breaking news
Captain Smit Machchhar
-
ఫ్లైదుబాయ్ ఘటన.. విమాన సంస్థ కీలక నిర్ణయం
సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో జరిగిన ఘటన నేపథ్యంలో సదరు విమాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను ఫ్లై దుబాయ్ తాత్కాలికంగా నిలిపివేసింది. అధికారుల దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ ప్రకటించింది.ప్రయాణికులు, సిబ్బంది, విమాన కార్యకలాపాల భద్రత, సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెలుగులోకి తీసుకురావడానికి వీలుగా ఈ తాత్కాలిక సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొంది.అసలేం జరిగింది?భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం దుబాయ్-టెల్అవీవ్ మధ్య ప్రయాణిస్తున్న విమానంలో పైలట్, కో-పైలట్ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కో-పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. విమానంలోని ప్రయాణికులకు పరిస్థితి అర్థమయ్యేలోపే కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయి. ఇదే సమయంలో గాయపడిన కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం ఏర్పడింది.‘‘విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు’’ఈ దాడికి సంబంధించి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో-పైలట్ విమానం వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుడు యానివ్ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచి కుప్పకూలిన తర్వాత ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో సెట్ పైలట్లు కాక్‌పిట్‌లోకి చేరుకుని విమానాన్ని కంట్రోల్ చేయగలిగారు. అటు నుంచి సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి నిలకడగాకాక్పిట్ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని టబుక్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. -
‘భారత్ గర్విస్తోంది’.. స్మిట్ మచ్చార్ ధైర్యానికి మోదీ ఫిదా!
దుబాయ్–టెల్అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనలో భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని ఎదుర్కొని.. విమానంలోని వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కీలకంగా వ్యవహరించారని అన్నారు.‘‘కెప్టెన్ స్మిట్ మచ్చార్ ఒక హీరో. భారత్ ఆయనను చూసి గర్విస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్మిట్ మచ్చార్ తెగువను కొనియాడుతూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన అపారమైన ధైర్యం, వెనక్కి తగ్గని సంకల్పాన్ని ప్రదర్శించారని అన్నారు. ఆయన చూపిన తెగువ వందలాది మంది ప్రాణాలను కాపాడటంతోపాటు పెను విషాదాన్ని తప్పించిందని పేర్కొన్నారు. స్మిట్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని, మరింత శక్తితో పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.Captain Smit Machchhar is a HERO.In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others. His valour helped save hundreds of lives and avert a great tragedy.India is proud of…— Narendra Modi (@narendramodi) October 1, 2026బుధవారం దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం FZ1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 737 విమానం సుమారు 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. సహ పైలట్ విమానాన్ని ప్రమాదానికి గురిచేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై అతడు దాడి చేసి కత్తితో పొడిచినట్లు సమాచారం.దాడితో మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం భారీ వేగంతో కిందికి దిగడం ప్రారంభించింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. దాదాపు 37 సెకన్లలోనే విమానం 14,300 అడుగుల మేర కిందికి దిగింది. ఒక దశలో నిమిషానికి సుమారు 23 వేల అడుగుల వేగంతో కిందికి దూసుకెళ్లినట్లు సమాచారం. దీంతో విమానంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.గాయాలతోనే ఎదురుదాడి..ఈ సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ వెనక్కి తగ్గలేదు. సహ పైలట్‌ను ప్రతిఘటిస్తూ కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు సమాచారం. దీంతో ముందు వరుసలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు సహకరించారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు రిలీఫ్ పైలట్లు అనంతరం నియంత్రణ బాధ్యతలు చేపట్టారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అనంతరం గాయపడిన స్మిట్ మచ్చార్, సహ పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు కూడా విమానాశ్రయంలో వైద్య సాయం అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.9,750 గంటల ఫ్లయింగ్ అనుభవంస్మిట్ మచ్చార్ భారతీయుడు. ఫ్లై దుబాయ్‌లో చేరకముందు స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్లు పనిచేశారు. బోయింగ్ 737 విమానాల్లో 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉంది. ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. దాదాపు 9,750 గంటల ఫ్లయింగ్ అనుభవంతోపాటు లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా కూడా పనిచేశారు.ట్రంప్, నెతన్యాహు ప్రశంసలుస్మిట్ మచ్చార్ ధైర్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసించారు. దాడిలో గాయపడినప్పటికీ విమానాన్ని, ప్రయాణికులను రక్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను కొనియాడారు. ప్రయాణికులు, సిబ్బంది సైతం దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఇటు ట్రంప్ కూడా స్మిట్‌ను హీరో అని, కోపైలట్‌ను టెర్రరిస్ట్ అని అభివర్ణించారు.ఈ ఘటనకు దారితీసిన కారణాలు, సహ పైలట్ ఎందుకు దాడికి పాల్పడ్డాడు? విమానాన్ని ఎందుకు కిందికి దించాడు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే తీవ్ర ప్రమాదం ఎదురైన సమయంలో గాయాలను లెక్కచేయకుండా స్మిట్ మచ్చార్ తీసుకున్న చర్యలు ఇప్పుడు ఈ ఘటనలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ప్చ్.. డంకీ ఎంత పని చేసింది? -
‘హ్యాట్సాఫ్ రియల్ హీరో..’ భారత పైలట్‌పై ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు
విమానం గాల్లో ఉంది.. ఒక్కసారిగా కాక్‌పిట్‌లో కలకలం. కో-పైలట్ కత్తితో కెప్టెన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆ భారత పైలట్ వెనక్కి తగ్గలేదు. కాక్‌పిట్ తలుపు తెరిచి బయటకు వచ్చి సంకేతం ఇచ్చాడు. ప్రయాణికులు, ఇతర సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను విమాన ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ స్మిట్మచ్చర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు.ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో జరిగిన ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ‘‘భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చర్ అసాధారణ ధైర్యానికి నా సెల్యూట్’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్ ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు తెరిచారని తెలిపారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారని పేర్కొన్నారు. ఈ చర్య పెను విమాన ప్రమాదాన్ని నివారించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్మిట్ మచ్చర్‌ను ‘హీరో’గా అభివర్ణించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు చెప్పిన వివరాలను మీడియాతో పంచుకున్న ట్రంప్.. తీవ్రంగా గాయపడినప్పటికీ పైలట్ చేసిన చర్యను అద్భుతమైనదిగా పేర్కొన్నారు.30 సెకన్లలో 14 వేల అడుగులు కిందకు!భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం దుబాయ్-టెల్అవీవ్ మధ్య ప్రయాణిస్తున్న బోయింగ్ 737 MAX 8 విమానం పైలట్, కో-పైలట్ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కో-పైలట్ కెప్టెన్ మచ్చర్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది.విమానంలోని ప్రయాణికులకు పరిస్థితి అర్థమయ్యేలోపే కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయి. ఇదే సమయంలో గాయపడిన కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం ఏర్పడింది.‘‘విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు’’ఈ దాడికి సంబంధించి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో-పైలట్ విమానం వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుడు యానివ్ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచి కుప్పకూలిన తర్వాత ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో సెట్ పైలట్లు కాక్‌పిట్‌లోకి చేరుకుని విమానాన్ని కంట్రోల్ చేయగలిగారు. అటు నుంచి సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.ఎవరీ స్మిట్మచ్చర్?స్మిట్ మచ్చర్ భారత పౌరుడు. బోయింగ్ 737 విమానాలపై ఆయనకు 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉంది. సుమారు 9,750 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి. 2011లో స్పైస్‌జెట్‌లో చేరిన మచ్చర్.. అక్కడ లైన్ ట్రైనింగ్ కెప్టెన్, సీనియర్ కమాండర్‌గా పనిచేశారు. 2022 జూన్‌లో స్పైస్‌జెట్‌ను వీడి ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లై దుబాయ్‌లో చేరినట్లు సమాచారం.ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి నిలకడగాకాక్పిట్ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని టబుక్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.‘‘180 మంది ప్రాణాలు కాపాడారు’’ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజార్ కూడా మచ్చర్‌ను ప్రశంసించారు. అనుభవజ్ఞుడైన, ప్రతిభావంతుడైన భారత పైలట్‌గా అభివర్ణించారు. మచ్చర్‌తో పాటు ప్రయాణికులు, సిబ్బంది చూపిన ధైర్యం 180 మంది ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు.విమానం టబుక్‌లో సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులు సుమారు ఎనిమిది గంటలు సౌదీ అరేబియాలో ఉన్నారు. అనంతరం ప్రత్యామ్నాయ ఫ్లై దుబాయ్ విమానంలో ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినా.. విమానాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడిన భారత పైలట్ స్మిట్మచ్చర్ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు.ఇదీ చదవండి: యూఏఈలో వాహనదారులకు షాక్


