సరికొత్త ట్రెండ్‌ క్యాండిల్‌ లైట్‌ ఈవెంట్స్‌... జెన్‌జీ సందడి | Hyderabad Embraces the Candlelight Event Trend – Music, Dinners & Magical Nights | Sakshi
Sakshi News home page

సరికొత్త ట్రెండ్‌ క్యాండిల్‌ లైట్‌ ఈవెంట్స్‌... జెన్‌జీ సందడి

Oct 6 2025 10:55 AM | Updated on Oct 6 2025 1:17 PM

GenZ Candlelight Concerts or live music events latest trend in Hyderabad

లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌ మొదలు నైట్‌ పారీ్టల వరకు

చిమ్మ చీకట్లో.. చిరు దీపాల వెలుగులో ఎంటర్‌టైన్మెంట్‌ 

క్యాండిల్‌ నైట్‌ డిన్నర్, బర్త్‌డే పార్టీలకు పెరుగుతున్న ఆదరణ 

జెన్‌జీ బ్యాచ్‌ సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ ఆసక్తితో మరింత గుర్తింపు

ఇటీవలి కాలంలో నగరం కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా లైఫ్‌స్టైల్, కల్చరల్‌ ఈవెంట్స్‌కి అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఈ నూతన ఒరవడిలో ఈ మధ్య ప్రధానంగా ఆదరణ పొందుతున్న సరికొత్త ట్రెండ్‌ క్యాండిల్‌ లైట్‌ ఈవెంట్స్‌. వాణిజ్య నగరంగా పేరుపొందిన హైదరాబాద్‌ ఇప్పుడు రాత్రి వేళల్లో మెరిసే మైనపు వెలుగుల్లో కొత్త మాయాజాలాన్ని సృష్టించిన అనుభూతిని కల్పిస్తుంది. చిమ్మ చీకటిలో చిరు వెలుగు అందించే క్యాండిల్‌ లైట్‌ ప్రత్యేక ఆకర్షణగా.. విభిన్నమైన వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రొటీన్‌ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌కు భిన్నంగా క్యాండిల్‌ లైట్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌ ఈ తరం ట్రెండ్‌గా నిలుస్తోంది. ట్రెండీ నైట్‌.. క్యాండిల్‌ లైట్‌ అన్న రీతిలో పలు ఎంటర్‌టైన్మెంట్‌ ఈవెంట్స్‌ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో

ప్రస్తుత అధునాతన జీవనశైలితో పాటు ట్రెండింగ్‌ ఈవెంట్స్‌కు హైదరాబాద్‌ నగరం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇందులో భాగంగానే క్యాడిల్‌ లైట్‌ ఈవెంట్స్‌ తెరపైకి వచ్చాయి. ఈ కొత్త ట్రెండ్‌ మన జీవనశైలి మార్పును మాత్రమే కాదు, మన మానసిక అవసరాలను కూడా ప్రతిబింబిస్తోంది. శాంతి, ప్రేమ, కళలకు వేదికగా ఈ ట్రెండ్‌ రూపాంతరం చెందుతోంది. ఈ క్యాండిల్‌ లైట్‌ ట్రెండ్‌కి నగరంలో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు మరింత క్రియేటివ్‌ ఐడియాలతో ముందుకు వస్తున్నాయి. క్యాండిల్‌ లైట్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్స్, థీమ్‌ బేస్డ్‌ క్యాండిల్‌ లైట్‌ పోయెట్రీ ఈవెనింగ్స్, మెడిటేషన్‌ సెషన్లు, క్యాండిల్‌ లైట్‌ డిన్నర్, క్యాండిల్‌ లైట్‌ ఆర్ట్‌ షోస్‌ వంటి కాన్సెప్ట్‌లు సరికొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 

డార్క్‌ బీట్స్‌.. 
ఒక వైపు మ్యూజిక్‌ లవర్స్‌కి క్లబ్‌ల శబ్దాలు, ఈడీఎం బీట్స్‌ విసుగుతెస్తుంటే, మరోవైపు క్యాండిల్‌ లైట్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌ వారికి ఓ కొత్త అనుభూతి అందిస్తున్నాయి. పియానో, వయోలిన్, ఫ్లూట్‌ వంటి సాఫ్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ప్రశాంతంగా కొనసాగే ఈ లైవ్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ ఈవెంట్స్‌లో పాల్గొనడమంటే.. సంగీతంతో మనసు నిండిపోవడమే కాదు, ఆ మైనపు వెలుగుల్లో మన మనసు కూడా ప్రశాంతతను పొందుతుంది. ఇటీవల కూకట్‌పల్లి, బంజారాహిల్స్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో జరిగే ఈవెంట్స్‌కి యువత నుంచి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లోని క్యాండిల్‌లైట్‌ సంగీత కచేరీలలో బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్, తారామతి బరాదరి రిసార్ట్స్‌ వంటి వేదికల్లో శాస్త్రీయ, ఆధునిక సంగీతంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సీసం కొవ్వొత్తులతో అలంకరించబడి సంగీతకారులు వాయించే సంగీతంతో ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి. ఈ కచేరీల్లో అర్జిత్‌ సింగ్, ఏఆర్‌ రెహమాన్‌ వంటి ప్రముఖ మ్యూజిక్‌ సెలబ్రిటీలు భాగం కావడం విశేషం. ఉత్తమ మూవీ సౌండ్‌ట్రాక్స్, కోల్డ్‌ప్లే, ఎడ్‌ షీరాన్‌ మిక్స్‌ వంటి థీమ్‌లు ఇందులో ఉంటాయి.  

చదవండి: కేఎఫ్‌సీలో కంపుకొట్టే చికెన్‌ బర్గర్‌? వీడియో చూస్తే వాంతులే!

నగరంలో సరికొత్త ట్రెండ్‌గా క్యాండిల్‌ లైట్‌ ఈవెంట్స్‌

చీకటి వెలుగుల సందడి.. : గోల గోలతో హంగామా చేసే పార్టీలు కాకుండా.. బంధువులు, స్నేహితులతో ఒక మధురమైన వేడుక జరుపుకోవాల నుకుంటున్నవారికి క్యాండిల్‌ లైట్‌ బర్త్‌డే పార్టీలు సరైన ఎంపికగా మారుతున్నాయి. చిన్న చిన్న డెకరేషన్, ఫెయిరీ లైట్స్, సున్నితమైన మ్యూజిక్, సొగసైన కేక్‌ కటింగ్‌.. ఇవన్నీ కలిపి ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలు, టీనేజ్‌ యువత ఈ స్టైల్‌కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

క్యాండిల్‌ నైట్‌ డిన్నర్‌.. : ప్రేమికుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న మరో ట్రెండ్‌.. క్యాండిల్‌ నైట్‌ డిన్నర్‌. ఒక టేబుల్, రెండు హృదయాలు, నెమ్మదిగా వెలిగే మైనపు వెలుగు, వెనకనుంచి వినిపించే ఓ మెలోడీ పాట.. ఇది కేవలం డిన్నర్‌ కాదు, ఒక జ్ఞాపకం. హైదరాబాద్‌లోని పలు హై ఎండ్‌ రెస్టారెంట్లు, రూఫ్‌టాప్‌ కెఫేలు, ప్రైవేట్‌ విల్లాస్, రిసార్టులు ఈ రకమైన డిన్నర్‌ అనుభూతికి ప్రత్యేక ప్యాకేజీలతో అందిస్తున్నాయి. పుట్టినరోజులు, వెడ్డింగ్‌ యానివర్సరీ వంటి సందర్భాల్లో ఈ డిన్నర్‌లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి.

మెంటల్‌ పీస్‌: ఉరుకుల పరుగుల బీజీ నగర జీవనశైలిలో కాసింత ప్రశాంతత కోసం వినూత్నమైన అనుభూతి కోసం ఈ క్యాండిల్‌ లైట్‌ ఈవెంట్స్‌ అద్భుతమైన వేదికలుగా నిలుస్తున్నాయి.  

సోషల్‌ మీడియాలో వైరల్‌: ఈ జెన్‌జీ బ్యాచ్‌ సోషల్‌ మీడియా యాప్స్‌లో తమను ప్రత్యేకం

గా ప్రదర్శించు కోవడం ఇష్టపడుతుంటారు. ఇందులో భాగంగానే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయదగిన అందమైన ఫొటోలు తీసుకోవాలంటే క్యాండిల్‌ లైట్‌ సెట్టింగ్స్‌ వైరల్‌గా నిలుస్తున్నాయి.  అరుదైన

అనుభూతి: ప్రతి ఈవెంట్‌ వ్యక్తిగతంగా ప్లాన్‌ చేయబడటం ఈ క్యాండిల్‌ లైట్‌ ఈవెంట్స్‌ ప్రత్యేకత. ఇష్టమైన వారి కోసం, వారికి నచ్చే సెట్టింగ్స్‌తో ఈ ఈవెంట్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.   

చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్‌వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement