
కిచెన్ చూసి షాకైన కస్టమర్లు
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కేఎప్‌సీ (KFC)మరోసారి చిక్కుల్లో పడింది. బెంగళూరు ఔట్‌లెట్‌లో కుళ్లిపోయినచికెన్ వడ్డించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి..
బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ కేఎఫ్‌సీపై విమర్శలు గుప్పిస్తూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం బెంగళూరు(Bangalore) కోరమంగళ అవుట్‌లెట్‌లో ఉన్న KFCలో ఒక మహిళా కస్టమర్ హాట్ & స్పైసీ చికెన్ జింజిర్ బర్గర్ ఆర్డర్ చేశారు. దాంట్లోని మాంసం కుళ్లి భరించలేని వాసన వచ్చింది. దీంతో దాన్ని రీప్లేస్ చేయమని అడిగారు. కానీ రెండోసారి కూడా దుర్వాసనతో చెడిపోయిన బర్గర్ ఇవ్వడంతో షాక్ అవ్వడం ఆమె వంతైంది.
దీంతో ఆమె సిబ్బందిని గట్టి నిలదీయంతో "ఇది కేవలం సాస్ వాసన" తోసిపుచ్చారని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా, సిబ్బంది తన చికెన్ బర్గర్‌ను వెజిటేరియన్‌తో భర్తీ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కోరమంగళ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లో తాను క్రమం తప్పకుండా అదే బర్గర్‌ను ఆర్డర్ చేస్తానని , ఇంతకు ముందెపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆమె వెల్లడించించింది.
అంతేకాదు ఈ వివాదంతో కస్టమర్లు వంటగదిని చూడాలని డిమాండ్ చేశాడు. దీనికి మొదట అంగీకరించని సిబ్బంది, రాత్రి 10 గంటల తర్వాత ప్రవేశం లేదని, మేనేజర్ అందుబాటులో లేరని సిబ్బంది అనేక సాకులు చెప్పారు.చివరికి అనుమతించారు. దీంతో అక్కడి దృశ్యాల్నిచూసి జనం షాకయ్యారని తన పోస్ట్‌లో ఆరోపించింది.అంతా కలుషితం, మురికి వాసన, కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లే మాంసం, బూజు పట్టిన, తుప్పు పట్టిన షీట్లు, మరకలు ఉమ్మి గుర్తులు ఉన్నాయంటూ పేర్కొంది. (పబ్లిక్ టాయిలెట్స్‌లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?)
🚨 WARNING: HSR KFC, Bangalore Extremely Unsafe Food 🚨
One of our followers has shared a shocking and disturbing experience at the KFC outlet in HSR Layout, Bangalore. She had ordered a Hot & Spicy Chicken Zinger Burger, but the moment she opened it, the stench was unbearable.… pic.twitter.com/yFpIcblaAA— Karnataka Portfolio (@karnatakaportf) October 4, 2025
దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చిన తర్వాత సిబ్బంది దాదాపు అరగంట పాటు వంటగదిని తాళం వేసి ఉంచారని, ఆ సమయంలో స్విగ్గీ , జొమాటో ఆర్డర్లు పంపడం కొనసాగిందని పోస్ట్ పేర్కొంది. "30-40 డెలివరీలు ఒకే చెడిపోయిన మాంసాన్ని ఉపయోగించి పంపించారని కూడా ఆరోపించారు.

మేనేజ్‌మెంట్ షాకింగ్ రియాక్షన్
ఇదిలా ఉంటే మేనేజ్‌మెంట్ స్పందన అత్యంత షాకింగ్‌గా ఉంది. తన సొంత కుటుంబానికి అలాంటి ఆహారాన్ని అందిందని అని ఒప్పుకుంటూనే, ఈఫుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అవుట్‌లెట్ మేనేజర్ వాదించడం విడ్డూరంగా నిలిచింది.
ఈ సంఘటన నెట్టింట విమర్శలకు తావిచ్చింది. పిల్లలతో సహా వెళ్లే కుటుంబాలకు ఇలాంటి ఆహారం వడ్డించడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నా.. అందుకే ఆ అవుట్‌లెట్‌కు వెళ్లడం పూర్తిగా మానేశాను. వీలైతే, మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే అక్కడి నుండి తినకండి" అని మరొకరు కామెంట్ చేశారు. "ప్రతి రెస్టారెంట్ ఏ సమయంలోనైనా కస్టమర్లు వంటగదిని సందర్శించడానికి అనుమతించాలి. సరైన పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లను ఆహార లైసెన్స్ రద్దు చేయడంతో వెంటనే మూసివేయాలి. అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపులర్ ఆహార డెలివరీ యాప్‌ల ద్వారా అందించే క్లౌడ్ కిచెన్‌ల పరిస్థితి ఏంటి ఒకయూజర్ ఆందోళనవ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!
ఈ సంఘటన నిజమని నిరూపితమైతే, అవుట్‌లెట్‌లో పరిశుభ్రత ,ఆహార భద్రత ఆందోళన కలిగించే అంశమే. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్‌లతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి ఈ వివాదం, వీడియోలోని ఆరోపణలపై కేఎఫ్‌సీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.