ప్రధాని మోదీకి నెతన్యాహు ఆహ్వానం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జ్యోతి వెలిగించడానికి రావాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఫ్లై దుబాయ్ విమానంలో సహ పైలట్ దాడిని ఎదుర్కొని, 174 మంది ప్రయాణికులను రక్షించిన భారత కెపె్టన్ స్మిత్ మచ్ఛార్‌తో కలిసి ఇజ్రాయెల్‌కు రావాలని, ఇద్దరు కలిసి జ్యోతి వెలిగించాలని కోరారు.
నెతన్యాహు గురువారం మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియా పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వారు తేల్చిచెప్పారు. అలాగే భారత్–ఇజ్రాయెల్ సంబంధాల్లో కొనసాగుతున్న పురోగతిని మోదీ, నెతన్యాహు స్వాగతించారు.
ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని తాము సమీక్షించామని తెలిపారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.


