వాషింగ్టన్: కేవలం 18 ఏళ్ల వయసున్న నాథన్ థామస్ 306 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు్కడైన పురుష ప్రొఫెసర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమయ్యే వయసులో తరగతి గదిలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ వయసు 18 ఏళ్ల 346 రోజులు. ప్రపంచంలో యంగెస్ట్ మేల్ ప్రొఫెసర్‌గా గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా 306 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును తిరగ రాశాడు.
అమెరికాలోని మియామి డేడ్ కాలేజీలో ఇంజనీరింగ్ బోధకుడిగా చేరాడు. దాదాపు తన వయసులోనే ఉన్న విద్యార్థులకు బోధిస్తున్నాడు. 1717లో 19 ఏళ్ల వయసులో ప్రొఫెసర్ అయిన స్కాటిష్ గణిత శాస్త్రవేత్త కోలిన్ మెక్‌లారిన్ నెలకొలి్పన రికార్డును థామస్ అధిగమించాడు. నాథన్ విద్యా ప్రస్థానం చాలామంది కంటే చాలా ముందుగానే ప్రారంభమైంది.
పాఠశాల విద్యను కొనసాగిస్తూనే 10 ఏళ్ల వయసులో డ్యూయల్–ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమం ద్వారా మియామి డేడ్ కాలేజీలో చేరాడు. 14 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మారాడు. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను పూర్తి చేశాడు. తాను ఒకప్పుడు విద్యారి్థగా చదువుకున్న అదే కళాశాలకు తిరిగి వచ్చాడు. కానీ, ఈసారి అధ్యాపకుడిగా అక్కడ అడుగుపెట్టారు.


