్యాప్తికి, పూల పుప్పొడి రేణువుల చేరవేతకు, పర్యా వరణ సమతుల్యతకు పక్షులు దోహదపడతాయి. ఇవి అంతరించిపోతే పర్యావరణం దెబ్బతింటుంది. పక్షుల అక్రమ రవాణాను కఠిన చట్టాలతో అరి కట్టాలి. అరుదైన రంగుల పక్షులు నివసించే అటవీ ప్రాంతాలను పరిరక్షించే ప్రత్యేక ప్రణాళికలను ప్రపంచ దేశాలు తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement