సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగు భాషను మరోసారి ఖూనీ చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవంలో తెలు గు భాషను ఖూనీ చేస్తూ లోకేశ్ చేసిన ప్రసంగం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. ఆయన ప్రసంగంపై నెటిజన్‌లు సెటైర్‌లు వేస్తున్నారు. ‘చూసి కూడా చదవలేని మాలోకం మన విద్యా శాఖ మంత్రి, తప్పులు లేకుండా తెలుగు పదాలు పలకలేడు, ఇలాంటి వ్యక్తి మంత్రి అంటే సిగ్గు సిగ్గు, సెండ్ హిమ్ టు ఎల్‌కేజీ, ఏ ఊకో రా అయ్యా సిగ్గు తీస్తున్నావ్’ అంటూ నెటిజన్లు రకరకాల సెటైర్లు, కామెంట్లు చేస్తున్నారు.
తెలుగును ఖూనీ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లోకేశ్ వ్యాఖ్యల్లో కొన్ని..
⇒ తెనాలికి చెందిన ఎనిమిది ఏడుగురు ప్రాణ త్యాగాలు చేశారు. పోరాడిన అమర వీలుకు(అమరవీరులకు) నా నివాల్(నివాళి)
⇒ ఈ రోజు జరుగుతున్న ఈ వేడకలు(వేడుకలు) నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది(గుర్తుంటాయి).
⇒ ఏడాదికి 250 పెంక్షం(పెన్షన్) పెంచడం కాదు.. హామీలకు కట్టుబడి ఉన్నాం.
⇒ విద్యా మిత్ర ద్వారా 99.. 150.. (99,150) మంది విద్యార్థులకు కిట్స్ అందజేశాం.
⇒ ఉద్యమం పంట(ఉద్యాన పంట)లు అభివృద్ధికి నిధులిచ్చాం.


