రాయలసీమ విద్యాసంస్థల అధిపతి కొండారెడ్డి కన్నుమూత | Rayalaseema Educational Institutions Head Konda Reddy Passes Away | Sakshi
Sakshi News home page

రాయలసీమ విద్యాసంస్థల అధిపతి కొండారెడ్డి కన్నుమూత

Aug 16 2026 4:38 AM | Updated on Aug 16 2026 4:38 AM

Rayalaseema Educational Institutions Head Konda Reddy Passes Away

చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస 

సాక్షి, అమరావతి: ప్రముఖ విద్యావేత్త, తిరుప­తిలో రాయలసీమ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు వై.కొండారెడ్డి (81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యు­లు చెన్నై కావేరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొండారెడ్డి భౌతికాయాన్ని ప్రజల దర్శనార్థం భైరాగిపట్టెడలోని ఆయన నివాసం వద్ద ఉంచారు. అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం తిరుపతి సమీపంలోని సి.గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆయన కుమారులు వై.ఆనంద్‌రెడ్డి, వై.విజయ్‌రెడ్డి తెలిపారు. 

వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన కొండారెడ్డి  
విద్యను సామాజిక బాధ్యతగా భావించి వేలాదిమంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిన విద్యాప్రదాత కొండారెడ్డి. రాయలసీమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎంతో విలువైనది. కొండారెడ్డి మృతి రాయలసీమ విద్యారంగానికి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రారి్థస్తూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement