అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వివాదాస్పదమయ్యాయి. దేశమంతా ఘనంగా జెండా పండుగ జరుపుకుంటున్న వేళ, బాధ్యతాయుతమైన ప్రభుత్వ శాఖ సిబ్బంది చేసినపని తీవ్ర విమర్శలకు దారితీసింది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ గీతాలు, దేశభక్తి గేయాలు వినిపించాల్సిందిపోయి.. ‘రాను బొంబాయికి రాను’ వంటి సినిమా, ఫోక్ సాంగ్స్ పెట్టి సిబ్బంది చిందులు వేశారు. జాతీయ వేడుకల పవిత్రతను విస్మరించి, ఇలా సినిమా పాటలకు డ్యాన్సులు చేయడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో అధికారికంగా జరుపుకోవాల్సిన వేడుకలను ఇలా చులకన చేయడంపై ప్రజలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని అవహేళన చేసేలా ప్రవర్తించిన ఏపీఎఫ్‌డీసీ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


