సాక్షి, విజయవాడ : ఎంపీ కేశినేని చిన్ని ఆఫీసులో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ సందర్బంగా జాతీయ పతాకాన్ని టీడీపీ నేతలు తిరగేసి కట్టారు. అయితే జెండా ఎగురవేసే సమయంలో పతాకం రివర్స్‌గా ఉన్న సంగతి గమనించే వెంటనే కిందకి దించారు. ఇదంతా గమనించిన ఎంపీ కేశినేని ఏమి తెలియనట్లు మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు.


