
అధిక బరువుతో బాధపడే వాళ్లు తీవ్రమైన క సరత్తు చేయాల్సిందే. గుట్టలకొద్దీ పేరుకు పోయిన కొవ్వు కరగాలంటే చెమట చిందించాల్సిందే. దీనికి కొందరికి రోజులు, నెలలు సరిపోవు. సంవత్సరాల తరబడి కృషి చేయాలి. ఏదో నాలుగు రోజులో, నెలలో చేసి నావల్ల కాదు చేతులెత్తేయకూడదు. ఓపిగ్గా ప్రయత్నించాలి. అప్పుడు అనుకున్న శరీరాకృతి సాధ్యమవుతుంది. ఇదే నిరూపించిందో యువతి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఈ వెయిట్ లాస్ జర్నీ వీడియో ఎక్స్‌లో సుమారు 60లక్షల వ్యూస్‌ను సాధించింది.
అద్భుతం, అమోఘం అంటూ చాలా మంది ఆమెను అభినందించగా, అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. వీడియో చివర్లో ఆమె స్మార్ట్‌లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత భారీగా బరువు తగ్గినపుడు, చర్మం వేలాడుతూ ఉంటుంది.అలా లేదేమిటి? అని కొందరు, బహుశా శస్త్రచికిత్స చేయించుకొని ఉండవచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. దాదాపు నేను కూడా సుమారు 200 పౌండ్లు బరుదు తగ్గాను. చర్మంఅలాగే ఉండిపోయింది. చాలా శస్త్రచికిత్సలు జరగకుండా ఆమె అలా అయ్యే అవకాశం లేదు. అది సాధ్యం కాదని నేను చెప్పడం లేదు, అది ఆమెదేనా అని అనుమానం అని మరో యూజర్ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.
Two years of hard work in 1 minute.
Impressive!!! pic.twitter.com/QP5QubvmwJ— MALEEK 1.0 (@Maleekoyibo) October 4, 2025