విమాన ప్రమాదాలు, ఇండిగో సంక్షోభంతో విమానాలు రద్దు లాంటి అనేక ఇబ్బందులతో విమాన ప్రయాణ మంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి పరిస్థితి ప్రయాణికులది. తాజాగా జరిగిన మరో సంఘటన విమాన ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది.వాంకోవర్ విమానాశ్రయంలో ఎయరిండియా పైలట్ బుక్ అయ్యాడు. స్టోరీ ఏమిటీ అంటే...
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఫెస్టివ్ మూడ్‌లో ఉన్న పైలట్ మద్యం సేవించి వాంకోవర్‌నుంచి ఢిల్లీకి బయలు దేరిన బోయింగ్ 777-AI 186 విమానంలో విధులకు సిద్ధ పడ్డాడు. విమానంలో పైలట్ భద్రతా ప్రోటోకాల్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. ఆల్కహాల్ వాసన వస్తున్నట్లు గమనించిన సిబ్బంది ఈ విషయాన్ని కెనడియన్ అధికారులకు నివేదించారు. వారు తక్షణమే పైలట్‌ను బ్రీత్ అనలైజర్ పరీక్షలో పట్టుబడ్డాడు. దీంతో అతని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమానాన్ని రెండు గంటల పాటు నిలిపి వేశారు. విషయం తెలిసి ప్రయాణీకులు ఆందోళన పడ్డారు. 2025 డిసెంబరు 23న సంఘటన చోటు చేసుకుంది.
పైలట్ వ్యవహారం బయటపడటంతో ఎయిరిండియా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. నలుగురు పైలట్లు రెండు షిఫ్ట్‌లతో నడిచే ఈ అల్ట్రా-లాంగ్-హాల్ విమానం స్థానిక సమయం సాయంత్రం 5 గంటలకు బయలు దేరింది. షెడ్యూల్ కంటే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరి, వియన్నాలో కొత్త సిబ్బందితో ఢిల్లీకి బయలుదేరింది. దీనిపై ఎయిరిండియా తీవ్రంగా స్పందించింది. పైలట్‌ను ఢిల్లీకి తరలించి, దర్యాప్తు చేపట్టింది. జీరో-టాలరెన్స్ తమ విధానమని, నిబంధనల ఉల్లంఘనను సహించబోమని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణీలకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. అలాగే ఈ విషయాన్ని ఎయిర్‌లైన్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి నివేదించింది.
మరోవైపు పైలట్ విమానాశ్రయంలో అనుకోకుండా మద్యం తాగాడని కొందరు చెప్పగా, మరికొందరు బాటిల్కొన్న సందర్భంగా అతనికి మద్యం వాసన వచ్చిందని చెబుతున్నారు.


