బెల్లీఫ్యాట్‌ తగ్గేందుకు 5:1:1 రూల్‌ అంటే..! | Health Tips In Telugu, What Is The 5:1:1 Rule In Weight Loss And Health, Read Story For More Details | Sakshi
Sakshi News home page

బెల్లీఫ్యాట్‌ తగ్గేందుకు 5:1:1 రూల్‌ అంటే..!

Feb 20 2026 3:42 PM | Updated on Feb 20 2026 4:23 PM

Health Tips: What Is The 5:1:1Rule To Lose Belly Fat

కార్బోహైడ్రేట్స్‌ తీసుకోవడం తగ్గిస్తే బరువు తగ్గి స్లిమ్‌గా అవుతామన్నది చాలామందిలో ఉండే అభిప్రాయం. అయితే మనం తీసుకునే కార్బోహైడ్రేట్లకు తగినట్లుగా పీచు, ప్రోటీన్‌లను చేర్చాలి. ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లు : 1 గ్రాము పీచు (ఫైబర్‌) : 1 గ్రాము ప్రోటీన్‌ అంటూ 5:1:1 నిష్పత్తిలో తీసుకుంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకోవడం తగ్గడంతో పొట్ట అలాగే దేహం బరువు పెరగక వ్యక్తులు స్లిమ్‌గా ఉంటారన్నది న్యూట్రిషనిస్టుల మాట.

తెల్ల బ్రెడ్డు, పేస్ట్రీలు, మైదా, ఇన్‌స్టాంట్‌ నూడుల్స్‌ వంటి రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్స్‌లో కేవలం పిండిపదార్థాలు మాత్రమే ఉంటాయి. వాటిలో పీచుపదార్థాలుగానీ లేదా ప్రోటీన్‌గానీ ఉండక΄ోవడంతో అవి తిన్నవెంటనే రక్తంలోకి చక్కెర విడుదలవుతుంది.  వినియోగం కాని చక్కెర కొవ్వుగా మారి బరువు పెరుగుతారన్నది చాలామందికి తెలిసిన విషయమే. 

5:1:1 రూల్‌ అంటే... 
ఐదు (5 ) గ్రాముల కార్బోహైడ్రేట్‌  ఉండే ఆహారాన్ని తీసుకుంటే... దానికి అనుగుణంగా –1 గ్రాము పీచు పదార్థం అలాగే – 1 గ్రాము ప్రోటీన్‌ తీసుకోవాలి. దాంతో పిండిపదార్థంవల్ల పెరగాల్సిన కొవ్వు పెరగకుండా ఈ పీచు, అలాగే ప్రోటీన్లు అడ్డుపడతాయి. 5:1:1 నిష్పత్తికి అర్థమిదే. ఈ నిష్పత్తిలోని 1 గ్రాముల పీచు, 1 గ్రాము ప్రోటీన్‌తో ఏయే ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం. 

1 గ్రాము పీచుతో... 
పీచు (ఫైబర్‌) జీర్ణక్రియను మెల్లగా జరిగేలా చూస్తుంది. దాంతో చక్కెరలు వెంటనే రక్తంలో పెరగకుండా మెల్లమెల్లగా ఇంకుతుంటాయి. ఫలితంగా రక్తంలోని చక్కెర మోతాదులు అకస్మాత్తుగా పెరగవు (స్పైక్‌ అవ్వవు). ఒకేసారి చక్కెరలు రక్తంలో విడుదల కావు కాబట్టి దాన్ని అదుపు చేయాల్సిన ఇన్సులిన్‌ కూడా అకస్మాత్తుగా విడుదల కావాల్సిన అవసరం లేదు. అందువల్ల అది నెమ్మదిగా తగిన మోతాదులోనే విడుదలవుతూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

ఇక పీచు వల్ల కడుపు నిండుగా ఉన్న భావనతో వెంటనే ఆకలిగా అనిపించదు. అంతేకాదు జీర్ణవ్యవస్థ ఆరోగ్యమూ బాగుంటుంది. జీర్ణవ్యవస్థలో ఉండాల్సిన మేలు చేసే మంచి బ్యాక్టీరియా (గట్‌ బ్యాక్టీరియా) పెరగడంతో వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. దాంతో అంత తేలిగ్గా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ఇక పీచు (ఫైబర్‌) అన్నది కొవ్వులను సమీకరించి వ్యర్థాల రూపంలో వెళ్లకుండా మలం నుంచి వేరు చేస్తుంది. 

1 గ్రాము ప్రోటీన్‌తో 
ప్రోటీన్‌ వల్ల కూడా చక్కెరలు తక్షణం పెరగక΄ోగా... కండరాల బలం కూడా సమంగా నిర్వహితమవుతుంది. ్ర΄ోటీన్‌ తిన్న తర్వాత వెంటనే ఆకలిగా అనిపించదవు. దాంతో మితిమీరు తినడం (ఓవర్‌ ఈటింగ్‌) తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం బాగా తగ్గుతుంది. ఇక ్ర΄ోటీన్‌ వల్ల కండరాల రిపేర్లు జరుగుతుండటం, దేహానికి అవసరమైన శక్తి అందుతుంది. 

మరి... ప్రోటీన్లూ, పీచు... ఈ రెండూ పుష్కలంగా ఉండే ఆహారాలేమిటంటే... 

  • దాదాపు చాలారకాల పప్పుదినుసులు / కాయధాన్యాలు (లెంటిల్స్‌) లోప్రోటీన్‌ తోపాటు పీచుపదార్థాలూ ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు కందులు, శనగలు, చిక్కుళ్లలో 40 నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్లతోపాటు ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. 

  • పొట్టుతీయని ధాన్యాలలో కార్బోహైడ్రేట్లతో పాటు కొంత ప్రోటీన్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు ముడిబియ్యం, జొన్నలు, కొర్రలు, సజ్జలు, అరికలు, సామలు, ఊదలు, క్వినోవా. 

  • అన్నిరకాల తాజా పండ్లలో స్వాభావికమైన చక్కెరతో పాటు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, తేమ (మాయిశ్చర్‌) లకు అదనంగా పీచుపదార్థాలూ (ఫైబర్‌) ఉంటాయి. 
    వీలైనంతవరకు 

  • పండ్ల రసాలను కాకుండా పండ్లు తీసుకోవడం మేలు. 

దూరం ఉంచాల్సినవి... 
బ్రెడ్, పేస్ట్రీలు, బిస్కెట్లు, కేకులు, డోనట్స్, పిజ్జా, బర్గర్, నూడుల్స్, బేకరీ పదార్థాలు, చిప్స్‌ వంటి కరకరలాడే (క్రిస్పీ) వేపుళ్లకు వీలైనంత దూరం ఉండాలి. అలాగే ప్యాకేజ్‌డ్‌ జ్యూస్‌లు, జామ్, స్వీట్లకు కూడా దూరంగా ఉండటం మేలు.

5:1:1 అనే ఈ నిబంధనను వీలైనంతగా పాటిస్తూ ఉంటే... బరువు పెరగక΄ోవడం, కడుపు చుట్టూ అనవసరమైన కొవ్వు పేరుకుని పొట్టరావడం వీలైనంతగా తగ్గుతుంది. దాంతో ఊబకాయంతో వచ్చే అనేక అనర్థాలు అంటే... డయాబెటిస్, హైబీపీ, ఫ్యాటీలివర్‌ గుండెజబ్బులు... వీటన్నింటినీ నివారించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.  
డాక్టర్‌ శ్రీలత సీనియర్‌ క్లినికల్‌ డైటీషియన్‌ అండ్‌ న్యూట్రీషనిస్ట్‌ 

(చదవండి: Actress Sneha and Prasanna: మైండ్‌ఫుల్‌ పేరెంటింగ్‌ మంత్ర!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement