కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌కు సెల్యూట్‌: వైఎస్‌ జగన్‌ | YS Jagan Salute To Flydubai Captain Smit Machchhar | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌కు సెల్యూట్‌: వైఎస్‌ జగన్‌

Oct 1 2026 10:36 AM | Updated on Oct 1 2026 10:44 AM

YS Jagan Salute To Flydubai Captain Smit Machchhar

సాక్షి, తాడేపల్లి: ఫ్లైదుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశంసలు కురిపించారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు.

ఫ్లైదుబాయ్‌ విమాన ఘటన విషయమై వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా.. ‘ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌ ధైర్యంగా నిలిచారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఆయన ధైర్యం, త్యాగం, నిస్వార్థ సేవ ప్రశంసనీయమని అన్నారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. స్మిట్‌ మచ్చార్‌ దేశం గర్వించదగ్గ నిజమైన హీరో అని కొనియాడారు. అలాగే, కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌ త్వరగా కోలుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: ‘భారత్‌ గర్విస్తోంది’.. స్మిట్‌ మచ్చార్‌ ధైర్యానికి మోదీ ఫిదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement