చంద్రబాబు డ్రామా పండింది.. రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత | AP High Court Strikes Down 34 Percentage BC Reservation GOs | Sakshi
Sakshi News home page

చంద్రబాబు డ్రామా పండింది.. రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత

Oct 1 2026 10:52 AM | Updated on Oct 1 2026 11:28 AM

AP High Court Strikes Down 34 Percentage BC Reservation GOs

సాక్షి, అమరావతి: బీసీల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు డ్రామా పండింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోలను ఏపీ హైకోర్టు గురువారం కొట్టేసింది. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం తెచ్చిన ఆ జీవోలు చెల్లవంటూ హైకోర్టు తేల్చేసింది. తద్వారా ఊహించిన తీర్పే రావడంతో కూటమి సర్కార్‌పై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం కోటా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026 ఆగస్టులో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే.. ఈ రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 

మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతున్నాయంటూ జీవో 105, జీవో 1065 చట్టబద్ధతను సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు సందర్భంగా.. రిజర్వేషన్లు 59 శాతానికి మించి ఉండకూడదన్న ధర్మాసనం,  రాజ్యాంగపరిధికి లోబడి రిజర్వేషన్లు కల్పించలేదని అభిప్రాయపడింది. మొత్తం రిజర్వేషన్లు పరిమితిని దాటకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని చెబుతూ పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలు తెచ్చిన ఆ జీవోలను డిస్మిస్‌ చేసింది. 

సర్‌ ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికలను వాయిదా వేయాలని వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం..  ఆ కారణంతో ఎన్నికలు వాయిదా వేయమని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. అలాగే వార్డుల పునర్విభజనపైనా జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణలో చట్ట నిబంధనలు పాటించాలని.. ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది.

డ్రామా నడిపిన చంద్రబాబు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చట్టం మాత్రం చేయలేదు. బదులుగా కేవలం జీవోలతో ముందుకెళ్లడంపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాల్సిన చంద్రబాబు.. డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు పేరిట మరో నాటకానికి తెర తీశారు. అయితే ఆ కమిటీ నివేదిక పూర్తిగా అందకముందే జీవోలు జారీ చేయడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. 

మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటే అంశంపై ఇప్పటికే న్యాయపరమైన వివాదాలు, గతంలో కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ.. అదే అంశంపై మరోసారి జీవోలు ఇవ్వడం ద్వారా బీసీలను చంద్రబాబు గందరగోళానికి గురిచేశారు. ఇటు.. కేంద్రంలోనూ భాగస్వామ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేసే దిశగా చర్యలు తీసుకోకపోవడాన్ని బీసీ సంఘాలు నిలదీస్తూ వస్తున్నాయి. ఈలోపు ఈ జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో.. చంద్రబాబు డ్రామా పండిందంటూ బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. 

ఇదీ  చదవండి: అదెలా సమర్థించుకుంటారు?.. ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement