
చాలామంది రెస్టారెంట్లు లేదా సినిమాలకు వెళ్లినప్పుడు అక్కడి టాయిలెట్లలో చేతులు కడుకున్న తర్వాత హ్యాండ్ డ్రైయర్స్ వాడటం మామూలే. కానీ అలా పబ్లిక్ టాయిలెట్లలోని వాష్ బేసిన్లలో హ్యాండ్ వాష్ తర్వాత... అక్కడి డ్రైయర్లు ఉపయోగించి చేతుల్ని ΄పొడిగా చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కొందరు వైద్యుల సలహా ఏమిటంటే... టాయిటెట్లలో హ్యాండ్‌వాష్ లేదా లిక్విడ్ సోప్‌తో చేతులు కడుక్కున్న తర్వాత అవి ఎంతోకొంత శుభ్రమవుతాయి. కానీ అలా శుభ్రమైన చేతుల్ని కాస్తా అక్కడ హ్యాండ్ డ్రైయర్ కింద పెట్టడం వల్ల మళ్లీ అవి కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువన్నది ఆరోగ్యనిపుణుల మాట. ఎందుకంటే అది టాయిలెట్ కావడం వల్ల ఎంత లేదన్నా అక్కడి పరిసరాల్లో సూక్ష్మజీవులు, జెర్మ్స్ వంటివి ఉండనే ఉంటాయి.
ఇలా మనం డ్రైయర్ కింద చేతులు పెట్టినప్పుడు ఆ డ్రైయర్ తాలూకు ఉష్ణోగ్రత పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు. కేవలం చేతుల్ని పొడిబార్చేందుకు ఉద్దేశించినంతే ఉంటుంది. అంతటి గోరువెచ్చటి ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవులు అంతరించి΄ోవనీ, దానికి బదులు అక్కడి గాలిలో ఉండే సూక్ష్మక్రిములు, జెర్మ్స్ మళ్లీ చేతులకు అంటుకు΄ోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డ్రైయర్‌కు బదులుగా వ్యక్తిగత హ్యాండ్‌కర్చిఫ్ వాడటం లేదా అలా స్వతహాగా అరి΄ోయేదాకా వేచిచూడటమే మంచిదని అంటున్నారు. అలాగే కొందరు నిపుణులు చెబుతున్నదేమిటంటే... టాయిలెట్లలోని వాష్‌బేసిన్ల దగ్గర ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాత మళ్లీ అక్కడి ఏ ఉపరితలాన్నీ (సర్ఫేస్‌నూ) తాకకూడదని సూచిస్తున్నారు.
చదవండి : ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే!