సాక్షి, తాడేపల్లి: 34 శాతం బీసీ రిజర్వేషన్ చెల్లదని తెలిసీ చంద్రబాబు డ్రామా చేశారని.. కేవలం బీసీలను మోసం చేయటానికే ఈ నాటకమంటూ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే చట్టమే తీసుకురావచ్చు.. కానీ అలా చేయకపోవటానికి కారణం బీసీలు ఎదగటం చంద్రబాబుకు ఇష్టం లేదు. వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు’’ అంటూ ఆమె దుయ్యబట్టారు.
‘‘అందుకే ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, జడ్పీలు, మేయర్లు, ఎంపీపీలు.. ఇలా అన్ని పదవుల్లోనూ వైఎస్ జగనే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. బీసీల బతుకుల్లో వెలుగు నింపినది వైఎస్ జగన్ మాత్రమే. బీసీల కోసం ప్రత్యేకంగా ఒక శాఖను పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదన చేసిందీ వైఎస్ జగనే. బీసీల్లోని కులవృత్తుల వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నదీ వైఎస్ జగనే.. ఇలా అనేక రకాలుగా ఆయన బీసీలకు మేలు చేశారు’’ అని ఉషశ్రీ చరణ్ వివరించారు.
కానీ చంద్రబాబు పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నాయి. జోగి రమేష్, విడదల రజిని, కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు.. ఇలా అనేకమంది బీసీ నేతలపై దాడులు చేశారు. అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేశారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుంది’’ అని ఉషశ్రీ చరణ్ తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు!


