నేరం ఒప్పుకున్న ఫ్లైదుబాయ్ కో–పైలట్ హమామీ
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేసిన కో–పైలట్, ఒమన్ జాతీయుడైన హమామ్ అల్–హమామీ మనసులో పెద్ద కుట్రే ఉన్నట్లు స్పష్టమైంది. ఆ విమానాన్ని కూల్చడమే తన లక్ష్యమని విచారణలో అతను నేరాన్ని అంగీకరించినట్లు ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక తన కథనంలో పేర్కొంది. చావుకు భయపడలేదని అతను వ్యాఖ్యానించాడు. కోపైలట్‌ను యూఏఈ అధికారులు భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దాడి తర్వాత విమానం అత్యవసరంగా సౌదీ అరేబియాలో ల్యాండైన సంగతి తెలిసిందే. నిందితుడిని అక్కడే అదుపులోకి తీసుకొని యూఏఈకి తరలించారు.
కో–పైలట్ హమామీ ఒమన్ దేశస్థుడైన తండ్రికి, సిరియా దేశస్థురాలైన తల్లికి జని్మంచాడు. చాలా ఏళ్లు దుబాయ్‌లో నివసించాడు. సిరియాలో అంతర్యుద్ధ జరుగుతున్న సమయంలో అక్కడ కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల ఆకర్శితుడైనట్లు తెలుస్తోంది. అతడి సోషల్ మీడియా ఖాతాలను దర్యాప్తు అధికారులు జల్లెడ పడుతున్నారు. అతడు తొలగించిన ‘ఎక్స్’ ఖాతాలోని 3,000కు పైగా పోస్టుల స్క్రీన్‌షాట్‌లు ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వాటిలోని అనేక పోస్టులు ఇస్లామిక్ భావజాలానికి సంబంధించినవే ఉన్నాయి.


