దేశంలోనే తొలి ‘గో మ్యూజియం’!  | India first cow culture museum to open in UP Mathura | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలి ‘గో మ్యూజియం’! 

Feb 16 2026 6:34 AM | Updated on Feb 16 2026 6:34 AM

India first cow culture museum to open in UP Mathura

మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో దేశంలోనే మొట్టమొదటి నేషనల్‌ కౌ కల్చర్‌ మ్యూజియం (జాతీయ ఆవు సంస్కృతి ప్రదర్శనశాల) ఏర్పాటు కానుంది. పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియం ఆవుల సాంస్కృతిక, ఆధ్యాతి్మక, శాస్త్రీయన ప్రాముఖ్యతను తెలియజేస్తుందని, గో సంరక్షణపై సమగ్ర అవగాహనను పెంపొందిస్తుందని అధికారులు తెలిపారు.

 ఈ ప్రాజెక్టు సంబంధించిన భూమికోసం బ్రజ్‌ తీర్థ వికాస్‌ పరిషత్‌ ఉపాధ్యక్షుడు శైలజాకాంత్‌ మిశ్రా, ఆగ్రా డివిజనల్‌ కమిషనర్‌ నాగేంద్ర ప్రతాప్, జిల్లా కలెక్టర్‌ సీపీ సింగ్, మధుర బృందావన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఉపాధ్యక్షులు ఎన్‌ లక్ష్మీ వెటర్నరీ యూనివర్సిటీ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు రూపురేఖలపై చర్చించారు. మ్యూజియంలో సు మారు 100 డిజిటల్, సింబాలిక్‌ ఆవుల నమూనాలు ప్రదర్శించనున్నట్టు కమిషనర్‌ నాగేంద్ర ప్రతాప్‌ తెలిపారు. 

 ఆవు వారసత్వ గొప్పతనం గురించి భవిష్యత్‌ తరాలకు అవగాహన కలి్పంచేందుకు దేశంలో అన్ని ప్రధాన ఆవుల జాతులు, అలాగే అంతరించి పోతున్న జాతులు అందులో ఉంటాయన్నారు. ఆవు పాలు, పెరుగు, జున్ను, నెయ్యి వంటి ఉత్పత్తుల ప్రదర్శనతోపాటు, అవి అందించే ఆయుర్వేద ప్రయోజనాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.  సందర్శకులకు స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించే ఒక డైరీ పార్లర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement