మేడం, మేడం అంటూ ఆకతాయిల అరాచకం | Engineering College Student Incident | Sakshi
Sakshi News home page

మేడం, మేడం అంటూ ఆకతాయిల అరాచకం

Jul 3 2026 8:35 AM | Updated on Jul 3 2026 10:53 AM

Engineering College Student Incident

కర్ణాటక: ఇంజనీరింగ్‌ విద్యార్థిని నడుచుకొని ఇంటికి వెళుతుండగా ఆకతాయిలు వేధించగా ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. ఇంటికి వెళ్లాక దుండగులు వచ్చి కత్తితో దాడి చేసిన దురాగతం చింతామణి పట్టణంలోని అశ్రయ లేఔట్‌లో జరిగింది. వివరాలు.. మేఘన (20) ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌ చదువుతోంది. 

ఆమె నృత్యకారిణి కావడంతో నూతన హైస్కూల్లో విద్యార్ధులకు శిక్షణనిచ్చి ఇంటికి వెళ్తోంది. కౌశిన్, వినయ్‌ అనే కీచకులు ఆమె వెంటపడుతూ మేడం, మేడం అని హేళన చేయసాగారు. మేఘన అడ్డుకోవడంతో ఆమెకు చెంపదెబ్బలు కొట్టారు. తరువాత 10 మంది గుంపుతో ఆమె ఇంటిలోకి చొరబడి  చాకుతో దాడి చేశారు. మేఘన గాయపడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. పట్టణంలో పోకిరీల ఆగడాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement