breaking news
Music concerts
-
సరికొత్త ట్రెండ్ క్యాండిల్ లైట్ ఈవెంట్స్... జెన్‌జీ సందడి
ఇటీవలి కాలంలో నగరం కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా లైఫ్‌స్టైల్, కల్చరల్ ఈవెంట్స్‌కి అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఈ నూతన ఒరవడిలో ఈ మధ్య ప్రధానంగా ఆదరణ పొందుతున్న సరికొత్త ట్రెండ్ క్యాండిల్ లైట్ ఈవెంట్స్. వాణిజ్య నగరంగా పేరుపొందిన హైదరాబాద్ ఇప్పుడు రాత్రి వేళల్లో మెరిసే మైనపు వెలుగుల్లో కొత్త మాయాజాలాన్ని సృష్టించిన అనుభూతిని కల్పిస్తుంది. చిమ్మ చీకటిలో చిరు వెలుగు అందించే క్యాండిల్ లైట్ ప్రత్యేక ఆకర్షణగా.. విభిన్నమైన వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రొటీన్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్‌కు భిన్నంగా క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఈ తరం ట్రెండ్‌గా నిలుస్తోంది. ట్రెండీ నైట్.. క్యాండిల్ లైట్ అన్న రీతిలో పలు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రస్తుత అధునాతన జీవనశైలితో పాటు ట్రెండింగ్ ఈవెంట్స్‌కు హైదరాబాద్ నగరం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇందులో భాగంగానే క్యాడిల్ లైట్ ఈవెంట్స్ తెరపైకి వచ్చాయి. ఈ కొత్త ట్రెండ్ మన జీవనశైలి మార్పును మాత్రమే కాదు, మన మానసిక అవసరాలను కూడా ప్రతిబింబిస్తోంది. శాంతి, ప్రేమ, కళలకు వేదికగా ఈ ట్రెండ్ రూపాంతరం చెందుతోంది. ఈ క్యాండిల్ లైట్ ట్రెండ్‌కి నగరంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు మరింత క్రియేటివ్ ఐడియాలతో ముందుకు వస్తున్నాయి. క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్, థీమ్ బేస్డ్ క్యాండిల్ లైట్ పోయెట్రీ ఈవెనింగ్స్, మెడిటేషన్ సెషన్లు, క్యాండిల్ లైట్ డిన్నర్, క్యాండిల్ లైట్ ఆర్ట్ షోస్ వంటి కాన్సెప్ట్‌లు సరికొత్త అనుభూతులను అందిస్తున్నాయి. డార్క్ బీట్స్.. ఒక వైపు మ్యూజిక్ లవర్స్‌కి క్లబ్‌ల శబ్దాలు, ఈడీఎం బీట్స్ విసుగుతెస్తుంటే, మరోవైపు క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ వారికి ఓ కొత్త అనుభూతి అందిస్తున్నాయి. పియానో, వయోలిన్, ఫ్లూట్ వంటి సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రశాంతంగా కొనసాగే ఈ లైవ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఈవెంట్స్‌లో పాల్గొనడమంటే.. సంగీతంతో మనసు నిండిపోవడమే కాదు, ఆ మైనపు వెలుగుల్లో మన మనసు కూడా ప్రశాంతతను పొందుతుంది. ఇటీవల కూకట్పల్లి, బంజారాహిల్స్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో జరిగే ఈవెంట్స్‌కి యువత నుంచి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లోని క్యాండిల్‌లైట్ సంగీత కచేరీలలో బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్, తారామతి బరాదరి రిసార్ట్స్ వంటి వేదికల్లో శాస్త్రీయ, ఆధునిక సంగీతంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సీసం కొవ్వొత్తులతో అలంకరించబడి సంగీతకారులు వాయించే సంగీతంతో ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి. ఈ కచేరీల్లో అర్జిత్ సింగ్, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖ మ్యూజిక్ సెలబ్రిటీలు భాగం కావడం విశేషం. ఉత్తమ మూవీ సౌండ్‌ట్రాక్స్, కోల్డ్‌ప్లే, ఎడ్ షీరాన్ మిక్స్ వంటి థీమ్‌లు ఇందులో ఉంటాయి. చదవండి: కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!నగరంలో సరికొత్త ట్రెండ్‌గా క్యాండిల్ లైట్ ఈవెంట్స్చీకటి వెలుగుల సందడి.. : గోల గోలతో హంగామా చేసే పార్టీలు కాకుండా.. బంధువులు, స్నేహితులతో ఒక మధురమైన వేడుక జరుపుకోవాల నుకుంటున్నవారికి క్యాండిల్ లైట్ బర్త్‌డే పార్టీలు సరైన ఎంపికగా మారుతున్నాయి. చిన్న చిన్న డెకరేషన్, ఫెయిరీ లైట్స్, సున్నితమైన మ్యూజిక్, సొగసైన కేక్ కటింగ్.. ఇవన్నీ కలిపి ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలు, టీనేజ్ యువత ఈ స్టైల్‌కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.క్యాండిల్ నైట్ డిన్నర్.. : ప్రేమికుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న మరో ట్రెండ్.. క్యాండిల్ నైట్ డిన్నర్. ఒక టేబుల్, రెండు హృదయాలు, నెమ్మదిగా వెలిగే మైనపు వెలుగు, వెనకనుంచి వినిపించే ఓ మెలోడీ పాట.. ఇది కేవలం డిన్నర్ కాదు, ఒక జ్ఞాపకం. హైదరాబాద్‌లోని పలు హై ఎండ్ రెస్టారెంట్లు, రూఫ్‌టాప్ కెఫేలు, ప్రైవేట్ విల్లాస్, రిసార్టులు ఈ రకమైన డిన్నర్ అనుభూతికి ప్రత్యేక ప్యాకేజీలతో అందిస్తున్నాయి. పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీ వంటి సందర్భాల్లో ఈ డిన్నర్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి.మెంటల్ పీస్: ఉరుకుల పరుగుల బీజీ నగర జీవనశైలిలో కాసింత ప్రశాంతత కోసం వినూత్నమైన అనుభూతి కోసం ఈ క్యాండిల్ లైట్ ఈవెంట్స్ అద్భుతమైన వేదికలుగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్: ఈ జెన్‌జీ బ్యాచ్ సోషల్ మీడియా యాప్స్‌లో తమను ప్రత్యేకంగా ప్రదర్శించు కోవడం ఇష్టపడుతుంటారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయదగిన అందమైన ఫొటోలు తీసుకోవాలంటే క్యాండిల్ లైట్ సెట్టింగ్స్ వైరల్‌గా నిలుస్తున్నాయి. అరుదైనఅనుభూతి: ప్రతి ఈవెంట్ వ్యక్తిగతంగా ప్లాన్ చేయబడటం ఈ క్యాండిల్ లైట్ ఈవెంట్స్ ప్రత్యేకత. ఇష్టమైన వారి కోసం, వారికి నచ్చే సెట్టింగ్స్‌తో ఈ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐసిస్) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్‌కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది. సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్ జోక్యం రష్యాపై ఐసిస్ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్‌కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది... అలా మొదలైంది... ఐసిస్ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్‌ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్‌కు పుతిన్ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్–కె). ఇది అఫ్గానిస్థాన్‌లో ఐసిస్ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్–కెనే. దీన్ని పాకిస్థానీ తాలిబాన్ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్‌లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్ కమెండోలు, అఫ్గాన్ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్–కె ఆగడాలకు కళ్లెం పడింది. అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ నుంచి వైదొలగడంతో ఐసిస్–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్లో దివంగత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది. ఇస్తాంబుల్‌లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్‌ను, ఆయన విధానాలను ఐసిస్–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా. మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'అమెరికాలో పూనకాలు లోడింగ్'.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
డీఎస్పీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పేరు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను ఊర్రూతలూగించడం ఆయన టాలెంట్. టాలీవుడ్లో మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల సినిమాల దాకా తన మ్యూజిక్‌తో అభిమానులను అలరించాడు. అందుకే టాలీవుడ్లో అతన్ని ముద్దుగా డీఎస్పీ అని పిలుస్తారు. అయితే తాజాగా తన టాలెంట్‌ను అమెరికాలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు డీఎస్పీ. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి డీఎస్పీ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'అమెరికాలో పూనకాలు లోడింగ్' అంటూ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) అమెరికాలోని నాసా ఆధ్వర్యంలో నిర్వహించే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా మెగాస్టార్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాసా అధ్వర్యంలో దేవి శ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. జులై 2న డల్లాస్, జులై 8న ఫిలడెల్ఫియా, జులై 15న సియాటెల్, జులై 22న సాన్ జొస్ , జులై 29న చికాగోలో ఈవెంట్స్ జరగనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్స్‌లో సింగర్ ఇంద్రవతి , సాగర్, గీతా మాధురి , హేమ చంద్ర , రీటా , పృథ్వి , మౌనిక అలరించనున్నారు. ప్రముఖ యాంకర్ నటి అనసూయ ఈ షోస్‌ను హోస్ట్ చేయనున్నారు. గతంలో నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లతో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నాసా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించారు. ఇటీవలే సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!) ℒℴ𝓋ℯ 𝓎ℴ𝓊 𝓂𝓎 𝒷ℴ𝓎 𝐑𝐎𝐂𝐊 𝐓𝐇𝐄 𝐒𝐇𝐎𝐖𝐖𝐖𝐖 Just do KUMMUDU..🎶🕺 Wishing ROCKSTAR @ThisIsDSP & his TEAM All The Very Best for DSP-USA TOUR 2023 *#DSPOoAntavaTourUSA*https://t.co/c6jea4ILUe@sagar_singer @itsvedhem @PrudhviChandrap @geethasinger… pic.twitter.com/8AvvNUZKQi — Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2023 -
కళా వైభవం
-
సాంస్కృతిక సౌరభం


