breaking news
Candle Light
-
సరికొత్త ట్రెండ్ క్యాండిల్ లైట్ ఈవెంట్స్... జెన్‌జీ సందడి
ఇటీవలి కాలంలో నగరం కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా లైఫ్‌స్టైల్, కల్చరల్ ఈవెంట్స్‌కి అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఈ నూతన ఒరవడిలో ఈ మధ్య ప్రధానంగా ఆదరణ పొందుతున్న సరికొత్త ట్రెండ్ క్యాండిల్ లైట్ ఈవెంట్స్. వాణిజ్య నగరంగా పేరుపొందిన హైదరాబాద్ ఇప్పుడు రాత్రి వేళల్లో మెరిసే మైనపు వెలుగుల్లో కొత్త మాయాజాలాన్ని సృష్టించిన అనుభూతిని కల్పిస్తుంది. చిమ్మ చీకటిలో చిరు వెలుగు అందించే క్యాండిల్ లైట్ ప్రత్యేక ఆకర్షణగా.. విభిన్నమైన వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రొటీన్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్‌కు భిన్నంగా క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఈ తరం ట్రెండ్‌గా నిలుస్తోంది. ట్రెండీ నైట్.. క్యాండిల్ లైట్ అన్న రీతిలో పలు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రస్తుత అధునాతన జీవనశైలితో పాటు ట్రెండింగ్ ఈవెంట్స్‌కు హైదరాబాద్ నగరం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇందులో భాగంగానే క్యాడిల్ లైట్ ఈవెంట్స్ తెరపైకి వచ్చాయి. ఈ కొత్త ట్రెండ్ మన జీవనశైలి మార్పును మాత్రమే కాదు, మన మానసిక అవసరాలను కూడా ప్రతిబింబిస్తోంది. శాంతి, ప్రేమ, కళలకు వేదికగా ఈ ట్రెండ్ రూపాంతరం చెందుతోంది. ఈ క్యాండిల్ లైట్ ట్రెండ్‌కి నగరంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు మరింత క్రియేటివ్ ఐడియాలతో ముందుకు వస్తున్నాయి. క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్, థీమ్ బేస్డ్ క్యాండిల్ లైట్ పోయెట్రీ ఈవెనింగ్స్, మెడిటేషన్ సెషన్లు, క్యాండిల్ లైట్ డిన్నర్, క్యాండిల్ లైట్ ఆర్ట్ షోస్ వంటి కాన్సెప్ట్‌లు సరికొత్త అనుభూతులను అందిస్తున్నాయి. డార్క్ బీట్స్.. ఒక వైపు మ్యూజిక్ లవర్స్‌కి క్లబ్‌ల శబ్దాలు, ఈడీఎం బీట్స్ విసుగుతెస్తుంటే, మరోవైపు క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ వారికి ఓ కొత్త అనుభూతి అందిస్తున్నాయి. పియానో, వయోలిన్, ఫ్లూట్ వంటి సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రశాంతంగా కొనసాగే ఈ లైవ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఈవెంట్స్‌లో పాల్గొనడమంటే.. సంగీతంతో మనసు నిండిపోవడమే కాదు, ఆ మైనపు వెలుగుల్లో మన మనసు కూడా ప్రశాంతతను పొందుతుంది. ఇటీవల కూకట్పల్లి, బంజారాహిల్స్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో జరిగే ఈవెంట్స్‌కి యువత నుంచి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లోని క్యాండిల్‌లైట్ సంగీత కచేరీలలో బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్, తారామతి బరాదరి రిసార్ట్స్ వంటి వేదికల్లో శాస్త్రీయ, ఆధునిక సంగీతంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సీసం కొవ్వొత్తులతో అలంకరించబడి సంగీతకారులు వాయించే సంగీతంతో ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి. ఈ కచేరీల్లో అర్జిత్ సింగ్, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖ మ్యూజిక్ సెలబ్రిటీలు భాగం కావడం విశేషం. ఉత్తమ మూవీ సౌండ్‌ట్రాక్స్, కోల్డ్‌ప్లే, ఎడ్ షీరాన్ మిక్స్ వంటి థీమ్‌లు ఇందులో ఉంటాయి. చదవండి: కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!నగరంలో సరికొత్త ట్రెండ్‌గా క్యాండిల్ లైట్ ఈవెంట్స్చీకటి వెలుగుల సందడి.. : గోల గోలతో హంగామా చేసే పార్టీలు కాకుండా.. బంధువులు, స్నేహితులతో ఒక మధురమైన వేడుక జరుపుకోవాల నుకుంటున్నవారికి క్యాండిల్ లైట్ బర్త్‌డే పార్టీలు సరైన ఎంపికగా మారుతున్నాయి. చిన్న చిన్న డెకరేషన్, ఫెయిరీ లైట్స్, సున్నితమైన మ్యూజిక్, సొగసైన కేక్ కటింగ్.. ఇవన్నీ కలిపి ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలు, టీనేజ్ యువత ఈ స్టైల్‌కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.క్యాండిల్ నైట్ డిన్నర్.. : ప్రేమికుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న మరో ట్రెండ్.. క్యాండిల్ నైట్ డిన్నర్. ఒక టేబుల్, రెండు హృదయాలు, నెమ్మదిగా వెలిగే మైనపు వెలుగు, వెనకనుంచి వినిపించే ఓ మెలోడీ పాట.. ఇది కేవలం డిన్నర్ కాదు, ఒక జ్ఞాపకం. హైదరాబాద్‌లోని పలు హై ఎండ్ రెస్టారెంట్లు, రూఫ్‌టాప్ కెఫేలు, ప్రైవేట్ విల్లాస్, రిసార్టులు ఈ రకమైన డిన్నర్ అనుభూతికి ప్రత్యేక ప్యాకేజీలతో అందిస్తున్నాయి. పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీ వంటి సందర్భాల్లో ఈ డిన్నర్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి.మెంటల్ పీస్: ఉరుకుల పరుగుల బీజీ నగర జీవనశైలిలో కాసింత ప్రశాంతత కోసం వినూత్నమైన అనుభూతి కోసం ఈ క్యాండిల్ లైట్ ఈవెంట్స్ అద్భుతమైన వేదికలుగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్: ఈ జెన్‌జీ బ్యాచ్ సోషల్ మీడియా యాప్స్‌లో తమను ప్రత్యేకంగా ప్రదర్శించు కోవడం ఇష్టపడుతుంటారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయదగిన అందమైన ఫొటోలు తీసుకోవాలంటే క్యాండిల్ లైట్ సెట్టింగ్స్ వైరల్‌గా నిలుస్తున్నాయి. అరుదైనఅనుభూతి: ప్రతి ఈవెంట్ వ్యక్తిగతంగా ప్లాన్ చేయబడటం ఈ క్యాండిల్ లైట్ ఈవెంట్స్ ప్రత్యేకత. ఇష్టమైన వారి కోసం, వారికి నచ్చే సెట్టింగ్స్‌తో ఈ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)
-
ఐఓసీ చీఫ్ జపాన్ పర్యటన రద్దు
టోక్యో: కరోనా కేసులు పెరుగుతుండటంతో జపాన్ పర్యటనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తమ ప్రకటనలో పేర్కొంది. వచ్చే సోమవారం టార్చ్ రిలే హిరోషిమా నగరానికి చేరుకోనుండగా... బాచ్ అందులో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బాచ్ పర్యటన రద్దయిందని... త్వరలోనే ఆయన కొత్త పర్యటన తేదీలను ప్రకటిస్తామని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఒలింపిక్స్‌కు మరో 10 వారాల సమయం మాత్రమే ఉండగా... నిర్వాహకులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కరోనా వేళ ఒలింపిక్స్ ఏంటంటూ... వాటిని మరోసారి వాయిదా లేదా రద్దు చేయాలంటూ స్థానిక మీడియా నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఈ సర్వేల్లో ఏకంగా 60 నుంచి 80 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణపై తమ విముఖతను తెలియజేశారు. మరోవైపు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించకూడదంటూ ఆన్లైన్లో దాఖలు చేసిన పిటిషన్‌కు మద్దతుగా 3 లక్షల మందికి పైగా జపాన్‌వాసులు సంతకాలు చేశారు. ఇన్ని సమస్యల మధ్య కూడా అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని ఐఓసీ పేర్కొనడం విశేషం. -
టోక్యో ‘జ్యోతి’ బయల్దేరింది
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై ఆశలు రేపుతూ ‘టార్చ్ రిలే’ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. 2011లో భూకంపం, సునామీ, న్యూక్లియర్ విస్ఫోటనాల ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఫుకుషిమా వద్ద ఈ జ్యోతిని వెలిగించి పరుగు ప్రారంభించడం విశేషం. 2011 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలైన అజుసా ఇవషిమిజు చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. జపాన్‌లోని 47 ప్రాంతాల మీదుగా ప్రయాణించే టార్చ్ 121 రోజుల తర్వాత క్రీడల ప్రారంభం రోజైన జులై 23కు టోక్యో చేరుకుంటుంది. ‘జపాన్ దేశవాసులకే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రజలకు కూడా టోక్యో 2020 జ్యోతి కొత్త వెలుగులు పంచుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుత కష్టకాలంలో చీకటి తర్వాత వెలుతురు ఉంటుందనే సందేశంతో టార్చ్ పయనిస్తుంది’ అని నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమొటో వ్యాఖ్యానించారు. -
దీపాలు వెలిగిద్దాం..మహమ్మారిని తరిమేద్దాం
-
అంతరిక్షంలో కొవ్వొత్తి అంతసేపు వెలుగుతుందా?
నేలపైనే గాక అంతరిక్షంలోనూ, గురుత్వాకర్షణ శక్తి నామమాత్రంగా ఉండే ప్రదేశంలోనూ కొవ్వొత్తి వెలగడం, ఇతర ఇంధనాలు మండటం జరుగుతుంది. అయితే ఇందుకు తగిన ఆక్సిజన్ మాత్రం తప్పక కావలసి ఉంటుంది. నేలపై కొవ్వొత్తి వెలగడానికి.. అంతరిక్షంలో వెలగడానికి మధ్య కొన్ని స్పష్టమైన తేడాలు ఉంటాయి. నేలపైన వెలిగే కొవ్వొత్తి జ్వాల కోలగా, ఓ పూరెక్క ఆకారంలో ఉంటుంది. కొవ్వొత్తిలో ఇంధనం మండే ప్రదేశం వద్ద గాలి వేడెక్కి పైకి పోవడం వల్ల, అక్కడ ఎప్పటికప్పుడు అల్పపీడనం ఏర్పడటం, దాంతో కొవ్వొత్తి చుట్టూ ఉన్న గాలి ఆ ప్రదేశం వైపు దూసుకుపోవడం వల్ల కొవ్వొత్తి జ్వాల ఎప్పుడూ పైకే వెలుగుతుంటుంది. దీనికి భిన్నంగా అంతరిక్షంలో వెలిగే కొవ్వొత్తి జ్వాల గుండ్రంగా ఉంటుంది. కేవలం కొవ్వొత్తి జ్వాల మాత్రమే కాదు. గురుత్వాకర్షణ శక్తి నామమాత్రంగానే ఉండే చోట అన్ని రకాల మంటలూ గోళాకృతిలోనే కనిపిస్తాయి. భూమ్యాకర్షణ శక్తికి దూరంగా అంతరిక్షంలో వెలిగించే కొవ్వొత్తి జ్వాల దాదాపుగా మన కంటికి కనిపించని లేత నీలిరంగులో ఉంటుంది. దీని ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగానే ఉంటుంది. నేలపైన కన్నా అంతరిక్షంలో కొవ్వొత్తి చాలా నిదానంగా వెలగడం మరో ప్రత్యేకత. నేలపై సుమారు 10 నిమిషాలు వెలిగే ఓ కొవ్వొత్తి, అంతరిక్షంలో 45 నిమిషాలు తీసుకోవడం విశేషం. ఏదేమైనా అంతరిక్షంలో రకరకాల మంటల గురించి మరిన్ని పరిశోధనలు జరగవలసి ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. -
క్యాండిల్‌లైట్ డిన్నర్.. అడవిలో
క్షణం తీరిక లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయాల్సిన నేటి తరుణంలో సేదతీరే సమయం కూడా ఉండదు. విధులు ముగించుకుని నిశిరాత్రిలో ఇంటికి వచ్చినా.. అలా ఆకాశం వైపు చూస్తూ.. నక్షత్రాలను చూసే భాగ్యమూ ఉండదు. ఇల్లు, వీధిలో ఉన్న విద్యుత్ దీపాలే.. అసలు ప్రపంచంగా గడిపేస్తుండటం చూస్తుంటాం. అయితే వీరిలో చాలామంది చిన్నప్పుడు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవారే. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నింటినీ దూరమైన వీరు నాటి జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. ఇలాంటి జీవితాన్ని, వాతావరణాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది ఓ ప్రైవేటు సంస్థ. గ్రాస్వాక్ పేరుతో పచ్చని ప్రకృతిలో క్యాండిల్‌లైట్ డిన్నర్‌ను ఏర్పాటు చేస్తూ నగర ప్రజలను ఆకట్టుకుంటోంది. వికారాబాద్ అర్బన్ : సువిశాల అటవీ ప్రాంతం.. చుట్టూ పచ్చని చెట్లు.. పక్షుల కిలకిలరావాలు.. ఆ మధ్యే చల్లని గాలులు. వివిధ రకాల పక్షులు కనువిందు చేస్తుంటాయి. ఇలాంటి వాతావరణం వికారాబాద్ పట్టణానికి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడుపల్లి పరిధిలో గ్రాస్వాక్ గుట్టపై కనిపిస్తుంది. ఇక్కడి వాతావరణం ఎంతటి స్వచ్ఛత అంటే.. 50 ఏళ్ల వెనక అటవీ ప్రాంతంలోని పల్లెటూరి వాతావరణానికి అతి దగ్గరగా ఉంటుంది. అక్కడున్నంతసేపూ మనల్ని మనం మరచిపోతామంటే.. అతిశయోక్తి కాదు. ఆన్లైన్ బుకింగ్.. ఇందులో ఒకరోజు గడపాలనుకుంటే www. thegrasswalk.com సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. నేరుగా కూడా వెళ్లవచ్చు. అయితే అక్కడ గుడారాలు ఖాళీగా ఉంటేనే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో వెనుతిరిగి రావాల్సిందే. ఆన్లైన్లో మీకు కన్ఫర్మ్ అయ్యిందంటే.. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు లోపలికి అనుమతిస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు అందులో గడపవచ్చు. భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ఉంటే 24 గంటలకు రూ.3,300 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేవలం ఉదయం టిఫిన్ మాత్రమే అందిస్తారు. రాత్రి డిన్నర్ గెస్టులు ఇచ్చిన ఆర్డర్‌పై చేసి ఇస్తారు. నలుగురి కంటే.. సంఖ్య పెరిగితే ఒక్కొక్కరికి అదనంగా రూ.1,000 చార్జ్ చేస్తారు. రూ.3,300లోనే పగటి పూట, సాయంత్రం వేళల్లో ట్రెక్కింగ్, స్విమ్మింగ్ చేయిస్తారు. క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్రత్యేకత.. గ్రాస్వాక్లో క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్రత్యేకం. సువిశాలమైన ఈ ప్రాంతంలో వంద మీటర్ల దూరంలో అంతకంటే ఎక్కువ దూరంలో గుడారాలు వేస్తారు. అందులో అన్నిరకాల సౌకర్యాలు ఉంటాయి. కానీ.. రాత్రి పూట క్యాండిల్‌లైట్ వెలుతురులో డిన్నర్ ఏర్పాటు చేస్తారు. ఇలాంటి డిన్నర్ చేయడానికి పట్టణ వాసులు ఎంతగానో ఇష్టపడతారు. ఆర్డర్‌పై వెజ్, నాన్‌వెజ్ వంటకాలు చేసి పెట్టడానికి సహాయకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎలా వెళ్లాలి.. హైదరాబాద్ నుంచి వికారాబాద్ దూరం 70 కి.మీ. ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వారు వికారాబాద్‌లోకి రాగానే ఎన్నెపల్లి నుంచి ఎడమకు తిరగాలి. నస్కల్ – పరిగి రూట్ లేదా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దారిలో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా 8 కి.మీ. లోనికి వెళ్లాక.. గుడుపల్లి గ్రామ బస్‌స్టాప్ వస్తుంది. అక్కడి నుంచి ఎడమకు తిరిగి ఒక కిలోమీటర్ ముందుకు వెళితే.. గ్రాస్వాక్ చేరుకుంటాం. -
హృదయ స్పందన
ప్రేమికుల రోజున క్యాండిల్ లైట్ విందులు, చాక్లెట్లు, ఖరీదైన కానుకలతో భాగస్వామి మనసు గెలుచుకోవాలని తపిస్తారు. కానీ, తమ భాగస్వామిని ఏడాది మొత్తంగా సంతోషపెట్టే కానుక ఇవ్వాలని ఆలోచించేవారికి ఓ అద్భుతమైన ఐడియా ‘హెల్త్ చెకప్.’ ఇలా ఆలోచించే జంటలకు ప్రేమికుల రోజైన నేడు నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేక హెల్త్ చెకప్‌లు అందిస్తున్నాయి. కిమ్స్ ఆసుపత్రి రూ.10 వేల విలువ గల హెల్త్ చెకప్‌కి ప్రేమికుల రోజును పురస్కరించుకొని రూ.3,200కే ఇస్తోంది. ఈ రోజు రూ.200 చెల్లించి పేరు నమోదు చేసుకుంటే 6 నెలల వరకు ఇదే డిస్కౌంట్ పొందవచ్చు. కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ రొమ్ము వ్యాధులను నిర్ధారించే బైలేటరల్ మమోగ్రామ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలలో 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఈ పరీక్షలు మామూలు రోజుల్లో రూ.4,470 ఉంటే ఈ ఒక్క రోజు రూ.2,325కే చేస్తారు. ప్రేమికుల రోజు సందర్భంగా మీ జీవితభాగస్వామి ఆరోగ్యరీత్యా రొమ్ము క్యాన్సర్ పరీక్షలను సగం ధరకే పొందవచ్చు’ అని కిమ్స్-ఉషాలక్ష్మి ఆసుపత్రి డెరైక్టర్ డా.పి.రఘురామ్ తెలియజేశారు. కేర్ గ్రూప్, గ్లోబల్ హాస్పిటల్స్ సైతం మరో అడుగు ముందుకేసి జంటలకు హెల్త్ చెకప్స్, నిర్ధారణ పరీక్షలలోనూ, అవుట్ పేషంట్ సేవలలోనూ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. హెల్త్ చెకప్స్‌లో ఏడాది పొడవునా డిస్కౌంట్స్ ఇచ్చే గ్లోబల్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ హెల్త్చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్స్‌లో ఈ రోజు మరో 500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఇప్పటికే రూ.9,275కు పైగా ఉన్న హెల్త్ చెకప్స్ డిస్కౌంట్ ధరలో రూ.3,000కు ఇస్తుండగా ఈ రోజు మాత్రం మరింత డిస్కౌంట్ ఇస్తూ రూ.2,500 చేసింది. డాక్టర్ ఫీజులో 15 శాతం రాయితీ ఇస్తోంది. కేర్ గ్రూప్ హాస్పిటల్స్ 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులైన జంటకు హెల్త్ చెకప్స్‌లో 30 శాతం డిస్కౌంట్ అందజేస్తుంది. ఇతర ఆఫర్లలో భాగంగా కాస్మటిక్, డెంటల్ కూడా చోటుచేసుకున్నాయి. వాటిలో భాగంగా అపోలో వైట్ డెంటల్ స్పా ఓరల్ స్క్రీనింగ్, వైట్ ఫేషియల్, కాస్మటిక్ పాలిషింగ్లలో 60 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. సో... ఏడాది పొడవునా ఆరోగ్య ధీమా కలిగించే ఏ హెల్త్ చెకప్ అయినా ఓ అమూల్యమైన కానుకే! - నిర్మలారెడ్డి