ఐటీ,కార్పొరేట్ ఉద్యోగం అంటే ఒత్తిడితో కూడుకున్నది అని చాలామంది వాపోతూ ఉంటారు. తాజాగా ఒక టెక్ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్యంపై వెల్లడించిన సంగతి నెట్టింట వైరల్ అవుతోంది. తన ఉద్యోగ జీవితంలో ఒత్తిడి చాలా ప్రమాదకరంగా మారిపోయిందని, దీంతో తనకు విశ్రాంతి అవసరమని వైద్యులు హెచ్చరించారని పేర్కొన్నాడు.
వర్క్‌ప్లేస్ చర్చా యాప్ ‘బ్లైండ్’ లో ఒక పోస్ట్ ద్వారా ఓ టెక్నీషియన్ తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన జీవితంలో ఉద్యోగ ఒత్తిడి, ధూమపానం కంటే ప్రమాద కరమని డాక్టర్ హెచ్చరించారని పేర్కొన్నాడు. ఆరోగ్యాన్నికాపాడు కోవాలంటే విశ్రాంతి అవసరమని చెప్పారంటూ తన అనుభవాన్ని పంచు కున్నాడు.
గత ఐదేళ్లుగా ఒకే వైద్యుడిని సందర్శిస్తున్నట్లు పంచుకున్నారు. ఈ కాలంలో ఆయన పర్యవేక్షణలోనే ఒత్తిడి నియంత్రణకు మందులు వాడుతున్నానని చెప్పాడు. అయినా బరువు పెరగడం, జీర్ణవ్యవస్థ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు గుర్తించారనీ,, ఉద్యోగ ప్రభావం తన శరీరంపై తీవ్రంగా కనిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారట వైద్యుడు. .
ఉదయం వేళల్లో గుండె వేగంగా కొట్టుకోవడం జరగబోయే చెడుకు సంకేమతని, ఒత్తిడి దూరంగా ఉంటూ, విశ్రాంతి తీసుకోవాలని సూచించారని పేర్కొన్నాడు. అలాగే 40 ఏళ్ల వయసులో గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించారని, ఆర్థికంగా వెసులుబాటు ఉంటే, ఉద్యోగం నుంచి విరామం తీసుకోవాలని సలహా ఇచ్చారన్నాడు. అయితే తనకు రెండు నెలల కంటే ఎక్కువ రోజులు ఉద్యోగం లేకుండా గడవడం కష్టమని, ఇలాంటి సలహా మీకెవరినైనా డాక్టర్ ఇచ్చారా? లేదంటే తాను మరో డాక్టర్‌ని సంప్రదించడం మంచిదా అని నెటిజనులను ప్రశ్నించాడు.
నెటిజనుల స్పందన
దీనికి కామెంట్లు వెల్లువెత్తాయి. చాలా మంది వినియోగదారులు బర్న్అవుట్ , నాది కూడా ఇలాంటి పరిస్థితే అంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. వరస్ట్ వర్క్‌లైఫ్ బ్యాలెన్స్, టాక్సిక్ సహోదోగ్యులు, ఆఫీసు రాజకీయాలు, మేనేజ్‌మెంట్ ఒత్తిడి వీటినుంచి బైట పడటానికి 3 - 4 నెలలు పట్టింది. దాదాపు 6 నెలల తర్వాత కానీ మనిషిని కాలేపోయాను. కనుక ఆరోగ్యం కంటే విలువైందీ, ముఖ్యమైందీ ఏదీ లేదని ఒకరు సలహా ఇచ్చా 45 ఏళ్లు ఒకే కంపెనీలో గాడిద చాకిరీ చేశారు, కాని రిటైర్ అయిన వారానికే గుండెపోటుతో చనిపోయాంటూ తన తండ్రి అనుభవాన్ని మరొకరు షేర్ చేశారు. ఆయన మానసిక ఆరోగ్యం పూర్తిగా నాశనం అయిందన్నారు.
ప్రతిరోజూ జాబ్ ఒత్తిడితో బాధపడుతూ డబ్బు / కెరీర్ అంటూ కాలయాపన వద్దు. విరామం తీసుకొని, మంచి జీవితాన్ని ఇచ్చే మరో కంపెనీలో చేరాలని మరొకరు సూచించారు. మీ డాక్టర్ సూపర్‌బాస్..కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన సమయం వచ్చిందని ఒకరు కామెంట్ చేశారు.
ఇదీ చదవండి: ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు
కాగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా అవసరం. తీవ్ర ఒత్తిడి శరీరంపై అనేక దుష్ప్రభావాలను చూపిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. ఒత్తిడి మానసిక ఆరోగ్యం, నైపుణ్యం దెబ్బతింటుంది. ఆకలి పెరగడం లేదా మందగించడం, గుండెపోటు, బరువు పెరగడం లాంటి వాటితోపాటు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు అధిక విడుదలకు కారణం ఒత్తిడి.


