breaking news
Air India
-
నష్టాల ఎఫెక్ట్: ‘మీ బట్టలు మీరే ఉతుక్కోండి’
న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తమ పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి ఊహించని షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ సర్వీసుల లేఓవర్ (విదేశాల్లో విమాన విరామ సమయం) సమయంలో సిబ్బందికి ఇప్పటివరకు అందిస్తున్న ఉచిత లాండ్రీ (దుస్తులు ఉతికే) సేవలను జూలై ఒకటి నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూడటంతో, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా వస్తున్న ఈ సాంప్రదాయానికి స్వస్తి పలుకుతుండటంతో సిబ్బంది కొంత సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని అంతర్గత ఈమెయిల్లో ఎయిర్ ఇండియా పేర్కొంది.హోటల్ గదుల్లో ఇస్త్రీ పెట్టెలుఇకపై అంతర్జాతీయ లేఓవర్ల సమయంలో హోటల్ లాండ్రీ సేవలకు బదులుగా, క్రూ సిబ్బంది ఉండే గదుల్లోనే ఐరన్ బాక్స్ (ఇస్త్రీ పెట్టె), ఐరన్ బోర్డులను అందుబాటులో ఉంచనున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. అదనంగా యూనిఫామ్ సెట్లు కావాలనుకునే ఉద్యోగులు ప్రత్యేక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, విదేశీ ప్రయాణాలకు ముందే తగిన ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించింది. అయితే దేశీయ లేఓవర్లలో (డొమెస్టిక్ రూట్లలో) మాత్రం ఈ లాండ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అలాగే విమానాల మళ్లింపు, అంతర్జాతీయ స్టేషన్లలో సిమ్యులేటర్ లేదా క్లాస్రూమ్ శిక్షణ వంటి ప్రత్యేక సందర్భాలకు ఈ కొత్త నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చారు.అంతర్జాతీయ ప్రమాణాల కోసమే..ఈ నిర్ణయాన్ని ఎయిర్ ఇండియా సమర్థించుకుంది. సాధారణంగా పైలట్లు, క్యాబిన్ క్రూ సభ్యులకు నాలుగు సెట్ల యూనిఫామ్‌లను ఇస్తామని, అంతర్జాతీయ పర్యటనల రొటేషన్ నిర్వహణకు ఇవి సరిపోతాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. విదేశీ ప్రయాణాల్లో యూనిఫామ్ మెయింటెనెన్స్‌ను రోజువారీ ఇతర ఖర్చుల కింద సిబ్బందే చూసుకోవడం అంతర్జాతీయంగా సాధారణ విషయమేనని స్పష్టం చేసింది.సిబ్బంది అసంతృప్తిఎయిర్ ఇండియా తీసుకున్న ఈ పొదుపు చర్యలపై సిబ్బంది నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై కొంతమంది ఉద్యోగులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇకపై తాము అంతర్జాతీయ ప్రయాణాలకు వెళ్లేటప్పుడు యూనిఫామ్‌లు ఉతుక్కోవడానికి బకెట్, డిటర్జెంట్ సర్ఫ్, బట్టలు ఆరేసుకునే తాడును కూడా వెంట తీసుకెళ్లాలేమోనంటూ వ్యంగ్యంగా నవ్వుకుంటున్నారు. యాజమాన్యం ఖర్చులు తగ్గించుకోవడానికి ఇలాంటి చిన్న విషయాలపై ఆంక్షలు విధించడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘ట్రంప్ కన్నా పుతిన్ బెటర్’.. తేల్చేసిన భారతీయులు -
విమానాన్ని ముక్కలు చేసిన బాంబు.. అసలు కథ బయటకు..
కెనడా నుంచి లండన్ మీదుగా 1985 జూన్ 23న భారత్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఐర్లాండ్ తీరానికి సమీపంలో గగనతలంలో పేలిపోయింది. ఆ విమానంలో ఉన్న 329 మంది అంతా మరణించారు. ఆ ఘటనను భారత్ ఎన్నటకీ మర్చిపోలేదు. 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 పేలుడు వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులే ఉన్నారని భారత్ మొదటి నుంచీ చెబుతోంది. కానీ, కెనడా ప్రభుత్వం లేదా దాని గూఢచారి సంస్థలు ఇంతకాలం బహిరంగంగా "ఖలిస్తానీలే బాంబు పెట్టారు" అని స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు తొలిసారిగా కెనడా ప్రధాన గూఢచారి సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) తొలిసారిగా అధికారికంగా ఆ విషయాన్ని చెప్పింది. "కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు విమానంలో బాంబు పెట్టారు. ఆ పేలుడుతో 329 మంది మరణించారు" అని పేర్కొంది. ఇన్నేళ్లుగా భారత్ చేస్తున్న ఆరోపణను కెనడా ఇప్పుడు అధికారికంగా అంగీకరించినట్లయింది. ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడా నేలపై పనిచేస్తున్నారన్న భారత వాదనకు బలం చేకూరింది. కెనడా గతంలో ఖలిస్తానీ అంశంపై తీసుకున్న వైఖరిలో మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.సీఎస్ఐఎస్ ఏమని చెప్పింది? ఈ విషాదాన్ని స్మరించుకుంటూ బుధవారం ఫేస్బుక్లో చేసిన పోస్టులో.. సీఎస్ఐఎస్ నేరుగా వేర్పాటువాద ఉద్యమాన్నే ఈ దాడికి బాధ్యులుగా పేర్కొంది. “కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు 1985 జూన్ 23న అమర్చిన బాంబు విమానాన్ని ధ్వంసం చేసింది. అందులో ఉన్న వారంతా మరణించారు. వారిలో ఎక్కువ మంది కెనడియన్లు. ఇది ఇప్పటికీ కెనడా చరిత్రలో అత్యంత ప్రాణాంతక ఉగ్రదాడి” అని సీఎస్ఐఎస్ తెలిపింది.టొరొంటో నుంచి ముంబైకి వెళ్తున్న బోయింగ్ 747 విమానం ‘ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 ఎంపెరర్ కనిష్క’పై జరిగిన ఈ బాంబు దాడి కెనడా చరిత్రలోనే అత్యంత ఘోర ఉగ్రదాడిగా నిలిచింది. 2001 సెప్టెంబర్ 11 దాడుల వరకు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక విమాన ఉగ్రదాడిగా నిలిచింది.నిషేధిత ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖాల్సా సభ్యులు సామాన్ల విభాగంలో అమర్చిన బాంబు పేలడంతో అట్లాంటిక్ మహాసముద్రం పైనే విమానం ముక్కలైంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. 2005లో ఈ విషాద ఘటన వార్షిక దినమైన జూన్ 23ను ఉగ్రవాద బాధితుల జాతీయ స్మరణ దినంగా కెనడా ప్రకటించింది.ఖలిస్తానీ ఉద్యమాన్నే ఈ దాడికి బాధ్యులుగా సీఎస్ఐఎస్ స్పష్టంగా పేర్కొనడం, కొద్ది నెలల క్రితం విడుదల చేసిన వార్షిక నివేదిక తర్వాత చోటుచేసుకోవడం గమనార్హం. ఆ నివేదికలో ఖలిస్తానీ తీవ్రవాదులను జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్న విషయం తెలిసిందే.కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు కెనడా భూభాగాన్ని వినియోగించి హింసాత్మక తీవ్రవాద కార్యాచరణను ప్రోత్సహిస్తున్నాయి, అలాగే హింసాత్మక కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తూ సమన్వయం చేస్తున్నాయని సీఎస్ఐఎస్ హెచ్చరించింది.భారత్‌కు కీలకం కెనడాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులే ఆ విమానానికి పేలుడు పదార్థాన్ని అమర్చారని సీఎస్ఐఎస్ స్పష్టంగా చేసిన ప్రకటన భారత్‌కు ఎంతో కీలకం. ఇరు దేశాల మధ్య ఖలిస్తానీ అంశంపై కొనసాగుతున్న దౌత్య వివాదంలో ఇది భారత్‌కు కీలక విజయంగా భావిస్తున్నారు.భారత్ ఎన్నో ఏళ్లుగా ఖలిస్తానీ కార్యకలాపాలపై ఆందోళనలు వ్యక్తం చేసినా, కెనడా వాటిని పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. భారత్‌లో ఆ ఉద్యమం క్షీణించిన తర్వాత కూడా కెనడా వాటికి ఆశ్రయం కల్పించిందని భారత్ చెబుతూ వచ్చింది.మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పాలన సహా వరుస కెనడియన్ ప్రభుత్వాలు ఈ అంశంపై భారత్‌తో వివాదానికి దిగాయి. ట్రూడో ప్రభుత్వం అయితే కెనడియన్ పౌరులపై హింసాత్మక సరిహద్దు దాటి భారత్ అణచివేత కార్యక్రమాన్ని నిర్వహించిందని కూడా ఆరోపించింది. అయితే చాలా కాలంగా తమ భూభాగంలో పనిచేస్తున్న ఖలిస్తానీ నెట్‌వర్క్‌ల వల్ల ఏర్పడిన ముప్పును కెనడియన్ సంస్థలు ఇప్పుడు గుర్తించడం ప్రారంభించడంతో, భారత్ చెబుతున్న వాదనకు బలం చేకూరినట్లు కనిపిస్తోంది. -
ఎయిరిండియాకు తృటిలో తప్పిన ప్రమాదం
ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భయాంలోళనలు నెలకొన్నాయి.రాయ్‌పూర్ విమానాశ్రయ అథారిటీ ప్రకారం, విమానం ల్యాండింగ్ అవుతున్నప్పుడు అకస్మాత్తుగా పక్షి ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రయాణీకులకు గానీ, సిబ్బందికి గానీ ఎటువంటి గాయాలు కాకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటన జరిగిన వెంటనే, పరిస్థితిని అంచనా వేయడానికి, ఇతర భద్రతా ప్రమాణాలనునిర్ధారించడానికి ఎయిరిండియా నిర్దేశిత చర్యలు చేపట్టింది.విమానయాన భద్రతా నియమాలకు అనుగుణంగా అవసరమైన తనిఖీలు చేపట్టినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తైన అనంతరం విమానానికి అనుమతి లభించిందని విమానాశ్రయ అథారిటీ ధృవీకరించింది.ఇదీ చదవండి: అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్ డ్రైవర్‌గా ఇపుడు లక్షపక్షులు ఢీకొట్టడం అనేది విమానయానాల్లో పెద్ద ప్రమాదం. ఇటువంటి సంఘటనల తర్వాత, విమానం తిరిగి సేవలను ప్రారంభించే ముందు గాలిలో ప్రయాణించడానికి యోగ్యంగా ఉందని నిర్ధారించుకొనేందుకుగాను విమానయాన సంస్థలు వివరణాత్మక తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: శివానుగ్రహం కోసం 12 ఏళ్లుగా నిలబడి దీక్ష?! నెటిజన్లు షాక్! -
తక్కువ ధరకు విమాన టికెట్లు.. ఎయిర్ ఇండియాలో కొత్త కేటగిరీ
విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దేశీయ ప్రయాణికుల కోసం కొత్తగా ‘బేసిక్’ ఛార్జీల కేటగిరీని ప్రవేశపెట్టింది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కొత్త ఫేర్ ద్వారా తక్కువ ధరలో టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేటగిరీలో ప్రయాణించే వారికి ఉచిత భోజనం అందుబాటులో ఉండదు. అయితే 15 కిలోల చెక్డ్ బ్యాగేజ్, 7 కిలోల క్యాబిన్ బ్యాగేజ్ అనుమతి యథాతథంగా కొనసాగుతుంది. టీ లేదా కాఫీ వంటి పానీయ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ‘వాల్యూ’, ‘క్లాసిక్’, ‘ఫ్లెక్స్’ అనే ఫేర్ కేటగిరీలు అందుబాటులో ఉండగా, వాటితో పాటు ‘బేసిక్’ను కూడా చేర్చింది. ధరకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయాణికులు అవసరమైన సేవలను మాత్రమే ఎంచుకునేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రయాణానికి 24 గంటల ముందువరకు ప్రయాణికులు అదనపు చెల్లింపుతో భోజనాన్ని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ మార్పులు జరిగితే ముందుగా బుక్ చేసిన భోజనాన్ని కొత్త విమానానికి బదిలీ చేయడం లేదా అందుబాటులో లేకపోతే పూర్తి రీఫండ్ ఇవ్వడం జరుగుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది.దేశీయ మార్కెట్లో తక్కువ ధరల విమానయాన సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ, నిర్వహణ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ ‘అన్‌బండిల్డ్’ మోడల్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎంపిక చేసిన మార్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ సేవపై ప్రయాణికుల స్పందనను పరిశీలించిన తర్వాత భవిష్యత్ విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. 2024లో ప్రవేశపెట్టిన స్మార్ట్ ఫేర్ వ్యవస్థను మరింత సరళీకృతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిర్ ఇండియా ఈ కొత్త ఫేర్‌ను ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ధరలను తగ్గించేందుకు భోజనాన్ని ఐచ్ఛికంగా మార్చే ప్రయత్నం గత కొన్ని నెలలుగా చర్చల్లో ఉండగా, ఇప్పుడు అధికారికంగా అమలులోకి తీసుకొచ్చింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, ఈ మార్పుతో టికెట్ ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉంది.‘బేసిక్’ ఫేర్ ప్రస్తుతం ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్, కాంటాక్ట్ సెంటర్ మరియు ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా అందుబాటులో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. -
విమానాల కొనుగోలు ప్రణాళిక వాయిదా?
టాటా గ్రూప్ సారథ్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఆర్థిక ఒడిదొడుకుల నేపథ్యంలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కొత్త విమానాల డెలివరీలను వాయిదా వేయడంతో పాటు, తన ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తాము ఆర్డర్ చేసిన సుమారు 500 విమానాల డెలివరీ ప్రక్రియను మందగించేలా (స్లో డౌన్) చేయడంపై ప్రముఖ విమాన తయారీ సంస్థలైన ‘ఎయిర్‌బస్ ఎస్ఈ’, ‘బోయింగ్ కో’లతో ఎయిరిండియా చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.భారీ చెల్లింపులు తప్పించుకునేందుకా?సాధారణంగా విమానయాన సంస్థలు జెట్ విమానాల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులను చాలా సంవత్సరాల పాటు విడతల వారీగా చెల్లిస్తాయి. అయితే, మొత్తం కొనుగోలు ధరలో సింహభాగం..అంటే దాదాపు 80 శాతం నిధులను విమానాన్ని అప్పగించే (డెలివరీ) సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డెలివరీలను వాయిదా వేసుకోవడం ద్వారా తయారీదారులకు చెల్లించాల్సిన ఈ భారీ వ్యయాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని, తద్వారా ప్రస్తుత నిధుల కొరత నుంచి ఉపశమనం పొందవచ్చని ఎయిరిండియా వ్యూహాత్మకంగా యోచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.దీనితో పాటు కొత్త దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించే ప్రణాళికలపై సంస్థ పునసమీక్ష జరుపుతోంది. లాభదాయకంగా లేని కొన్ని పాత మార్గాలను పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ఎయిర్‌పోర్ట్‌ల్లో తమ కార్యకలాపాల ప్రారంభాన్ని వాయిదా వేయాలని చూస్తోంది. ఇప్పటికే వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఎయిరిండియా గత నెలలో అంతర్జాతీయ విమాన సామర్థ్యాన్ని తాత్కాలికంగా 27 శాతం (జూన్ - ఆగస్టు మధ్య 145 వారపు విమానాలు), దేశీయ విమాన సామర్థ్యాన్ని 22 శాతం వరకు తగ్గించిన సంగతి తెలిసిందే.ఇందుకు దారితీసిన కారణాలుపశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల తరచూ గగనతలం మూసివేత.గత ఏడాది మార్చి నుంచి పాకిస్థాన్ వైపు గగనతలాన్ని శాశ్వతంగా మూసివేయడం వల్ల విమాన ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరగడం.అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు భగ్గుమనడం.అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం.ఎయిర్ ఇండియా ప్రతినిధి ఏమన్నారంటే..బ్లూమ్‌బెర్గ్ నివేదికపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ... ఈ వార్తలు కేవలం ఊహాజనితమైనవని కొట్టిపారేశారు. తమ ఫ్లీట్‌ను ఆధునీకరించడానికి, దీర్ఘకాలిక పరివర్తన ప్రణాళికను అమలు చేయడానికి సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?
న్యూఢిల్లీ: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. అయితే ఈ ప్రమాదం ఎందుకు? ఎలా? జరిగిందనే కారణాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ తరుణంలో తాజాగా ఉన్నతాధికార వర్గాలు స్పందించాయి. మరో రెండు నెలలు ఒపిక పెడితే అన్ని విషయాలు బయటపెడతాయని కీలక ప్రకటన చేశాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ కొనసాగిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే తుది నివేదిక విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని, అనవసర ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని వర్గాలు సూచించాయి. అలాగే దర్యాప్తులోని ఏ అంశాన్నీ దాచిపెట్టబోమని, అన్ని వివరాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చాయి.ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలపై కూడా అధికారులు స్పందించారు. వాటిలో ప్రచారంలో ఉన్న కొన్ని అంశాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన విమాన ఇంజిన్లను తయారు చేసిన జీఈ ఏరోస్పేస్ సంస్థ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ.. విచారణలో వెలుగుచూస్తున్న అంతర్గత అంశాల్లో మాత్రం జోక్యం చేసుకోవడం లేదని సమాచారం. తుది నివేదిక సిద్ధం చేసే ప్రక్రియపై మాత్రమే అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.తుది నివేదిక విడుదలకు ముందుగా ఒక మధ్యంతర స్థితిగతుల నివేదిక (స్టేటస్ రిపోర్ట్) విడుదల చేసే అవకాశాన్ని కూడా ఏఏఐబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనల ప్రకారం అలాంటి నివేదిక తప్పనిసరి కాదని అధికారులు గుర్తుచేస్తున్నారు.మరోవైపు.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కూడా దర్యాప్తు వేగంపై ప్రభావం చూపినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఈ దర్యాప్తుకు సంబంధించిన పలు అంతర్జాతీయ భాగస్వాములు, సాంకేతిక నిపుణులు, సంస్థలపై ఆ పరిస్థితుల ప్రభావం పడిందని, అందువల్ల జాప్యానికి దర్యాప్తు బృందాన్ని తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడ్డాయి.గత ఏడాది విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో మాత్రం కీలక విషయాన్ని వెల్లడించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే బోయింగ్ 787 విమానంలోని రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు దాదాపు ఒకేసారి "రన్(RUN)" స్థితి నుంచి "కటాఫ్(CUTOFF)" స్థితికి మారినట్లు గుర్తించారు. దీంతో రెండు ఇంజిన్లకూ ఇంధన సరఫరా నిలిచిపోయి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తేల్చారు.అయితే ఆ స్విచ్‌లు ఎందుకు మారాయి? సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? లేదంటే మరేదైనా కారణమా? అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం తుది నివేదిక వచ్చిన తర్వాతే లభించనుంది. అందుకే ఇప్పుడు విమానయాన రంగం మాత్రమే కాదు.. దేశమంతా ఆ నివేదిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
ఎయిరిండియాకు షాక్ : రెట్టింపు ఫైన్
విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.‘మహారాజా స్కాలర్ స్కీమ్’ వివాదంలో విద్యార్థినికి అనుకూలంగా వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. ‘మహారాజా స్కాలర్ స్కీమ్’ (Maharaja Scholar Scheme) నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు రూ. 74,131 జరిమానా విధిస్తూ రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్ (State Consumer Redressal Commission) తీర్పునిచ్చింది.2021లో అదనపు లగేజీ (Excess Baggage) కింద ఒక విద్యార్థిని నుండి రూ. 34,131లను ఎయిర్ ఇండియా అక్రమంగా వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె ఈ పథకానికి అర్హురాలేనని సంస్థ అంగీకరించినప్పటికీ, రీఫండ్ (డబ్బులు తిరిగి ఇవ్వడం) ఇవ్వడంలో ఏళ్ల తరబడి జాప్యం చేసింది. దీంతో ఆ విద్యార్థిని కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సదరు విద్యార్థినికి అనుకూలంగా తీర్పునిచ్చింది.జిల్లా వినియోగదారుల కమిషన్ 2024 ఫిబ్రవరి నాటి ఆదేశాల ప్రకారం తనకు చెల్లింపులు చేయకుండా, ఆలస్యం చేయడంతోపాటు, తనను మానసిక క్షోభ గురి చేశారని జైపూర్ నివాసి లావణ్య మాగన్ ఆరోపించింది. దీనికి అదనంగా మరింత పరిహారం అందించాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జుడీషియల్ మెంబర్ ముఖేష్, మెంబర్ దినేష్ కుమార్‌లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.ఫిర్యాదుదారైన విద్యార్థినిని అనవసరమైన మానసిక వేధింపులకు గురైందని, కోర్టు చుట్టూ తిరగడం వల్ల ఆమె విలువైన సమయం వృధా అయిందని కోర్టు విశ్వసించింది. కాబట్టి ఆమె పడిన మానసిక ఆవేదన పూర్తిగా సమంజసమైనదేనని మే 29న కమిషన్ వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల మధ్య పలుమార్లు ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత, మాగన్ సదరు స్టూడెంట్ స్కీమ్‌కు అర్హురాలేనని స్వయంగా సంస్థే అంగీకరించిందని వినియోగదారుల కమిషన్ తన తీర్పులో పేర్కొంది.అసలు వివాదం ఏంటి? ఎయిరిండియా ప్రవేశపెట్టిన “మహారాజా స్కాలర్ స్కీమ్” ద్వారా అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విద్యార్థులకు ప్రత్యేక లగేజీ అలవెన్స్ లభిస్తుంది. ఈ స్కీం కిందే యూకేలో చదువుకుంటున్న విద్యార్థిని లావణ్య మాగన్, లండన్‌నుంచి ఇండియాకు వచ్చేందుకు జూలై 21, 2021న ఎయిరిండియా టికెట్ బుక్ చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో చెక్-ఇన్ చేసే సమయంలో ఆమెకు ఈ స్టూడెంట్ లగేజీ స్కీమ్ వర్తించదంటూ అదనపు లగేజీ ఛార్జీల కింద 350 బ్రిటిష్ పౌండ్లు (రూ. 34,131) వసూలుచేయడంతో వివాదం మొదలైంది.అకడమిక్ ప్రోగ్రామ్ (చదువు) కాలపరిమితి ముగిసినందువల్ల ఆమె ఈ పథకానికి అర్హురాలు కాదని మొదట ఎయిరిండియా వాదించి, క్లెయిమ్‌ను తిరస్కరించింది. అయినా మాగన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. తాను నాలుగేళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తి చేశానని, తన ప్రయాణం చదువు పూర్తి కావడానికి సంబంధించిందేనని వాదించింది. చివరికి ఎయిరిండియా డబ్బులు చెల్లించేందుకు అంగీకరించింది. కానీ దాన్ని చెల్లించడంలో విఫలం కావడంతో మరోసారి వినియోగరుదారుల కమిషన్‌ను ఆశ్రయించి విజయం సాధించింది. -
ప్రకృతి ఉగ్రరూపం... భయంకరమైన రాక్షస గాలులు మూడు విమానాలు ధ్వంసం
-
‘వాడి జ్ఙాపకాలే ప్రాణంగా..’.. అహ్మదాబాద్ విషాదానికి ఏడాది
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన ఆ భయంకర విమాన ప్రమాదానికి ఏడాది నిండింది. 2025, జూన్ 12న టేకాఫ్‌తో మొదలైన ఆ ప్రయాణం క్షణాల్లో విషాదాంతమైంది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ లండన్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానాశ్రయం సమీపంలోని మెడికల్ హాస్టల్‌ను ఆ విమానం ఢీకొట్టిన దృశ్యం ఇప్పటికీ అందరి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.కాలం గడిచినా చెరగని గాయంఈ ప్రమాదంలో జావేద్ అలీ, తన భార్య , ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడింది కేవలం ఒక్కరు మాత్రమే. జావేద్ తల్లి ఫరీదా బానో ఇప్పుడు అనాథలా మిగిలిపోయారు. ఒక తల్లికి తన బిడ్డను పోగొట్టుకోవడం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదంటారు. ఆ ఘటన దరిమిలా ఆమె ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. A year of grief and waiting: What remains when a plane falls from the sky - A year after the Air India crash, a mother still speaks about her dead son in the present tense and a brother waits for answers. Via @BBC:https://t.co/gjZTBusaFA— 🌊💙 Viking Resistance 💙🌊 (@BlueCrewViking) June 1, 2026‘వాడు నన్ను విడిచి వెళ్లడు’ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్నా, తన కొడుకు జావేద్‌ను తలుచుకుంటూ ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. ‘నా కొడుకు ఎక్కడికి వెళ్లినా నాతో పాటే ఉండేవాడు. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్లినా, ఏ గదిలో ఉన్నా వాడు నా వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. వాడు నన్ను విడిచి వెళ్లలేదు. వాడి జ్ఞాపకాలే నా ప్రాణంగా బతుకుతున్నాను’ అని ఫరీదా బానో చెప్పిన మాటలు ఎంతటివారినైనా కదిలింపజేస్తాయి.తీరని లోటు - మిగిలిన శూన్యంఈ ప్రమాదం కేవలం 260 మంది ప్రాణాలను మాత్రమే తీసుకోలేదు. ఎన్నో కుటుంబాల ఆశలను బూడిద చేసింది. 241 మంది ప్రయాణికులు, 19 మంది స్థానికులు ఒకే ఒక్క క్షణంలో కాలగర్భంలో కలిసిపోయారు. భౌతికంగా వారు దూరమైనా, వారి కుటుంబ సభ్యుల గుండెల్లో ద్రవిస్తునన్న వేదన మాత్రం అలానే ఉంది. ఇది కూడా చదవండి: అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్ల అరెస్ట్ -
దేశీయ విమాన సర్వీసులను తగ్గించనున్న ఎయిరిండియా, ఇండిగో
న్యూఢిల్లీ: దేశంలోని రెండు అతిపెద్ద విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లు రోజువారీ దేశీయ విమాన సర్వీసులను తగ్గించనున్నాయి. జూన్ నుంచి 250 సర్వీసులను ఉపసంహరించుకుంటున్నట్టు విమానాయన సంస్థలు ప్రకటించాయి. ఇంధన ధరలు పెరిగిపోవడం, ప్రయాణికుల సంఖ్య తగ్గడమే దీనికి కారణంగా తెలుస్తోంది. జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ కోతలు కొనసాగున్నాయి. దేశీయ పర్యాటకానికి ఇది అత్యంత కీలకమైన సెలవుల కాలం. ఈ సమయంలో సర్వీసుల తగ్గింపు అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. రోజుకు 500 దేశీయ విమానాలను నడిపే ఎయిరిండియా జూన్, జూలై నెలల్లో తన దేశీయ షెడ్యూల్లో సుమారు 22% తగ్గిస్తోంది. దీంతో రోజుకు సుమారు 110 విమానాలు తగ్గుతాయి. ఇక, రోజుకు సుమారు 2,200 విమానాలను నడిపే ఇండిగో, తన దేశీయ సామర్థ్యాన్ని 5 నుంచి 7% మేర తగ్గిస్తోంది. ఇవి కూడా రోజుకు దాదాపు 110 సర్వీసులు తగ్గుతాయి. ఎయిరిండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా రోజువారీ సుమారు 340 దేశీయ సర్వీసుల్లో దాదాపు 10% కోత విధిస్తోంది. ఈ సర్దుబాట్లు తాత్కాలిక చర్యని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. డిమాండ్, నిర్వహణ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. వేసవి తర్వాత వ్యాపారం మందగించిన కాలంలో డిమాండ్ తగ్గడమే ఈ కోతకు కీలక కారణమని ఇండిగో పేర్కొంది. పరిస్థితులు మెరుగుపడిన వెంటనే విమానాలను పునరుద్ధరిస్తామని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. దీని కారణంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలపై తీవ్ర ప్రభావం పడనుంది. కీలక వ్యాపార, విహార మార్గాలతో అనుసంధానించి ఉండే ఈ నగరాలు నిత్యం రద్దీగా ఉంటాయి. ముంబై నుంచి జైపూర్, గోవా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, నాగ్‌పూర్, పాటా్న, భోపాల్‌కు వెళ్లే సర్వీసుల సంఖ్య తగ్గుతుంది. ఢిల్లీ నుంచి గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, లక్నో, కొచ్చి, కోల్‌కతాకు వెళ్లే విమానాలపై ప్రభావం పడింది. దక్షిణ భారతంలోని ఒక ప్రధాన కేంద్రంగా ఉన్న బెంగళూరు సైతం తిరుగు ప్రయాణ విమానాల తగ్గింపు వల్ల ఇబ్బంది పడనుంది. అయితే, గగనతల ఆంక్షలు సడలించడంతో విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు కొన్ని అంతర్జాతీయ సర్వీసులను పునరుద్ధరించడం కొంత ఊరట. ఎందుకు తగ్గిస్తున్నాయి? పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశీయ కార్యకలాపాలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు సుమారు 25%, అంతర్జాతీయ విమానాలకు ఇంకా ఎక్కువగా పెరిగాయి. విమానయాన సంస్థల బడ్జెట్లలో అత్యధిక భాగం ఇంధన ఖర్చులే. సరిగ్గా నెల రోజుల క్రితం, జెట్ ఫ్యూయల్ ధరల్లో ఈ పెరుగుదల కార్యకలాపాలపై ఒత్తిడిని పెంచింది. ఈ పెరుగుదల విమానయాన సంస్థలను కార్యకలాపాలను హేతుబదీ్ధకరించేలా చేసింది. ఇటీవలి వారాల్లో అనేక మార్గాల్లో ఛార్జీలు ఇప్పటికే 30% పెరిగాయి. ఏటీఎఫ్ ఖర్చుల కారణంగా విమానయాన సంస్థలు ప్రతి ప్రయాణికుడికి రూ. 400–450 ఇంధన సర్ఛార్జీలను ప్రవేశపెట్టాయి. సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో రద్దీ మార్గాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే మూడు నెలల్లో విమాన ప్రయాణం సామాన్యులకు అందుబాటులో ఉండకపోవచ్చు. -
భారత సైన్యంతో ఎయిరిండియా ఒప్పందం
దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు, సైనిక దివ్యాంగుల పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ వితంతువులు(వీర నారీ-యుద్ధంలో భర్తలను కోల్పోయినవారు), వారి పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్మీ ప్రత్యేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా భారత సైన్యంతో ఎయిరిండియా సహకార ఒప్పందం కుదుర్చుకుంది. దేశ నిర్మాణంలో, సామాజిక బాధ్యతలో కార్పొరేట్ రంగానికి ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.తొలి విడతగా 60 మందికి అవకాశంఈ వినూత్న భాగస్వామ్యం ద్వారా వీర నారీలు, వారి పిల్లలకు ‘ఎయిరిండియా శాట్స్ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ (ఏఐ సాట్స్)లో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమం కింద ప్రాథమికంగా 20 మంది యుద్ధ వితంతువులను, 40 మంది వారి పిల్లలను ఎయిర్‌లైన్స్ ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. వీరికి విమానాశ్రయ కార్యకలాపాల్లో కీలకమైన కస్టమర్ సేవలు, లోడ్ అండ్ కంట్రోల్, ర్యాంప్ ఆపరేషన్స్ విభాగాల్లో బాధ్యతలు అప్పగిస్తారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వీరికి శిక్షణ అందిస్తారు. తద్వారా దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక సాధికారతను పెంపొందిస్తూ ఉద్యోగానికి తక్షణమే సిద్ధమయ్యేలా అభ్యర్థులను తీర్చిదిద్దుతారు.‘ఆశా’ పాఠశాలల్లో వృత్తి విద్యా ల్యాబ్‌ల ఏర్పాటుకంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న సైనికులు, పూర్వ సైనికోద్యోగులు (అనుభవజ్ఞులు), దివ్యాంగుల పిల్లల సంక్షేమం కోసం భారత సైన్యం ప్రత్యేకంగా ‘ఆశా’ (ఆర్మీ స్పెషల్ హెల్ప్ అండ్ అసోసియేషన్) పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ చిన్నారులకు నాణ్యమైన విద్యా వైద్యంతో పాటు దీర్ఘకాలిక భవిష్యత్తును అందించేందుకు ఎయిరిండియా వృత్తి శిక్షణా మౌలిక సదుపాయాలను నిర్మించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 25 ఆశా పాఠశాలల్లో అత్యాధునిక వృత్తి శిక్షణా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడమే ఈ చొరవ ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే 10 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభం కాగా, త్వరలోనే మిగిలిన 15 పాఠశాలలకు కూడా దీనిని విస్తరించనున్నారు.వైవిధ్యమైన రంగాలలో శిక్షణచిన్నారుల సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేలా ఈ ల్యాబ్‌ల్లో విభిన్న విభాగాలపై అనుభవపూర్వక శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంలో ఫోటోగ్రఫి, విజువల్ స్టోరీ టెల్లింగ్, మ్యూజిక్, పెయింటింగ్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కుకింగ్, హాస్పిటాలిటీ, బ్యూటీ అండ్ వెల్నెస్, బోటిక్ అండ్ టైలరింగ్, ఎలక్ట్రికల్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు, క్రీడల్లో శిక్షణ ఇస్తారు.భారత సైన్యంతో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఎయిరిండియా గవర్నెన్స్, రిస్క్, కంప్లయన్స్, కార్పొరేట్ వ్యవహారాల గ్రూప్ హెడ్ పి.బాలాజీ మాట్లాడుతూ ‘భారత సైన్యంతో ఎయిరిండియా భాగస్వామ్యం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు; ఇది దేశ నిర్మాణ ప్రయత్నంలో భాగం కావాలనే మా ఉమ్మడి సంకల్పానికి ప్రతిరూపం. నైపుణ్యాలను బలోపేతం చేయడం, సరైన అవకాశాల ద్వారా సమాజంలో గౌరవాన్ని, సాధికారతను పెంపొందించడమే ఈ రెండు కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. సైన్యంతో కలిసి పనిచేస్తూ భవిష్యత్తులో స్థిరమైన, సానుకూల ప్రభావాన్ని చూపే ఒక స్కేలబుల్ మోడల్‌ను రూపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అన్నారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ఢిల్లీలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
వరుసగా ఎయిరిండియా విమానాల్లో చోటుచేసుకుంటోన్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. గురువారం ఒక్క రోజే రెండు ఎయిరిండియా విమానాలకు భారీ ప్రమాదం తప్పింది. తొలుత ఢిల్లీ నుంచి వచ్చిన విమానం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా దాని తోక భాగం రన్‌వేను బలంగా తాకింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 186 మంది ఉన్నారు.అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీ వస్తున్న మరో ఎయిరిండియా విమానం గురువారం సాయంత్రం ఢిల్లీఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం రన్‌వేకు సమీపిస్తున్న సమయంలో, ఒక ఇంజిన్‌లో మంటలు వచ్చినట్లు కాక్‌పిట్ సిబ్బందికి అలర్ట్ వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ సిగ్నల్‌ను క్రాస్ చెక్ చేసుకోగా, ఇంజిన్‌లో మంటలు రావడం నిజమేనని నిర్ధారణ అయింది.పైలట్లు వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అప్రమత్తం చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. తక్షణమే అత్యవసర నియమావళిని (SOP) అమలు చేస్తూ విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న ఉన్న ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఆగిన తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా కిందకు దించారు. ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
బెంగళూరు: ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేను విమాన చివరి భాగం(తోక) తగలడంతో ఒక్కసారిగా కలవరం మొదలంది. ఢిల్లీ నుంచి నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతుండగా ఇది చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 181 ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం AI2651లో ఇది చోటు చేసుకుంది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాండింగ్ కోసం సమీపిస్తున్నప్పుడు విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ అస్థిరమైన ల్యాండింగ్ ప్రయత్నం తరువాత పైలట్ గో-అరౌండ్ (ల్యాండింగ్ ప్రయత్నాన్ని రద్దు చేసి మళ్లీ గాల్లోకి ఎగిరి, మరోసారి ల్యాండింగ్ ప్రయత్నం చేయడం) చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చేస్తున్నప్పుడు విమాన చివరి భాగం నేలను తాకింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణీకులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి పీటీఐకి తెలిపారు. -
ఎయిరిండియా సంచలన నిర్ణయం
టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిరిండియా అంతర్జాతీయ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు విపరీతంగా పెరగడం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో మే నెలలో పలు కీలక అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను భారీగా తగ్గించింది. వివిధ మార్గాల్లో 5 శాతం నుంచి ఏకంగా 25 శాతం వరకు విమానాల రద్దు జరిగినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.ముఖ్యమైన రూట్లలో కోతలు ఇలా..చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) మే 1 నుంచి అంతర్జాతీయ విమాన ఇంధన ధరలను 5 శాతం పెంచడంతో ఎయిరిండియా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.ఉత్తర అమెరికా: ఈ మార్గంలో కార్యకలాపాలను 20 శాతం తగ్గించారు. షెడ్యూల్ చేసిన 200 విమానాల్లో సుమారు 40 విమానాలను రద్దు చేశారు.యూరోప్: పారిస్, కోపెన్హాగన్, జ్యూరిచ్ వంటి నగరాలకు వారంతపు సర్వీసులను తగ్గించారు. మొత్తం 450 విమానాల్లో దాదాపు 20 విమానాలు రద్దు అయ్యాయి.ఆస్ట్రేలియా: మెల్బోర్న్, సిడ్నీ రూట్లలో వారానికి నడిచే ఏడు విమానాల్లో రెండింటిని నిలిపివేశారు.ఆగ్నేయ ఆసియా: ఈ ప్రాంతానికి సర్వీసులను 10 శాతం వరకు కుదించారు.కారణాలేమిటి?.. సీఈఓ వివరణనెట్వర్క్ ఆప్టిమైజేషన్, డిమాండ్‌లో మార్పులు, పెరుగుతున్న ఇంధన ధరలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ ఉద్యోగులకు రాసిన లేఖలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ‘పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విమాన మార్గాల మూసివేత వల్ల ప్రయాణ కాలం పెరగడం, కరెన్సీ మార్పిడి రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల అనేక అంతర్జాతీయ సర్వీసులు నష్టాల్లో నడుస్తున్నాయి’ అని చెప్పారు.దేశీయ విమాన సర్వీసులపై ప్రభుత్వ జోక్యం వల్ల ధరల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ రూట్లలో మాత్రం భారం తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. జూన్, జులై నెలల్లో కూడా పరిస్థితులను బట్టి షెడ్యూల్లో మార్పులు ఉండొచ్చని సూచించారు.ఇండిగో, అంతర్జాతీయ సంస్థల పరిస్థితిమరోవైపు, ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. మే నెలలో అంతర్జాతీయ సర్వీసులను యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే గల్ఫ్ దేశాలకు సర్వీసులను ఇప్పటికే 10 శాతం తగ్గించింది. అంతర్జాతీయంగా చూస్తే.. లుఫ్తాన్సా మే నుంచి అక్టోబర్ మధ్య ఏకంగా 20,000 విమానాలను రద్దు చేయగా క్వాంటాస్ భారత్‌కు నడిపే తన సర్వీసులను అక్టోబర్ వరకు తగ్గించుకుంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఎయిరిండియా పైలట్ గుండెపోటుతో ఆకస్మిక మృతి
న్యూఢిల్లీ: వైద్యపరంగా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులలో కూడా దాగివున్న గుండె సంబంధిత ప్రమాదాలపై కొత్త ఆందోళనను రేకెత్తిస్తోంది. గుండెపోటుతో 40 ఏళ్ల ఎయిరిండియా పైలట్ (ఫస్ట్ ఆఫీసర్) కుప్పకూలిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఇండోనేసియాలోని బాలీలో హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే అతనికితీవ్ర గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.న్యూఢిల్లీ నుంచి ఇండోనేషియాలోని బాలికి బయలుదేరిన అంతర్జాతీయ విమానానికి పైలట్‌గా వ్యవహరించారు. డ్యూటీలో అనంతరం హోటల్లో విశ్రాంతి తీసుకుంటుండగా గుండెలో తీవ్రమైన అసౌకర్యానికి గురికాగా, బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి : సీనియర్ నటి పిల్లలకు భారీ ఊరటఎయిరిండియా స్పందనతమ పైలట్ మరణం పట్ల ఎయిరిండియా యాజమాన్యం విచారం వ్యక్తంచేసింది. ఆయన కుటుంబానికి తగిన సాయం అందిస్తామని ప్రకటించింది. బాధితుడి వివరాలను బయటపెట్టలేదు. విమానయాన సంస్థల నిబంధనల ప్రకారం పైలట్ ఇటీవలే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేలింది. -
గంజాయితో పట్టుబడిన భారతీయ పైలట్
న్యూఢిల్లీ: తాను నడపాల్సిన విమానం అమెరికాలో ఉండటంతో అక్కడికి వేరే విమానంలో ప్రయాణికుడిలా చేరుకున్న ఒక భారతీయ పైలట్‌ను అమెరికా ప్రభుత్వం బలవంతంగా వెనక్కి తిప్పిపంపింది. ప్రయాణసమయంలో అతని వద్ద నిషేధిత గంజాయిని పట్టుకున్నామని, నిబంధనల మేరకు అతడిని స్వదేశానికి పంపేశామని అమెరికా వెల్లడించింది. తమ పైలట్‌ను వెనక్కిపంపిన విషయాన్ని ఎయిర్ఇండియా విమానయాన సంస్థ సైతం దృవీకరించింది. ‘‘ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు ఏప్రిల్ 14వ తేదీన మా కోపైలట్ ఒకరు వెళ్లారు. అక్కడికి వెళ్లాక అతను విధుల్లో చేరాల్సి ఉంది. అయితే నిషేధిత(గంజాయి) పదార్థం అతని వెంట ఉందని నిర్ధారణ కావడంతో అమెరికా అతడిని వెనక్కి పంపేసింది’’అని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు, అంతర్గత దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. సంస్థ కఠిన నిబంధనావళిని అనుసరిస్తూ అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అతని పేరు, స్వస్థలం, గతంలో ఎక్కడ పనిచేశా వంటి తదితర వివరాలు ఏవీ తెలియరాలేదు. -
రూ.22 వేల కోట్ల లాస్.. ‘టాటా’ ఆదుకోవాల్సిందే..!
ప్రభుత్వ రంగం నుంచి టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కూడా 'ఎయిర్ ఇండియా' కష్టాలు తీరడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (మార్చి 31తో ముగిసిన కాలానికి) ఈ విమానయాన సంస్థ ఏకంగా రూ. 22,000 కోట్లకు (2.7 బిలియన్ డాలర్లు)పైగా నష్టాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. దీంతో సంస్థను గట్టెక్కించేందుకు వాటాదారుల నుంచి భారీగా నిధుల సమీకరణకు ఎయిర్ ఇండియా సిద్ధమవుతున్నట్లు సమాచారం.అంతర్జాతీయ పరిణామాలు, సాంకేతిక సమస్యలు ఎయిర్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ సమస్యలు, పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసివేయడం వల్ల పెరిగిన ఇంధన ఖర్చులు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం సంస్థను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఇవి ఆపరేటింగ్ ఖర్చులను భారీగా పెంచడమే కాకుండా, ఆదాయ మార్గాలను కూడా ప్రభావితం చేశాయి.సంక్షోభ నివారణకు మెజారిటీ వాటాదారు అయిన టాటా గ్రూప్, 25.1 శాతం వాటా కలిగిన సింగపూర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ చర్చలు జరుపుతున్నట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఎయిర్ ఇండియాకు అవసరమైన నగదును ఇన్ఫ్యూషన్ (నగదు ఇంజెక్షన్) రూపంలో అందించే విషయమై ఈ రెండు సంస్థలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భాగస్వామ్య సంస్థల నుండి అందే నిధులు అవసరానికి సరిపోతాయా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.నిధుల సమీకరణ పరిమాణంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ వాటాదారుల నుండి వచ్చే మొత్తం సరిపోకపోతే, ఎయిర్ ఇండియా ఇతర ఫైనాన్సింగ్ మార్గాలను వెతకాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై అటు టాటా గ్రూప్ గానీ, ఇటు ఎయిర్ ఇండియా ప్రతినిధులు గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ఎయిరిండియా ప్రయాణికులకు ఏటీఎఫ్ సెగ
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) రేట్లు భారీగా ఎగిసిన నేపథ్యంలో ఎయిరిండియా గ్రూప్ తమ ఫ్లయిట్స్‌పై ఇంధన సర్‌చార్జీని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీ ఫ్లయిట్స్‌పై రూ. 299 నుంచి రూ. 899 వరకు, విదేశీ రూట్లలో 24 డాలర్ల నుంచి 280 డాలర్ల వరకు (కొన్ని రూట్లు మినహాయించి) ఉంటుంది. ఏప్రిల్ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఎయిరిండియా గ్రూప్ పేర్కొంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు కూడా ఇవి వర్తిస్తాయి.బంగ్లాదేశ్, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా తదితర రూట్లకు సంబంధించి నియంత్రణ సంస్థ నుంచి వచ్చే అనుమతులను బట్టి నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 27తో ముగిసిన వారాంతంలో బ్యారెల్‌కి 27.83 డాలర్లుగా ఉన్న ఏటీఎఫ్ మార్చి 27న ముగిసిన వారాంతానికి 81.44 డాలర్లకు ఎగిసినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో సర్‌చార్జీలను విధించినప్పటికీ ఏటీఎఫ్ వ్యయాలు పూర్తిగా రికవర్ కావని, ఇప్పటికీ సింహభాగం భారాన్ని సంస్థే భరిస్తోందని ఎయిరిండియా పేర్కొంది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 40–45 శాతం వరకు ఉంటుంది. మరో విమానయాన సంస్థ ఇండిగో ఇప్పటికే ఇంధన సర్‌చార్జీలను సవరించిన సంగతి తెలిసిందే.సీఈవో విల్సన్ రాజీనామాఎయిరిండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేశారు. దీనితో ఆయన స్థానంలో కొత్త వారి నియామకం కోసం కంపెనీ ప్రత్యేక కమిటీని నియమించింది. న్యూజిలాండ్‌కి చెందిన విల్సన్ గతంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి పని చేశారు. 2022లో ఎయిరిండియా పగ్గాలు చేపట్టిన విల్సన్ గత నాలుగేళ్లుగా సీఈవో, ఎండీగా పని చేస్తున్నారు. ‘2026లో తప్పుకోవాలనే యోచనలో ఉన్నట్లు 2024లోనే ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కి విల్సన్ తెలిపారు. అధికార బదలాయింపు ప్రక్రియ సజావుగా సాగేట్లుగా అప్పటి నుంచే కసరత్తు జరుగుతోంది‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.వారసుడు ఎంపికయ్యేంత వరకు విల్సన్ ప్రస్తుత హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది. ‘కోవిడ్ అనంతరం పలు సవాళ్లు ఎదురైనప్పటికీ కంపెనీ వాటిని అధిగమించి, పురోగమించడంలో విల్సన్ కీలకపాత్ర పోషించారు‘ అని చంద్రశేఖరన్ కితాబిచ్చారు. ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీలు, సరఫరా వ్యవస్థలో సవాళ్లు, రెండు యుద్ధాలు, ఎయిర్‌స్పేస్ మూసివేత, ఇంధన ధరల పెంపు, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక పెను విషాదం (అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన)లాంటి అసాధారణ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు సాధించిన విజయాలు ఎంతో గర్వకారణం.కొత్త విమానాల డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో నేను కంపెనీ పగ్గాలను మరొకరికి అప్పగించేందుకు ఇదే సరైన సమయం‘ అని ఉద్యోగులకి ఇచ్చిన సందేశంలో విల్సన్ పేర్కొన్నారు. 2022లో ఎయిరిండియాను ప్రభుత్వం నుంచి టాటాలు కొనుగోలు చేసిన అనంతరం నాలుగు ఎయిర్‌లైన్స్‌ని విజయవంతంగా విలీనం చేయడం తదితర అంశాల్లో విల్సన్ కీలక పాత్ర పోషించారు. అయితే, 250 మంది ప్రయాణికులు మరణించిన ఎయిరిండియా విమాన దుర్ఘటన, ఇతరత్రా సందర్భాల్లో భద్రతా ప్రమాణాల లోపాలు తదితర అంశాలపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా సీఈఓ రాజీనామా
టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిర్ ఇండియా కంపెనీ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. టాటా చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియాను తిరిగి పట్టాలెక్కించే క్రమంలో కీలక పాత్ర పోషించిన విల్సన్ తన పదవీకాలం ముగియక ముందే తప్పుకోవడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల క్రితం ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ సంస్థలో భారీ మార్పులు వస్తాయని ఆశించింది. అయితే, ఊహించిన దానికంటే పరివర్తన ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం గమనార్హం.ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా బోర్డు సమావేశంలో విల్సన్ రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. కొత్త సీఈఓను నియమించే వరకు విల్సన్ తన బాధ్యతల్లో కొనసాగుతారని కంపెనీ చెప్పింది. ప్రస్తుతం ఆయన తన నోటీసు పీరియడ్‌లో ఉన్నారు. తన నిష్క్రమణకుగల కారణంపై స్పష్టత రావాల్సి ఉంది. గతేడాది జూన్‌లో జరిగిన ఏఐ 171 అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక వెలువడిన అనంతరం ఆయన పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంది.దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగోలో కూడా ఇటీవల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన రాజీనామాను ప్రకటించగా సంస్థ ఇప్పటికే కంపెనీ చీఫ్‌ను ప్రకటించింది. ఆయన ఆగస్టు నాటికి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఎయిర్ ఇండియా విషయంలో టాటా గ్రూప్ కొన్ని నెలల క్రితమే కొత్త సీఈఓ కోసం అన్వేషణ ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు సరైన అభ్యర్థి దొరకలేదు. ఇండిగో తన కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసుకోగా, ఎయిర్ ఇండియా చీఫ్ కోసం కొందరి పేర్లను పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: రెస్క్యూ మిషన్ వివరాలు లీక్ చేస్తే తీవ్ర పరిణామాలు -
‘ఎయిర్ ఇండియా’లో ‘పాన్ పాన్’ కాల్... ప్రయాణికులు బెంబేలు
లక్నో: బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. గాలిలో ఉండగానే విమానంలో పొగలు రావడంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం లక్నోకు విమానాన్ని మళ్లించారు. విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా, ఒక్కసారిగా ఆక్సిజన్ మాస్కులు కిందకు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు.అసలేం జరిగింది?సోమవారం సాయంత్రం 134 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఐఎక్స్ 1523 (IX 1523) విమానం ‘బాగ్డోగ్రా’ నుంచి బయలుదేరింది. సాయంత్రం 4:58 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, ఏవియానిక్ ప్యానెల్ నుంచి పొగ వస్తున్నట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు ‘పాన్ పాన్’ (PAN PAN) కాల్ ద్వారా అత్యవసర పరిస్థితిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు చేరవేసి, లక్నోలో ల్యాండింగ్‌కు అనుమతి కోరారు.విమానంలో గందరగోళంఅత్యవసర ల్యాండింగ్ ప్రకటన వెలువడగానే విమానంలో ఆక్సిజన్ మాస్కులు కిందకు పడ్డాయి. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, విమాన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను శాంతింపజేస్తూ, మాస్కులను ఎలా ఉపయోగించాలో సూచనలు ఇస్తూ, వారికి భరోసా కల్పించారు. సాయంత్రం 5:17 గంటలకు లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.తనిఖీల్లో తేలిందేంటి?విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను టెర్మినల్-3కి తరలించారు. అగ్నిమాపక దళం, సాంకేతిక నిపుణులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పొగ లేదా మంటల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు. ప్రయాణికులను స్వల్ప విరామం తర్వాత ప్రత్యామ్నాయ విమానాల్లో ఢిల్లీకి పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సాంకేతిక లోపంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇది కూడా చదవండి: కువైట్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి: సముద్రంలో అల్లకల్లోలం -
లండన్‌కు వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: బ్రిటన్‌లోని లండన్ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ఇండియా ఏ350రకం విమానం సాంకేతిక సమస్యలతో తిరిగొచ్చి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి వచ్చింది. సౌదీ అరేబియా గగనతంలోకి ప్రవేశించాక సాంకేతిక సమస్య తలెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమానం మళ్లీ ఢిల్లీకి వెనుతిరగాల్సి వచ్చిందని ఎయిర్ఇండియా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. గతవారం రోజుల వ్యవధిలో ఎయిర్ఇండియా విమానం మార్గమధ్యంలో యూటర్న్ తీసుకోవడం ఇది రెండోసారి. ‘‘గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఏ350–900 రకం వీటీ–జేఆర్ఎఫ్ సిరీస్ ఎయిర్ఇండియా విమానం లండన్‌కు బయల్దేరింది. నాలుగు గంటల్లో 3,300 కిలోమీటర్లు ప్రయాణించి సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించింది. అప్పుడు విమానంలో కొన్ని శబ్దాలు పెద్దగా విని్పంచాయి. దీంతో ముందుజాగ్రత్తగా వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ముందుకు, వెనక్కి అలా మొత్తంగా ఏడు గంటలపాటు ప్రయాణించి ఢిల్లీలో మధ్యాహ్నం 12.30 గంటలకు ల్యాండ్ అయింది. విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారు. ఘటనపై సాంకేతిక బృందం సమగ్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు పూర్తవడానికి మరింత సమయం పడుతుంది’’అని అధికార ప్రతినిధి వివరించారు. విమానంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు తెలియరాలేదు. ఇదే విమానం సరిగ్గా 11 రోజుల క్రితం న్యూయార్క్‌లోని జాన్ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ మార్గమధ్యంలో సాంకేతికసమస్యల బారినపడింది. దీంతో గమ్యస్థానం ఢిల్లీకి బదులుగా మధ్యలోనే ఐర్లాండ్‌లోని షానన్ నగరంలో ల్యాండ్ అయింది. ఏ350–900 రకం విమానాలను గత ఏడాది జనవరి నుంచి ఎయిర్ఇండియా నడుపుతోంది. గత వారం ఢిల్లీ నుంచి బయల్దేరి కెనడాలోని వాంకోవర్‌కు చేరుకోవాల్సిన ఎయిర్ఇండియా విమానం చైనా గగనతలంలోకి చేరుకోగానే సాంకేతిక సమస్యల కారణంగా మళ్లీ ఢిల్లీకే తిరిగిరావడం తెల్సిందే. -
బరువు పెరిగితే జీతంలో కోతే!
న్యూఢిల్లీ: కేబిన్ సిబ్బంది ఫిట్నెస్ విషయమై ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యం, ఫిట్నెస్ నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. బరువు పెరిగితే జీతంలో కోత విధించనుంది. ఇక, బరువు, ఫిట్నెస్ అసెస్మెంట్ మీదే సిబ్బంది జీతం, ఉద్యోగం ఆధారపడి ఉండనున్నాయి! బీఎంఐ 18 నుంచి 24.9 మధ్య ఉంటేనే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) రీడింగ్ 18 నుంచి 24.9 మధ్య ఉంటే సాధారణ బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు పరిగణిస్తారు. 18 కంటే తక్కువగా ఉంటే తక్కువ బరువున్నవారిగా అంచనా వేస్తారు. బీఎంఐ 25 నుంచి 29.9 మధ్య ఉంటే వారు అధిక బరువు కేటగిరీలోకి వెళ్తారు. ఇక బీఎంఐ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణిస్తారు. బీఎంఐ 18 కంటే తక్కువగా ఉన్నా, 25 నుంచి 29.9 మధ్య ఉన్న సిబ్బందిని విధుల నుంచి తొలగించి, వారిని ఫంక్షనల్ అసెస్మెంట్కు పంపిస్తారు. అందులో ఉత్తీర్ణులై, ఆరోగ్యంగానే ఉన్నారని, విధుల్లో కొనసాగడానికి అర్హులని నిర్ధారణ అయితేనే వారిని కొనసాగిస్తారు. ఫంక్షనల్ అసెస్మెంట్లో విఫలమైతే.. అర్హత ప్రమాణాలను చేరుకునేవరకూ వారి జీతంలో కోత (లాస్ ఆఫ్ పే) విధిస్తారు. ఊబకాయంతో ఉన్నవారిని విధుల నుంచి తొలగించడమే కాకుండా తక్షణమే వేతనం నిలిపేస్తారు. వారు నిర్దిష్ట కాల వ్యవధిలో తమ బీఎంఐని ఆరోగ్యకరమైన స్థాయిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తారు. శిక్షణలో ఉన్నవారికీ వర్తింపు... మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ప్రస్తు™è ం పనిచేస్తున్న క్యాబిన్ సిబ్బందితోపాటు శిక్షణ పొందుతున్న వారికీ వర్తించనుంది. సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కలి్పంచడం, సరైన బరువుతో ఉండేలా చూడటం కోసమే ఈ విధానాన్ని ప్రారంభించినట్టు ఎయిరిండియా తెలిపింది. మెరుగైన ఫిట్నెస్ ప్రమాణాలను అమలు చేయడానికి ముందు సన్నాహక చర్యగా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. సంస్థ పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించి, నాలుగేళ్లలో పాత ఉద్యోగుల్లో ఎక్కువ మందిని దశలవారీగా తొలగించింది. -
2500 ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ క్యాన్సిల్.. రీజన్ ఇదే
పశ్చిమాసియా నెలకొన్న ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో భారీ స్థాయిలో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్ ఇండియా సంస్థ సీఈఓ క్యాంప్ విల్సన్ అన్నారు. గడిచిన మూడు వారాల్లో దాదాపుగా 2,500 విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. ఫ్లైట్స్ రద్దుతో సంస్థపై పెద్దఎత్తున ఆర్థిక భారం పడుతుందని తెలిపారు.పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచాన్నే సంక్షోభంలో నెట్టిపడేసింది. చమురు, గ్యాస్ కొరత ఏర్పడడంతో పలు వాణిజ్య సేవలకు ఆటంకం తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా సైతం తన విమానయాన సేవలను గణనీయంగా తగ్గించినట్లు పేర్కొంది.క్యాంప్ విల్సన్ మాట్లాడుతూ "ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచంతో పాటు ఎయిర్ ఇండియాపై గణనీయంగా పడింది. యుద్ధం మెుదలైన నాటి నుంచి దాదాపుగా 2,500కు పైగా విమానాలు రద్దయ్యాయి. మా సామర్థ్యంలో కేవలం 30 శాతం విమానాలు మాత్రమే నడపగలుగుతున్నాం. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గగనతలం మూసివేయడం భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలు తీసుకున్నాం". అని ఆయన అన్నారు.అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా విమాన ఇంధన ధరలు రెట్టింపయ్యాయని ఈ ఆర్థిక భారం వచ్చే నెల నుండి ఎయిర్ఇండియాపై పడనుందని తెలిపారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి టికెట్లపై ఇంధన సర్ఛార్జ్ విధించామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విమాన టికెట్ ధరలు మరింతగా పెరిగాయి. -
ఎయిర్ ఇండియా భారీ తప్పిదం
భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఓ భారీ తప్పిదం చేసింది. ఓ ఫ్లైట్‌కు బదులు మరో ఫ్లైట్‌ను వినియోగించి ప్రయాణికులకు విస్మయకర అనుభవాన్ని మిగిల్చింది. సొంతంగానూ భారీ ఆర్దిక నష్టాన్ని మూటగట్టుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. మార్చి 20న ఉదయం 11:34 గంటలకు ఢిల్లీ నుంచి AI185 సర్వీస్ నంబర్‌తో బోయింగ్ 777-200LR విమానం ప్యాసింజర్లతో కలిసి వాంకోవర్‌కు (కెనడా) బయల్దేరింది. అయితే నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఈ విమానం తప్పుడు విమానం అని అధికారులు గుర్తించారు.వాస్తవానికి ఈ సర్వీస్‌లో బోయింగ్ 777-300ER మోడల్ విమానం వాంకోవకర్కు వెళ్లాలి. అయితే ఆపరేషనల్ తప్పిదం కారణంగా 777-300ER మోడల్‌కు బదులు 777-200LR విమానం వాంకోవర్‌కు టేకాఫ్ అయ్యింది.చైనా గగనతలంలోకి ప్రవేశించాక అధికారులు తమ తప్పిదాన్ని గుర్తించారు. కెనడాకు వెళ్లేందుకు 777-300ER మోడల్‌కు మాత్రమే అనుమతి ఉందని, తాము ప్రయాణిస్తున్నది 777-200LR మోడల్ అని నాలుక కరుచుకున్నారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. మొత్తం 7 గంటలు 54 నిమిషాల ప్రయాణం తర్వాత విమానం తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఎయిర్ ఇండియాపై అసంతృప్తిని వెల్లగక్కారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సంస్థ.. మరుసటి రోజు సరైన విమానం ఏర్పాటు చేసి ప్రయాణాన్ని కొనసాగించింది. అప్పటివరకు ప్రయాణికులకు ఉచిత హోటల్ వసతి, ఇతర సదుపాయాలు కల్పించింది.ఈ ఘటన ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించింది. బోయింగ్ విమానానికి ఒక్క గంటలో 8–9 టన్నుల ఇంధనం ఖర్చు అవుతుంది. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం వల్ల వందల టన్నుల ఇంధనం వృథా అయ్యింది. దీని వల్ల భారీ ఆర్దిక నష్టం చవిచూడటంతో పాటు సంస్థ ప్రతిష్టను దిగజార్చుకుంది. -
విమానంలో 11 ఏళ్లుగా పలు సాంకేతిక సమస్యలున్నాయి
-
న్యూయార్క్–ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా ఎ–350 విమానంలో సోమవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో దాన్ని మార్గమధ్యంలోనే అత్యవసరంగా ఐర్లాండ్‌లోని షానన్ నగరంలో దించేశారు. విమానానికి పూర్తిస్థాయిలో సాకేంతిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.అందులో దాదాపు 300 మంది ప్రయాణికులున్నారు. ‘‘వారంతా క్షేమమే. వారికి బస తదితర ఏర్పాట్లు చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఢిల్లీ చేరుకునేందుకు సాయపడతాం’’అని ఎయిరిండియా తెలిపింది. న్యూయార్క్ నుంచి బయల్దేరిన ఆరు గంటలకు విమానంలో సమస్య తలెత్తినట్టు వివరించింది. ఆ విమానాన్ని ఎయిరిండియా 2024లో సమకూర్చుకుంది. -
ఇండిగో, ఎయిరిండియాపై ఫిర్యాదు కొట్టివేత
దేశీ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఊరటనిచ్చింది. మార్కెట్‌పై ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయంటూ వాటిపై వచ్చిన ఫిర్యాదులను కొట్టివేసింది. రెండు సంస్థలు పోటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలు ప్రాథమికంగా రుజువు కాలేదని పేర్కొంది.వివరాల్లోకి వెళ్తే, ఈ కంపెనీలు చట్టవిరుద్ధంగా భారీ స్థాయిలో టికెట్ల క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తున్నాయని, ఏకపక్ష నిబంధనలను కస్టమర్లపై రుద్దుతున్నాయని సీసీఐకి ఫిర్యాదు వచ్చింది. అయితే, టికెట్ల రిఫండ్‌లకి ఎయిర్‌లైన్స్‌లో నిర్దిష్ట వ్యవస్థ ఇప్పటికే అమల్లో ఉన్నందున, అలాగే క్యాన్సిల్ చేసుకుంటే పెద్ద మొత్తంలో రిఫండ్ వచ్చేలా బుక్ చేసుకునే వీలు కూడా ఉన్నందున గుత్తాధిపత్య దురి్వనియోగం ఆరోపణలపై తదుపరి విచారణ అవసరం లేదని సీసీఐ పేర్కొంది.రిఫండ్, క్యాన్సిలేషన్ నిబంధనలను కంపెనీలు ముందుగానే ప్యాసింజర్లకు తెలియజేస్తాయని తెలిపింది. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా వాటిని అమలు చేస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనడానికి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు సీసీఐ అభిప్రాయపడింది. అటు 2025 డిసెంబర్లో ఇండిగో పెద్ద ఎత్తున ఫ్లయిట్లను రద్దు చేయడంపై దాఖలైన కేసుతో కలిపి ఈ కేసును కూడా విచారణ చేయాలన్న మరో పిటీషన్ని తోసిపుచ్చింది. రెండూ వేర్వేరు అంశాలు కాబట్టి కలిపి విచారణ చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొంది. దేశీ ఏవియేషన్ మార్కెట్లో ఇండిగోకి 65 శాతం, ఎయిరిండియాకి 27 శాతం వాటా ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా? -
విమానం గాల్లో ఉండగా క్యాబిన్ క్రూ రీల్, ఎయిరిండియా విచారణ
ఎయిరిండియా విమానం గాలిలో ఉన్నప్పుడు, మాజీ క్యాబిన్ క్రూ సభ్యురాలు ఒకరు కాక్‌పిట్‌లో కూర్చోని రీల్ చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రయాణీకుల భద్రతపై ఆందోళన లేవనెత్తింది. దీనిపై ఎయిరిండియా స్పందించింది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మహిళ పైలట్ సీటులో కూర్చున్నట్లు కనిపిస్తుంది. కెమెరాను అద్దం (విండ్‌స్క్రీన్ )వైపు తిప్పినప్పుడు బయట మేఘాలు కనిపిస్తుండటంతో, విమానం గాలిలో ఉన్నప్పుడే ఈ వీడియో తీసినట్లు స్పష్టమవుతోంది. విమానయాన భద్రతా ప్రోటోకాల్‌ల గురించి చర్చకు దారితీసింది.క్లిప్‌ను ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ, “విమానం గాలిలో ఉంది, ఒక ఎయిర్ హోస్టెస్ కాక్‌పిట్‌లో కూర్చుని రీల్స్ తయారు చేస్తోంది. ఇది నిజంగా దీనికి అనుమతి ఉందా? ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారిని చూడటం చాలా బాధగా ఉంది అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ వీడియో భద్రతా నిబంధనల ఉల్లంఘనేనంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలుఈ ఘటనపై ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి కఠినమైన ప్రోటోకాల్ ఉంది. దీన్ని అధిగమించడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని క్యారియర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వీడియోను ఎపుడు, ఎలా చిత్రీకరించారు, దీని యథార్థతను తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించామని, దర్యాప్తు ఫలితాల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని ఎయిరిండియా తెలిపింది, కాక్‌పిట్ ప్రవేశంపై ఎయిర్ ఇండియాకు కఠినమైన నిబంధనలు ఉన్నాయని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని ఎయిరిండియా స్పష్టం చేసింది.Wait until you see the end of this video. The plane is in the air and an air hostess is sitting in the cockpit making reels. Is this really allowed? Feels quite disturbing to see something like this when passenger safety is supposed to be the top priority. @DGCAIndia pic.twitter.com/91Nmsr9R70— Nikhil saini (@iNikhilsaini) March 10, 2026డీజీసీఏ నిబంధనలేంటి?డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం విమానం గాలిలో ఉన్నప్పుడు కాక్‌పిట్‌లో ఎప్పుడూ కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి.ఒకవేళ పైలట్లలో ఒకరు విరామం కోసం లేదా అత్యవసర పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, ఆ సమయంలో ఒక క్యాబిన్ క్రూ సభ్యుడిని లోపలికి పిలుస్తారు. రెండవ పైలట్ తిరిగి వచ్చే వరకు ఆ క్రూ సభ్యుడు అక్కడే ఉండాలి. కొందరు నెటిజన్లు ఈ నిబంధనను ప్రస్తావిస్తూ, బహుశా పైలట్ బయటకు వెళ్లిన సమయంలో నిబంధనల ప్రకారమే ఆమె లోపలికి వెళ్లి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఘటనపై ఎయిరిండియా దర్యాప్తులో ఏం తేలనుందో వేచి చూడాల్సిందే. -
ప్రయాణికులకు అలర్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్లకు వెళ్లే అన్ని విమానాల సస్పెన్షన్‌ను ఎయిర్ ఇండియా సోమవారం(మార్చి 2) రాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రయాణీకులకు సూచనలు చేసింది.ఈ క్రమంలో ఢిల్లీ, ముంబై, తిరుచిరాపల్లి సహా పలు విమానాశ్రయాల నుంచి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వంటి సంస్థలు కూడా తాత్కాలికంగా వాటి సర్వీసులను నిలిపివేశాయి. దీంతో, యూరప్ వెళ్లే విమానాలు సైతం నిలిచిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో ఆదివారం దేశవ్యాప్తంగా వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.దాడులు, గగనతల పరిమితులు, భద్రత దృష్ట్యా భారత్ నుంచి వెళ్లాల్సిన దాదాపు 400కు పైగా విదేశీ విమానాలు రద్దయినట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది. పశ్చిమాసియా గగనతలాన్ని ఉపయోగించుకొనే విమాన సర్వీసులను సోమవారం రాత్రి 11.59 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ‘ఇండిగో’ తెలిపింది. పశ్చిమాసియాకు వెళ్లే దాదాపు 184 అంతర్జాతీయ విమానాలను పాకిస్థాన్ రద్దు చేసింది. అటు పశ్చిమాసియా దేశాల్లోనూ 1,800కు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) వెల్లడించింది.మరోవైపు.. ఆదివారం కువైట్, అబుదాబీ, మస్కట్, షార్జా, బహ్రెయిన్, రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా, దోహా, దుబాయ్ నగరాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 26 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆయా విమానాశ్రయాల్లోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు, వాహనాల రద్దీ బాగా తగ్గింది. -
ఎయిరిండియా విమానం దోషి... పైలట్ సుమీత్ సబర్వాల్!
అది గత ఏడాది జూన్ 12న జరిగిన వైమానిక దుర్ఘటన.. ‘ఎయిరిండియా ఫ్లైట్ 171’ (బోయింగ్ డ్రీమ్ లైనర్ 787) అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరింది. టేకాఫ్ చేసిన 32 సెకండ్లకే రెండు ఇంజిన్ల నుంచి చోదక శక్తి లభించక విమానం కూలిపోయింది. విమాన సిబ్బంది 12 మంది, ప్రయాణికులు కలిపి మొత్తం 241 మంది మరణించారు. వీరు కాకుండా శకలాలు నేలపై కూలిపోయి వైద్య విద్యార్థుల హాస్టల్ వద్ద ఉన్న మరో 19 మంది కూడా చనిపోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. విమానంలోని ఒక్క ప్రయాణికుడు మాత్రం మృత్యువును జయించి బతుకు జీవుడా అంటూ గాయాలతో బయటపడ్డాడు. ఇద్దరు పైలట్లలో ఒకరు ‘దాదాపుగా’ ఉద్దేశపూర్వకంగా ఇంధన స్విచ్చుల్ని ఆపివేయడం కారణంగానే విమానం కూలిపోయిందని, సదరు దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న భారతీయ ఇన్వెస్టిగేటర్లు ఆమేరకు ఆ అంశాన్ని పొందుపరుస్తూ తుది నివేదిక రూపొందిస్తున్నారని ఇటలీ వార్తాపత్రిక ‘కొరియరె డెల్లా సెరా’ బుధవారం ఓ సంచలన కథనం ప్రచురించింది. పాశ్చాత్య వైమానిక సంస్థల్లోని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ అది తాజా బాంబు పేల్చింది. పెదవి విప్పని పౌర విమాన శాఖ ఎయిరిండియా విమాన దుర్ఘటనకు సాంకేతిక లోపం కారణం కాదని తనిఖీల్లో తేలిందని, ఇంధనం మీటల్ని కదిలించిన పైలట్ ఎవరనేది కూడా కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్స్ (సీవీఆర్) విశ్లేషణ సందర్భంగా ఇన్వెస్టిగేటర్లు గుర్తించారని ఇటలీ పత్రిక కథనం తెలిపింది. దీనిపై ‘హిందూస్థాన్ టైమ్స్’ పత్రిక మరిన్ని వివరాలు తెలుసుకుందామని విమాన దుర్ఘటన దర్యాప్తు బ్యూరో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖను సంప్రదించినప్పటికీ అవి స్పందించలేదు. విమానంలో ఇంధన సరఫరాకు వీలు కల్పించే స్విచ్చుల్ని ఉద్దేశపూర్వకంగా ఎలా ఆఫ్ చేశారు? లేదా బాధ్యత వహించేది ఎవరు? అనే అంశమై తుది నివేదికలో పూర్తి వివరాలు ఉంటాయో, ఉండవో ప్రస్తుతానికైతే తెలియరాలేదు. ఈ దుర్ఘటనలో మరణించిన విమాన పైలట్ (కమాండర్) సుమీత్ సబర్వాల్ వివాదానికి కేంద్ర బిందువుగా, ప్రధాన అనుమానితుడిగా నిలిచారని ‘కొరియరె డెల్లా సెరా’ కథనం తెలిపింది. సుమీత్ సబర్వాల్ కుటుంబం, భారతీయ పైలట్ల సంఘాలు మాత్రం అతడి వైపే నిలిచాయి. విమాన తయారీదారు, దాని ఆపరేటర్, ఇతర అంశాలపై మరింత లోతుగా పరిశీలన జరగాలని ఇండియన్ పైలట్స్ అసోసియేషన్స్ డిమాండ్ చేశాయి. తుది నివేదికపై రాజకీయ ప్రభావం?ఎయిరిండియా విమాన దుర్ఘటన దర్యాప్తులో అమెరికన్ ఇన్వెస్టిగేటర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. గత ఏడాది డిసెంబరులో ఏఏఐబీకి చెందిన భారతీయ దర్యాప్తు బృందం వాషింగ్టన్ వెళ్లింది. కూలిన ఎయిరిండియా విమానం ‘బ్లాక్ బాక్స్’ను దర్యాప్తు బృంద సభ్యులు అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా మండలి (నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు)కి చెందిన ప్రయోగశాలల్లో మరోసారి విశ్లేషించారు. ఇందులో ప్రత్యేకించి విమానం క్యాబిన్ ఆడియో రికార్డింగ్స్ మీద వారు దృష్టి పెట్టారు. పొరపాటు వల్ల దుర్ఘటన సంభవించలేదని, ఇంధన స్విచ్చులను ఏ పైలట్ ఆఫ్ చేశారో కూడా ఆడియో విశ్లేషణలో బయటపడిందని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ‘కొరియరె డెల్లా సెరా’ పేర్కొంది. అమెరికన్ ప్రయోగశాలల్లో జరిపిన ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్) విశ్లేషణ కూడా సబర్వాల్ వైపే తప్పు చూపిస్తోంది. ఇంజిన్లు పనిచేయని క్రమాన్ని పరిశీలిస్తే... తొలుత కెప్టెన్ (కమాండర్ సుమీత్ సబర్వాల్) కూర్చునే ఎడమ వైపు ఇంజిన్ షట్ డౌన్ అయిందని, ఆ తర్వాత కుడి వైపు ఇంజిన్ షట్ డౌన్ అయిందని తెలుస్తోంది. ఆ సమయంలో విమానాన్ని సబర్వాల్ పర్యవేక్షిస్తుండగా (మానిటరింగ్), ఫస్ట్ ఆఫీసర్ కుందర్ (కో-పైలట్/సెకండ్ ఇన్ కమాండ్) కుడి వైపు కూర్చుని విమానాన్ని (పైలటింగ్) నడుపుతున్నారు. విమానాన్ని పైకి, కిందికి, పక్కలకు తిప్పడానికి పైలట్లు తమ ఎదురుగా ఉండే ‘కంట్రోల్ యోక్’ ఉపయోగిస్తారు. చాలినంత ఇంధనం అందక, చోదక శక్తి లోపించి ఎయిరిండియా విమానం కిందికి కూలిపోబోతున్న ఆఖరి క్షణాల్లో... అది ప్రయాణించే ఎత్తును పెంచేందుకు ఫస్ట్ ఆఫీసర్ కుందర్ ప్రయత్నించారు. అందుకు ఆయన వాడిన ‘కంట్రోల్ యోక్’ ఉన్న పొజిషన్ ఓ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇది కూడా చదవండి: పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’ఇక సబర్వాల్ ముందున్న కంట్రోల్ యోక్ మాత్రం ‘స్థిరమైన స్థితి’లో అలాగే ఉంది. అంటే... విమానం కిందికి కూలిపోతున్నప్పటికీ దాన్ని పైకి, ఎత్తుకు లేపడానికి సబర్వాల్ ప్రయత్నించలేదని ఇటలీ పత్రిక కథనం పేర్కొంది. అయితే ఈ ‘తుది నిర్ధారణలు’ రాజకీయ నాయకత్వ పరిశీలనకు వెళ్లవచ్చని, జాతీయంగా తీవ్ర వివాదాలకు తావివ్వకుండా మరింత జాగ్రత్తగా తుది నివేదిక రూపొందవచ్చని... పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికన్ ఇన్వెస్టిగేటర్లను ఉటంకిస్తూ ‘కొరియరె డెల్లా సెరా’ తన కథనం రాసింది. దర్యాప్తు ముగియలేదు: ఏఏఐబీ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై దర్యాప్తు ముగిసిందని, బాధ్యులెవరో తెలిసిందని, పైలట్ ఉద్దేశపూర్వక చర్య వల్లనే విమానం కూలిపోయిందని కొన్ని మీడియా వర్గాల్లో వస్తున్న వార్తలపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) అధికారికంగా స్పందించింది. అవి ఊహాగానాలేనని తోసిపుచ్చింది. దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా ‘అంతిమ నిర్ధారణ’కు రాలేదని స్పష్టం చేసింది. విచారణ పూర్తి కాకుండా వ్యక్తిగతంగా ఎవరినీ తప్పుపట్టడం సరికాదని పేర్కొంటూ దర్యాప్తు బ్యూరో గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.-జమ్ముల శ్రీకాంత్ (Credit: Hindustan Times). -
తప్పిన పెను ప్రమాదం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని సెకన్లకే కుప్పకూలిన ఘోర ప్రమాదఘటనను మర్చిపోకముందే దాదాపు అలాంటి మరో ఘోర ప్రమాదం అదృష్టవశాత్తు తప్పిపోయింది. విమానంలోని ఇంధన నియంత్రణ స్విచ్ దానంతట అదే ఆన్ పొజిషన్ నుంచి కటాఫ్ పొజిషన్‌కు మారింది. ఇది విమానం ల్యాండయ్యాక జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.అసలేం జరిగింది?లండన్ హీత్రూ అంతర్జాతీయ విమా నాశ్రయం నుంచి ఆదివారం రాత్రి ఎయిరిండియా డ్రీమ్ లైనర్ (బోయింగ్ 787–8) విమానం 200 మందికి పైగా ప్రయాణికులతో బెంగళూరు బయల్దేరింది. సోమ వారం ఉదయం 11.54 గంటలకు బెంగళూరు విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ల్యాండయ్యాక సాధారణ తనిఖీల్లో భాగంగా విమానంలోని ఇంధన స్విచ్‌లను పైలట్లు సరి చూశారు. ఎడమవైపు స్విచ్‌ను ‘రన్’ పొజిషన్లోకి మార్చారు. ఫ్యూయల్ కంట్రోల్ లాకింగ్ సిస్టమ్ సరిగా ఉంటే స్విచ్ అలాగే ఉండాలి. కానీ అది హఠాత్తుగా పడిపోయి కటాఫ్ పొజిషన్లోకి మారింది. స్విచ్‌ను మళ్లీ ‘రన్’ పొజిషన్లోకి మార్చినా అది వెంటనే కటాఫ్‌లోకి పడిపోయింది. ఈ ఘోర వైఫల్యాన్ని పైలట్లు వెంటనే డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లడం, వాళ్లు సాంకేతిక నిపుణులతో తనిఖీ చేయించడం చకచకా జరిగిపోయాయి. డ్రీమ్‌లైనర్ రకం విమానాలన్నింటినీ తనిఖీ చేశామని, ఎలాంటి స్విచ్ లోపాలూ కన్పించలేదని ఎయిరిండియా ఒక ప్రకటనలో పేర్కొంది. స్విచ్ లోపాలపై ఈ ఉపకరణాలను తయారుచేసిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యాను ఫ్యాక్చరర్ (ఓఈఎం)కు సమాచారం ఇచ్చామని, వాళ్లు పైలట్ల నుంచి సమాచారం తీసుకున్నారని పేర్కొంది. ఘటనపై సమగ్రస్థాయిలో నివేదిక ఇవ్వాలని ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది. -
30 బోయింగ్ విమానాలకు ఎయిరిండియా ఆర్డరు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంధనం ఆదా చేసే 737 మ్యాక్స్ రకానికి చెందిన మరో 30 బోయింగ్ విమానాల కోసం ఎయిరిండియా ఆర్డరిచ్చింది. దీనితో బోయింగ్‌కి మొత్తం కలిపి దాదాపు 200 విమానాలకు ఆర్డరిచ్చినట్లవుతుంది. మరోవైపు, ఏ321 రకానికి చెందిన 200 విమానాల కోసం ఎయిర్‌బస్‌కి ఇచ్చిన ఆర్డర్లో ఎయిరిండియా స్వల్ప మార్పులు చేసింది.ఇందులో 15 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అధునాతన ఎ 321ఎక్స్ఎల్ఆర్ (ఎక్స్ట్రా లాంగ్ రేంజ్) వేరియంట్‌కి మార్చుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇవి 2029–2030 మధ్యలో డెలివర్ అ య్యే అవకాశం ఉందని వివరించింది. ఇంధనం ఆదా చేసే ఎ321 ఎక్స్ఎల్ఆర్ విమానా లకు దాదాపు 8,700 కి.మీ. రేంజి ఉంటుంది. -
మంచుతుఫాన్ ఎఫెక్ట్.. USAకు ఫ్లైట్స్ క్యాన్సిల్
అమెరికా న్యూయార్క్‌లో భారీ మంచు తుఫాను పొంచి ఉన్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 25, 26 తేదీలలో అక్కడికి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అమెరికాకు మంచు తుపానులు భయం పట్టుకుంది. ఈ వారాతంలో ఆ దేశం తీవ్ర మంచుతుపాను ఎదుర్కొనే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో USA అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు. తుపానును ఎదుర్కొవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమైందని ప్రకటించారు. అయితే దీని ప్రభావం భారత్‌లోని విమానయాన సంస్థలపై సైతం పడింది. మంచు తుఫాన్ నేపథ్యంలో న్యూయార్క్ వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.ఈ విమానాల రద్దుపై వివరణ ఇస్తూ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. "అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలలో రేపు, ఎల్లుండి తీవ్ర మంచుతుఫాను ప్రభావం ఉండనుంది. యుఎస్ తూర్పు తీరంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా జనవరి 25,26 తేదీలలో అక్కడికి ప్రయాణించే విమానాలను రద్దు చేస్తున్నాం. ఈ క్యాన్సిలేషన్‌పై పూర్తి సమాచారం మా సిబ్బంది ప్రయాణికులకు వ్యక్తిగతంగా అందిస్తుంది". అని ఎక్స్‌లో ఎయిర్ఇండియా పోస్ట్ చేసింది.అయితే ప్రస్తుతం రాబోయే మంచు తుఫాన్ అమెరికాలో 2/3 మందిని ఎఫెక్ట్ చేస్తుందని సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ప్రస్తుతం వచ్చే మంచుతుఫాన్ టెక్సాన్ నుంచి ఇంగ్లాండ్ వరకూ దాదాపు 2వేల కిలోమీటర్ల మైళ్లు ప్రయాణించనున్నట్లు పేర్కొంది. దీనివల్ల దేశంలోనే విద్యుత్‌వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. -
చికెన్ ముక్క చిక్కుల్లో ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా విమానం ఎక్కారా? అయితే మీ ఆకలిని అణచుకోండి.. లేదంటే ’కోడ్ ఆఫ్ కాండక్ట్’ హెచ్చరిక లేఖ అందుకునేందుకు సిద్ధంగా ఉండండి.. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వస్తున్న అభిషేక్ చౌదరి అనే ప్రయాణికుడికి ఎయిర్ ఇండియా సిబ్బంది చుక్కలు చూపించారు. ముందుగా బుక్ చేసుకున్న మీల్ అడిగినందుకు తనను వేధించారంటూ ఆయన సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన యూట్యూబర్ ఫ్రెండ్ ఆకాష్ గుప్తాతో కలిసి దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. నాన్‌వెజ్ భోజనం బుక్ చేసినా.. జనవరి 19న జరిగిన ఈ ప్రయాణంలో అసలు రచ్చ అంతా నాన్ వెజ్ భోజనం దగ్గర మొదలైంది. అభిషేక్ తన తమ్ముడి కోసం ముందుగానే నాన్–వెజ్ భోజనం బుక్ చేసుకున్నాడు. కానీ ఆహారం అందించే సమయానికి.. అది అయిపోయిందని సిబ్బంది చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే, కనీస మర్యాద లేకుండా ‘నీ టికెట్ చూపించు’అంటూ ఎయిర్ హోస్టెస్ మొరటుగా ప్రవర్తించిందని అభిషేక్ ఆరోపించాడు. పక్కనే ఉన్న ఓ ఫ్రెంచ్ ప్రయాణికుడికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ‘క్షమాపణ చెప్పాల్సింది పోయి, చాలా దురుసుగా మాట్లాడారు’.. అని ఆ విదేశీ ప్రయాణికుడు కూడా వీడియోలో వాపోయాడు. బెదిరింపులు.. ఆంక్షలు అభిషేక్ ఈ విషయాన్ని సీనియర్ క్రూ మెంబర్ దృష్టికి తీసుకెళ్తే, ఆమె ఇంకా సీరియస్‌గా ‘నువ్వు నోరు మూసుకో’అని గద్దించిందట. విచిత్రం ఏంటంటే, అభిషేక్ ఈ గొడవను వీడియో తీస్తున్నాడని తెలియగానే, ఫ్లైట్‌లో లైట్లు డిమ్ చేసేశారట. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక అభిషేక్ దిగకుండా గ్రౌండ్ స్టాఫ్ ఆపేశారు. అతని ఫోన్ లాక్కుని చెక్ చేశారు. ‘జరిగిందేదీ సోషల్ మీడియాలో పెట్టను’.. అని బలవంతంగా రాయించుకున్నారట. పైగా అతను తాగి ఉన్నా డని తప్పుడు ఆరోపణలు చేశారట. చివరగా, పైలట్ సంతకంతో కూడిన ఒక ‘కోడ్ ఆఫ్ కండక్ట్ వార్నింగ్ లెటర్’కూడా చేతిలో పెట్టారు. మొక్కుబడి స్పందన ఈ వీడియో వైరల్ అవ్వడంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనిపై పూర్తి విచారణ జరుపుతున్నామని, తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
AI -171: పైలట్ల సమాఖ్య నోటీసులు.. ఏఏఐబీ రియాక్షన్ ఇదే
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో పైలట్ సుమీత్ సబర్వాల్ మేనల్లుడు కెప్టెన్ వరుణ్ ఆనంద్‌ను విచారణకు పిలవడంపై భారత పైలట్ల సమాఖ్య(FIP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విమాన ప్రమాద పరిశోధనా బ్యూరో (AAIB)కు పైలట్ల సమాఖ్య నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వేధింపులకు గురిచేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది.ఆనంద్‌కు ఆ విమానం, ఆ ఫ్లైట్‌తో ఎలాంటి సంబంధం లేదని.. మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులను విచారణకు పిలవడం సరికాదని సమాఖ్య పేర్కొంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై స్పందించిన ఏఏఐబీ.. తాము చట్ట ప్రకారంగానే వ్యవహరించామని, విచారణకు అవసరమైతే ఎవరినైనా పిలుస్తామంటూ తేల్చి చెప్పింది.ఎయిరిండియా విమాన ప్రమాదంలో కెప్టెన్ సుమిత్ సభర్వాల్, కో-పైలట్ క్లైవ్ కుందర్‌లు మృతి చెందగా.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుమిత్ మేనల్లుడు కెప్టెన్ వరుణ్ ఆనంద్‌కు ఏఏఐబీ సమన్లు జారీ చేసింది. జనవరి 15న విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్న వరుణ్ ఆనంద్.. ‘భారత పైలట్ల సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నారు. -
విమానం ఇంజిన్‌లో ఇరుక్కున్న లగేజ్ కంటైనర్..!
ఢిల్లీ–న్యూయార్క్ ఎయిర్ ఇండియా AI101 విమానంలో లగేజ్ కంటైనర్.. ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు కారణంగా టాక్సీ(రన్ వే మధ్యలో భూమి మీద సడిచే సమయంలో) చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరూ గాయపడలేదు కానీ విమానాన్ని గ్రౌండ్ చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది విమానంలో 250 మంది ప్రయాణికులు ఉండగా, వారంతా ఊపిరి బిగబెట్టుకుని కూర్చున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు విమానం క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే అదృష్టవశాత్తూవిమానం సురక్షితంగా గ్రౌండ్ (ఎగరడానికి అనుమతి లేకుండా నిలిపివేయడం)చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. आज दिल्ली एयरपोर्ट पर एयर इंडिया के एयरबस A350 के इंजन में एक बैगेज कंटेनर फंस गया. फ्लाइट दिल्ली से न्यूयॉर्क जा रही थी. #AviationNews pic.twitter.com/LG1dDA6dLM— Versha Singh (@Vershasingh26) January 15, 2026 ఇదీ చదవండి:ఇరాన్ గగనతలం.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం -
ఇరాన్ గగనతలం.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం!
ఇరాన్లో పరిస్థితులు దారుణంగా మారాయి. అగ్రరాజ్యం అమెరికా దాడులు చేస్తుందనే కారణంగా ఇరాన్.. అకస్మాత్తుగా తన గగనతలాన్ని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, గగనతం మూసివేస్తున్న సమయంలో ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. దీంతో, ఇండిగో సంస్థ, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ గురువారం తెల్లవారుజామున ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించే సమయానికి చాలా విమానాలు తమ మార్గాలను మళ్లించుకున్నాయి. అయితే, ఈ మూసివేత ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇరాన్ గగనతలంలో భారత్‌కు చెందిన ఇండిగో విమానం ప్రయాణంలో ఉంది. జార్జియాలోని టీబీలిసీ నుంచి వస్తున్న ఇండిగో 6E-1808 విమానం ఇరాన్ తన బోర్డర్లను మూసివేయడానికి సరిగ్గా నిమిషాల ముందు గగనతలం చివరి వరకు వచ్చేసింది. సరైన సమయంలో సదరు ఇండిగో విమానం.. ఇరాన్ సరిహద్దులు దాటి పాకిస్తాన్ గగనతంలోకి ప్రవేశించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా, ఆ సమయంలో ఇరాన్ భూభాగంపై ఉన్న ఏకైక 'నాన్-ఇరానియన్' విమానం ఇండిగోనే కావడం గమనార్హం.విమానయాన సంస్థల సూచనలు..ఇక, ప్రస్తుతానికి ఇరాన్ గగనతలం అనిశ్చితంగా ఉన్నందున భారత విమానయాన శాఖ (DGCA) పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రయాణికులు తమ విమాన సమయాలను సరిచూసుకోవాలని సూచించింది. భారత విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తామిచ్చే సూచనలు గమనించుకోవాలని ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని ఎయిరిండియా తెలిపింది. ఇండిగో కూడా ఇలాంటి సూచనలే జారీ చేసింది. ఇరాన్ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని పేర్కొంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.కేంద్రం అడ్వైజరీ..ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. భారతీయులు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమ స్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. అలాగే, ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్‌లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది. IndiGo flight 6E1808 is now the last non-Iran-registered passenger aircraft in Iranian airspace. pic.twitter.com/qEAU83gYrK— Chendur.Vengat (@coolvnkt) January 14, 2026అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురవుతున్న హెచ్చరికలు, ఇరాన్ అంతర్గత అశాంతి నేపథ్యంలో టెహ్రాన్ తన గగనతలాన్ని శత్రు విమానాలకు దొరక్కుండా మూసివేసింది. కమర్షియల్ విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్ గగనతంలో జరిగిన విమాన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ గగనతలం మూసివేతతో భారత్ నుంచి యూరప్, అమెరికా వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. -
ఎయిర్ ఇండియా కొత్త డ్రీమ్‌లైనర్
టాటా గ్రూప్ ఏవియేషన్ కంపెనీ ఎయిర్ ఇండియా, ఫిబ్రవరి నుంచి కొత్త బోయింగ్ 787–9 డ్రీమ్‌లైనర్ విమానాన్ని అంతర్జాతీయ వాణిజ్య సేవలకు ఉపయోగించనుంది. ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో చేరిన తొలి డ్రీమ్‌లైనర్ ఇదే. ఈనెల 7న అమెరికాలోని సియాటిల్‌లో ఉన్న బోయింగ్ ఎవెరెట్ ఫ్యాక్టరీలో ఈ విమానం టైటిల్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ పూర్తయింది. అనంతరం జనవరి 11న ఇది ఢిల్లీకి చేరింది.ఎయిర్ ఇండియా చివరిసారిగా లైన్ ఫిట్ డ్రీమ్‌లైనర్‌ను 2017 అక్టోబర్‌లో, ప్రభుత్వ సంస్థగా ఉన్న సమయంలో కొనుగోలు చేసింది. విస్తరణ దిశగా సాగుతున్న ఎయిర్ ఇండియా ఈ ఏడాది మరో ఐదు వైడ్–బాడీ విమానాలను (ఏ350–1000, బీ787–9లు) ఫ్లీట్‌లో చేర్చాలని భావిస్తోంది. ఎయిర్ ఇండియా మొత్తం 350 ఎయిర్‌బస్ విమానాలు, 220 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు పెట్టింది. ఇప్పటికే ఆరు ఏ350 వైడ్–బాడీ విమానాలు ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో చేరాయి. అలాగే 51 బీ 737–8 న్యారో–బాడీ విమానాలు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు అందాయి.ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే.. -
విల్సన్‌కు 'టాటా'.. ఎయిరిండియా సీఈఓ కోసం కసరత్తు!
ఎయిరిండియాకు కొత్త సీఈవోను నియమించే దిశగా టాటా గ్రూప్ అన్వేషణ ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ పదవీ కాలం 2027 జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అలాగే తక్కువ ఖర్చుతో సేవలు అందించే అనుబంధ సంస్థ ‘ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్’ కొత్త ఎండీ నియామకంపైనా టాటా గ్రూప్ దృష్టి సారించినట్లు తెలిసింది.‘‘2027 తర్వాత ఒప్పందాన్ని పొడిగించాలనే ఉద్దేశం విల్సన్‌కూ, టాటా గ్రూప్‌కూ లేదు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని సీఈవోగా చేయాలని టాటాసన్స్ భావిస్తోంది. అందులో భాగంగా ఎయిరిండియాకు బాధ్యతలు చేపట్టగలిగే సామర్థ్యం కలిగిన అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు’’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787–8 ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక జూన్ నాటికి వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా, టాటా హౌస్‌లో సోమవారం జరిగిన ఓ అధికారిక సమావేశానికి క్యాంప్‌బెల్ విల్సన్ హాజరు కావడం గమనార్హం. -
ఎయిర్ ఇండియా సీఈవోను తప్పిస్తున్నారా?
విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్ బెల్ విల్సన్‌ను తప్పించే యోచనలో టాటా గ్రూప్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. టాటా సన్స్ తమ విమానయాన వ్యాపారంలో నాయకత్వ మార్పులను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు త్వరలో కొత్త సీఈఓ నియమితులయ్యే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.టాటా గ్రూప్ తన టాప్ లెవల్ మేజేజ్మెంట్ నిర్మాణాన్ని సమీక్షిస్తున్న క్రమంలో ఇప్పటికే ప్రధాన అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన సీనియర్ నాయకులతో చర్చలు జరిపిందని నివేదిక తెలిపింది. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ యూకే, యూఎస్ కేంద్రంగా ఉన్న కనీసం రెండు పెద్ద విమానయాన సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడినట్లుగా పేర్కొంది.ఎయిర్ ఇండియా చైర్మన్‌గా ఉన్న చంద్రశేఖరన్ ఎయిర్ లైన్స్‌లో కార్యాచరణ వేగం, క్షేత్ర స్థాయి మార్పుల పురోగతిపై పూర్తి సంతృప్తిగా లేరని, అందుకే నాయకత్వ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని ఈ విషయం గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. విల్సన్ ప్రస్తుత పదవీకాలం జూన్ 2027 వరకు ఉన్నప్పటికీ, విమానయాన సంస్థ అంతకు ముందే నాయకత్వ మార్పును చూడవచ్చని నివేదిక తెలిపింది.న్యూజిలాండ్‌కు చెందిన విల్సన్ 2022 జూలైలో ఎయిర్ ఇండియాలో చేరారు. ఎయిర్ లైన్స్ పునర్నిర్మాణం, ఆర్థిక మెరుగుదలకు ఐదేళ్ల పరివర్తన ప్రణాళికను ప్రకటించారు. ఈయన హయాంలో కొన్ని కీలక మార్పులు సజావుగా పూర్తయ్యాయి. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం పెద్దగా అంతరాయాల్లేకుండా ముందుకు సాగింది. విమానయాన సంస్థ తన విమానాలు, సామర్థ్యాన్ని విస్తరించింది. అయితే గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా కుప్పకూలి 260 మంది మరణించారు.ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోనూ..మరోవైపు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఇలాంటి సమీక్షలే జరుగుతున్నట్లు సమాచారం. దాని సీఈవో అలోక్ సింగ్ పదవీకాలం కూడా 2027లో ముగియనుంది. టాటా సన్స్ తమ అన్ని విమానయాన వ్యాపారాలలో నాయకత్వ అవసరాలను అంచనా వేస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. -
ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు
విమాన ప్రమాదాలు, ఇండిగో సంక్షోభంతో విమానాలు రద్దు లాంటి అనేక ఇబ్బందులతో విమాన ప్రయాణ మంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి పరిస్థితి ప్రయాణికులది. తాజాగా జరిగిన మరో సంఘటన విమాన ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. కెనడాలోని వాంకోవర్ విమానాశ్రయంలో ఎయరిండియా పైలట్ బుక్ అయ్యాడు. స్టోరీ ఏమిటీ అంటే...టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఫెస్టివ్ మూడ్‌లో ఉన్న పైలట్ మద్యం సేవించి వాంకోవర్నుంచి ఢిల్లీకి బయలు దేరిన బోయింగ్ 777-AI 186 విమానంలో విధులకు సిద్ధ పడ్డాడు. విమానంలో పైలట్ భద్రతా ప్రోటోకాల్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. ఆల్కహాల్ వాసన వస్తున్నట్లు గమనించిన సిబ్బంది ఈ విషయాన్ని కెనడియన్ అధికారులకు నివేదించారు. వారు తక్షణమే పైలట్‌ను బ్రీత్ అనలైజర్ పరీక్షలో పట్టుబడ్డాడు. దీంతో అతని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమానాన్ని రెండు గంటల పాటు నిలిపి వేశారు. విషయం తెలిసి ప్రయాణీకులు ఆందోళన పడ్డారు. 2025 డిసెంబరు 23న సంఘటన చోటు చేసుకుంది. పైలట్ వ్యవహారం బయటపడటంతో ఎయిరిండియా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. నలుగురు పైలట్లు రెండు షిఫ్ట్లతో నడిచే ఈ అల్ట్రా-లాంగ్-హాల్ విమానం స్థానిక సమయం సాయంత్రం 5 గంటలకు బయలు దేరింది. షెడ్యూల్ కంటే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరి, వియన్నాలో కొత్త సిబ్బందితో ఢిల్లీకి బయలుదేరింది. దీనిపై ఎయిరిండియా తీవ్రంగా స్పందించింది. పైలట్‌ను ఢిల్లీకి తరలించి, దర్యాప్తు చేపట్టింది. జీరో-టాలరెన్స్ తమ విధానమని, నిబంధనల ఉల్లంఘనను సహించబోమని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణీలకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. అలాగే ఈ విషయాన్ని ఎయిర్‌లైన్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి నివేదించింది.మరోవైపు పైలట్ విమానాశ్రయంలో అనుకోకుండా మద్యం తాగాడని కొందరు చెప్పగా, మరికొందరు బాటిల్ కొన్న సందర్భంగా మద్యం వాసన వచ్చిందని చెబుతున్నారు. -
అత్యవసర పరిస్థితి... ఎయిర్ ఇండియా విమానం మళ్లింపు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా (AI887) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, విమానం కుడి వైపు ఇంజిన్ (ఇంజిన్ నంబర్ 2)లో ఆయిల్ ప్రెజర్ ఒక్కసారిగా సున్నాకి పడిపోయింది. ఈ అత్యవసర పరిస్థితిని గమనించిన పైలట్లు అప్రమత్తమై, వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి, సురక్షితంగా ల్యాండ్ చేయడంతో 100 మందికి పైగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.సాధారణంగా విమాన ఇంజిన్ భాగాలు వేడెక్కకుండా, సజావుగా పనిచేయడానికి ఇంజిన్ ఆయిల్ ఎంతో కీలకం. ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోవడం అనేది విమానయాన రంగంలో అత్యంత ప్రమాదకరమైన ‘టెక్నికల్ ఫెయిల్యూర్’గా పరిగణిస్తారు. దీనివల్ల ఇంజిన్ మంటలు అంటుకోవడం లేదా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, బోయింగ్ 777-337 ER విమాన సిబ్బంది సరైన సమయంలో స్పందించి ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ పాటించడంతో పెను ముప్పు తప్పింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి, ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.గత కొద్ది రోజుల్లో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం (డిసెంబర్ 18న) గన్నవరం విమానాశ్రయంలో విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కూడా ఇలాంటి ఇంజిన్ సమస్యే తలెత్తింది. ఆ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు ఉన్నారు. అయితే టేకాఫ్‌కు ముందే ఈ లోపాన్ని గుర్తించి,విమానాన్ని రద్దు చేయడంతో ప్రమాదం తప్పింది.వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు విమానాల నిర్వహణ, భద్రతా తనిఖీలపై ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, పర్యాటక సీజన్ కావడంతో విమానయాన సంస్థలు తమ విమానాల కండిషన్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో నిలిచిపోయిన విమానానికి సమగ్ర సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నామని, పూర్తి క్లియరెన్స్ వచ్చాకే విమానాన్ని తిరిగి సర్వీసులోకి తెస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ఆపరేషన్ సిందూర్‌పై మునీర్ సంచలన వ్యాఖ్యలు -
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దాడి చేసిన ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ పాయింట్ వద్ద క్యూను పట్టించుకోకుండా కొందరు ఎయిరిండియా ఉద్యోగులు వెళ్లిపోవడంపై తలెత్తిన వివాదంతో ఈ గొడవ జరిగినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను అంకిత్ దివాన్ అనే ప్రయాణికుడు శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎయిర్‌పోర్టులోని టెరి్మనల్–1 వద్ద కొందరు సిబ్బంది క్యూలో ఉన్న వారిని నెట్టేసి ముందుకు వెళ్తుండగా, తాను అభ్యంతరం తెలిపానని ఆయన పేర్కొన్నారు. దీంతో, వేరే విమానంలో అక్కడికి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ ఒకరు నానాదుర్భాషలాడుతూ తనపై చేయిచేసుకున్నారని, పక్కనే ఉన్న తన కూతురు ఈ ఘటన చూసి షాక్‌కు గురైందని అంకిత్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చూశాకనే తమకు తెలిసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై విమానాశ్రయం అధికారులు, ఎయిరిండియా సిబ్బందితోపాటు బాధితుడి నుంచి కూడా ఫిర్యాదు రాలేదని వివరించారు. ఒక వేళ వస్తే, ఘటనకు దారి తీసిన పరిస్థితులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా ఉండగా, ప్రయాణికుడిపై దాడి చేసినట్లుగా భావిస్తున్న పైలట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించామని ఎయిరిండియా తెలిపింది. అంతర్గత దర్యాప్తు చేపట్టామని పేర్కొంది. కాగా, ఆరోపణలను ఎదుర్కొంటున్న పైలట్..ఘటన అనంతరం ఇండిగో విమానంలో బెంగళూరు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
ఎయిరిండియా టికెట్‌కు రూ. 4 లక్షలు వెచ్చించా, ఫుడ్ వ్లాగర్ వింత అనుభవం
బిజినెస్క్లాస్లో దర్జాగా ప్రయాణించాలని చాలా విమాన ప్రయాణికులు ఆశపడతారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలలో లాంగ్ జర్నీ చేసేవారికి సౌకర్యవంతమైన సీట్లు చక్కటి ప్లేస్, ఆహారం ఇలా కొన్ని ప్రత్యేక సదుపాయాలుంటాయి. ఇది కేవలం సుదూర గమ్యస్థానాన్ని చేరుకోవడం గురించి మాత్రమే కాదు మంచి ప్రయాణ అనుభవాన్ని కూడా ఇస్తుందని భావిస్తారు. ముఖ్యంగా ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కోవంటి అల్ట్రా-లాంగ్ రూట్లలో సౌకర్యాలపై అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే టికెట్ల ధర లక్షల్లో ఉంటుంది. అందులోనూ ఎయిరిండియా లాంటి విమానాలలో టికెట్ కోసం లక్షలు ఖర్చు చేసినప్పుడు, ఎవరైనా ప్రీమియం ఫీచర్స్‌నే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఫుడ్ బ్లాగర్ తనకెదురైన చేదు అనుభవాన్ని గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.పాపులర్ ఫుడ్ వ్లాగర్ పవిత్రా కౌర్ ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లేందుకు ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించింది. ఈ ప్రయాణంలో తనకెదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది తన యూట్యూబ్ వీడియోలో. ఈ జర్నీకి 10- 6 రేటింగ్ ఇచ్చింది. వరుసగా తన అనుభవానాలకు ఏకరువు పెట్టింది. తొలుగ ఫస్ట్ సీట్ అస్సలు బాగాలేదని, తరువాత రెండో సీట్లోకి మారినా కూడా పరిస్థితిలాగే ఉందని నిరాశను వ్యక్తం చేసింది. ఇందు కోసమా తాన టికెట్‌కు రూ. 4లక్షలకు ఖర్చు చేశానని వాపోయింది.విమానంలో ఆహారంపైకూడా పెదవి విరించింది. మంచి నిద్ర తరువాత బాగాతిందామని ఎదురుచూస్తే నిరాశే మిగిలిందనీ, మెయిన్ కోర్స్ తప్ప మిగతాది అస్సలు బాగాలేదని తెలిపింది. డెజర్ట్స్ అయితే దారణమని వ్యాఖ్యానించింది. అయితే డ్రింక్స్, షాంపైన్ మాత్రం బావున్నాయని చెప్పింది. అంతేకాదు తాను తినకపోవడం ఇదే మొదటిసారి అయిఉండాలని కూడా తెలిపింది. ఇక శుభ్రత మరొక బాధాకరమైన విషయమని పేర్కొంది. తన సీటుపై అక్షరాలా రెండు చచ్చిన ఈగల్ని చూశానని ఫిర్యాదు చేసింది. ఎందుకు? ఇలా అని ప్రశ్నించింది.అయితే దటీజ్ ఎయిరిండియా అంటూనే కంఫర్ట్ పరంగా, సీట్లు, సౌకర్యవంతంగా ఉన్నాయని ఆమె అంగీకరించింది. బాగా నిద్రపోయానని వెల్లడించింది. తనకు వేరే మార్గం లేదని, అందుకే ఈ ఎయిరిండియావిమానంలో ప్రయాణించానని తెలిపింది. కానీ ఇన్ని ఫిర్యాదులున్నప్పటికీ ఎయిరిండియా ప్రయాణం అనుకున్నదానికంటే బావుంది అంటూ కితాబివ్వడం విశేషం. అయితే ఈ ఆరోపణలపై ఎయిరిండియా అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. -
గన్నవరం: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
గన్నవరం: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. గురువారం(డిసెంబర్ 18వ తేదీ) రాత్రి గం. 8.10ని.లకు టేకాఫ్ కావాల్సిన విమానం.. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. టేకాఫ్ అవుతున్న సమయంలోనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, ఈరోజు ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుండి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX 398)లో గురువారం ఉదయం సమస్య ఏర్పడటంతో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.ఎయిరిండియా విమానం కోజికోడ్‌కు వెళ్తుండగా, కుడి వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్, టైర్లో సమస్య ఏర్పడింది. దాంతో వెంటనే విమానాన్ని కొచ్చి వైపు మళ్లించి ఉదయం 9 గంటల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ నిర్వహించారు.ఇదీ చదవండి:ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
కొచ్చి: ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుండి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX 398)లో గురువారం ఉదయం సమస్య ఏర్పడటంతో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఎయిరిండియా విమానం కోజికోడ్‌కు వెళ్తుండగా, కుడి వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్, టైర్లో సమస్య ఏర్పడింది. దాంతో వెంటనే విమానాన్ని కొచ్చి వైపు మళ్లించి ఉదయం 9 గంటల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ నిర్వహించారు. CIAL (Cochin International Airport Limited) ప్రకటన ప్రకారం.. అన్ని అత్యవసర సేవలను ముందుగానే సిద్ధం చేసి, ల్యాండింగ్‌ను విజయవంతంగా సులభతరం చేశారు. ల్యాండింగ్ తర్వాత చేసిన తనిఖీలో కుడి వైపున ఉన్న రెండు టైర్లు పగిలిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎటువంటి గాయాలు జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం రన్‌వేను క్లియర్ చేసి, సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఏవియేషన్ డే: ఇండిగో తరహా సంక్షోభాలు మున్ముందు ఎదురైతే..
భారత్‌లోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలు నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన సేవలు ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో వేల మంది ప్రయాణికుల మీద ప్రభావం చూపుతోంది. పర్యాటకులతో పాటు వ్యాపార, వ్యక్తిగత, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న వారికి అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకంగా పెళ్లిళ్లూ రద్దవుతున్నాయి. దీంతో, ఇండిగో యాజమాన్యం తీరుపై జనం నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని సగటు ప్రయాణికుడు ప్రశ్నిస్తున్నాడు..అయితే, ఇండిగో తన దగ్గర ఉన్న పరిమిత సిబ్బంది, పైలెట్లతోనే పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. తక్కువ ధరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఈ సంస్థ రాత్రి పూట నడిపే సర్వీసులు సైతం అధికంగా ఉన్నాయి. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 63% మందిని ఈ సంస్థ చేరవేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో విమానయాన సంస్థలు సైతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.పౌర విమానయాన రంగంలో కీలక సవాళ్లు..1. అధిక ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ఖర్చులుభారతదేశంలో ATF ధరలు GST పరిధిలోకి రాకపోవడంతో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. విమానయాన నిర్వహణ ఖర్చులలో ఇంధన వాటా 30–40% ఉంటుంది. దీనివల్ల టిక్కెట్లు ఎక్కువగా ఉన్నాయి. మార్జిన్లు తక్కువగా ఉంటాయి. ఇంధన ఖర్చులను తగ్గించడానికి పరిశ్రమ చాలా కాలంగా ATFని GST కింద చేర్చాలని డిమాండ్ చేస్తోంది.2. మౌలిక సదుపాయాల అడ్డంకులుదేశ ప్రయాణీకుల రద్దీ ప్రతీ ఏటా పెరుగుతోంది. 120 మిలియన్ల నుండి 236 మిలియన్లకు పెరిగింది. విమానాశ్రయాలు కూడా 74 నుండి దాదాపు 160కి రెట్టింపు అయ్యాయి. ఎయిర్‌పోర్టుల విస్తరణ ఉన్నప్పటికీ ప్రధాన విమానాశ్రయాలలో (ఢిల్లీ, ముంబై, బెంగళూరు) రద్దీ మాత్రం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ప్రాంతీయ కనెక్టివిటీ (UDAN పథకం) విస్తరిస్తున్నప్పటికీ చిన్న విమానాశ్రయాలు నిధులు, కార్యాచరణ అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. చిన్న విమానయాన సంస్థలు మనుగడ కోసం కష్టపడుతున్నాయి3. స్థిరత్వం, కార్బన్ నియమాలు2027 నుండి ICAO యొక్క CORSIA కార్బన్ ఆఫ్సెట్ పథకాన్ని భారతదేశం పాటించాలి. ప్రభుత్వం స్థిరమైన విమాన ఇంధనం (SAF) మిశ్రమ లక్ష్యాలను నిర్దేశించింది. కానీ SAF ఖరీదైనది, పరిమితమైనంది. లాభదాయకతను సమతుల్యం చేస్తూ ఉద్గారాలను తగ్గించడానికి విమానయాన సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.4. సైబర్ భద్రతా ప్రమాదాలుఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన GPS స్పూఫింగ్ సంఘటనలు నావిగేషన్ వ్యవస్థలలోని భద్రతలేమిని హైలైట్ చేశాయి. డిజిటల్ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ బెదిరింపులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి భారత్ GNSS సలహాదారులను, మెరుగైన పర్యవేక్షణను అమలు చేస్తోంది.5. పైలట్ల కొరత.. దేశంలో ముఖ్యంగా పైలట్ల కొరత అధికంగా ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలెట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.పరిష్కారాలు..దేశంలో కొత్త ఫ్లయింగ్ అకాడమీలు ఏర్పాటు చేయడంపైలట్ శిక్షణలో PPP మోడల్ ప్రవేశపెట్టడంFDTL (Flight Duty Time Limit) నియమాలను శాస్త్రీయ డేటా ఆధారంగా తయారు చేయడం. పైలట్లకు వెల్నెస్ ప్రోగ్రామ్‌లు, ఫ్యాటిగ్ మానిటరింగ్ సిస్టమ్లుపైలట్ శిక్షణ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలిఎయిర్లైన్స్ సిబ్బంది ప్లానింగ్‌లో AI ఆధారిత షెడ్యూలింగ్ ఉపయోగించాలిఎయిర్లైన్స్కు స్లాట్ మేనేజ్మెంట్ కఠినంగా అమలు చేయడంవాతావరణ అంచనాల కోసం అధునాతన మెటీరియాలజీ సిస్టమ్‌లు ఏర్పాటు చేయడంప్రయాణికులకు రియల్-టైమ్ సమాచారం అందించే యాప్‌లు తీసుకురావాలి. విమాన సర్వీసుల రద్దులపై పెనాల్టీ మెకానిజం తీసుకురావడం. ఎయిర్‌లైన్స్ బ్యాకప్ క్రూ & బ్యాకప్ విమానాల వ్యవస్థను కలిగి ఉండాలి. చిన్న ఎయిర్‌లైన్స్‌కు పన్ను రాయితీలు ఇవ్వాలి.మల్టీ-రన్‌వే ఎయిర్‌పోర్ట్‌లు అభివృద్ధి చేయాలి. మెట్రో నగరాల్లో సెకండరీ ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు చేయాలి. కార్గో టెర్మినల్‌లను ఆధునీకరించాలి. ఎయిర్‌పోర్ట్‌లలో సోలార్ ఎనర్జీ వినియోగం.ఎఫ్డీటీఎల్ నిబంధనలు..డీజీసీఏ 2024 జనవరిలో కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను జారీ చేసింది. మొదటి దశ నిబంధనలు 2025 జులై నుంచి అమలవుతున్నాయి. రెండో దశ నిబంధనలను నవంబరు 1 నుంచి పాటించాల్సి వచ్చింది. ఈ నిబంధనలు ప్రధానంగా పైలెట్లు, కేబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతి నివ్వడం, రాత్రి డ్యూటీలకు సంబంధించినవే. పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంపు.రాత్రి ల్యాండింగ్ పరిమితులు వారానికి ఆరు నుంచి రెండుకు కుదింపు.‘రాత్రి గంట’లకు కొత్త నిర్వచనం ఇచ్చారు. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకూ సమయాన్ని రాత్రి గంటలుగా పేర్కొన్నారు. పైలెట్లకు వరుసగా రెండు రాత్రి డ్యూటీలు మాత్రమే వేయాలి. విమానయాన సంస్థలు తప్పనిసరిగా అలసట నివేదికలను మూడు నెలలకోసారి సమర్పించాలి.ఇండిగో ఏం చేసింది..మొదటి దశ నిబంధనల్లో ముఖ్యమైనదైన పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి గంటల పెంపు అంశాన్ని ఇండిగో తేలికగానే అమలు చేసింది. రెండోదశలో, రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి ఆరు నుంచి రెండుకు తగ్గించడాన్ని అమలు చేయాల్సి రావడంతో ఇండిగోకి ఇబ్బంది తలెత్తింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో పోల్చితే, తన సిబ్బందితో ఎంతో ఎక్కువ గంటలు పనిచేయిస్తుంది. అందుకే రాత్రి పూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి. ఇండిగోతో పోల్చితే ఎయిర్ ఇండియా సగం విమాన సర్వీసులే నిర్వహిస్తోంది. కొత్త నిబంధనల ఫలితంగా పైలెట్లు, సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబరులోనే 755 విమాన సర్వీసులు రద్దు చేసింది. ఈనెలలో రోజూ వేల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. దీంతో, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సమగ్ర సంస్కరణలు అవసరం..భారత్ ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌ను కలిగి ఉంది. కోవిడ్ కారణంగా దేశీయంగా మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ కొద్దినెలలుగా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ రవాణా కోవిడ్‌కి ముందు స్థాయిలను చేరుకుంటోంది. భారత పౌర విమానయాన రంగం కేవలం రవాణా వ్యవస్థ కాదు. ఇది దేశ ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ సమగ్రత, గ్లోబల్ కనెక్టివిటీకి ఎంతో కీలకం. సవాళ్లు ఉన్నప్పటికీ, సమగ్ర సంస్కరణలు, సాంకేతిక ఆధునీకరణ, పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తే భారత విమానయాన రంగం స్థిరమైన, సమర్థవంతమైన, ప్రపంచ స్థాయి వ్యవస్థగా మారుతుంది. భారత విమానయాన రంగం ప్రస్తుతం మార్పు దశలో ఉంది. సవాళ్లను అవకాశాలుగా మార్చే విధాన దృక్పథం, పోటీని ప్రోత్సహించే మార్కెట్ నిర్మాణం, ప్రయాణికుల కేంద్రిత సేవలు ఈ రంగాన్ని మరింత బలపరుస్తాయి. సమర్థవంతమైన నియంత్రణ, పారదర్శకత, దీర్ఘకాలిక ప్రణాళికలతో భారత పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదు. భవిష్యత్ విమానయాన రంగం పర్యావరణ అనుకూలత, ఇంధన సామర్థ్యం, హరిత సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా భారత్ ముందడుగు వేస్తే, స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుంది. ప్రయాణికులకు భరోసా ఉంటుంది. -
విమానంలో బాంబు పెట్టామంటూ మెయిల్: అధికారులు అలర్ట్
ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయగా.. దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజీని ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ విమానంలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. -
నా గుండె పగిలింది
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో తన సితార్ ధ్వంసం కావడంపై అంతర్జాతీయ సంగీతకారిణి అనౌష్క శంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో తన ప్రియమైన సితార్ ధ్వంసం కావడంతో ఆమె భగ్గుమన్నారు. ‘ఒక భారతీయ వాయిద్యానికి కూడా ఈ దేశపు విమాన సంస్థలో భద్రత లేదా?’.. అంటూ సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. పదిహేనేళ్ల తన కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం, తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సంగీత ప్రియులను కలచివేసింది. విలువైన సితార్ దిగువ భాగంలో ఏర్పడిన లోతైన పగులును ఆమె చూపించారు. ‘నా సితార్ శృతి తప్పిందేమోనని ముందు భావించాను. వాయించడానికి తీసుకున్నప్పుడే ఈ దారుణం తెలిసింది’.. అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చాలా కాలం తర్వాత ఎయిర్ ఇండియాను ఎంచుకున్నాను. నా వాయిద్యానికే ఇలా ఎందుకు జరిగింది? ప్రత్యేక హార్డ్–కేసులు ఉన్నా, హ్యాండ్లింగ్ రుసుములు వసూలు చేసినా ఇంత దారుణమైన నిర్లక్ష్యమా?’.. అని ఆమె నిలదీశారు. పరిశీలిస్తున్నామన్న ఎయిర్ ఇండియా అనౌష్క తన విమాన వివరాలను, ఎక్కడ దిగారనేది చెప్పనప్పటికీ, ఎయిర్ ఇండియా ప్రతినిధి గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘మా అతిథి అనుభవించిన బాధకు చింతిస్తున్నాం. ఈ వాయిద్యం సాంస్కృతిక ప్రాధాన్యం మాకు తెలుసు’.. అని పేర్కొన్నారు. నష్టానికి గల కారణాలను నిర్ధారించలేకపోతున్నామని చెప్పిన సంస్థ, ఢిల్లీ విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీతో సహా సమగ్ర విచారణ ప్రారంభించినట్లు తెలిపింది. భారత్ పర్యటనకు ముందే.. జనవరి 30న హైదరాబాద్‌తో ప్రారంభం కానున్న తన భారత పర్యటనకు అనౌష్క శంకర్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం పలువురు కళాకారుల్ని కలచివేసింది. ఈ సంఘటన హృదయ విదారకమని ప్రముఖ కళాకారులు జాకిర్ ఖాన్, విశాల్ దడ్లాని పేర్కొన్నారు. గాయకుడు పాపోన్ స్పందిస్తూ, ‘ఈ రోజుల్లో శ్రద్ధ కరువైంది. అసలు శ్రద్ధ అనే భావమే కనుమరుగైందేమో! ఇది విచారకరం’.. అంటూ ఎయిర్ ఇండియా తీరుపై మండిపడ్డారు. గతంలోనూ ప్రయాణ సమస్యలు 44 ఏళ్ల శంకర్ గత ఏడాది కూడా ప్రయాణ సమస్యలను ఎదుర్కొన్నారు. ఆమె తన యూరోపియన్ టూర్ చివరి షో కోసం బెర్లిన్‌లో ఉన్నప్పుడు, దుస్తులు, వాయిద్యానికి అవసరమైన ’మిజ్రాబ్స్’ (వేళ్లకు ధరించే ఫిక్సŠడ్ పికర్స్) ఉన్న లగేజీని పోగొట్టుకున్నారు. పదేపదే తప్పిదాలా? సంగీత కళాకారులకు ఇలాంటి చేదు అనుభవాలు కొత్తేమీ కాదు. 2010లో సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ వాయిద్యం ఎయిర్ ఇండియాలో దెబ్బతినగా, 2019లో పండిట్ శుభేంద్ర రావు సితార్ కూడా ఈ సంస్థ విమానంలోనే దెబ్బ తింది. తాజా ఘటనతో, విమానయాన సంస్థలు కళాకారుల విలువైన వాయిద్యాల భద్రత విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మరోసారి తెరపైకి వచ్చింది. -
ప్రయాణికులకు చుక్కలు చూపిన ఎయిరిండియా!
ఎయిరిండియా విమానయాన సంస్థ తన ప్రయాణికులకు చుక్కలు చూపించింది. పలు ఎయిర్‌పోర్టులలో పడిగాపులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితికి వివరణ ఇస్తూ ఎయిర్‌లైన్స్ తర్వాత ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చింది. మంగళవారం సాయంత్రం తర్వాత పలు ఎయిర్‌పోర్టులలో ఎయిరిండియా ప్యాసింజర్ల చెక్ ఇన్ను అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో క్యూ లైన్లలో ప్రయాణికులు చాలాసేపు ఎదురు చూశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇది చోటు చేసుకుందని ఆ తర్వాత ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. థర్డ్ పార్టీ సిస్టమ్‌లో సమస్య కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని.. ఆ సమస్యను పరిష్కరించామని.. ఇప్పుడంతా సర్వసాధారణ పరిస్థితి నెలకొందని.. రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. #UpdateThe third-party system has been fully restored, and check-in at all airports is functioning normally. All our flights are operating as per schedule.We thank our passengers for their understanding.— Air India (@airindia) December 2, 2025ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్24 ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు ఆలస్యం కాగా.. మరికొన్ని పూర్తిగా రద్దయ్యాయి. ఇదిలా ఉంటే.. కిందటి నెలలోనూ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో టెక్నికల్ ఇష్యూ తలెత్తి సుమారు 800 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దానికి కొన్ని రోజులముందు జీపీఎస్ స్పూఫింగ్ (GPS spoofing) జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ స్పూఫింగ్ నిజమేనని, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) మార్చేందుకు యత్నాలు జరిగినట్టు కేంద్రం ధ్రువీకరించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. సోమవారం రాజ్యసభలో పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు.నేవిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ అంటారు. నిజమైన శాటిలైట్ సిగ్నల్స్‌ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్‌ను తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా.. ప్రస్తుతమున్న ప్రదేశం, సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. పౌర విమానాలే లక్ష్యంగా అంతర్జాతీయ రూట్లలో ఈ తరహాలో జరిగిన సైబర్ దాడులు తరచూ వెలుగుచూస్తున్నాయి. దేశంలో నవంబర్ 2023- ఫిబ్రవరి 2025 మధ్యకాలంలో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు నమోదైనట్లు అంచనా. -
క్రాష్ తర్వాత ఎయిరిండియా కొత్త ఆశలు
వచ్చే ఏడాది (2026) ఆఖరు నాటికి కొత్తగా 26 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ (Air India CEO Campbell Wilson) వెల్లడించారు. అలాగే అప్‌గ్రేడ్ చేసిన విమానాలతో 81 శాతం ఇంటర్నేషనల్ సర్వీసులను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. అయితే, మొత్తం మీద విమాన ప్రయాణికుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వివరించారు.‘ఏఐ 171 క్రాష్ కావచ్చు లేదా ఇతరత్రా పరిస్థితులు కావచ్చు గత కొద్ది నెలలుగా ఎదురైన ప్రతికూలతలు ఎలా ఉన్నా, 2026లో ఎయిరిండియాలో సుస్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మేము పెట్టుబడుల ప్రణాళికలను కొనసాగిస్తున్నాం‘ అని విల్సన్ చెప్పారు. ‘కొత్త విమానాలు వస్తున్నా, కొన్ని విమానాలను లీజుదార్లకు తిరిగి ఇచ్చేయనుండటం, చాలా మటుకు విమానాలకు రెట్రోఫిట్ చేస్తుండటం వల్ల వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్యాపరంగా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు.ఎయిరిండియా గ్రూప్‌లో ప్రస్తుతం 300 విమానాలు (ఎయిరిండియాకి 187, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కి 110 విమానాలు) ఉన్నాయి. ఎయిరిండియా వద్ద సుదీర్ఘ దూరాలకు ప్రయాణించగలిగే బోయింగ్ 777 విమానాలు 22, అలాగే బోయింగ్ 787 రకం విమానాలు 32 ఉన్నాయి. వచ్చే ఏడాది ఎయిరిండియాకు 20 చిన్న విమానాలు, 6 పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తాయని విల్సన్ చెప్పారు. 2026 ఆఖరు నాటికి బోయింగ్ 787 విమానాల్లో మూడింట రెండొంతుల ఎయిర్‌క్రాఫ్ట్‌లు అప్‌గ్రేడ్ అవుతాయని వివరించారు. -
ఇండియాకు బూడిద మేఘాలు : డీజీసీఏ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: Ethiopia volcano eruption: ఇథియోపియాలో అకస్మాత్తుగా పేలిన బాంబుల అగ్నిపర్వత విస్ఫోటనం ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతిని రేపింది.దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఉన్నహేలీ గుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తర్వాత పేలింది. దీంతో దాదాపు 14 కి.మీ (45,000 అడుగులు) ఎత్తులో పెద్ద బూడిద మేఘాన్ని ఉత్పత్తి చేసి ఎర్ర సముద్రం మీదుగా తూర్పు వైపు వ్యాపించింది. ఫలితంగా సమీపంలోని పర్యాటక ఆకర్షణ అయిన అఫ్దేరా గ్రామం బూడిదలో కూరకుపోయింది. అగ్నిపర్వతం పేలిన తర్వాత తనకు పెద్ద శబ్దం వినిపించిందని, దానిని షాక్ వేవ్ అని అభివర్ణించానని అఫర్ ప్రాంత నివాసి అహ్మద్ అబ్దేలా అన్నారు.ఇది ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా యెమెన్, ఒమన్, పాకిస్తాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపైకి కదులుతోంది. అసలే కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరం ఢిల్లీని కూడా తాకవచ్చని వాతావరణ (IMD) నిపుణులు అంచనా. బూడిద మేఘాలు ఇండియా మీదుగా చైనా వైపు పయనిస్తాయని, మంగళవారం రాత్రి 7.30 గంటలకు భారతదేశ గగనతలం నుండి నిష్క్రమిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవి గుజరాత్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్, పంజాబ్ మరియు హర్యానాపై తాకవచ్చని, దీంతో అక్కడి కాలుష్య నాణ్యత మరింత దిగజారిపోవచ్చని IMD తెలిపింది.DGCA కీలక ఆదేశాలువిమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింంది. అగ్నిపర్వత బూడిద ప్రభావిత ప్రాంతాలు , విమాన ఎత్తులను ఖచ్చితంగా నివారించాలని అత్యవసర కార్యాచరణ హెచ్చరికను జారీ చేసింది. విమాన ప్రణాళిక, రూటింగ్ , ఇంధన పరిగణనలను తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలని సంస్థలను కోరింది. "ఇంజిన్ పనితీరు క్రమరాహిత్యాలు లేదా క్యాబిన్ పొగ/వాసనతో సహా" ఏదైనా అనుమానిత బూడిద సంఘటనను వెంటనే నివేదించాలని విమానయాన సంస్థలకు ఆదేశించింది.ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!ముందు జాగ్రత్తగా ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ తమ విమానాలను రద్దు చేశాయి. కొన్ని ప్రదేశాలకు ఎయిరిండియా సోమ, మంగళవారం 11 విమానాలను రద్దు చేసింది. అలాగే జెడ్డా, కువైట్ ,అబుదాబి వంటి మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రదేశాలకు షెడ్యూల్ చేసిన విమానాలను అకాసా రద్దు చేసింది. -
Air India Crash: ‘పైలట్‌ను నిందించొద్దు’: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గత జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన కేసులో కేంద్ర ప్రభుత్వానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీసీసీఏ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ కోరుతూ ఎయిర్ ఇండియా పైలట్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందిస్తూ, సుప్రీం కోర్టు ఈ నోటీసు జారీ చేసింది. పైలట్ తండ్రి.. ఈ ఘటనకు సరైన కారణాన్ని గుర్తించేందుకు, జవాబుదారీతనం నిర్ధారించేందుకు స్వతంత్ర దర్యాప్తును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చి , జె సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం.. విమాన ప్రమాదంపై తప్పుడు నివేదికలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషాద సంఘటనకు పైలట్‌ను బాధ్యుడిని చేస్తూ, నిందించకూడదని ధర్మాసనం పేర్కొంది. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి బాధ్యుడంటూ పైలట్‌ను నిందించకూడదు. ఇది ఒక విషాద ఘటన. ప్రాథమిక నివేదికలో పైలట్ వైపు నుండి ఎటువంటి తప్పు లేదని తేలింది. ఇటువంటి తప్పుడు నివేదికలు రూపొందించకూడదు. ఇటువంటి ఘటనలపై పరిశోధించేందుకు నిర్థిష్ట నిబంధనలున్నాయని జస్టిస్ బాగ్చి అన్నారు. దివంగత పైలట్ తండ్రి, పిటిషనర్ వ్యక్తం చేసిన బాధను, న్యాయమైన దర్యాప్తు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ మాట్లాడుతూ, ‘నియమం 11 అనేది ప్రమాదాలకు సంబంధించినది. నిబంధన తొమ్మిది ప్రకారం ప్రాథమిక దర్యాప్తు మాత్రమే నిర్వహించారు. మేము స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నాం. ఈ విమాన ప్రమాదంపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిగేలా చూడాలని’ కోర్టును కోరారు.2025, జూన్ 12న మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా మొత్తం 265 మంది మృతి చెందారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కన్నుమూశారు.ఇది కూడా చదవండి: వీధి కుక్కల కేసు: ‘సుప్రీం’ కీలక ఆదేశాలు -
Air India survivor: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం..
జూన్ 12న అహ్మదాబాద్‌లో టేకాప్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేశ్..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆ రోజు తానెలా బతకాననేది ఒక అద్భుతం కానీ ఇవాళ అదొక పీడకలలా వెంటాడుతోందని ఆవేదనగా చెబుతున్నాడు. ప్రమాద ఘటన అనంతరం బ్రిటన్‌లో నివాసం ఉంటున్న ఆయన.. స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో అతడి హృదయ విదారక పరిస్థితి వెలుగులోకి వచ్చింది. లక్కీమ్యాన్ కాదు..అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ఇండియా ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడిగా రమేశ్ వార్తల్లో నిలిచారు. బ్రిటన్‌లో నివాసముంటున్న విశ్వాస్ కుమార్.. గుజరాత్‌లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు విమానంలో 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి అంబులెన్సు ఎక్కిన దృశ్యాలు ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అంత పెద్ద ప్రమాదంలో బయటపడ్డ లక్కీమ్యాన్‌గా అందరూ అతన్నిచూస్తుంటే..ఆయన మాత్రం రోజు రోజుకి కుంగిపోతున్నాడు. నిత్య నరకం అనుభవిస్తున్నా అంటూ కన్నీటిపర్యంతమవుతున్నాడు. ఆ ప్రమాదం కారణంగా తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడిని కోల్పోయా..అని బోరుమన్నాడు. ఆ తర్వాత తన జీవితమే తలకిందులైపోయిందని, తన సోదరుడితో కలిసే చేసిన వ్యాపారం కూడా మూతపడిందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తాను తిరిగి నార్మల్‌గా అవ్వడం అంత సులభం కాదని అంటున్నాడు. ఆ ఘటన తర్వాత నెలలతరబడి మౌనంగా ఉన్నట్లు తెలిపాడు. తానెప్పుడు ఇంటిని వదలి బయటకు వెళ్లడం లేదని, బెడ్రూంలోనే ఒంటిరిగా కూర్చొని ఉంటానని. తనకోసం తలుపు బయట అమ్మ కూర్చొని ఉంటుందని చెబుతున్నాడు. కనీసం తన కొడుకుతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. భరించలేని మానసిక గాయంతో బాధపడుతున్నాని చెబుతున్నాడు. ఇంకా శారీరక అసౌక్యర్యాన్ని ఎదుర్కొటున్నట్లు వివరించాడు. భార్య సాయం లేనిదే కనీసం..తన మోకాలు, భుజం, వెన్ను నొప్పి తోపాటు చేతికి అయ్యిన కాలిన గాయాలతో బాధపడుతున్నానని, భార్య సాయం లేనిదే స్నానం కూడా చేయలేకపోతున్నట్లు బాధగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా, లండన్ లీసెస్టర్ కమ్యునిటీ నాయకుడు, సంజీవ్ పటేల్, అతని సలమాదారు, ప్రతినిధి రాడర్ సీగర్‌లు కూడా తమ వంతుగా రమేష్‌కి మద్దతు అందిస్తున్నామని అన్నారు. అలాగే ఎయిర్ ఇండియా కూడా రమేష్‌కు సుమారు రూ. 21 లక్షల పరిహారం అందించిందని తెలిపారు. అతనికి ఇప్పుడు ఆర్థిక సాయంతోపాటు మానసిక స్థైర్యం, భరోసా అందించాలని అన్నారు. అదే అతడిని తిరిగి కోలుకునేలా చేయగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా సైతం రమేష్‌కు అవసరమైన సహాయాన్ని అందించడం తమ బాధ్యత అని పేర్కొనడం విశేషం.#WATCH | New video shows miracle survivor from seat 11A walking away from Ahmedabad plane crash site.More news & updates ▶️https://t.co/cetvZaId2H#AirIndiaPlaneCrash #AhmedabadPlaneCrash pic.twitter.com/QdcZJNqef6— Hindustan Times (@htTweets) June 16, 2025 (చదవండి: భారత్‌పై జర్మన్ పర్యాటకుడి ప్రశంసల జల్లు...!) -
హైదరాబాద్-విశాఖ విమానం ‘యూటర్న్’
సాక్షి, విశాఖ: మోంథా తుపాను(Cyclone Montha) ప్రభావంతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రవాణా వ్యవస్థపైన కూడా ప్రభావం చూపింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులు నిలిచిపోగా.. తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ కాకుండానే తిరిగి వచ్చేసింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరింది. ఈ క్రమంలో విశాఖలో ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ కాలేదు. దీంతో, ఎయిర్‌పోర్టు అధికారులు విమానాన్ని తిరిగి హైదరాబాద్‌కు పంపారు. అనంతరం, హైదరాబాద్ విమానం సేఫ్‌గా ల్యాండింగ్ అయ్యింది. ఈ క్రమంలో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. మోంథా తుపాను (Cyclone Montha) ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. రద్దయిన వాటిలో విశాఖపట్నం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 3 విమానాలు ఉన్నాయి. -
Air India: ‘బొద్దింకను చనిపోయే వరకు ఉరితీశారు’
ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 24 (శుక్రవారం)ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఏఐ315 ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు బొద్దింకను చంపాడు. తన సీటు వద్ద కనిపించిన కాక్రోచ్‌ను ప్రయాణికుడు చంపిన ఘటనను విమాన సిబ్బంది లాగ్‌బుక్‌లో నమోదు చేశారు. అందులో ‘కాక్రోచ్ ఎగ్జిక్యూషన్’ అంటే బొద్దింకను చనిపోయే వరకు ఉరి తీశారు అని పేర్కొన్నారు. అంతే ఈ లాగ్‌బుక్ ఘటన నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘కాక్రోచ్ ఎగ్జిక్యూషన్’ అనే పదాన్ని ఉపయోగించడం నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది. An entry in Air India’s cabin defect log recorded that a live cockroach was discovered by a passenger. The rectification note wryly mentioned that the matter was dealt with… conclusively.Khalaas, Dubai style pic.twitter.com/sifW6NNtG5— Jagriti Chandra (@jagritichandra) October 25, 2025ఈ ఘటనపై నెటిజన్లు ఎగ్జిక్యూషన్ అనే పదాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు స్మైలీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. మరికొ మరికొందరు విమానంలో హైజీన్ స్టాండర్డ్స్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. ఎయిరిండియా విమానం అధికారికంగా ఈ ఘటనపై స్పందించలేదు. అయితే, విమానాల్లో శుభ్రత, హైజీన్ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విమానంలో లాగ్‌బుక్ విమానంలో లాగ్‌బుక్ (Logbook) అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది విమాన సిబ్బంది, పైలట్లు, మైంటెనెన్స్ టీమ్ కోసం ఉపయోగపడే అధికారిక రికార్డు. విమానంలో ఏదైనా సమస్య (ఉదాహరణకు: లైట్స్ పని చేయకపోవడం, సీటు సమస్య, బొద్దింక కనిపించడం) ఉంటే, దాన్ని లాగ్‌బుక్‌లో రాసి మైంటెనెన్స్ టీమ్‌కు తెలియజేస్తారు.ప్రతి చిన్న సమస్యను నమోదు చేయడం వల్ల..తదుపరి ప్రయాణానికి ముందు వాటిని పరిష్కరిస్తారు. -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ: నాగ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ466 విమానానికి పెను ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. ఇంజన్లో సౌండ్ రావడంతో గుర్తించిన పైలట్.. విమానాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మళ్లించారు. నాగ్‌పూర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసిన అనంతరం విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. విమాన మరమ్మతులకు అధిక సమయం అవడంతో రద్దు చేసినట్లు వెల్లడించారు.మరో వైపు, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా రెండు ఇండిగో విమానాలను దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన రెండు విమానాలు గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. పశ్చిమ బెంగాల్, బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. -
Italy: ఎయిర్ ఇండియా షాక్.. దీపావళి ప్రయాణాలు వాయిదా!
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న పలువురు భారతీయులు దీపావళి పండుగకు స్వదేశానికి వస్తుంటారు. ఇందుకోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాకిచ్చింది. కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొందామనే సంతోషంలో ఉన్న ప్రవాస భారతీయుల ఆశలపై ఎయిర్ ఇండియా నీళ్లు జల్లింది.దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ఇటలీ నుండి భారతదేశానికి బయలుదేరిన వందలాది మంది ప్రయాణికులు తాము శుక్రవారం ఎక్కాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయ్యిందని తెలియడంతో షాక్‌నకు గురయ్యారు. తదుపరి విమానం సోమవారం(దీపావళి) లేదా ఆ మర్నాడు(మంగళవారం) బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. Hundreds of passengers returning for Diwali break left stranded after Air India’s flight from Milan to Delhi on Oct 17 (AI 138) is cancelled due to a technical glitch. Return now scheduled for four days later. Some were taken to a hotel, where they were later asked to leave.… pic.twitter.com/8LcmrocBfX— Jagriti Chandra (@jagritichandra) October 18, 2025సాంకేతిక సమస్య కారణంగా మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.‘ఎయిర్ ఇండియా.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని, షెడ్యూల్ చేసిన విమానంలో సాంకేతిక సమస్య కారణంగా కారణంగా.. 2025, అక్టోబర్ 17న మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యింది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ విమానంలో ఎక్కాల్సిన ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించామని, విమానాశ్రయం సమీపంలోనే వారికి ఈ ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.‘ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలతో సీట్ల లభ్యత ఆధారంగా 2025, అక్టోబర్ 20 లేదా ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమానాలలో ప్రయాణికులు తిరిగి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ భోజనంతో సహా అవసరమైన అన్ని సహాయాలను ఎయిర్ ఇండియా అందిస్తుంది. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఎయిర్ ఇండియా నిబద్ధత కలిగివుంటుందని పునరుద్ఘాటిస్తున్నాం’ అని ప్రతినిధి పేర్కొన్నారు. -
మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
ముంబై: విమానాల్లో వరుస సమస్యలు ఎయిర్ ఇండియాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా గురువారం ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో దుబాయ్‌లో సురక్షితంగా దించినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్‌పీఐ) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమానం కూడా బోయింగ్ 787 రకానికి చెందినదే. ఈ నెల 4న బర్మింగ్‌హామ్ వెళ్తుండగా ఇదే రకం విమానంలో ఉన్నట్లుండి అత్యవసర ర్యాట్ తెరుచుకుంది. తాజాగా అదే రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. అయితే, ఆ సమస్యలు ఏమిటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. కానీ, ఎఫ్ఐపీ మాత్రం ఆ విమానంలో ఆటోపైలట్, ఇన్స్ట్రుమెంట్ లాండింగ్ సిస్టమ్స్ (ఐఎల్ఎస్), ఫైట్ డైరెక్టరేట్స్ (ఎఫ్‌డీస్) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి కీలక వ్యవస్థలన్నీ చెడిపోయాయని ఆరోపించింది. -
‘ఎయిరిండియా బోయింగ్ 787 విమానాల్ని నిలిపేయండి’
సాక్షి,న్యూఢిల్లీ: ఒక్కో విమాన ప్రయాణం వెనుక ఉన్న భద్రతా ప్రమాణాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఎయిరిండియా బోయింగ్ 787 విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఈ విమానాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. సాంకేతిక సమస్యల్ని పరిష్కరించే వరకు వాటి రాకపోకల్ని నిలిపి వేయాలని కోరింది. ఆ లేఖలో.. విమానాన్ని నియంత్రించడంలో కీలకమైన భాగం కంట్రోల్ స్టిక్.. బోయింగ్ 787 విమానాల్లో ‘కంట్రోల్ స్టిక్’సమస్యలు ఉన్నాయని పేర్కొంది. విమాన నియంత్రణలో అంతరాయం కలిగించే ఈ లోపం, ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. అయినప్పటికీ ఎయిరిండియా నిర్వహణ విభాగం ఈ సమస్యను తేలికగా తీసుకుంటోందని విమర్శించింది. ఇందులో భాగంగా బోయింగ్ 787 విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరింది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా సాంకేతిక పరిశీలన పూర్తయ్యే వరకు ఈ విమానాలను ఆపాలని భారత పైలెట్ల సమాఖ్య స్పష్టం చేసింది. -
ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో విమానయాన రంగంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు విపరీతంగా పెరగకుండా నిరోధించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులకు సరసమైన ధరలు లభించేలా చూడటానికి దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన సామర్థ్యాన్ని పెంచాలని రెగ్యులేటర్ ఆదేశించింది.పండుగ కాలంలో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు విమానయాన సంస్థలతో ఈ సమస్యను ముందుగానే చర్చించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీల పోకడలను సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక డిమాండ్ ఉన్న దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సమయాల్లో ఛార్జీల హెచ్చుతగ్గులపై ప్రయాణికుల నుంచి ఇటీవల ఫిర్యాదుల పెరుగుతున్న దృష్ట్యా డీజీసీఏ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.భారతదేశంలో ‘ఓపెన్ స్కైస్ పాలసీ’ ప్రకారం విమానయాన సంస్థలకు తమ ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఛార్జీలు అసమానంగా పెరిగితే జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని అధికారులు స్పష్టం చేశారు. పండుగ సీజన్లో ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటానికి విమాన ఛార్జీలు, విమాన సామర్థ్యాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని డీజీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.డీజీసీఏ సలహాకు అనుగుణంగా ప్రధాన విమానయాన సంస్థలు అదనపు విమానాలను మోహరిస్తున్నాయి. ఈ అదనపు విమానాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో సేవలందించనున్నాయి. దేశంలో 64.2 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న ఇండిగో 42 సెక్టార్లలో 730 అదనపు విమానాలను నడపనుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిసి 20 మార్గాల్లో సుమారు 486 విమానాలను జోడించనున్నాయి. స్పైస్ జెట్ 38 సెక్టార్లలో 546 అదనపు సేవలను మోహరించనుంది.ఇదీ చదవండి: మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు! -
Birmingham: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
బర్మింగ్‌హామ్: ఎయిర్ ఇండియా విమానానికి కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పిన ఉదంతం చోటుచేసుకుంది. భారత్‌లోని అమృత్సర్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు బయలుదేరిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానంలో గాలిలో ఉన్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్ కోసం విమానం కిందకు దిగుతున్న సమయంలో దానిలోని అత్యవసర పవర్ యూనిట్ ‘ర్యామ్ ఎయిర్ టర్బైన్’ (ఆర్ఏటీ) ఊహించని రీతిలో తెరుచుకుంది. అయితే, పైలట్లు అప్రమత్తమై ఎంతో చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. Air India spokesperson says, "The operating crew of flight AI117 from Amritsar to Birmingham on 04 October 2025 detected deployment of the Ram Air Turbine (RAT) of the aircraft during its final approach. All electrical and hydraulic parameters were found normal, and the aircraft…— ANI (@ANI) October 5, 2025ఏఐ117 విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ఉపక్రమిస్తున్న తరుణంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులుగానీ, సిబ్బంది ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘అమృత్సర్ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళుతున్న ఏఐ117 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో టర్బైన్ తెరుచుకున్నట్లు మా సిబ్బంది గుర్తించారు. అయితే ఆ సమయంలో విమానంలోని ఇతర వ్యవస్థలన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. మొత్తానికి విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది’ అని పేర్కొంది.ల్యాండింగ్ అనంతరం విమానంలో నిపుణులతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ అంతరాయం కారణంగా బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ114 విమాన సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. కాగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొంది. సంస్థకు ప్రయాణికుల భద్రతే ముఖ్యమని ఎయిర్ ఇండియా మరోమారు స్పష్టం చేసింది. -
ఎయిర్ ఇండియా బంపరాఫర్: రూ. 1200కే ఫ్లైట్ టికెట్!
చాలామంది ఇప్పటికి కూడా ఒక్కసారైనా విమాన ప్రయాణం చేసి ఉండరు. అలాంటి వారికోసం.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 'పేడే సేల్' కింద ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగానే.. దేశీయ విమాన ఛార్జీల ప్రారంభ ధర రూ.1200 కాగా, అంతర్జాతీయ టికెట్స్ ధర రూ. 3724 నుంచి ప్రారంభమవుతాయి.ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘పేడే సేల్’ కోసం బుకింగ్‌లు అక్టోబర్ 1, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 30, 2025 వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక ఛార్జీల కోసం వినియోగదారులు 'FLYAIX' ప్రోమో కోడ్ ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: కొత్త కస్టమర్లను తీసుకోవద్దు: హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై డీఎఫ్ఎస్ఏ ఆంక్షలుఎయిర్లైన్ మొబైల్ యాప్‌లో చేసిన అన్ని బుకింగ్‌లపై ఎయిర్‌లైన్ జీరో కన్వీనియన్స్ ఫీజులను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలతో.. చెక్ ఇన్ బ్యాగేజిపై తగ్గింపులు లభిస్తాయి. దేశీయ విమానాలలో 15 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీకి రూ.1,500, అంతర్జాతీయ విమానాలలో 20 కేజీల చెక్ ఇన్ బ్యాగేజీకి రూ. 2500 వసూలు చేస్తారు. ఇది సాధారణ ధరల కంటే చాలా తక్కువ.💸 PayDay just got better! ✈️Grab Xpress Lite fares starting from ₹1200 on domestic routes and ₹3724 on international routes.📅 Book by 1 Oct and travel from 12 Oct till 30 Nov 2025.Book our PayDay deals from 28 Sep across all channels, and unlock early access with… pic.twitter.com/MdVaIUkI0m— Air India Express (@AirIndiaX) September 26, 2025 -
బెంగళూరు ఎయిరిండియా విమానంలో కలకలం
-
ఎయిరిండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు యత్నించి..
బెంగళూరు: ఎయిరిండియా(Air India) విమానంలో కలకలం రేగింది. కాక్‌పిట్ డోర్(Cockpit Door) తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించారు. హైజాక్ అవుతుందన్న భయంతో పైలట్ డోర్ తెరవలేదు. పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.ఎయిరిండియా(IX-1086) ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి బయలుదేరింది. విమానం గాల్లో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ వద్దకు వెళ్లి దాన్ని తెరవడానికి ప్రయత్నించాడు. భద్రత పరంగా కాక్‌పిట్ డోర్‌ను తెరవాలంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయాలి. పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత, కెప్టెన్ అనుమతిస్తేనే ప్రవేశం సాధ్యమవుతుంది. ఆ ప్రయాణికుడు డోర్ తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.అయితే, ఆ ప్రయాణికులు ఎందుకు కాక్‌పిట్‌ను తెరవడానికి ప్రయత్నించాడో ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి మరో ఏడుగురు వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. వారిని విమానం వారణాసిలో ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్ఎఫ్(Central Industrial Security Force) అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎయిరిండియా పూర్తి వివరాలు వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఎయిరిండియా ఘటన: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు -
విశాఖలో హైదరాబాద్ విమానం అత్యవసర ల్యాండింగ్
గోపాలపట్నం: విశాఖలో ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వెనక్కి వచ్చి అత్యవసర ల్యాండింగ్ అయింది. గురువారం మధ్యాహ్నం 2.38 గంటలకు విశాఖ నుంచి బయలుదేరిన విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో రెండో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.దీంతో పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ అధికారులకు సమస్యను 2.47 గంటలకు తెలిపారు. స్పందించిన ఎయిర్‌పోర్టు అధికారులు విమానం సురక్షిత ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విమానంలో 103 మంది ప్రయాణీకులు ఉన్నారని, కొందరు ప్రత్యామ్నాయ విమానాల్లో వెళ్లగా, మరికొందరు ప్రయాణం రద్దు చేసుకున్నారని విమానాశ్రయ ఇన్చార్జ్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం తెలిపారు. -
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: పైలట్ అప్రమత్తతతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానం బయల్దేరగా.. కొంతదూరం వెళ్లాక విమానం రెక్కలో పక్షి ఇరుక్కుంది. పక్షి ఇరుక్కోవడంతో ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి.పైలెట్.. చాకచక్యంగా మార్గమధ్యలోనే వెనుతిరిగి విశాఖలో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎయిరిండియా విమాన ప్రమాదం, కీలక పరిణామం : అమెరికా కోర్టులో
తీవ్ర విషాదాన్ని నింపిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏఐ171 డ్రీమ్‌లైనర్‌విమానం కుప్పకూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు బాధిత కుటుంబాలు బోయింగ్, హనీవెల్‌పై దావా వేశాయి. కంపెనీ తీవ్ర నిర్లక్ష్య కారణంగానే విమానం కూలిపోయిందని ఆరోపిస్తూ అమెరికాలోని కోర్టులో ఫిర్యాదు నమోదు చేశాయి. తమకు జరిగిన పూడ్చలేని నష్టానికి పరిహారం చెల్లించాలని కోరాయి. ఈ ప్రమాదంపై అమెరికా కోర్టులో దావా వేయడం ఇదే తొలిసారి.డెలావేర్ సుపీరియర్ కోర్టులో మంగళవారం ఈ నాలుగు కుటుంబాలు ఫిర్యాదును దాఖలు చేశాయి. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లోని స్విచ్‌ను ఇన్స్టాల్ చేసి తయారు చేసిన బోయింగ్ మరియు విడిభాగాల తయారీ సంస్థ హనీవెల్‌లకు ఆ ప్రమాదం గురించి తెలుసునని, ముఖ్యంగా 2018లో US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేక బోయింగ్ విమానాలలో డిసేబుల్డ్ లాకింగ్ మెకానిజమ్‌ల గురించి హెచ్చరించిన తర్వాత, స్విచ్‌ను ఇన్స్టాల్ చేసి తయారు చేసిన బోయింగ్ మరియు హనీవెల్‌లకు ఆ ప్రమాదం గురించి తెలుసునని పేర్కొన్నారు. ఈ స్విచ్ లాకింగ్ మెకానిజం అనుకోకుండా ఆగిపోవచ్చు, లేదా కనిపించకుండా పోవచ్చు. దీనివల్ల ఇంధన సరఫరా ఆగిపోవచ్చు, టేకాఫ్‌కు అవసరమైన థ్రస్ట్ కోల్పోవచ్చు అని వాదులు తెలిపారు. థ్రస్ట్ లివర్ల వెనుక నేరుగా స్విచ్‌ను ఉంచడం ద్వారా, "సాధారణ కాక్‌పిట్ కార్యకలాపాలు అనుకోకుండా ఇంధన కటాఫ్‌కు దారితీయవచ్చని బోయింగ్ సమర్థవంతంగా హామీ ఇచ్చింది" అయినా, ఈ విపత్తును నివారించడానికి హనీవెల్ , బోయింగ్ చేసిందేమీలేదని ఫిర్యాదులో మండిపడ్డాయి.ఈ ప్రమాదంలో కోల్పోయిన తమ బంధువులు కాంతాబెన్ ధీరూభాయ్ పఘడల్, నవ్య చిరాగ్ పఘడల్, కుబేర్భాయ్ పటేల్, బాబిబెన్ పటేల్ మరణాలకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేశాయి. అయితే వర్జీనియాలోని ఆర్లింగ్టన్లో ఉన్న బోయింగ్ బుధవారం దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో ఉన్న హనీవెల్ కూడా ఇంకా స్పందించలేదు. రెండు కంపెనీలు డెలావేర్లో విలీనమైనాయి.కాగాఅహ్మదాబాద్‌లోనిమెడికల్ కాలేజీపై ఎయిరిండియా విమానం కుప్పకూలిన ప్రమాదంలో 12 మంది సిబ్బంది, మరో 19మందితో229 మంది మరణించారు. ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ప్రాథమిక నివేదిక ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో గందరగోళం నెలకొందని, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని జూలైలో నివేదించింది. భారత్, యూకే, అమెరికన్ పరిశోధకులు ప్రమాదానికి కారణం ఇదీ అని నిర్ణయించ లేదు. మరోవైపు బోయింగ్ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్‌లు సక్రమంగానే ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) దీనిపై క్లారిటీ ఇచ్చింది. US FAA నిర్వాహకుడు బ్రయాన్ బెడ్ఫోర్డ్, యాంత్రిక సమస్య లేదా ఇంధన నియంత్రణ భాగాల అనుకోకుండా కదలికలు కారణం కాదనే గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
బాబోయ్.. ఎయిరిండియా విమానాల్లో ఉక్కపోత!
దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు. ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. రెండుగంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ప్రయాణికులకు కలిగిన అంతరాయంపై ఎయిరిండియా ప్రకటన చేసినా.. చేయకపోయినా.. అది ఏసీ వల్లే అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చేసింది. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.పీటీఐ కథనం ప్రకారం.. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ రాత్రి 11గం. సమయంలో సింగపూర్‌కు బయల్దేరాల్సి ఉంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తిందని అనౌన్స్మెంట్ చేశారు. అయితే.. రెండు గంటలు గడిచినా మరమ్మత్తులు కాలేదు. ఆపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రయాణికులను సిబ్బంది కిందకు దించేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఏసీ పని చేయకపోవడంతో ప్యాసింజర్లు మ్యాగజైన్లు, న్యూస్పేపర్లతో విసురుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఎయిరిండియా విమానాల్లో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకున్నాయి. Now after suffering without AC for around 2 hrs, passengers of Delhi-Singapore @airindia flight being deplaned suspecting a technical glitch. Pathetic service @airindia @DGCAIndia @moneycontrolcom https://t.co/omaceiKZ41 pic.twitter.com/MOccbgH4JT— Ashish Mishra (@AshishM1885) September 10, 2025ఢిల్లీ–సింగపూర్ విమానం (AI2380) – సెప్టెంబర్ 10, 2025(తాజా ఘటన)బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానంలో విద్యుత్ సరఫరాలో లోపంతో పని చేయని ఏసీలు!200 మందికి పైగా ప్రయాణికులు రెండు గంటల పాటు ఎదురు చూశాక.. చివరికి విమానం నుంచి దిగమన్నారుఢిల్లీ–పాట్నా విమానం – మే 19, 2025తీవ్ర వేడిలో AC పనిచేయకపోవడంతో ప్రయాణికులు పేపర్లు, మ్యాగజైన్లు ఉపయోగించి గాలి తీసుకునే ప్రయత్నంరిషి మిశ్రా అనే నేత ఓ వీడియో షేర్ చేసి విమానయాన మంత్రిత్వ శాఖను ప్రశ్నించారుఅహ్మదాబాద్–లండన్ విమానం (AI171) – జూన్ 12, 2025ఈ విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే.. విమానం క్రాష్‌కి ముందు ప్రయాణికులు AC పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారుTV స్క్రీన్లు, లైట్లు, సిబ్బందిని పిలిచే crew call buttons కూడా పనిచేయలేదని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ఎయిర్ ఇండియా CEO ఏమన్నారంటే..వరుసగా ఈ తరహా ఘటనలు జరగడంపై కాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందిస్తూ.. ఎయిరిండియాకు ఉన్న విమానాల సంఖ్య, సిబ్బంది, సంస్థ పరిమాణాన్ని బట్టి చూస్తే.. ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణమే. అయినప్పటికీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. -
Fire Indication: ఇండోర్ విమానం ఢిల్లీకి మళ్లింపు
న్యూఢిల్లీ: ఇండోర్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. విమానపు కుడి ఇంజిన్‌లో అగ్నిప్రమాద సూచన అందుకున్న దరిమిలా పైలట్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.ఢిల్లికి తిరిగి వచ్చిన విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేశామని, ప్రయాణికులను ఇండోర్‌కు ప్రత్యామ్నాయ విమానంలో తరలించామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ‘ఆగస్టు 31న ఢిల్లీ నుండి ఇండోర్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది.కాక్‌పిట్ సిబ్బందికి ఇంజిన్‌లో మంటలు వస్తున్నట్లు సూచన అందింది. ప్రామాణిక విధానాన్ని అనుసరించి.. కాక్‌పిట్ సిబ్బంది ఇంజిన్‌ను ఆపివేయాలని నిర్ణయించుకుని, ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఢిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలోకి తరలిస్తున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రధాన ప్రాధాన్యత’ అని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. Indore-bound Air India plane returns to Delhi airport after fire indication in engine; lands safely https://t.co/OrMzQfYt5g— JAMMU LINKS NEWS (@JAMMULINKS) August 31, 2025 -
ఈదురు గాలిలో భారీ వాన.. విమానం సురక్షిత ల్యాండింగ్.. ప్రయాణికుల ఆనందం
ముంబై: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ, ముంబై సహ పలు నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరద నీరు కారణంగా ముంబై నగరం అతలాకుతలమైంది. వర్షాల ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. ఈ క్రమంలో భారీ వర్షంలో కూడా ఎయిరిండియా విమానాన్ని ఓ పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో, సదరు పైలట్‌పై ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ముంబై ఎయిర్‌పోర్టులో మంగళవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆ సమయంలో ఓ ఎయిరిండియా విమానం ల్యాండింగ్ అయ్యేందుకు విమనాశ్రయానికి వచ్చింది. ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో ఈదురు గాలులు, వర్షం పడుతున్న క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ పైలట్ నీరజ్ సేథీ ఎలాంటి అలజడి లేకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రతికూల వాతావరణంలో కూడా ఇలా విమానం ల్యాండింగ్ చేయడం పట్ల ప్రయాణికులు నీరజ్‌పై ప్రశంసలు కురిపించారు. విమానంలోని ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పైలట్‌కు కృతజ్ఞతలు తెలిaపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీరజ్ సేథీ ‘నిజమైన హీరో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.#MumbaiRain #AirIndia Landing at Mumbai airport midst of heavy rain ,Hats off to captain Neeraj Sethi for landing 🛬 safely with less visibility pic.twitter.com/MBrndAmKrF— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) August 20, 2025ముంబైకి ఆరెంజ్ అలర్ట్.. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. 345 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఎనిమిది విమానాలను దారి మళ్లించారు. ఇక, బుధవారం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్ తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల విమానాలు ఆలస్యం కావచ్చని లేదా రద్దయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సరిచూసుకోవాలని సూచించాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్‌లు నీట మునగడంతో సెంట్రల్ రైల్వే నేడు ఏకంగా 17 లోకల్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని పలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా థానే, నవీ ముంబై, లోనావాలా వంటి ప్రాంతాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నాయి. కుండపోత వానల కారణంగా బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12:30 గంటలకే కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, గురువారం నుంచి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఎయిరిండియాకు ఐవోసీ హరిత ఇంధనం
విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పర్యావరణహిత ఏవియేషన్ ఇంధనం (ఎస్ఏఎఫ్) సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాడేసిన వంట నూనె నుంచి ఎస్ఏఎఫ్ ఉత్పత్తి ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ఐవోసీ చైర్మన్ అరవిందర్ సింగ్ సాహ్ని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌పై టారిఫ్‌ల ప్రభావం అంతంతే!పానిపట్‌లోని రిఫైనరీలో ఏటా 35,000 టన్నుల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఐటీసీ, హల్దీరామ్స్ లాంటి హోటళ్లు, రెస్టారెంట్ చెయిన్స్ నుంచి నూనెను సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. విమాన రవాణా వల్ల వచ్చే ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోలియంయేతర ముడివనరుల నుంచి ప్రత్యామ్నాయ ఇంధనమైన ఎస్ఏఎఫ్ను తయారు చేస్తారు. లభ్యతను బట్టి సాధారణంగా వినియోగించే విమాన ఇంధనం (ఏటీఎఫ్)లో 50 శాతం వరకు దీన్ని కలపవచ్చు. -
‘రన్‌వేపై విమానం జారింది’: తప్పిన ప్రమాదంపై ఎంపీ వ్యాఖ్యలు
కొచ్చి: ‘ఎయిర్ ఇండియా’పై నీలి నీడలు ఇప్పట్లో వీడేలా లేవు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. నేటి (సోమవారం) తెల్లవారుజామున కేరళలోని కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా టేకాఫ్‌ను నిలిపివేశారు. అనంతరం ఊహించని విధంగా విమాన ప్రయాణం ఆలస్యం అవుతున్నదని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ఈ విమానంలో లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ నేత హిబి ఈడెన్ కూడా ప్రయాణిస్తున్నారు.కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (సీఐఏఎల్)ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక సమస్యల కారణంగా ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ను నిలిపివేసిందని, విమానాన్ని మారుస్తున్నామని, త్వరలోనే బయలుదేరే అవకాశం ఉందన్నారు. టేకాఫ్ రోల్ సమయంలో గుర్తించిన సాంకేతిక సమస్య కారణంగా కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్లే విమానం ఏఐ504 ఈ రోజు సాయంత్రం బయలుదేరేలా తిరిగి షెడ్యూల్ చేశారని అన్నారు. కాక్‌పిట్ సిబ్బంది ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి, టేకాఫ్ రన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారని, నిర్వహణ తనిఖీల కోసం విమానాన్ని తిరిగి బేకు తీసుకువచ్చారని ఆయన తెలిపారు. Something unusual with this flight ✈️ AI 504, it just felt like the flight skid on the runway and hasn't taken off yet. Air India cancelled AI 504 and announced a new flight at 1 am which hasn't still started boarding, today is the third flight which has been AOG— Hibi Eden (@HibiEden) August 17, 2025ఈ ఘటన దరిమిలా ప్రయాణికులు విమానం నుంచి దిగిపోయారని, కొచ్చిలోని తమ సహోద్యోగులు వారికి సహాయం అందిస్తున్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. కాగా ఈ ఘటన సమయంలో విమానంలో ఉన్న ఎర్నాకులం కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ .. తాను ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయ్యే ప్రయత్నంలో రన్‌వే నుండి జారిపోయినట్లు అనిపించిందని సోషల్ మీడియాలో పోస్ట్‌లో తెలిపారు.ఆ సమయంలో విమానంలో ఏదో అసాధారణమైనది జరిగిందన్నారు. తెల్లవారుజామున ఒంటి గంటకు తదుపరి విమానాన్ని ప్రకటించారని, అయితే ఇంకా బోర్డింగ్ ప్రారంభించనేలేదని ఆయన పేర్కొన్నారు. కాగా 2022 జనవరిలో ప్రైవేట్ యాజమాన్యంలోకి వచ్చినప్పటి నుండి ఎయిర్ ఇండియా చివరి నిమిషంలో విమానాల జాప్యాలు, రద్దులను ఎదుర్కొంటోంది. దీనికి సాంకేతిక, నిర్వహణ సమస్యలే ప్రధాన కారణమని ఎయిర్ ఇండియా చెబుతూవస్తోంది. -
మళ్లీ డ్రాగన్‌తో విమాన బంధం!
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం, గల్వాన్ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించను న్నాయి. నాలుగేళ్లుగా ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను త్వరలో పునరు ద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. టియాజిన్ సిటీలో జరగబోయే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో భారత్–చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరు ద్ధరణ బాటలో పయనిస్తుండటం విశేషం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపె డా టారిఫ్‌ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపించనున్నాయని, అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్‌ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నాలుగు సరిహద్దు రాకపోకల మార్గాల గుండా సరకు రవాణాకు ఇరుదేశాలూ మొగ్గు చూపుతు న్నవేళ నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు డైరెక్ట్ ఫ్లైట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.నూతన ఎయిర్సర్వీసుల ఒప్పందం త్వరలో ఖరారు కాబోతోందని ఆయా వర్గాలు తెలిపాయి. ఇది ఒకవేళ ఖరారుకాక పోయినాసరే పాత విధానంలో విమాన సర్వీసులను మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఎయిర్ఇండియా, ఇండిగో వంటి దేశీయ పౌర విమానయా సంస్థలు ఇకపై నేరుగా చైనాకు విమాన సర్వీసులను మొదలెట్టాలని మోదీ సర్కార్ సూచించినట్లు తెలుస్తోంది. గల్వాన్ నుంచి గట్టిబంధం దిశగా2020 మేలో తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్‌లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్‌పోర్ట్‌లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.అయితే ట్రంప్ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్‌ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్‌లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించారు. -
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. చెన్నైలో అత్యవసర ల్యాండింగ్..
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా, పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులను కలవరపెట్టింది. విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని, అదృష్టం కొద్దీ బతికిపోయామని ఆయన సోమవారం తెలిపారు. ‘ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 2455లో బయల్దేరాం. నాతో పాటు పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులున్నారు. విమానం ఆలస్యంగా బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్లైట్‌ను చెన్నై ఎయిర్‌పోర్టుకు మళ్లిస్తున్నట్లు కెపె్టన్ ప్రకటించారు. అందరిలోనూ భయం నెలకొంది. అక్కడా ల్యాండింగ్‌కు వెంటనే అనుమతి లభించకపోవడందో విమానం రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తరువాత చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. అందరం ఊపిరి పీల్చుకున్నాం’అని కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కెపె్టన్ ముందు చూపువల్ల తాము బతికి బయటపడ్డామని, అదృష్టవంతులమని చ్పెఆరు. అయితే.. విమానంలో భద్రత అదృష్టం మీద ఆధారపడి ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీజీసీఏ, కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. అయితే వేణుగోపాల్ ప్రకటనపై ఎయిరిండియా స్పందించింది. ఆదివారం రాత్రి కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా చెన్నైకి అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చిందని తెలిపింది. అయితే.. రన్‌వేపై మరో విమానం ఉండటం వల్ల విమానంగాల్లో చక్కర్లు కొట్టలేదని, చెన్నై ఏటీసీ సూచన మేరకే అలా చేయాల్సి వచి్చందని తెలిపింది. ‘ప్రియమైన వేణుగోపాల్‌గారు అనుమానిత సాంకేతిక సమస్య, అననుకూల వాతావరణం వల్ల చెన్నైకి మళ్లింపు జరిగింది. అయితే ల్యాండింగ్ ప్రయత్నంలో ఏటీసీ ఒక రౌండ్–అరౌండ్ సూచించింది. ఎలాంటి పరిస్థితులనైనా నిర్వహించేందుకు మా పైలట్లు బాగా శిక్షణ పొందారు. వారు ప్రామాణిక విధానాలను అనుసరించారు. అలాంటి అనుభవం కలవరపెడుతుందని మాకు అర్థమైంది. మళ్లింపు వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. భద్రత ఎల్లప్పుడూ మా ప్రాధాన్యత. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’అని పేర్కొంది. కాగా, ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం.. ఆదివారం రాత్రి 7.15 నిమిషాలకు బయలుదేరాల్సిన విమానం 8:17 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరింది. 10:35 గంటలకు చెన్నైలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున 1:40 గంటలకు బయలుదేరి 3:58 గంటలకు ఢిల్లీ చేరుకుంది. -
రతన్ టాటా ఏంటో అమెరికాకు తెలుసు! ఇవాళ ఆయన ఉండి ఉంటేనా..
భారత దేశ చరిత్రలో అహ్మదాబాద్ ఎయిరిండియా AI171 విమాన ప్రమాదంపై అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచింది. ఈ ఘటనపై అమెరికా న్యాయవాది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్ 12వ తేదీ మధ్యాహ్నా సమయంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం కొద్దిసెకన్లకే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 260 మంది మరణించారు. అందులో 229 మంది ప్రయాణికులు.. 12 మంది సిబ్బంది.. కింద ఉన్న మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సాయం అందడంలో జాప్యంపై అమెరికాకు చెందిన న్యాయవాది మైక్ ఆండ్రూస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాటా కంపెనీ మాజీ చైర్మన్, దివంగత రతన్ టాటా బతికి ఉండి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారాయన. రతన్ గనుక ఉండి ఉంటే.. బాధిత కుటుంబాలు ఇప్పుడు ఇంతగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండేవి కావని అన్నారాయన. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మైక్ ఆండ్రూస్ మాట్లాడుతూ.. ‘‘అమెరికాకు రతన్ టాటా అంటే ఏంటో తెలుసు. ఆయన నైతిక విలువలు, ఉద్యోగుల పట్ల ఆయన కనబరిచే శ్రద్ధ, వాళ్ల బాగోగుల గురించి ఆయన చేసే ఆలోచనలు.. వీటి గురించి అమెరికా ప్రజలకు కూడా కొంత తెలుసు. ఒకవేళ ఆయన గనుక ఇవాళ ఉండి ఉంటే.. ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బాధితుల పట్ల దయగుణం కచ్చితంగా ప్రదర్శించేవారు’’ అని అన్నారాయన. ప్రమాదంలో మరణించిన 65 కుటుంబాల తరఫున పరిహారం కోసం ఆండ్రూస్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక బాధిత కుటుంబం దీనావస్థను ప్రస్తావిస్తూ.. వయసుపైబడి మంచాన ఉన్న ఓ తల్లి ఒక్కగానొక్క కొడుకు సంపాదన మీదే ఆధారపడి బతుకుతోంది. అలాంటి కొడుకు ఎయిరిండియా ప్రమాదంలో మరణించాడు. ఆమెకు ఇప్పటిదాకా ఎలాంటి పరిహారం అందలేదు. మరి ఇప్పుడు ఆమె వైద్య ఖర్చులను ఎవరు చెల్లిస్తారు? ఆమె పరిస్థితి ఏంటి? అని ఆండ్రూస్ అంటున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం ఓ ట్రస్ట్ నెలకొల్పి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని టాటా గ్రూప్స్ కు చెందిన ఎయిరిండియా ప్రతిజ్ఞ చేసింది. అలాగే ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను తిరిగి నిర్మిస్తామని పేర్కొంది. జులైలో.. తాత్కాలిక పరిహారం కింద రూ.25 లక్షలను ఎయిరిండియా విడుదల చేసింది. ఆ సొమ్మును 147 విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు, విమానం కూలడంతో నేల మీద మరణించి మరో 19 కుటుంబాలకు పరిహారంగా అందజేశారు. ఈ సొమ్మును తుది పరిహారంలో మినహాయిస్తామని కూడా ప్రకటించారు. అయితే పరిహారం అందడంలో జాప్యంతో.. బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు మెట్లు ఎక్కాయి.2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా AI171 విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను కేంద్ర పౌరవిమాన మంత్రిత్వశాఖకు సమర్పించింది. అందులో.. • ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు టేకాఫ్ తర్వాత సెకన్ పాటు ఆగిపోయాయి, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది.• ఇంజిన్లు గాల్లోనే ఆగిపోవడం వల్ల విమానం కుప్పకూలింది.• 32 సెకన్లలోనే విమానం క్రాష్‌ల్యాండ్ అయింది.ఆ సమయంలో ఒక పైలట్ ఇంధనం ఎందుకు సిచ్ఛ్ ఆఫ్ చేశావని మరో పైలట్‌ను ప్రశ్నించాడు. నేను ఆఫ్ చేయలేదు అని సమాధానం ఇచ్చాడతను.మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినా.. విమానం అప్పటికే కూలిపోయింది.విమాన ప్రమాదానికి FADEC (Full Authority Digital Engine Control) సిస్టమ్‌లో లోపం కారణమైతే, బోయింగ్ కంపెనీపై అమెరికాలో ఉత్పత్తి బాధ్యత కేసు వేయవచ్చని లాయర్ మైక్ ఆండ్రూస్ తెలిపారు. అలాకాని పక్షంలో ఎయిరిండియాదే గనుక బాధ్యత అయితే.. మాంట్రియాల్ కన్వెన్షన్ ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రెండూ ఉన్నట్లు గనుక తేలితే.. అప్పుడు పరిస్థితి కొంత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడ్డారయన. -
‘అదో భయంకర ప్రయాణం.. లక్కీగా బతికాం’: ఎంపీ వేణుగోపాల్
న్యూఢిల్లీ: మరో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా పలువురు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. త్రివేండ్రం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని సాంకేతిక సమస్యల కారణంగా చెన్నైకి అత్యవసరంగా మళ్లించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ ఆ విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని ‘ఎక్స్’ పోస్టులో తెలియజేశారు. అదొక భయంకర ప్రయాణమని, విషాదానికి దగ్గరగా వచ్చామని దానిలో పేర్కొన్నారు.వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, అప్పటికే బయలుదేరడానికి ఆలస్యం అయిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపానికి గురయ్యింది. దీంతో దానిని చెన్నైకి మళ్లించారు. ‘త్రివేండ్రం నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI 2455లో నేను, పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. మేమంతా విషాదానికి దగ్గరగా వచ్చాం. ఆలస్యంగా బయలుదేరిన విమానం తరువాత భయంకరమైన ప్రయాణానికి దారి తీసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేమంతా కుదుపులకు గురయ్యాం. దాదాపు గంట తర్వాత కెప్టెన్ విమానంలో సిగ్నల్ లోపం ఉందని ప్రకటించి, దానిని చెన్నైకి దారి మళ్లించారు. అయితే విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి కోసం రెండు గంటల పాటు ఎదురు చూశాం. మొదటి ప్రయత్నంలో అదే రన్‌వేపై ఒక విమానం ఉండటంతో మా విమానం ల్యాండ్ కావడం సాధ్యం కాలేదన్నారు. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైలట్ నైపుణ్యం, అదృష్టం కారణంగానే మేమంతా ప్రాణాలతో బయటపడ్డామని’ వేణుగోపాల్ పేర్కొన్నారు. Air India flight AI 2455 from Trivandrum to Delhi - carrying myself, several MPs, and hundreds of passengers - came frighteningly close to tragedy today.What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని, అలాంటి లోపాలు మళ్లీ తలెత్తకుండా చూసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆయన కోరారు. కాగా ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా.. రన్‌వేపై మరో విమానం ఉండటం వల్ల ఈ విమానం ల్యాండ్ కాలేదని, చెన్నై ఏటీసీ సూచనల మేరకు తరువాత ఆ విమానం ల్యాండ్ అయ్యిందని తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది. గత జూన్ 12న అహ్మదాబాద్‌లో చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, మరో 19 మంది ఇతరులు మృతి చెందారు. నాటి నుంచి ఎయిర్ ఇండియా విమానయాన సంస్జ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. Air India flight AI 2455 from Trivandrum to Delhi - carrying myself, several MPs, and hundreds of passengers - came frighteningly close to tragedy today.What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025 -
ఎయిర్ ఇండియా విమానంలో.. ‘దురదృష్టవశాత్తూ’ బొద్దింకలు
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాలు ఏదో కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి నడిచే ఎయిర్ ఇండియా విమానం ఏI180లో చిన్న చిన్న బొద్దింకలు కనిపించాయని ఇద్దరు ప్రయాణికులు ఫిర్యాదు చేసిన దరిమిలా వాటిని తొలగించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.ఎయిర్ ఇండియా విమానంలోని ఇద్దరు ప్రయాణికులు తమ సీట్ల వద్ద బొద్దింకలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన అనంతరం వారి సీట్లు మార్చామని ఎయిర్ ఇండియా తెలిపింది. ‘శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి వెళ్లే ఏI180 విమానంలో, ఇద్దరు ప్రయాణికులు దురదృష్టవశాత్తూ చిన్న బొద్దింకల కారణంగా ఇబ్బంది పడ్డారు. దీంతో తమ క్యాబిన్ సిబ్బంది ఆ ఇద్దరు ప్రయాణికులను ఇతర సీట్లకు మార్చారు. అక్కడ వారు సౌకర్యవంతంగా కూర్చున్నారు.ఇంధన స్టాప్ సమయంలో, మా గ్రౌండ్ సిబ్బంది వెంటనే శుభ్రపరిచే ప్రక్రియను నిర్వహించారు’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో తమ పరిశుభ్రతా చర్యలు కొనసాగుతున్నప్పటికీ, కీటకాలు కొన్నిసార్లు గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో విమానంలోకి ప్రవేశిస్తుంటాయి. ఇటువంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌లైన్ తెలిపింది, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. -
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీలో నిలిపివేత
న్యూఢిల్లీ: ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సాంకేతికపరమైన లోపం కారణంగా టేకాఫ్‌ను నిలిపివేసింది. ఆటో-థ్రోటిల్ పనిచేయడంలో విఫలం కావడంతో, విమానం తిరిగి తనిఖీల కోసం నిలిచిపోయింది. సోమవారం ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో సాంకేతికపరమైన లోపం తలెత్తింది.విమాన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం రన్‌వే 29ఆర్‌లో ప్రారంభమైన టేకాఫ్ రోల్ సమయంలో ఆటో-థ్రోటిల్ వ్యవస్థ ఆశించిన విధంగా పనిచేయలేదు. దీంతో కెప్టెన్ దాదాపు 60 నాట్ల వేగంతో టేకాఫ్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని సంబంధిత ఇంజనీర్లతో సంప్రదించి, నిర్దిష్ట నిర్వహణ విధానం కింద తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) డౌన్లోడ్ కోసం విమానాన్ని తిరిగి దాని స్థానికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పరిశోధించేందుకు ప్రస్తుతం ఇంజనీరింగ్ తనిఖీలు జరుగుతున్నాయి. #Flight stopped at the time take off due to technical problems164 passengers are in flightNo information about alternative arrangementsJustice Battu Devanand, Judge of AP High Court is travelling in the flight. pic.twitter.com/po4wPHYzKe— endla janardhan (@endlajanardhana) August 4, 2025సాంకేతిక లోపం తో ఢిల్లీ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఈ ఎయిర్ ఇండియా విమానంలో.. ఈ ఘటన జరిగిన సమయంలో 164 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ కూడా ఉన్నారు. విమానంలో వృద్దులు, చిన్నారులు , మధుమేహ రోగులు ఉన్నారని, వీరికి తక్షణం ఆహారం అందించాలని విమాన సిబ్బందిని ఆయన కోరారు. దీంతో విమాన సిబ్బంది ప్రయాణికులకు ఆహారం అందించారు. -
భద్రతా ఉల్లంఘనల్లో ఎయిరిండియా సెంచరీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ ఎయిరిండియాలో దాదాపు 100 భద్రతా ఉల్లంఘనలు జరిగాయని భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ఎయిర్‌లైన్ గురుగ్రామ్ స్థావరంపై డీజీసీఏ ఈ నెల 1 నుంచి నాలుగువరకు ఆడిట్ నిర్వహించింది. కార్యకలాపాలు, విమాన షెడ్యూలింగ్, రోస్టరింగ్ మరియు ఇతర కీలక విధులను పరిశీలించింది. ఈ సందర్భంగా అనేక ఉల్లంఘనలు గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది. విమానయాన సంస్థ సిబ్బంది శిక్షణ, విధులు, విశ్రాంతి కాల నిబంధనలు, సిబ్బంది సామర్థ్యం, ఎయిర్‌ఫీల్డ్ అర్హత వంటి అంశాల్లో నిబంధనలు పాటించలేదని తేలింది. వీటిలో ఏడు ఉల్లంఘనలను లెవల్–1గా వర్గీకరించారు. ఇవి తక్షణ దిద్దుబాటు చర్య అవసరమయ్యే తీవ్రమైన భద్రతా ప్రమాదాలుగా తెలిపింది. అంతేకాదు.. మార్పులకు అఉగుణంగా బోయింగ్ 787, 777 పైలట్లకు ఎయిరిండియా శిక్షణ ఇవ్వలేదని గుర్తించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారనే విషయంపై నివేదికను సమరి్పంచాలని ఎయిరిండియాను ఆదేశించింది. ఆడిట్ నివేదిక అందింది: ఎయిరిండియా డీజీసీఏ ఆడిట్ నివేదిక తమకు అందిందని ఎయిరిండియా ధ్రువీకరించింది. నిర్ణీత గడువులోగా స్పందిస్తామని తెలిపింది. ‘‘అన్ని విమానయాన సంస్థలకు ఆడిట్లు జరుగుతాయి. అందులో భాగంగానే ఎయిరిండియా వార్షిక డీజేసీ ఆడిట్ జూలైలో జరిగింది. ఇందులో కనుగొన్న విషయాలను మేం అంగీకరిస్తున్నాం. నిరీ్ణత సమయ వ్యవధిలోపు మా ప్రతిస్పందనను, తీసుకున్న దిద్దుబాటు చర్యలను డీజీసీఏకు సమరి్పస్తాం. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు మా సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది’’అని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ ప్రమాదం తరువాత.. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ కూలిపోయిన తర్వాత ఎయిర్‌లైన్‌పై తీవ్ర పరిశీలన జరిగిన నేపథ్యంలో ఆడిట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఈ నెలలో 15 పేజీల ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా సెకన్ల వ్యవధిలో ఆగిపోయిందని తెలిపింది. రెండు ఇంధన స్విచ్‌లు కొన్ని సెకన్ల వ్యవధిలో ‘రన్’నుంచి ‘కటాఫ్’కు మారాయని నివేదిక పేర్కొంది. ‘ఎందుకు ఆపేసావు?’అని ఒక పైలట్.. మరో పైలట్‌ను అడగ్గా, తాను అలా చేయలేదని మరో పైలట్ బదులివ్వడం కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డయ్యింది. -
Delhi: భారీ వర్ష సూచన.. వైమానిక సంస్థల హెచ్చరికలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమాన ప్రయాణికుల సౌకర్యార్థం పలు విమానయాన సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.ఎయిర్ ఇండియా #TravelAdvisory Gusty wind and rain may impact flight operations to and from Delhi this morning.Please check your flight status here https://t.co/ZRtxRBbSY7… before heading to the airport and allow extra time for your journey.— Air India (@airindia) July 29, 2025 ఢిల్లీలో వర్షం కురుస్తున్న కారణంగా విమాన కార్యకలాపాలు ప్రభావితం కావచ్చని ఎయిర్ ఇండియా ప్రయాణికులకు తెలియజేసింది. విమానాశ్రయానికి వెళ్లే ముందు ప్రయాణికులు http://airindia.com/in/en/manage/fలో మీరు ప్రయాణం చేయబోయే విమాన స్థితిగతులను తెలుసుకోవాలని సూచించింది. మీ ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించాలని కోరింది. ఇండిగో Travel Advisory 🌂 A Rainy Day Reminder With heavy rainfall expected over #Delhi, we’re seeing a chance of delays and slower traffic to and from the airport. While we can’t control the skies, we’re doing everything possible to keep your journey steady on the ground.…— IndiGo (@IndiGo6E) July 29, 2025 ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ ప్రయాణికులకు వాతావరణ సంబంధిత ప్రయాణ హెచ్చరికలను జారీచేసింది. అదనపు ప్రయాణ సమయానికి ముందుగానే సిద్ధం కావాలని ప్రయాణికులను కోరింది. స్పైస్ జెట్ #WeatherUpdate: Due to bad weather in Delhi (DEL) and Dharamshala (DHM), all departures/arrivals and their consequential flights may get affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/2wynECYWr0.— SpiceJet (@flyspicejet) July 29, 2025 విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికను జారీ చేసింది. ఢిల్లీ, ధర్మశాలలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుంది. దీనిని గమనించాలని సూచించింది. భారత వాతావరణ శాఖ Delhi weather report: IMD predicts cloudy sky with moderate rain in national capital on Tuesday#DelhiRains #DelhiWeather #IMD https://t.co/rwVi0Riava— IndiaTV English (@indiatv) July 28, 2025 ఇంతలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవార మధ్యాహ్నం నాటికి వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టు 3 వరకు అంటే వచ్చే ఏడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది. -
ఆ అమ్మ చర్మం బిడ్డ బుగ్గలపై చిగురించింది..
తల్లి తన బిడ్డల కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుందనడానికి సిసలైన ఉదాహరణ ఇది. ఈ తల్లి ప్రమాదంలో చెంపలు కాలిపోయి అందవికారంగా తయారైన తన ఆరునెలల చిన్నారి కోసం తన చర్మాన్ని వొలిచి ఇచ్చింది. ఆ తల్లి త్యాగం ఫలించింది. ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉన్నారు. తనకేం జరిగిందో తెలియకున్నా అమాయకంగా నవ్వుతూ బిడ్డ ధ్యాన్ష్... తన చర్మాన్నిచ్చి కాపాడుకున్నానన్న సంతోషంతో తల్లి మనీషా ఇద్దరూ ఫొటోకు పోజులిచ్చారు. గతనెల 12న అహమ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో విమానం కూలి మేఘనినగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్, నివాస గృహాలపై పడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్లో యూరాలజీ నిపుణుడైన డాక్టర్ కపిల్ కచ్చాడియా భార్య మనీషా, వాళ్ల ఆరు నెలల కుమారుడు ధ్యాన్ష్ ఇంట్లో ఉన్నారు. విమాన శకలం నుంచి చెలరేగిన మంటల్లో మనీషా చేతులు ముఖంపై 25 శాతం కాలిన గాయాలు కాగా, ధ్యాన్ష్ ముఖం, రెండు చేతులు, ఉదరం, ఛాతీ కాలి, గాయాలు కావడంతో ఇద్దరినీ కేడీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ధ్యాన్ష్ ను పీడియాట్రిక్ ఐసియులో చేర్చి వెంటిలేటర్‌పై ఉంచారు. 36 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ధ్యాన్స్కు అతని తల్లి ముప్ఫై ఏళ్ల మనీషా చర్మాన్ని తీసి స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా అమర్చారు. ఫలితంగా ఎనిమిది నెలల పసివాడు ధ్యాన్ష్ ఇప్పుడు చక్కగా నవ్వుతున్నాడు, ప్రాణాంతక కాలిన గాయాల నుండి బయటపడిన అతని బుగ్గలు ఇప్పుడు నునుపుతేలి ఆరోగ్యంతో మెరుస్తున్నాయి. తన నుంచి తీసిన చర్మాన్ని పిల్లాడికి అమర్చి, అతడు కోలుకున్న తర్వాత ఆ బోసి నవ్వులు చూస్తూ మనీషా కూడా త్వరలోనే కోలుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ జూన్ 12న జరిగిన ఏఐ 171 విమాన ప్రమాదం తర్వాత తీవ్రమైన కాలిన గాయాలకు ఐదు వారాల చికిత్స తర్వాత ఇటీవల డిశ్చార్జ్ అయినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.‘ఒక్క క్షణం అంతా నల్లగా అయిపోయింది, ఆపై వేడి మా ఇంటిని చుట్టుముట్టింది. నేను ధ్యాన్ష్‌ను పట్టుకుని దట్టమైన పొగ, మంటల గుండా పరిగెత్తాను. మేము బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడగలమని అనుకోలేదు కానీ దేవుడి దయవల్ల, కేడీ హాస్పిటల్ వైద్యులు సకాలంలో స్పందించి చేసిన చికిత్స వల్ల ఇద్దరం ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాం. ఇప్పుడు నేను నా బిడ్డ అందమైన నవ్వును తిరిగి చూడగలుగుతున్నాను’’ అంటూ సంతోషం వెలిబుచ్చింది మనీషా. కేడీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్ దేశాయ్ మాట్లాడుతూ, ‘ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చూపిన ధైర్యాన్ని, వైద్యులకు అందించిన సహకారాన్ని మాటలలో వర్ణించలేం. మా హాస్పిటల్లో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలనిచ్చింది’’ అని పత్రికలవారికి తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన ఆరుగురు ప్రమాద బాధితులకు తమ ఆస్పత్రి మానవతా దృక్పథంతో ఉచిత సేవలందించినట్లు తెలిపారు. (చదవండి: రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..) -
Air India: టేకాఫ్ అయిన పావుగంటకే..
అహ్మదాబాద్ ఘటన తర్వాత.. విమానాల్లో, అందునా ఎయిరిండియా సంస్థ విమానాల్లోనే ఎక్కువగా సాంకేతిక సమస్యలూ బయటపడున్నాయి. ఈ క్రమంలో విమానాల ఆలస్యం, రద్దు, దారి మళ్లింపు, వెనక్కి రావడం లాంటి ఘటనలూ నమోదు అవుతున్నాయి. తాజాగా..జైపూర్ నుంచి ముంబై బయల్దేరిన ఎయిరిండియా విమానం.. పావు గంటకే సాంకేతిక సమస్యతో వెనక్కి వచ్చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.35గం.కు బయల్దేరిన విమానం.. 18 నిమిషాల తర్వాత తిరిగి జైపూర్ ఎయిర్‌పోర్టుకే వచ్చేసింది. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే విమానాన్ని పైలట్ వెనక్కి తీసుకురావాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం(జులై 23వ తేదీ) సైతం ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి 160 మంది ప్రయాణికులతో బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం.. సాంకేతిక సమస్యతో రద్దయ్యింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమంటూ ఆ సమయంలో ఎయిరిండియా ప్రకటించింది. అదే రోజు.. కేరళ కాలికట్(కోజికోడ్) నుంచి దోహాకు 188 మందితో(సిబ్బంది సహా) బయల్దేరిన ఎయిరిండియా విమానం.. రెండు గంటల తర్వాత తిరిగి కాలికట్ ఎయిర్‌పోర్టుకే చేరుకుంది. ఇది కూడా సాంకేతిక సమస్యతోనే వెనక్కి వచ్చినట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. -
ప్రాణాలు తీస్తున్న డ్రీమ్ లైనర్.. బోయింగ్ విమానాల తయారీలో తక్కువ క్వాలిటీ
-
ఎయిరిండియా ఘటన.. ఆ మృతదేహాలు మా వాళ్లవి కావు
లండన్: గత నెలలో జరిగిన భారత విమానయాన చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఒకటైన అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదంపై మరో వివాదం నెలకొంది. ‘అహ్మదాబాద్ ఎయిరిండియా (Air India Flight 171) ప్రమాదంలో ఇద్దరు యూకే ప్రయాణికులు మృతి చెందారు. మృతదేహాల్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యుల నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వైద్యులు డీఎన్ఏ నమోనాల్ని సేకరించారు. వాటి ఆధారంగా ఘటనా స్థలంలో లభ్యమైన రెండు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులవేనంటూ యూకే కుటుంబసభ్యులకు అప్పగించారు.అసలు మృతదేహాలు ఎక్కడా?కానీ డీఎన్ఏ పరీక్షల్లో యూకే కుటుంబ సభ్యుల డీఎన్ఏకు.. భారత్ వైద్యులు అప్పగించిన మృతదేహాలకు డీఎన్ఏ వేరుగా ఉందని తెలిపారు. మరి యూకే మృతుల బంధువులకు అప్పగించిన మృతదేహాలు ఎవరివి? అసలు మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదే విషయంపై యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులు భారత్‌తో న్యాయపోరాటం చేస్తున్నారు. మృతదేహాల మార్పుపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.డీఎన్ఏ మ్యాచ్ అవ్వలేదుమృతదేహాల మార్పుపై బాధితుల తరుఫు న్యాయవాది జేమ్స్ హీలీ మీడియాతో మాట్లాడారు. ‘జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమానం ఏఐ 171 విమానంలో 12,13 సీట్లలో మా క్లయింట్ (యూకే ప్రయాణికులు) ప్రయాణించారు. మృతదేహాల గుర్తింపు కోసం మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరించారు. వాటి ఆధారంగా మృతదేహాల్ని గుర్తించారు. మాకు అప్పగించారు. మాకు అప్పగించిన మృతదేహాల్ని.. కుటుంబసభ్యుల డీఎన్ఏతో టెస్ట్ చేశాం. కానీ మాకు అప్పగించిన మృతదేహాల డీఎన్ఏకు, కుటుంబ సభ్యుల డీఎన్ఏకు మ్యాచ్ అవ్వడం లేదని వెల్లడించారు.260 మంది ప్రయాణికులు దుర్మరణంఅహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 241 మంది మృతిచెందారు. ఇక, ఈ విమానం అహ్మదాబాద్ మేఘాణి నగర్లో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో అందులోని పలువురు మృతిచెందారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో 260 మంది మృతి చెందగా వారిలో 19మంది ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీలో ఉన్నవారివేనని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి సూపరిటెండెంట్ రాకేష్ జోషి తెలిపారు. యూకే బాధిత ప్రయాణికులకు మద్దతుగా ఎయిరిండియాడీఎన్ఏ రిపోర్టుల ఆధారంగా మృతదేహాల్ని గుర్తించడం, కుటుంబ సభ్యులకు అప్పగించే బాధ్యత ఎయిరిండియాది కానప్పటికీ.. యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులకు ఎయిరిండియా యాజమాన్యం అండగా నిలిచింది. బాధితుల మృతదేహాలను గుర్తించే విషయంలో తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన యూకే ప్రయాణికుల మృతదేహాల్ని డీఎన్ఏ ఆధారంగా గుర్తించారు. ఆ మృతదేహాల్ని అంతర్జాతీయ అత్యవసర సేవ కెన్యన్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను ఉపయోగించింది. ఎయిర్ ఇండియా కార్గో ద్వారా మృతదేహాల అవశేషాలను మోసుకెళ్లే శవపేటికలను యూకేకి పంపారు. -
ఎయిరిండియా విమానంలో మంటలు.. భద్రతపై ఆందోళన
-
టేకాఫ్ రద్దు.. తప్పిన విమాన ప్రమాదం
న్యూఢిల్లీ: మరో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై వేగంగా వెళుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని సకాలంలో గుర్తించడంతో టేకాఫ్‌ను రద్దు చేశారు. ఆ సమయంలో గంటకు 155 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న విమానాన్ని ఆపేందుకు పైలట్లు బ్రేకులు వేసి, ప్రమాదం జరగకుండా చూశారు.సోమవారం సాయంత్రం 5:30 గంటలకు కోల్‌కతాకు బయలుదేరాల్సిన ఏఐ2403 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు తమ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని అనుసరించి టేకాఫ్‌ను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన దరిమిలా ప్రయాణీకులంతా దిగిపోయారని, ఈ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఈ ఘటనకు ముందు ముంబైలో కొచ్చికి వెళుతున్న విమానం వర్షంలో తడిసిన రన్‌వేను తప్పించుకుని, విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం తలెత్తింది. ఒక ఇంజిన్‌తో పాటు రన్‌వే కూడా దెబ్బతింది. అయితే విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.ఇదిలావుండగా గత ఆరు నెలల్లో ఐదు భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి ఎయిర్ ఇండియాకు తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలియజేసింది. గత నెలలో అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది మృతిచెందారు. 11ఏ సీటులో ఉన్న ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. -
ముంబై ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
-
రంగంలోకి ఆర్ఎస్ సంధు!
ఎయిరిండియా విమాన దుర్ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో పైలట్లకు భాగస్వామ్యం కల్పించాలని, సాంకేతిక నిపుణులను కూడా తీసుకోవాలని భారత ఎయిర్‌లైన్ పైలట్ల సంఘం(ఆల్పా ఇండియా) తీవ్రంగా పట్టుపడుతోంది. పైలట్ల సంఘం ఈమేరకు తమ డిమాండ్లను పలుమార్లు విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ముందుంచింది. దీంతో ఏఏఐబీ కూడా సానుకూలంగా స్పందించింది. ఎయిరిండియాలో గతంలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ గా పనిచేసిన మాజీ పైలట్ కెప్టెన్ ఆర్ఎస్ సంధును ఏఏఐబీ రంగంలోకి దించుతోంది. గత నెల 12న అహ్మదాబాద్ వద్ద ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానం కూలిపోయి 260 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. విమాన దుర్ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్న బృందంలో ‘డొమైన్ ఎక్స్పర్ట్’గా చేరాలని ఆర్ఎస్ సంధును ఏఏఐబీ కోరిందని, అందుకు ఆయన అంగీకరించారని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. వైమానిక రంగంలో విశేషానుభవం గడించిన, విషయ పరిజ్ఞానం గల నిపుణుడిగా (డొమైన్ ఎక్స్పర్ట్)గా ఆర్ఎస్ సంధుకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎయిరిండియాలో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన ఆర్ఎస్ సంధుకు విమానయాన పరిశ్రమలో దాదాపు 39 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం ఉంది. ఎయిరిండియాలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలో సేవలందించారు. 2013లో ప్రత్యేకించి బోయింగ్ 787-8 విమానాల శ్రేణికి పరిశీలకుడిగా (డెజిగ్నేటెడ్ ఎగ్జామినర్)గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ‘ఏవియాజియోన్’ పేరుతో ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బోయింగ్ 787 విమానాల విషయంలో ఆర్ఎస్ సంధుకు సుదీర్ఘానుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నందున ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ఆయన మరింత లోతుకెళ్లడంతోపాటు దర్యాప్తుకు విశ్వసనీయత కల్పిస్తారని భావిస్తున్నారు. మరోవైపు- దర్యాప్తులో సహకారం అందిస్తున్న ఇతర ‘డొమైన్ ఎక్స్పర్ట్స్’ పేర్లను ఏఏఐబీ వెల్లడించలేదు. సంజీవ్ కుమార్ సింగ్ (56) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఎయిరిండియా విమాన దుర్ఘటనపై దర్యాప్తు చేస్తోంది. - జమ్ముల శ్రీకాంత్AAIB Engages Captain RS Sandhu as AI Expert for Ahmedabad Plane Crash InvestigationAAIB Engages Captain RS Sandhu as AI Expert for Ahmedabad Plane Crash Investigation -
రన్‌వేపై జారిన ఎయిరిండియా విమానం.. అంతా సేఫ్
కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి జారిపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రకటించారు. కొచ్చి(కేరళ) నుంచి వచ్చిన విమానం భారీ వర్షంలో విమానం ల్యాండ్ అయ్యింది. అయితే ఆ సమయంలో టైర్లు పేలిపోవడం వల్లే విమానం పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు హుటాహుటిన ఫ్లైట్ నుంచి దిగేశారు. ఈ ఘటనతో ఇంజిన్ కూడా డ్యామేజ్ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.Runway scare: #Kochi-bound #AirIndia flight veers off course during landing at #Mumbai airport; passengers safeMore details🔗https://t.co/nhauXEYCrs pic.twitter.com/NewRgbZFyD— The Times Of India (@timesofindia) July 21, 2025 -
టేకాఫ్ అయిన ఎనిమిది నిమిషాలకు..
శంషాబాద్ (హైదరాబాద్): టేకాఫ్ తీసుకున్న ఎనిమిది నిమిషాల ప్రయాణం తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించడంతో ఫుకెట్ విమానం వెనక్కి తిరిగి వచి్చంది. వివరాలివి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్–110 విమానం (బోయింగ్ 737) శనివారం ఉదయం 6.41 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరేందుకు టేకాఫ్ తీసుకుంది. విమానంలో 98 మంది ప్రయాణికులున్నారు.ఉదయం 6.49 గంటల సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు.. ఏటీసీ అనుమతి మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 6.57 గంటలకు సురక్షితంగా దించారు. సాంకేతిక సమస్యల సర్దుబాటు అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు తిరిగి ఫుకెట్ విమానం బయల్దేరినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. -
దర్యాప్తు నివేదికతో మరిన్ని అనుమానాలు
న్యూఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు అనంతరం మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ పేర్కొన్నారు. పైలట్ల సామర్థ్యాన్ని కొట్టిపారేయలేమన్న ఆయన.. విమానంలో మెకానికల్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన లోపాలేవీ ఈ నివేదిక పేర్కొనలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘ప్రాథమిక నివేదిక విడుదలతోపాటు ఘటనకు దారి తీసిన పరిస్థితులు, కారణాలపై అదనంగా మరిన్ని వివరాలు వెల్లడవుతున్నాయి. ఇది మరింత స్పష్టతను, మరిన్ని ప్రశ్నలను లేవనెత్తడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు’అంటూ ఆయన తమ సిబ్బందికి పంపిన అంతర్గత మెమోలో పేర్కొన్నారు. ఇంధన నాణ్యతలోగానీ, టేకాఫ్ ప్రక్రియలోగానీ తేడాల్లేవన్నారు. అదేవిధంగా, ఇద్దరు పైలట్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష కూడా జరిగిందన్నారు. ‘ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి ఎలాంటి కారణం గుర్తించలేదు. ఎటువంటి సిఫారసులు చేయలేదు. పైపెచ్చు ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే ఊహాగానాలకు తెరలేపవద్దు’అని కోరారు. తుది నివేదిక వెలువడే వరకు మరిన్ని సెనేషనల్ వార్తలు, వదంతులు వస్తాయనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ)శనివారం ప్రాథమిక నివేదిక విడుదల చేయడం తెల్సిందే. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం రెండు ఇంజన్ల ఫ్యూయల్ సప్లయ్ స్విచ్‌లు నిలిచినట్లు పైలట్ల మధ్య సంభాషణల ద్వారా వెల్లడైందని తెలిపింది. ఫ్యూయల్ స్విచ్‌లను తనిఖీ చేయించండి: డీజీసీఏ ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడమే అహ్మదాబాద్ ఘటనకు దారి తీసినట్లు తేలడంతో దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలిచి్చంది. ఆయా సంస్థలు తమ బోయింగ్ 787, 737 రకం విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. కాగా ఎయిరిండియా ప్రమాద నివేదికలోని కీలక విషయాలను ప్రభుత్వం వెల్లడించకమునుపే వాల్‌స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఎలా తెలిసిపోయాయని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు. -
‘నో కామెంట్’.. ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా మౌనం
న్యూఢిల్లీ: జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి, 260 మంది మరణించిన ఘటనపై చురుకుగా దర్యాప్తు సాగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను వెలువరించించి. దీనిపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు సంఘీభావం తెలిపింది. బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని పేర్కొంది. అలాగే విచారణ ఇంకా కొనసాగుతున్నందున ఇప్పుడే దీనిపై ఎటువంటి కామెంట్ చేయలేమని స్పష్టం చేసింది.ఎయిర్‌లైన్‌కు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక జూలై 12న అందింది. విమాన ప్రమాదం దర్యాప్తులో ఎయిర్ ఇండియా ఏఏఐబీ, ఇతర అధికారులకు నిరంతరం సహకారం అందిస్తోంది. క్యారియర్ నియంత్రణ సంస్థలు, భాగస్వాములకు పలు వివరాలు అందిస్తోంది. ప్రమాదంపై వెలువడిన ప్రాథమిక వివరాలపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్నదని, అందుకే దీనిపై ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించబోమని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక వివరాలను మేము అంగీకరిస్తున్నామని ‘ఎక్స్’ పోస్టులో తెలిపింది.ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి 260 మంది మరణించడానికి కొద్దిసేపటి ముందు విమానంలోని ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆపివేసివున్నాయి. తరువాత ఆన్ చేశారని తేలింది. కాగా బోయింగ్ 787-8 విమానాల ఆపరేటర్లు తక్షణ భద్రతా చర్యలు చేపట్టలేదని ఏఏఐబీ తన నివేదికలో చెప్పకపోయినా, విమానంలో ఇంధన నియంత్రణలను మార్చడం దర్యాప్తులో కీలకమైన అంశంగా పేర్కొంది. దీనిపై లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.. అసలు కారణం అదే
ఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈ నివేదికపై బోయింగ్ సంస్థ స్పందిస్తూ.. విచారణకు సహకరిస్తామని చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో.. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే క్రాష్‌ల్యాండ్ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్‌పిట్ వాయిస్‌లో పైలట్ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. విచారణకు సహకరిస్తాం: బోయింగ్‌అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీనిపై బోయింగ్ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది.🚨🇮🇳#BREAKING | NEWS ⚠️ apparently the fuel cut off switches were flipped “from run to cutoff “just after takeoff starving the engines of fuel causing the Air India plane to crash 1 pilot can be heard asking the other” why he shut off the fuel” WSJ report pic.twitter.com/XZp5DHzRnb— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 11, 2025ఇదిలా ఉండగా.. జూన్ 12న ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికిపైగా మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. దీంతో, హస్టల్లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. Preliminary reports suggests that the Air India crash last month was caused by one of the pilots flipping a switch that cut off the fuel supply to the engines Not really sure how I feel about this….@AirNavRadar pic.twitter.com/AkW6tPMiaR— Flight Emergency (@FlightEmergency) July 11, 2025 -
కేంద్రం చేతికి ఎయిరిండియా ఘటన ప్రాథమిక నివేదిక
భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం✈️ ప్రాథమిక నివేదిక కేంద్రానికి చేరింది. త్వరలో ఇందులోని వివరాలను ప్రజల కోసం బహిర్గతం చేసే అవకాశం ఉంది. న్యూఢిల్లీ: జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం సెకన్ల వ్యవధిలోనే నేలకూలి పేలిపోయింది. ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు 270 మంది మరణించారు. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) తన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖ, సంబంధిత అధికార వర్గాలకు అందజేసింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఇప్పటిదాకా సేకరించిన విషయాలను, దర్యాప్తు తాలుకా వివరాలను ఆ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రాథమిక నివేదికలో ఏం ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విమాన ప్రమాదానికి కారణాలు అందులో ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఈ వారం చివర్లో ఈ నివేదికను విడుదల చేసే అవకాశం ఉంది. 📌 ప్రమాదం వివరాలు:తేదీ: జూన్ 12, 2025 మధ్యాహ్న సమయంవిమాన నంబర్: AI-171 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్)స్థలం: అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన వెంటనే, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయిందిమృతులు: 241 మంది ప్రయాణికులు, 31 మంది మెడికల్ విద్యార్థులు సహా మొత్తం 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు🧾 ప్రాథమిక నివేదికలో ముఖ్యాంశాలు?..బ్లాక్‌బాక్స్ డేటా విజయవంతంగా డౌన్లోడ్ చేసి విశ్లేషణ ప్రారంభించారుకాక్పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారుపైలట్ మేడే కాల్లో “నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్” అని చెప్పిన ఆడియో రికార్డు దొరికింది✈️ అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖకు జూలై 8న అందజేసింది.🔍 తదుపరి దర్యాప్తు:AAIB నివేదికను ఆధారంగా తీసుకుని పూర్తి నివేదికను మూడు నెలల్లోగా సమర్పించాల్సిందిగా కేంద్రం ఆదేశించిందిమరోవైపు ఎన్ఐఏ కూడా కుట్ర కోణంపై విచారణ ప్రారంభించింది -
Ahmedabad: ఎయిరిండియా విమానం ప్రమాదానికి కారణం ఏంటంటే?
సాక్షి,ఢిల్లీ: భారత విమానయాన చరిత్రలో ఘోర విషాదంగా నిలిచిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చినట్లు బ్లూబెర్గ్ నివేదించింది. విమాన దుర్ఘటనకు కారణం రెండు ఇంజిన్లు విఫలం కావడం వల్లేనని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు భావిస్తున్నారు. కాబట్టే విమాన సిబ్బంది ప్రమాదాన్ని నిరోధించే ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని, తద్వారా అపార ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలుస్తోంది. విమానంలో అత్యవసర విద్యుత్ సరఫరా కోసం ఉపయోగించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) యాక్టివేషన్ యాక్టివేట్ కావడం వల్ల విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం వల్లేనని తేలింది. కానీ,సాధారణ లోపాల వల్ల ప్రమాదం జరగలేదని తేటతేల్లమైంది. వీటితో పాటు విమాన ప్రమాదానికి గల కారణాల్ని రాబట్టేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) డేటాను విశ్లేషిస్తున్నారు. ఇది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించనుంది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఓ వైద్య కళాశాల వసతిగృహంపై కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతిచెందగా.. 19 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒకేఒక వ్యక్తి మృత్యుంజయుడిగా ప్రాణాలతో భయటపడ్డాడు. -
Air India Plane: ఒక్కసారిగా 900 అడుగుల కిందకు.. విచారణకు ఆదేశం!
ఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అతి పెద్ద దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఇది యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరి వెళ్లే క్రమంలో సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 241 విమానంలో ఉన్నవారు చనిపోగా, ఈ దుర్ఘటన కారణంగా చనిపోయిన వారి సంఖ్య 275కు పెరిగింది. ఇది జూన్ 12వ తేదీన జరిగిన ఘటన. అయితే ఆపై మరో రెండు రోజులకు ఒక పెను ప్రమాదం తప్పిందనే వార్త తాజాగా వెలుగుచూసింది. దీతాజాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించడంతో పెను ప్రమాదం తప్పిందనే విషయం బయటకొచ్చింది. ఈ ఘటనను జాతీయ మీడియా హైలైట్ చేయడంతో వామ్మో మరో ఘోర ప్రమాదం తప్పిందని అనుకోవడం ప్రజల వంతైంది.అసలు విషయంలోకి వెళ్లే.. జూన్ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నా బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పై నుంచి కిందకు దిగిపోయింది. ఉన్నపళంగా 900 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి పోవడంతో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి నియంత్రణలోకి తెచ్చారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 777 AI-187 విమానం.. ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ నుంచి వియన్నాకు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం 900 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో వార్నింగ్ సిగ్నల్ వెళ్లింది పైలట్లకు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన పైలట్లు భద్రతాపరమైన చర్యలు చేపట్టడంతో విమానం మళ్లీ అదుపులోకి వచ్చింది. ఆపై దీన్ని సురక్షితంగా వియన్నా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల్లో వియన్నాలో ఆ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం తర్వాత ప్రయాణికులు హడలెత్తిపోతుండగా.. వరుసగా అదే సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వామ్మో ఎయిరిండియా అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టోక్యో-ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా కోల్‌కతాకు మళ్లించారు. ఢిల్లీకి వస్తున్న AI 357 బోయింగ్ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది.. క్యాబిన్లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్‌కతాలో ల్యాండ్ చేశారు.విమానం కోల్‌కతాలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానంలో సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయని పేర్కొంది. కోల్‌కతాలోని గ్రౌండ్ సిబ్బంది.. ప్రయాణీకులకు సహాయం చేస్తున్నారని.. వీలైనంత త్వరగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. -
విమాన ప్రమాదం వెనుక విద్రోహ చర్య?: మంత్రి మురళీధర్ మోహోల్
న్యూఢిల్లీ: ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై అన్ని కోణాలలో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. ఈ ప్రమాదం దరిమిలా ఎయిర్ ఇండియా విమానం ఏI 171లోని బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, దానిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారని అన్నారు.విమాన ప్రమాదం దురదృష్టకర సంఘటన అని, ఏఏఐబీ దీనిపై పూర్తి దర్యాప్తు ప్రారంభించిందని, దీనిలో ఏదైనా విద్రోహ చర్య ఉందా? అనే అంశంతో పాటు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లను సంబంధిత అధికారులు సమీక్షిస్తున్నారని, పలు సంస్థలు విచారణలో భాగస్వామ్యం వహిస్తున్నాయని మోహోల్ తెలిపారు. జూన్ 12న లండన్‌కు వెళ్తున్న బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 ఫ్లీట్‌కు చెందిన ఏI 171 విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒకరు మాత్రమే ప్రమాదం నుండి బయటపడ్డారు.ఈ ప్రమాదాన్ని మంతి మురళీధర్ మోహోల్ అరుదైన కేసుగా అభివర్ణించారు. రెండు ఇంజిన్లు ఒకేసారి షట్ డౌన్ కావడం ఎప్పుడూ జరగలేదంటూ, అనుభవజ్ఞులైన పైలట్లు, నిపుణుల వాదనలను ఆయన గుర్తుచేశారు. విచారణ అనంతరం నివేదిక వచ్చిన తర్వాతనే ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని అన్నారు. ఈ ఘటనపై నివేదిక మూడు నెలల్లో వస్తుందని కూడా ఆయన తెలిపారు. కాగా బ్లాక్ బాక్స్‌ను పరిశీలన కోసం విదేశాలకు పంపుతారనే వాదనలను మోహోల్ తోసిపుచ్చారు. -
విమానం రెక్కలో ఇరుక్కున్న గడ్డి
ముంబై: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఈ నెల 25న ముంబై విమానాశ్రయంలో దాదాపు 5 గంటలపాటు నిలిచిపోయింది. విమానం ఒక రెక్క దిగువ భాగంలో గడ్డి ఇరుక్కుపోయి ఉండటమే ఇందుకు కారణమని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. గమనించిన వెంటనే తొలగించి, విమానం టేకాఫ్‌కు క్లియరెన్స్ ఇచ్చామంది. అయితే, ఆ విమానం ఏ రకానిది? అందులోని ప్రయాణికులు, సిబ్బంది సంఖ్య ఎంత? టేకాఫ్ షెడ్యూల్ సమయం? ప్రయాణికులు ఎంతసేపు విమానంలో ఉండిపోయారు? వంటి వివరాలను టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా వివరించలేదు. రెక్క దిగువ భాగంలో గడ్డి ఎలా చేరిందని విషయాన్ని సైతం తెలపలేదు. అయితే, ముంబైలో ఉదయం 7.45 గంటలకు టేకాఫ్ తీసుకోవాల్సిన ఏఐ 2354 విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరినట్లు ఫ్లయిట్‌రాడార్24. కామ్ ట్రాక్ రికార్డును బట్టి తెలుస్తోంది. -
బాధలో అహ్మదాబాద్ బాధితులు.. డీజే పార్టీ జోష్‌లో ఎయిర్ ఇండియా ఉద్యోగులు
ఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా (Air India) విమానం కూలిపోయిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన నుంచి మృతుల కుటుంబాలు, ప్రజలు తేరుకోక ముందే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఉద్యోగులు.. ఆఫీసులోనే పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంస్థ.. నలుగురు సీనియర్ల ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగులు పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్ (గతంలో సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీసెస్) ఎయిరిండియా భాగస్వామ్యంతో (AISATS) దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి గ్రౌండ్ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్‌లోని ఏఐఎస్ఏటీఎస్ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.A video showing senior Air India SATS (AISATS) executives dancing at a DJ party in their Gurugram office—just eight days after the deadly Flight AI171 crash—has sparked public outrage.The June 20 celebration, reportedly attended by top officials of AISATS (Air India SATS… pic.twitter.com/jBQwUSBstd— Mid Day (@mid_day) June 23, 2025విమాన ప్రమాదం కారణంగా ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం కనీన మానవత్వం లేదా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ప్రయాణీకుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతోపాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. -
ఎయిరిండియాలో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్..
న్యూఢిల్లీ: నష్టాలతో నడుస్తున్న విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో ప్రమోటర్ సంస్థలు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. వీటిలో ఒక్క చివరి నెల(మార్చి)లోనే రూ. 4,306 కోట్లు అందించాయి. 2022 జనవరి మొదలు టాటా గ్రూప్ ఎయిరిండియాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లలో సరికొత్త మార్పులకు తెరతీసే(ట్రాన్స్ఫార్మేషన్) ప్రణాళికలను అమలు చేస్తోంది.2024 నవంబర్‌లో రెండు సంస్థల భాగస్వామ్య కంపెనీ విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేశాయి. తద్వారా ఎయిరిండియాలో సింగపూర్ సంస్థ 25.1 శాతం వాటా దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా మూలధన వ్యయాలకుగాను ప్రమోటర్ సంస్థలు గతేడాది రూ. 9,500 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రయివేట్ రంగ విమానయాన దిగ్గజానికి టాటా సన్స్ రూ. 3,225 కోట్లు, సింగపూర్ ఎయిర్‌లైన్స్ రూ. 6,333 కోట్లు చొప్పున అందించినట్లు వెల్లడించారు. నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు వర్కింగ్ క్యాపిటల్, వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా సమకూర్చినట్లు తెలియజేశారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం ఈ మార్చిలో టాటా సన్స్ రూ. 3,225 కోట్లు, సింగపూర్ సంస్థ రూ. 1,081 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మార్చి పెట్టుబడులకు ముందు ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ దాదాపు రూ. 5,253 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కాగా.. 2024 డిసెంబర్31తో ముగిసిన 9 నెలల కాలంలో ఎయిరిండియా గ్రూప్ అనుకోని పద్దులకు ముందు రూ. 8,033 కోట్ల నష్టాలు ప్రకటించింది. ఇదే కాలంలో ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం రూ. 56,367 కోట్ల ఆదాయం సాధించింది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం
గాంధీనగర్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా.. 34 ఎయిరిండియా విమానం ఢీ కొట్టిన బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్‌కు చెందిన వారు ఉన్నారని మంగళవారం (జూన్ 24న)గుజరాత్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విమానం అహ్మాదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఢీ కొట్టింది. దుర్ఘటనలో మొతత్తం మరణాల సంఖ్యను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ప్రమాదం తీవ్రతతో ఘటనా స్థలంలో భౌతికకాయాల్ని గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది.దీంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన డీఎన్ఏను ఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాలతో పోల్చి చూస్తున్నారు. మృతదేహాల్ని వారిక కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. కొన్ని మృతదేహాల డీఎన్ఏ గుర్తింపు ఇంకా పురోగతిలో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదంఅహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం భారత విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. జూన్ 12న, లండన్‌కు బయలుదేరిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది.ప్రమాదం ఎలా జరిగింది?- విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే పైలట్ మేడే కాల్ ఇచ్చారు.- విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా 475 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది.- విమానం మేఘాణి నగర్ ప్రాంతంలోని జనావాసాలపై కూలి, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను ఢీకొట్టింది.- ప్రమాద సమయంలో విమానంలో 241 మంది ప్రయాణికులు ఉండగా, నేలపై ఉన్న 34 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.కారణాలు ఏమిటి?- ప్రాథమికంగా హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం అనుమానంగా భావిస్తున్నారు.- బోయింగ్ 787-8 మోడల్ గతంలోనూ సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచింది- బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషణ జరుపుతున్నారు.ఒకే ఒక్కడు ఎలా బతికాడు?విశ్వకుమార్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కూలిన సమయంలో అతని సీటు విరిగిపడి బయటకు పడిపోయింది. శిథిలాల మధ్య నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఎయిరిండియా కీలక నిర్ణయం.. గల్ఫ్ మీదుగా వెళ్లే విమానాలు రద్దు
గల్ఫ్ దేశాల్లో సైరెన్లు మోగుతున్నాయి. గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. ఖతార్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. యూరప్, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలకు సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేసింది.మరోవైపు, ఖతార్‌లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఖతార్ అధికారుల మార్గదర్శకాలను పాటించాలని భారత్ తెలిపింది. కాగా, ఇరాన్ దాడులను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నా ఖతార్.. ఇతర దేశాల పౌరుల భద్రతకు ముప్పులేదని తెలిపింది. దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని ఖతార్ స్పష్టం చేసింది.కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్‌లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్‌లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలాలను మూసేశాయి. తమ పైనా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్ ప్రకటించాయి. -
ఆ విమానాలు నిలిపివేయడమే మంచిది
సాక్షి, హైదరాబాద్: ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 రకం విమానాల్లో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వాటి సర్వీసులను నిలిపివేయడమే మంచిదని విమాన ప్రయాణాలు సాగించేవారిలో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 రకం విమానం ఈ నెల 12న అహ్మదాబాద్‌లో కూలిపోవటంతో 270 దుర్మరణం చెందారు. ఈ ఘటన తర్వాత విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించి ఏయే అంశాలపై ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారన్నది తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా తాము ప్రయాణించబోయేది ఏ రకం విమానం అన్నదానికి ప్రయాణికులు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది. 41 శాతం మంది తాము ఏ రకమైన విమానంలో ప్రయాణించబోతున్నాము.. అది ఏ కంపెనీది అన్నది కూడా చూస్తున్నారు. సర్వేలోని కొన్ని ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు.. -
DGCA సీరియస్.. ఎయిరిండియా నుంచి ముగ్గురి తొలగింపు
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ క్షణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఇటీవల బెంగళూరు నుంచి లండన్ హీత్రోకు బయలుదేరిన రెండు విమానాలు(మే 16, 17వ తేదీల్లోని AI133 సర్వీస్).. గరిష్ట విమాన ప్రయాణ సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డీజీసీఏ.. ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏడు రోజుల గడువు విధించింది. అదే సమయంలో..నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ఎయిరిండియాకు చెందిన ముగ్గురు సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఉప్రకమించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. ‘‘నిబంధనలు పాటించకుండానే విమానాలను షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా, వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డీజీసీఏ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో.. వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజులలోపు డీజీసీఏకి నివేదించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త వారినే కొనసాగించాలని తెలిపింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన. ఐవోసీసీ అడిటింగ్లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు విమానం కూలినచోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా కన్నుమూశారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరింది. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. -
ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా?
బాలీవుడ్ నటుడు, కమెడియన్ విర్ దాస్ (Vir Das) చిక్కుల్లో పడ్డాడు. ఎయిరిండియాకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 241 మంది మరణించారు. అంతమంది చావుకు కారణమైన ఎయిరిండియాను పొగుడుతూ తాజాగా అతడు ఓ ట్వీట్ వేశాడు.పీఆర్ స్టంట్?నేను లండన్ నుంచి ఇంటికి ఎయిరిండియా (Air India) విమానంలోనే వచ్చాను. నాకెంతో గొప్పగా అనిపించింది. సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. వారిది ఎంతో మంచి మనసు అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఫ్రీ టికెట్ ఇచ్చారా?, ఈ చెత్త పీఆర్ స్టంట్ చేసేవారికి నేను చెప్పేది ఒక్కటే.. ఇలాంటి సమయంలో ఈ ట్వీట్లు వేయడం బాధాకరం. మీ స్థాయిని మీరే తగ్గించేసుకుంటున్నారు అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.మా తాత..దాంతో విర్ దాస్.. తనది పీఆర్ స్టంట్ కాదని వివరణ ఇచ్చాడు. ఎయిరిండియాకు నేనెందుకు సపోర్ట్ చేస్తున్నానో మీకు చెప్తాను.. మా తాత ఎయిరిండియాలోనే పని చేసేవాడు. ఆ సంస్థ విమానాల్లోనే నేను నలుమూలలా ప్రయాణించాను. ఆ విమానాల్లో నేను కూర్చోని సీటు అంటూ లేదు. అయితే, ఈ ఎయిరిండియాలో కొన్ని సమస్యలున్నాయి. కానీ, ఏ సిబ్బంది కూడా మిమ్మల్ని చులకనగా చూడరు. నవ్వుతూ ఆహ్వానిస్తారు. వారిని కూడా ఈ విమాన ప్రమాదంలో మనం కోల్పోయాం. ఈ నష్టాన్నెందుకు ఎవరూ గుర్తించడం లేదు. నేను మాత్రం వారికి మద్దతిస్తున్నాను అని క్లారిటీ ఇచ్చాడు. అనంతరం ఈ ట్వీట్‌ను డిలీట్ చేశాడు.అప్పుడు కూడా ఇంతే!జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పుడు కూడా విర్ దాస్ ఎయిరిండియాకు సపోర్ట్ ఇచ్చాడు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన రోజు ఇది! వారి కుటుంబాలకు ఇదే నా ప్రగాఢ సానుభూతి. విమాన సిబ్బందికి కూడా నా సపోర్ట్ తెలియజేస్తున్నాను. నా జీవితం మొత్తం ఎయిరిండియాలోనే తిరిగాను. ఇక్కడ సమస్యలు లేవని కాదు, కానీ, ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఎయిరిండియాలో పనిచేసే సిబ్బంది బెస్ట్ క్రూ అని మాత్రం బాగా తెలుసు. అసలు ఈ విషాదం ఎలా జరిగిందనేది సమయమే నిర్ధారిస్తుంది. పని చేస్తున్న ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోవడం ఎంత బాధాకరమో ఊహకు అందకుండా ఉంది అని ట్వీట్ చేశాడు. I flew Air India home from London. It was all great. The crew, happy to report, still the kindest in the sky. @airindia— Vir Das (@thevirdas) June 20, 2025 చదవండి: కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా? -
Air India Flight: విమానంలో వైద్యురాలు హల్చల్
కర్ణాటక: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో క్యాబిన్ సిబ్బందితో వాగ్వాదం జరిపి నిందించిన ప్రయాణికురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు నుంచి సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఐఎక్స్ 2749 విమానం బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఈ సంఘటన జరిగింది. యలహంక సమీపంలోని శివనహళ్లి నివాసి వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్ భాయ్ తనకు కేటాయించిన సీట్ నంబర్– 20లో కూర్చోడానికి ముందు ముందు వరుసలో ఉన్న సీట్లో తన బ్యాగులను ఉంచింది. దీన్ని ప్రశ్నించిన సిబ్బందితో ఆమె తీవ్రంగా వాగ్వాదానికి దిగింది. అందరినీ నిందిస్తూ బాంబు పెట్టి విమానాన్ని పేల్చేస్తానని ఆగ్రహంతో ఊగిపోయింది. పైలట్, విమాన సిబ్బంది ఎంత నచ్చచెప్పినా ఆమె తగ్గలేదు. తోటి ప్రయాణికులతో కూడా గొడవ పడింది. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. #ViralVideo… pic.twitter.com/aQMeuyUyfj— PulseNewsBreaking (@pulsenewsbreak) June 19, 2025 -
ఎయిరిండియా రద్దుల పద్దు!
చూడబోతే ఎయిరిండియాకు కష్టాలన్నీ ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. ఈ నెల 12న గుజరాత్లో జరిగిన దురదృష్ట ఘటనలో 272 మంది మరణించిన తర్వాత ఎయిరిండియా విమానాలు ఎక్కాలన్నా, ప్రత్యేకించి ప్రమాదం సంభవించిన బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ రకం విమానాల్లో ప్రయాణించాలన్నా చాలామంది భయపడుతున్నారు. అందుకు తగినట్టే ఆ సంస్థ అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో వినియోగించే దాదాపు 90 విమాన సర్వీసుల్ని అంచెలంచెలుగా రద్దుచేస్తూ పోతోంది. శుక్రవారం కూడా ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. నిర్వహణాపరమైన, సాంకేతికమైన సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతోంది. వీటికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇరాన్ గగనతలాన్ని మూసివేయటం వంటివి కూడా విమాన సర్వీసుల రద్దుకు దోహదపడ్డాయి. జూలై రెండో వారం వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతంమేర తగ్గించనున్నామని ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు కూడా ఏమంత భరోసాతో లేరు. అసలు విమానయానమే వద్దనుకున్నవారు కొందరైతే, బోయింగ్ విమానాలు ఎక్కరాదని మరికొందరు నిర్ణయించుకుని ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. విమానయాన సంస్థలను నియంత్రించే పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానాల్లో భద్రతకు సంబంధించిన ప్రధాన లోపాలేమీ లేవని, కేవలం నిర్వహణాపరమైన సమస్యలే ఉన్నాయని చెబుతోంది. భిన్న విభాగాల మధ్య సమన్వయం అవసరమవుతుందని సలహా ఇచ్చింది. ఎక్కడ ఏ చిన్న లోపాన్ని గమనించినా దాన్ని నమోదు చేయటం, వెనువెంటనే సరిదిద్దటం వంటివి జరగాలని సూచించింది. ఎయిర్‌లైన్స్ సంస్థలకు రేటింగ్ ఇచ్చే అంతర్జాతీయ స్వతంత్ర ఆన్లైన్ సంస్థ పరిశీలనలో ఇండిగో, ఆకాశ సంస్థలు ఏడు అంశాల్లో ఆరు పాయింట్లు సాధించాయి. స్పైస్ జెట్ ఏడుకు ఏడు పాయింట్లు పొందగా, ఎయిరిండియా కేవలం నాలుగు పాయింట్లే సాధించటం గమనించదగ్గ అంశం. ఇక బోయింగ్ డ్రీమ్‌లైనర్ భద్రతా లోపాలపై ఫిర్యాదు చేసిన ఇంజినీర్ జార్జి బార్నెట్ అనుమానాస్పద స్థితిలో నిరుడు మార్చిలో మరణించిన ఉదంతం కలవరపరుస్తుంది. ఆ సంస్థ క్వాలిటీ కంట్రోల్లో 32 ఏళ్లు పనిచేసిన బార్నెట్ రెండ్రోజులు విచారణకు హాజరై మూడో రోజు ఎందుకు తుపాకీతో కాల్చుకుంటాడన్నది ప్రశ్నార్థకమైంది.టాటా ఎయిర్‌లైన్స్‌గా ఉన్న సంస్థను 1953లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయం చేసి, ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశీయ విమాన సర్వీసుల కోసం ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆవిర్భవించింది. ఈ రెండూ పబ్లిక్ రంగ సంస్థలు కావటంతో పౌర విమానయాన రంగంలో అవి దిగ్గజ సంస్థలుగా వెలిగాయి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై విమానయానంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించటం, తక్కువ ధరకే ప్రయాణికులను చేరేవేసే సంప్రదాయాన్ని ప్రారంభించటంతో అంతక్రితమే నష్టాలతో ఉన్న ఆ సంస్థ మరింతగా కుంగిపోవటం మొదలైంది. అసలు విమానయాన రంగంలో ప్రైవేటును అనుమతించినప్పుడే ఎయిరిండియా నిర్వహణను పూర్తిగా నిపుణులకు వదిలేయాల్సింది. కానీ పగ్గాలు ప్రభుత్వం దగ్గరే ఉండటం, దానికి లోబడి సంస్థ పనిచేయాల్సి రావటంతో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. టాటా సన్స్ 2022లో ఎయిరిండియాను తీసుకున్నప్పుడు విమానయాన రంగాన్నే సంపూర్ణంగా మారుస్తామని ప్రకటించింది. దశాబ్దాల అసమర్థ ఉద్యోగస్వామ్యాన్ని తొలగించి, గర్వించదగిన గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపింది. మూడేళ్లు గడిచాయి. కానీ చెప్పుకోదగ్గ మార్పుల జాడలేదు. అలాగని ఎయిరిండియా ఏమీ చేయలేదని కాదు. సిబ్బందికి పునఃశిక్షణనిచ్చింది. వారి యూనిఫాంని మార్చింది. యాప్‌ను సరికొత్తగా తీసుకొచ్చింది. అయితే, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలు జరగలేదన్న మాటేగానీ లోపాల పరంపర గురించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇందులో పారిశుద్ధ్యం మొదలుకొని విరిగిపోయిన సీట్లు, నాసిరకం ఉపకరణాలు వగైరాలున్నాయి. అయినా పెద్దగా ఫలితం లేదు. ఇక అస్వస్థతగా ఉండి సెలవు పెట్టినవారిని సైతం ఒత్తిడి తెచ్చి విధినిర్వహణకు పిలిచిన సందర్భాలున్నాయని పైలెట్ల ఫిర్యాదు. ఇవన్నీ విడివిడి ఘటనలుగా కొట్టిపారేయటం కాక వాటివెనక అల్లుకునివున్న నిర్లక్ష్యాన్నీ, అలసత్వాన్నీ సకాలంలో గమనించుకుంటే పరిస్థితి మెరుగుపడేది. నిరుడు ఢిల్లీ–శాన్ఫ్రాన్సిస్కో సర్వీస్ విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా రష్యాలో రోజుల తరబడి నిలిచిపోయింది. మరుగుదొడ్లు పనిచేయక చికాగోకు బయల్దేరిన విమానం కాసేపటికే వెనుదిరిగింది. టాటా బ్రాండ్‌కు మార్కెట్లో మంచి పేరుంది. వాటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో విశ్వాసం ఉంది. ఎయిరిండియా దాన్ని అందుకోలేకపోయింది. నిరుడు మే నెలలో ముంబై–లండన్ సర్వీసు బోయింగ్ 787 విమానంలో తలుపు సరిగా పనిచేయటం లేదంటూ ఫిర్యాదు చేశాక, దాన్ని వెనక్కు తీసుకోవాలని తమపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, నిరాకరించినందుకు షోకాజ్ నోటీసులు జారీచేసి, 48 గంటలు దాటకుండా ఉద్యోగం నుంచి తొలగించారని సీనియర్ ఫ్లయిట్ అటెండెంట్లు ఇద్దరు ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయటం గమనించదగ్గది. ప్రవర్తన సరిగా లేకపోవటం, విధి నిర్వహణ సక్రమంగా చేయక పోవటం వంటి కారణాలతోనే వారిని తొలగించామని సంస్థ సంజాయిషీ ఇస్తోంది. అంతా సవ్యంగా గడిచినంతకాలం నిర్వాహకులు తమను తాము అభినందించుకుంటూ కాలం గడుపుతారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థ ఉంటే ఇలాంటివి చోటుచేసుకోవు. ఈ విషాద ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్చుకోవాలి. అత్యంత జాగరూకతతో మెలగాలి. -
ఎయిరిండియా అంటేనే వణికిపోతోంటే....పేల్చేస్తా అంటూ మహిళ వీరంగం!
ఎయిరిండియా విమానం కూలిన దుర్ఘటన తాలూకు విషాదం మన మనసుల్లోకి తొలగి పోక ముందే ఒక మహిళా ప్రయాణికురాలు అనుచితం ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ‘విమానం- క్రాష్’ అన్న పదాలు వింటేనే ఉలిక్కి పడుతున్న ప్రస్తుత తరుణంలో స్వల్ప వివాదానికే విమానాన్ని కూలిపోతుంది అంటూ అంటూ నానా గలాటా సృష్టించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన ఈ సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళా ప్రయాణీకురాలు, వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్‌భాయ్ (36) బ్యాగ్ స్థలం కోసం విమాన సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలోని తన సీటు 20Fలో కూర్చునే ముందు మొదటి వరుసలో తన బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. దీంతో దీన్ని ఆమె సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉంచమని సిబ్బంది కోరారు. అంతే ఆవేశంతో ఊగిపోతూ , "విమానం కూలిపోతుంది" అంటూ గొడవకు దిగింది. క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఇది తప్పు అన్న తోటి ప్రయాణీకులపై కూడా అరిచిందిట. దీంతో పైలట్ , సిబ్బంది భద్రతా సిబ్బంది మరియు CISF సిబ్బందికి సమాచారం అందించారు, వారు ఆమెను విమానం నుండి కిందికి దింపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాన్ని కూల్చివేస్తామని బెదిరించిందన్న ఆరోపణలపై ఆ మహిళా వైద్యుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
పక్షి ఢీ కొట్టడంతో ఎయిరిండియా విమాన సర్వీస్ రద్దు!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు.. ఆ మాటకొస్తే మిగతా సంస్థల విమానాలు కూడా రకరకాల కారణాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. పక్షికి ఢీ కొట్టడంతో ఏకంగా ఎయిరిండియా విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణే (మహారాష్ట్ర)కు ఎయిరిండియా AI2470 విమానం చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్ టీంను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు జరిపింది. ఆపై ఆ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.#AirIndia Pune-bound flight from Delhi suffers a bird hit, forcing the airline to cancel its return journey.Read more ⬇️https://t.co/kzYUgPcSiW— NDTV Profit (@NDTVProfitIndia) June 20, 2025✈️ జరిగింది ఇదే..జూన్ 20వ తేదీ.. ఉదయం 5:31కి ఢిల్లీ నుంచి ఏఐ2470 విమానం బయలుదేరి, 7:14కి పుణేలో ల్యాండ్ అయింది.ల్యాండింగ్ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో పక్షి ఢీకొన్నట్లు గుర్తించారు.దీంతో, అదే విమానంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 ఫ్లైట్‌ను రద్దు చేశారు.🛠️ తీసుకున్న చర్యలువిమానాన్ని గ్రౌండ్ చేశాక.. ఇంజినీరింగ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది.ప్రయాణికుల కోసం వసతి ఏర్పాట్లు, పూర్తి రీఫండ్లు లేదంటే ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటనప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా అందిస్తామని తెలిపిన ఎయిరిండియా. 🔍 జూన్ 12వ తేదీన లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు కింద ఉన్న మరో 38 మంది మరణించారు. ఈ ప్రమాద నేపథ్యంలో.. ఎయిరిండియా బోయింగ్ 787, 777 విమానాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. -
టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?
అహ్మదాబాద్‌లో 270 మందిని బలిగొన్న ఎయిరిండియా ఏఐ-171 డ్రీమ్‌లైనర్ ప్రమాదానికి టర్కిష్ ఎయిర్‌లైన్స్ మెయింటెనెన్స్ సెంటర్‌తో సంబంధం ఉందన్న ఊహాగానాలను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఖండించారు. టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఎయిరిండియా ఫ్లీట్‌లోని 33 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో ఏదీ టర్కీ సంస్థ నిర్వహణలో లేదని స్పష్టం చేశారు.‘ఎయిరిండియా ఆధ్వర్యంలోని 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఏ ఒక్కటీ టర్కిష్ సంస్థ నిర్వహణలో లేదు. వాటిలో చాలా వరకు ఏఈఎస్ఎల్, సింగపూర్‌లోని ఎస్ఐఏ ఇంజినీరింగ్ నిర్వహణలో ఉన్నాయి. బోయింగ్ 777 విమానాల్లో కొన్నింటిని మాత్రమే టర్కిష్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఆయా కాంట్రాక్టులు కూడా సమీక్షలో ఉన్నాయి’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రమాద సంఘటనపై జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి కొందరు విజిల్ బ్లోయర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరన్ ఈ వాదనలను ‘ఊహాజనితమైనవి’గా అభివర్ణించారు. ఘటనపై మరింత స్పష్టత వచ్చేందుకు విమాన డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లు, బ్లాక్ బాక్స్ నివేదికల కోసం వేచి ఉండాలని తెలిపారు.‘యూట్యూబ్, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఇలా చాలా మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బాక్స్ డేటాతో నిజం తేలుతుంది. దాని కోసం వేచిచూడాలి తప్పా ఓ నిర్ణయానికి రాకూడదు’ అని అన్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. వారిలో ఎవరినీ ఓదార్చడానికి నాకు మాటలు లేవు. టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థలో జరిగిన ఈ ప్రమాదం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో మేము వారికి తోడుగా ఉండడం తప్పా వారి లోటును తీర్చలేం. వారికి అన్ని విధాలుగా తోడుంటాం. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, కొడుకును కోల్పోయిన వారిని ఓదార్చడం చాలా కష్టం’ అని అన్నారు.ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధంఈ ఘోర ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. గుజరాత్ ప్రతినిధి, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ (ఎంవోసీఏ) కార్యదర్శి, ఎంహెచ్ఏ అదనపు కార్యదర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని దర్యాప్తులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసింది. -
భారీ సంఖ్యలో ఎయిరిండియా విమానాలు రద్దు
ఢిల్లీ: భారీ సంఖ్యలో విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు అయ్యాయి. నిర్వహణ సమస్యల వల్ల 8 విమానాలను రద్దు చేసింది. 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు పూర్తి రీఫండ్, ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశం కల్పిస్తునట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.రద్దయిన విమానాలు:AI906 (దుబాయ్–చెన్నై)AI308 (ఢిల్లీ–మెల్బోర్న్)AI309 (మెల్బోర్న్–ఢిల్లీ)AI2204 (దుబాయ్–హైదరాబాద్)రద్దయిన డొమెస్టిక్ విమానాలుAI874 (పుణె–ఢిల్లీ)AI456 (అహ్మదాబాద్–ఢిల్లీ)AI2872 (హైదరాబాద్–ముంబై)AI571 (చెన్నై–ముంబై)కాగా, జూన్ 21 నుంచి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు వెల్లడించింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత అంతరాయాలతో సతమతమవుతున్న ఎయిరిండియా.. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు 15 శాతం మేర తాత్కాలికంగా తగ్గించాలని ఇప్పటికే ఆ సంస్థ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు అమల్లో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది.ఢిల్లీ-నైరోబి, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో జూలై 15 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఢిల్లీ-నైరోబి రూట్లో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు చొప్పున విమానాలు నడుపుతున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.అలాగే.. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియాలోని నగరాలకు కలిపే 16 అంతర్జాతీయ రూట్లలో కూడా విమానా సర్వీసులను తగ్గించారు. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్లలో సర్వీసులను తగ్గించారు.యూరప్‌లో ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమృత్సర్-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్స్టర్డామ్ మార్గాల్లో కూడా విమానాల సర్వీసులను కుదించారు. అలాగే, ఢిల్లీ-మెల్బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా, ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) మార్గాల్లో కూడా సర్వీసులను తగ్గించారు.ఇదిలా ఉండగా, విమాన సర్వీసుల కుదింపుపై ఎయిరిండియా సీఈవో ప్రయాణికులకు వివరణ ఇచ్చారు. "విమాన ప్రయాణానికి ముందు భద్రతా తనిఖీలను కఠినతరం చేయడం, మధ్యప్రాచ్యంలో గగనతల మార్గాల మూసివేత వల్ల ప్రయాణ సమయం పెరగడం వంటి కారణాలతో ఈ కుదింపులు చేశాం" అని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఆయన ఎయిరిండియా తరఫున ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. -
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
ఒక ప్రమాదం, అందులోనూ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, జరగగానే ఒకటి రెండు రోజులు గగ్గోలు పెట్టడం, ఆ ప్రమాద కారణాలను గుర్తించి సవరించే పని ఎంత మాత్రమూ చేయకుండా మరొక ప్రమాదం దాకా మౌనంగా ఉండి పోవడం మన సమాజానికీ, రాజ కీయ నాయకత్వానికీ, ప్రచార సాధ నాలకూ బాగా అలవాటు అయిపోయింది. నిజానికి సమాజం మొత్తంగా ఇందులో చేయగలిగినదేమీ లేదు. ఆ బాధ్యత రాజకీయ నాయకత్వాలదీ, ప్రభుత్వాలదీ, అధికార వ్యవస్థలదీ! ఒక ప్రమాదం జరగగానే కూలంకుషంగా అధ్యయనం చేసి, ప్రమాద కారణాలను అన్వేషించి, మరొకసారి అటువంటి ప్రమాదం జరగడానికి వీలులేని విధంగా ఆ కారణాలన్నిటినీ తొలగించవలసిన బాధ్యత అధికార వ్యవస్థలదే! అహ్మదాబాద్ విమాన ప్రమాదం అత్యంత విషాద కరమైన, ఘోరమైన ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్ది సెకన్ల లోనే కూలిపోయి, 241 మంది విమాన ప్రయాణికులు, కనీసం 40 మంది ఇతరులు చనిపోయారు. ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో శాస్త్రీయ విశ్లేషణ జరిపి కారణాలు నిర్ధారించడానికి మూడు నాలుగేళ్లు పడుతుందంటున్నారు. ఈలోగా మన వాట్సప్ కార్ఖానాలూ, వాచాల త్వమే పెట్టుబడిగా నడుస్తున్న ఛానళ్లూ, సంచలనాత్మకమైతే చాలు ఎంత అబద్ధమైనా, ఎంత నిరాధారమైనా మాట్లాడ వచ్చునని అనుకుంటున్న సామాజిక మాధ్యమాలూ చాలా కారణాలను వండి వార్చాయి.ఈ ప్రమాదానికి సాంకేతిక కారణాలు ఎట్లాగూ అధ్యయనంలో బయటపడతాయి కాని ఈలోగా ఆలోచించ వలసిన సామాజిక, రాజకీయార్థిక కోణాల వైపు నుంచి చూస్తే అధికార వ్యవస్థల నిర్లక్ష్యం, లేదా లాభాపేక్షాపరుల అక్రమాలను అధికారులు అవినీతి వల్లనో, సోమరితనం వల్లనో చూసీ చూడనట్టు పోవడం మూల కారణం అని తేలుతుంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించి 2022 జనవరిలో టాటా గ్రూప్‌కు అప్పగించినప్పటి నుంచీ గడచిన మూడేళ్లలో ఆ సంస్థ నిర్వహణలో భద్రతా లోపాల గురించీ, నిర్వహణ లోపాల గురించీ, నిబంధనల ఉల్లంఘనలగురించీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనేక సార్లు మందలించింది, జరిమానాలు వేసింది, హెచ్చ రించింది. విమానాల నిర్వహణలో, కాక్ పిట్ క్రమశిక్షణలో, అంతర్గత జవాబుదారీతనంలో లోపాలను ఎత్తి చూపింది. అర్హత లేని పైలట్లను వాడుతున్నారని 2025 జనవరిలో కూడా ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించింది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అంత ర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత ప్రమాదకర విమానాశ్రయాలలో ఒకటని గతంలోనే పేరు పొందింది. విమానాలకు పక్షుల తాకిడి అతి ఎక్కువగా ఉండే విమానా శ్రయం అది. ఎందువల్లనంటే దాని రన్ వేలు సరాసరిగా కిక్కిరిసిన జనసమ్మర్దపు కాలనీలకూ, భవనాలకూ అంటు కుని ఉంటాయి. రన్ వేకూ నివాస గృహ, భవన సము దాయాలకూ మధ్య ప్రామాణికంగా ఉండవలసినంత దూరం కాదు గదా, కనీసమైన స్థలం కూడా లేదు. అందు వల్ల టేకాఫ్‌లో విఫలమయ్యే విమానం ఆ నివాస గృహాల మీద కూలిపోక తప్పదు. ఆ నివాస గృహాల భవన సముదాయాల కుప్పలో ఒకటి ఇప్పుడు నలభై మంది వైద్య విద్యార్థులు మరణించిన బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థి వసతిగృహం. అయితే ఈ సంగతి ఇప్పుడు, ఇంత ఘోరమైన ప్రమాదం జరిగాక మాత్రమే తెలిసినది కాదు. ఎన్నో భద్రతా అధ్యయనాలు ఈ సంగతి ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నాయి. విమానాశ్రయ రన్ వే అంచుల్లో నివాస గృహాలు ఉన్నాయనీ, ఆ ఇళ్లవాళ్లు తమ చెత్తను ఈ గోడ ఇవతల పారబోస్తున్నారనీ, అక్కడ పురుగులు చేరి, ఆ పురుగుల కోసం పక్షులు వచ్చి, సరిగ్గా విమానం టేకాఫ్ సమయంలో ఫాన్‌లలోకి పక్షులు ఎగిరే అవకాశం ఉందనీ; అక్కడ నేల చదునుగా లేదనీ, మురికి కాల్వల మాన్ హోల్స్ మీద కప్పులు కూడా లేవనీ ఇదివరకు తెలిసిన విషయాలే. అధ్యయనాలలో, నివేదికలలో రాసినవే. పరిష్కరించాలని సిఫారసులు అందినవే. డీజీసీఏ 2019 నివేదికలోనే అహ్మ దాబాద్ విమానాశ్రయం భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలమయిందని వివరంగా రాసింది. అంతకు ముందే 2018లో ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుజరాత్ ప్రభుత్వానికి సమర్పించిన ఒక విజ్ఞాపనలో రన్ వే భద్రత కోసం, 29.79 ఎకరాల అదనపు స్థలం కావాలని కోరింది. దానికి గుజరాత్ ప్రభుత్వ ఆమోదం కూడా దొరి కింది. కాని అక్కడ ఉన్న 350 కుటుంబాలను తరలించి, స్థలం ఖాళీ చేయించడంలో రాజకీయాలు అడ్డుపడి ఏడు సంవత్సరాలు గడిచినా ఆ పని జరగలేదు.ప్రస్తుత విమానాశ్రయం మీద ఒత్తిడి తగ్గించే పరి ష్కారంగా ధోలేరాలో పదివేల ఎకరాలలో రెండో విమా నాశ్రయాన్ని 2022లో ప్రకటించారు. అది 2025 కల్లా ప్రారంభమవుతుందన్నారు. దాని ప్రచార కార్యక్రమం నడిచినంతగా నిర్మాణ కార్యకలాపాలు సాగలేదు.విజయ్ రూపానీ ఐదు సంవత్సరాల పాటు 2016 నుంచి 2021 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రమా దాల హెచ్చరికలన్నీ ఉన్నాయి. వాటిని నివారించే అవకాశాలూ ఉన్నాయి. కాని నిర్లక్ష్యమే రాజ్యమేలింది. ప్రస్తుత విమాన ప్రమాదంలో రూపానీ విషాదకర మరణానికి ఆ నిర్లక్ష్యమూ కారణమే! ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్ -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత సివిల్ ఏవియేషన్ కొత్త రూల్స్
-
Air India crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దెబ్బతిన్న బ్లాక్ బాక్స్
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India Boeing 787-8 Dreamliner) విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాల్ని వెలికి తీసే బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.అయితే, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ నుంచి వివరాల్ని సేకరించేందుకు కేంద్రం అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్ బాక్స్ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.ఏప్రిల్ 12న అహ్మదాబాద్ నుంచి ఎయిరిండియా 787 డ్రీమ్‌లైనర్ విమానం 242 మందితో లండన్ బయల్దేరింది. కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీనగర్ బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్‌పై కప్పు మీద ఆ విమానం కూలిపోయి (air india crash video) అగ్ని గుండంలా మారింది. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డీఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ వైద్యులు మృతదేహాల్ని ఎనాలసిస్ చేసి మొత్తం 208 మృతదేహాల్ని గుర్తించారు. అలా ఇప్పటి వరకు (ఏప్రిల్ 18) ఉన్న సమాచారం ప్రకారం.. 170 మృతదేహాల్ని డీఎన్ఏతో గుర్తించారు. వారిలో యూకే, ఫోర్చుగల్,కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు మృత దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. -
భయంతో కేకలు.. ప్రమాదం వేళ యువతులు ఎలా తప్పించుకున్నారంటే..
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన అనంతరం బీజే మెడికల్ కాలేజీ(బీజేఎంసీ)క్యాంపస్‌లో భీతిల్లిన విద్యార్థులకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. భవనంలో మంటలు చెలరేగడం చూసిన రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న విద్యార్థులు ప్రాణభయంతో వణుకుతూ కేకలు వేయగా, కొందరు దుప్పట్లు, ఇతర దుస్తులను ఒకదానికొకటి ముడివేసి వాటి సాయంతో కిందికి దిగడం, మరికొందరు దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో ఉంది.విమానం కూలిన ప్రాంతంలో కొన్ని మీటర్ల దూరంలోనే మంటలు వ్యాపిస్తుండటం చూసిన ఓ యువతి కేవలం రెయిలింగ్ సాయంతోనే కిందికి దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్న మరో ఓ వీడియోలో రికార్డయింది. క్యాంపస్ వెలుపలి గోడపై నుంచి ఈ వీడియో తీస్తున్న వారు.. కింద పడిపోతే గాయాలవుతాయని ఆమెను హెచ్చరిస్తూ వేస్తున్న కేకలు సైతం వినిపించాయి. మరో వ్యక్తి కూడా అదే రెయిలింగ్ ద్వారా కిందికి దిగేందుకు ప్రయత్నించారు. #Watch | A horrifying plane crash struck the BJ Medical College UG hostel mess in Meghani Nagar, claiming the lives of several MBBS students. Heart-wrenching videos have surfaced from the moment of the crash, showing hostel students desperately trying to escape through the… pic.twitter.com/tmDxB3XfdJ— The Daily Jagran (@TheDailyJagran) June 17, 2025 Shocking video from #AhmedabadCrash: As the plane hit the medical college hostel, students jumped from windows to save their lives. Video shot moments after impact. pic.twitter.com/1CvGMV7iZ8— Neha Bhan🇮🇳 (@neha_journo) June 17, 2025మెడికల్ కాలేజీ హాస్టల్ మూడో అంతస్తు వరకు నిచ్చెనలు వేసుకుని ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించినట్లుగా మరో వీడియోలో ఉంది. విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా 29 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. విమాన ప్రమాదంతో మెడికల్ కాలేజీకి సంబంధించిన నాలుగు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.Removal of the aft fuselage section of the Air India Boeing 787-8(VT-ANB) from the BJ Medical College, Ahmedabad.#AirIndiaCrash #Ahmedabad #AirindiaPlane #BreakingNews pic.twitter.com/kGkxtK0WFt— The Metropolitan Times (@times66982) June 17, 2025 Black day for India 💔Visuals from inside of the BJ Medical College UG Boys hostel mess in Meghani Nagar, Amdavad, Gujarat where Air India London bound flight crashedEngine tore the walls of the hostel. Many students are feared to be dead as it was lunch time #PlaneCrash https://t.co/zJyrnyJAVB pic.twitter.com/nRps7cXAbM— Karnataka Weather (@BengaluruRains_) June 12, 2025 -
ఎయిరిండియా రద్దుల పర్వం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/కోల్‌కతా: అహ్మదా బాద్ ఘోర ప్రమాదం తర్వాత డ్రీమ్‌లైనర్ రకం విమానాలతో కొనసాగుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ‘క్యాన్సిల్’ మచ్చ అంటుకుంది. మంగళవారం ఏడు ఎయిర్ఇండియా విమా నాలు రద్దుకాగా వాటిలో ఆరు విమానాలు డ్రీమ్ లైనర్ 787–8 రకానికి చెందినవి ఉండడం గమనార్హం. సాంకేతికలోపం సహా ఇతరత్రా కారణాలతో డ్రీమ్లైనర్లు గాల్లో చక్కర్లుకొట్టడం మానేసి పార్కింగ్ ప్రాంతానికే పరిమితమయ్యాయి. సాంకేతికలోపంతో..ఢిల్లీ నుంచి పారిస్‌కు వెళ్లాల్సిన డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో దానిని రద్దుచేశారు. ఇలాంటి మరో విమానం అందుబాటులో లేకపోవడంతో అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విమాన సర్వీస్ క్యాన్సిల్ అయింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ఇండియా సంస్థ తన విమానాలను క్షణ్ణంగా తనిఖీలు చేశాక రాకపోకలకు పంపిస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ విమానాలు క్యాన్సిలేషన్ బారినప డుతున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతు న్నారు. మంగళవారం అధిక సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.దీనిపై ఎయిర్ఇండియా స్పందించింది. ‘‘రద్దయిన విమాన ప్రయాణికులను హోటల్ వసతులు, లేదంటే టికెట్ క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్ లేదంటే తదుపరి రీషెడ్యూలింగ్‌కు వెసులుబాటు కల్పిస్తున్నాం’’ అని ఎయిర్ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అహ్మదాబాద్ నుంచి ‘తొలి’విమానం రద్దుఅహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత అదే ఎయిర్పోర్ట్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు లండన్‌కు బయల్దేరి వెళ్లాల్సిన ఎయిర్ఇండియా వారి ఏఐ159 విమానం రద్దయింది. విమానప్రమాదం తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్న తొలి ఎయిర్ఇండియా అహ్మదాబాద్–లండన్ సర్వీస్ విమానం ఇదే. మరోవైపు ఢిల్లీ నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్ ఛార్లెస్ డీ గాలే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిన ఏఐ143 విమానం సైతం రద్దయింది.ఎయిరిండియా విమానంలో పనిచేయని ఇంజన్శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి ముంబైకి రావాల్సిన ఎయిర్ఇండియా విమా నం సాంకేతిక లోపంతో కోల్‌కతాలో ఆగిపోయింది. దీంతో ఈ సర్వీసును రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 211 మంది ప్రయాణికులతో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన బోయింగ్ 777–200ఎల్ఆర్ విమానం ముంబైకి చేరుకో వాల్సి ఉంది. శాన్ఫ్రాన్సిస్కో నుంచి వస్తూ పాకిస్తాన్ గగనతలం మీదుగా ముంబైకి చేరుకో వాల్సి ఉంటుంది.అయితే, పాక్ తన గగనతలాన్ని భారతీయ సర్వీసులకు మూసి వేసిన కారణంగా ఈ విమానం నేరుగా రావడం కుదర్లేదు. దాంతో చుట్టూతిరిగి తొలుత కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. రాత్రి 2 గంటల సమయంలో టేకాఫ్ తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజన్ మొరాయించింది. ఇంజనీర్లు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో ఆ సర్వీస్‌ను రద్దుచేశారు. కొందరిని ఇతర విమానాల్లో ముంబైకి పంపించారు.ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుముంబై: మస్కట్–ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో, విమానాన్ని అధికారులు నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయించి, తనిఖీలు చేపట్టారు. బెదిరింపు వట్టిదేనని ధ్రువీకరించుకున్నాక విమానం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది. మస్కట్‌లో బయలు దేరిన ఈ విమానంలో 157 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం విమానం కోచిలో ల్యాండయ్యింది. తిరిగి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని బెదిరింపు మెయిల్ వచ్చింది. -
ఎయిర్ ఇండియాకు షాక్‌ల మీద షాక్‌లు!
న్యూఢిల్లీ: భారతదేశ ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈరోజు(మంగళవారం, జూన్ 17) వరుసపెట్టి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. మంగళవారం ఆరు ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. రద్దయిన ఆరు ఎయిర్ ఇండియా విమానాలు కూడా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాలే కావడం గమనార్హం. AI 153(ఢిల్లీ-వియన్నా), AI 143(ఢిల్లీ-పారిస్), AI 159 (అహ్మదాబాద్-లండన్), AI 133 (బెంగళూరు-లండన్), AI 170 (లండన్-అమృత్సర్)లతో పాటు శాన్ఫ్రానిస్కక్ష నుంచి ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఈ రోజు ఉదయమే రద్దయ్యింది. అధునాతన టెక్నాలజీతో నడిచే బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో విమాన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఆరు బోయింగ్ విమానాల్లో సమస్యలు కనిపించడంతో ప్రయాణికుల్లో ఆందోళన కనబడుతోంది. విమానం మాట ఎత్తితేనే హడలిపోతున్న ప్రయాణికులు.. బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం అంటే వామ్మో అని పరిస్థితికి వచ్చారు. -
టెన్షన్.. టెన్షన్.. మరో ఎయిర్ ఇండియా విమానం రద్దు
ఢిల్లీ: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం బయటపడింది. ఢిల్లీ నుంచి పారిస్ వెళ్ల్సాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఆ విమానాన్ని రద్దు చేశారు. ముందుస్తు తనిఖీల్లో భాగంగా ఢిల్లీ-పారిస్ విమానంలో సమస్య ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు కాగా, తాజాగా ఢిల్లీ-పారిస్ విమానాన్ని రద్దు చేశారు. మంగళవారం(జూన్ 17) నాడే మూడు ఎయిర్ ఇండియా విమానాలు సాంకేతిక లోపం కారణంగా రద్దు కావడం గమనార్హం. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఆ తర్వాత అహ్మదాబాద్- లండన్ ఎయిర్ ఇండియా విమానం, ఇప్పుడు ఢిల్లీ-పారిస్ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రద్దు చేయాల్సి వస్తుంది. ఇటీవల జూన్ 12వ తేదీన విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాప్ అయిన సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విమానం బీజే మెడికల్ హాస్టల్‌పై కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమాన ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు. అందుకు తగ్గట్టే ఆ సర్వీసుల్లోనే వరుసగా సాంకేతిక లోపాలు బయటపడటంతో మరింత భయం పుట్టిస్తోంది ప్రయాణికుల్లో. గత 48 గంటల్లో వరుసగా 9 విమానాల్లో సాంకేతిక లోపాల్ని గుర్తించారు. -
Air India: 48 గంటల్లో 9 ఘటనలు.. డీజీసీఏ సీరియస్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానయాన సంస్థపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సాంకేతిక లోపాలు బయటపడడం, విమానాలు రద్దు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మంగళవారం ఎయిరిండియాతో వర్చువల్ సమావేశం నిర్వహించింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది కూడా. అయితే.. ఈలోపే వరుసగా సాంకేతిక లోపాలతో ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. గత 48 గంటల్లో 9 ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ.. ఎయిరిండియా ఇంజనీరింగ్ చీఫ్‌కు డీజీసీఏ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఒకేరోజు ఎయిరిండియాకు చెందిన మూడు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుయ్యాయి. శాన్ఫ్రాన్సిస్కో-ముంబై, అహ్మదాబాద్-లండన్ సర్వీస్ రద్దు కాగా తాజాగా ఢిల్లీ-ప్యారిస్ సర్వీస్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అదే రూట్.. సాంకేతిక సమస్యతో మళ్లీ రద్దు -
ఎయిరిండియా ఘటన: అయ్యో! ప్రాణాల కోసం..
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ (వీటీ–ఏఎన్‌బీ) 171 విమాన ప్రమాదం దుర్ఘటనలో భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 12న మేఘానీ నగర్ బీజే మెడికల్ కాలేజీకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగే సమయంలో విమాన ప్రమాద భయం నుంచి తప్పించుకునేందుకు మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోని మూడో అంతస్తునుంచి విద్యార్థులు కిందకి దూకి తప్పించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి. బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీకొన్నాక వెలువడిన దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో మూడో భవనంలో ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో హాస్టల్ బాల్కనీ నుంచి కిందకి దూకారు. తమ ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు.మెస్‌లో భోజనం చేస్తుండగా ఎయిరిండియా విమానం ఢీ కొట్టడంతో.. అప్రమత్తమైన విద్యార్థులు హాస్టల్ బాల్కనీ నుంచి బెడ్ షీట్లను వేలాదీస్తూ కిందకు దూకి ప్రాణాల్ని రక్షించుకునే భయనక దృశ్యాలు ప్రమాద తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. A distressing video has emerged showing medical students at BJ Medical College hostel in #Ahmedabad desperately jumping from balconies to escape following the catastrophic Air India #planecrash crash on June 12!!Although no media is highlighting this..#MedTwitter pic.twitter.com/iBAqn8xngc— Indian Doctor🇮🇳 (@Indian__doctor) June 17, 2025మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది.ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్‌వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు.వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. -
అందుకే లండన్ విమానం రద్దు చేశాం: ఎయిరిండియా క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు హడలెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత బయట పడుతున్న సాంకేతిక లోపాల ఘటనలు ‘వామ్మో.. ఎయిరిండియా’ అనేలా చేస్తున్నాయి. తాజాగా.. మంగళవారం మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి రద్దయ్యిందనే వార్తలు రాగా.. ఎయిరిండియా అందులో నిజం లేదని వివరణ ఇచ్చుకుంది. ఆంగ్ల మీడియా సంస్థల కథనం ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరియిండియా విమానంలో సాంకేతిక సమస్య బయటపడింది. మధ్యాహ్నం 1.10 గంటలకు AI 159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరాల్సి ఉండగా.. పైలట్ టేకాఫ్ కంటే ముందు సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దించేశారు. తొలుత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు.. చివరకు ఫ్లైట్ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జూన్ 12వ తేదీన ఇదే రూట్లో ప్రయాణించే ఎయిరింయా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ఏఐ 171 విమానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఎయిరిండియా. దాని స్థానంలోనే AI 159 విమానానికి తీసుకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా.. ఇవాళ ఆ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడం.. టేకాఫ్‌కి ముందే ఆ సమస్యను గుర్తించడం.. చివరకు సర్వీస్ రద్దు కావడం జరిగిపోయాయి. విమాన రద్దు నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏఐ 159 విమాన రద్దుపై ఎయిరిండియా వివరణ ఇచ్చుకుంది. విమానం సిద్ధంగా లేకపోవడంతోనే రద్దు చేశామని స్పష్టత ఇచ్చింది. ప్రయాణికులకు హోటల్లో వసతు కల్పిస్తున్నామని, అడిగిన వారికి డబ్బులు సైతం వెనక్కి ఇస్తున్నామని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని ఎయిరిండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. Air India crashed after taking off. The plane was seen struggling to gain altitude before crashing into a fire ball.. Over 200 people were on board..#AirIndiaCrash pic.twitter.com/xacH20AlSe— Sudhir Byaruhanga (@Sudhirntv) June 12, 2025 -
మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య
-
హడలెత్తించిన మరో ఎయిరిండియా విమానం
కోల్‌కతా: అహ్మదాబాద్ విషాద ఘటన మరవకముందే.. ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత శనివారం.. గువాహటి– కోల్‌కతా ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం 170 మంది ప్రయాణికులు కలవరపాటుకు గురైన సంగతి తెలిసిందే. చివరికి 18 గంటల తర్వాత వారిని మరో విమానంలో పంపించారు.తాజాగా, మరో విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులు హడలెత్తిపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబైకి వెళ్తోన్న ఎయిరిండియా విమానం (AI 180).. మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేసుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తగా.. సిబ్బంది వెంటనే గుర్తించి అలర్ట్ అయ్యారు. వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.An Air India flight from San Francisco to Mumbai via Kolkata suffered a technical snag in one of its engines, requiring passengers to be deplaned during a scheduled halt at the city airport early on Tuesday.#AirIndia #Kolkata #Mumbai #SanFrancisco #Ahmedabad pic.twitter.com/Sbj0JjHMlG— Diksha singh (@DikshaSingh7522) June 17, 2025కాగా, నిన్న(సోమవారం) కూడా.. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో టేకాఫ్ అయిన గంట తరువాత సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం హాంకాంగ్‌లో క్షేమంగా ల్యాండయ్యిందని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా విమానం ఏఐ315 స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.16 గంటలకు హాకాంగ్ నుంచి బయలుదేరింది.8.50కి టేకాఫ్ కావాల్సిన విమానం.. అప్పటికే మూడున్నర గంలు ఆలస్యంగా బయలుదేరింది. టేకాఫ్ అయిన గంట తరువాత విమానం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు విమానాన్ని హాంకాంగ్‌లో ల్యాండ్చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. ఈ సమస్య ఎయిర్పోర్ట్ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ తెలిపింది. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా ప్రమాదం తర్వాత బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్‌తో సంబంధం ఉన్న జెట్ వెనక్కి తిరిగి వెళ్లడం ఇది రెండోసారి. ఆదివారం.. చెన్నైకి వస్తున్న బ్రిటన్ ఎయిర్వేస్ డ్రీమ్‌లైనర్ కూడా సాంకేతిక సమస్య కారణంగా లండన్‌కు తిరిగి వెళ్లింది. -
Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్‌లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్‌లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్‌లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది. -
సాంకేతిక లోపంతో రన్‌వేపై ఆగింది!
గువాహటి: అహ్మదాబాద్ ప్రమాదాన్ని మరవకముందే గువాహటి– కోల్‌కతా ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం 170 మంది ప్రయాణికుల్ని హడలెత్తించింది. చివరికి 18 గంటల తర్వాత వారిని మరో విమానంలో పంపించారు. శనివారం రాత్రి 9.20 గంటలకు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో రన్‌వేపై ఆపేశారు. ప్రయాణికులు రెండుసార్లు విమానం దిగాల్సి వచ్చింది.దీనిపై దుమ్మెత్తిపోసతఊ వారు పోస్ట్ చేసిన వీడియోలు వైరలయ్యాయి. ‘‘అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో మమ్మల్ని కిందికి దిగమన్నారు. చౌక హోటల్లో వసతి కల్పించారు. కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. ఆదివారం ఉదయం 9.30కు విమానం ఎక్కించి, కాసేపటికే మళ్లీ దించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3.34కు మరో విమానంలో కోల్‌కతా బయలుదేరాం’’ అని ఓ ప్రయాణికుడు తెలిపారు. వారి ఆరోపణలను ఎయిరిండియా ఖండించింది. ‘‘నగరంలోని బెస్ట్ హోటల్లో వసతి కల్పించాం. మా సిబ్బందీ అందులోనే ఉన్నారు’’ అని చెప్పింది. సమస్యలేమిటో మాత్రం వెల్లడించలేదు. -
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
లక్నో: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉత్తర ప్రదేశ్ నుంచి కోల్‌కతా బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది ప్రయాణాన్ని నిలిపివేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం (జూన్15)న ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియాకు చెందిన ఎయిరిండియా (IX 1511) విమానం కోల్‌కతాకు బయల్దేరాల్సి ఉంది.అయితే,ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉండగా.. సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపంపై సమాచారం అందుకున్న ఇంజినీర్లు విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించే పనిలోపడ్డారు. ఫలితంగా, భద్రతా కారణాల దృష్ట్యా టేకాఫ్ వాయిదా పడింది. తిరిగి విమాన కార్యకలాపాలపై అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానం కోసం పడిగాపులు కాస్తున్నారు. -
‘171’ నంబర్‌కు బైబై.. నంబర్లు మార్చేసిన ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ‘ఏఐ171’అనే నంబర్ కలిగిన బోయింగ్ 787–8 విమానం కూలిపోవడం, 270 మంది మరణించడంతో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ విమానాలకు ఏఐ171, ఐఎక్స్ 171 పేర్లను తొలగించాయి.ఇక, అహ్మదాబాద్–లండన్ మధ్య నడిచే విమానాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి ‘ఏఐ159’ అనే కొత్త నంబర్‌తో పిలువనున్నట్లు ఎయిర్ ఇండియా వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ మేరకు టికెట్ల బుకింగ్ వ్యవస్థలో శుక్రవారం నుంచే మార్పులు చేసినట్లు తెలిపాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సైతం తమ విమానానికి ‘ఐఎక్స్171’నంబర్‌ను వదులుకుంటున్నట్లు వెల్లడించింది. కొత్త నంబర్‌ను ఇంకా ప్రకటించలేదు. ప్రమాదానికి గురైన విమానం నంబర్‌ను మార్చడం కొత్తేమీ కాదు. ప్రమాదంలో మరణించినవారికి నివాళిగా పాత నంబర్‌ను వదిలేసుకోవడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ ప్రమాదానికి గురైన విమానంలోని ఎయిర్ ఇండియా పైలట్ చివరి మాటలు బయటకు వచ్చాయి. విమానం పైకి ఎగరడం లేదు. కిందికి పడిపోతోంది. ఇప్పుడు కమ్యూనికేషన్ లైన్ బలహీనంగా ఉంది. మేడే అని.. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కు పైలట్ చివరి సందేశం చేరవేశాడు. ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతోందని ఈ సందేశాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం 1.37 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఏఐ171 విమానం కొన్ని క్షణాల వ్యవధిలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. -
ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది: విమానయాన మంత్రిత్వ శాఖ
-
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
ఈమె పేరు రోశ్నీ రాజేంద్ర సొంఘారే! ఎయిర్ ఇండియాలో ఫ్లయిట్ అంటెండెంట్! ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా! మబ్బుల్లోంచి దూసుకెళ్లే విమానంలో ప్రపంచమంతా చుట్టేయాలని చిన్నప్పటి నుంచీ కలలు కంది!ఆమె చిన్నప్పడు అమ్మ గోరుముద్దలు పెడుతూ చెప్పే కథల్లో అంశాలేవైనా విమానాన్నే ఊహించుకునేది! చేయి పట్టుకుని నాన్న బజారుకు తీసుకెళ్తే.. విమానం బొమ్మ కనిపించిన షాప్ దగ్గరల్లా ఆగేది!అందుకే జ్ఞానం వచ్చాక ఆమె ఎయిర్ హోస్టెస్ అవుతాననే నిర్ణయాన్ని వినిపించినప్పుడు అమ్మానాన్నలు ఆశ్చర్యపోలేదు! సంతోషంగా దీవించారు! వాళ్లది ఆర్థికంగా ఉన్న కుటుంబమేమీ కాదు. సర్దుబాటు చేసుకోగల పరిస్థితులూ లేవు. అయినా కూతురి ఆశను తుంచేయలేదు. తమ రెక్కలు ముక్కలు చేసుకునైనా కూతురి కోరికకు రెక్కలు తొడగాలనుకున్నారు. అయితే.. వాళ్లను కష్టపడనివ్వలేదు రోశ్నీ! ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకుంది. పైసా పైసా కూడబెట్టుకుంది. చిన్న చిన్న సరదాలు, సంతోషాలనూ దూరం పెట్టింది. తన కల కోసం అమ్మానాన్నల మీద భారం మోపద్దనేదే ఆమె తాపత్రయం. మొత్తానికి కూడబెట్టుకున్న డబ్బుతో ఫ్లయిట్ అటెండెంట్ ట్రైనింగ్ పూర్తి చేసింది. స్కై లవ్స్ హర్ నిన్న మొన్నటి (2025, జూన్ 12) దాకా ఎయిర్ ఇండియాలోనే ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. ఆమె కోరుకున్నట్టుగానే కొత్త ప్రదేశాలెన్నిటినో చుట్టొచ్చింది. చూసొచ్చిన ప్రతి ప్రాంతం దగ్గర ఓ ఫొటో తీసుకుని, ఆ ఫొటో సహా ఆ ప్రాంతపు ముచ్చట్లను ‘స్కై లవ్స్ హర్’అనే పేరుతో ఉన్న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసేది. రోశ్నీ పోస్ట్‌లు చూస్తే తెలిసిపోతుంది.. ప్రయాణాలంటే ఆమెకెంత ఇష్టమో! చాలా చురుకైన అమ్మాయి. ముంబైలో వాళ్లుండే డోంబివ్లీ ఈస్ట్‌లోని నవ్ ఉమియా క్రుపా సొసైటీలో ఏ చిన్న వేడుకైనా ఉత్సాహంగా పాల్గొనే రోశ్నీని తలచుకుని బాధపడనివాళ్లు లేరు. View this post on Instagram A post shared by Roshni Songhare 🌹 (@sky_loves_her) -
పరిహార భారం ఎయిర్ ఇండియాదే
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఖరీదైన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయింది. విమానం ఖరీదు, బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. విమానానికి బీమా సదుపాయం ఎలాగూ ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే. అంటే ఇక్కడ ఎయిర్ ఇండియాదే. ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం.. విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే, ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాలి. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే. అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ.120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్డీఆర్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) గతంలోనే ఖరారు చేసింది. అహ్మదాబాద్ ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీరందరికీ కలిపి ఎయిర్ ఇండియా యాజమాన్యం రూ.435 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కాకుండా విమానంలో పనిచేసే సిబ్బందికి చట్టప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తికాక ముందే బాధిత కుటుంబాలకు 16,000 ఎస్‌డీఆర్‌లు(రూ.18 లక్షలు) అడ్వాన్స్‌గా చెల్లించాలి. మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసిందే. బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిసింది. విమానానికి బీమా, బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే ఈ విలువ రూ.1,000 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వరకు ఉంటుంది. -
గాల్లో ప్రాణాలు
దేశంలో విమానయాన నియంత్రణ సంస్థ అయిన ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) పాత్రపైనే ఇపుడు అనివార్యంగా ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రయా ణికుల భద్రత పట్ల ఉపేక్ష, జాగ్రత్త, ఆదుర్దా కనబరచక పోవడం డీజీసీఏ స్వభావంగా మారిపోయింది. విమాన భద్రతా ఉల్లంఘనలు 2008 నుంచి వేలాదిగా చోటుచేసు కుంటున్నా అది వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు పయనించగలిగిన బోయింగ్ 777–200, 777–300–ఇ.ఆర్. విమానాలను ఎయిర్ ఇండియా రంగంలోకి దించింది. భారత్ నుంచి అమెరికా వెళ్ళే విమానాలకు 16 గంటల వరకు సమయం పడుతుంది. దాంతో ఎయిర్ ఇండియాకు చెందిన సుదూర శ్రేణి విమానాలకు అప్పటి డీజీసీఏ నసీమ్ జైదీ కఠిన నిబంధనలను నిర్దేశించారు. కానీ, ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానాలతో భారత్ నుంచి ఆస్ట్రేలియాకి సర్వీసులు మొదలు పెట్టిన పుడు ఎగువ నిబంధనలను అప్పటి డీజీసీఏ మార్చే సింది. అది ఆకాశయాన భద్రతా ప్రమాణా లను గాలికొదిలేసింది. ఇది అటు ప్రయాణికు లతో పాటు ఇటు విమాన సిబ్బంది ప్రాణాలకు కూడా చేటు తేవడమే అవుతుంది. డ్రీమ్ లైనర్ను ఆ విధంగా ఉపయోగించడం వల్ల ప్రమాదానికి లోనయ్యే అవకాశం అనుమతించిన సాధారణ పరిమితులకు మించి 25 రెట్లు పెరిగిందని ఎయిర్ ఇండియాకూ తెలుసు. కానీ, ఆ నివేదికను ఎయిర్ ఇండియా, డీజీసీఏ రెండూ మరుగు పరిచేశాయి. ఆ రూటులో సుర క్షిత పయన నిబంధనలు ఉల్లంఘనలకు గుర వుతున్న సంగతి ప్రయాణికులకు తెలియలేదు. డిజైన్ దశలోనే లోపాలుఅలాగే, 787 డ్రీమ్లైనర్లు ఇంకా డిజైన్ దశలో ఉన్నప్పుడే,ఇంకా వాటి గగన సామర్థ్యాలను పరీక్షించకముందే ఎయిర్ ఇండియా వాటి కొనుగోలుకు ఆర్డరు పెట్టేసింది. ఎయిర్ ఇండియా సమకూర్చుకున్న బోయింగ్ 787 డ్రీమ్లైనర్ల ప్రారంభపు ఆకాశయానాల్లోనే వాటి భద్రత, ఇంజినీరింగ్‌కు సంబంధించి అనేక లోపాలు, సమస్యలు బయటపడ్డాయి. విమాన సిబ్బందికి విమాన భద్రతా నిబంధనలను రూపొందించడంలో డీజీసీఏకున్న అధికారాలను సవాల్ చేస్తూ, నేను బొంబాయి హైకోర్టులో 2013–14 రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశాను. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి అప్పట్లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. నేను వేసిన రిట్ పిటి షన్లకు అటు డీజీíసీఏ గానీ, ఇటు ఎయిర్ ఇండియా గానీ 2019 వరకు జవాబులు దాఖలు చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మరో దిగ్భ్రాంతికరమైన సంగతి ఏమిటంటే, విమాన సిబ్బందికి విమాన సురక్షిత నిబంధనలను జారీ చేసే, లేదా రూపొందించే అధికారం డీజీసీఏకు 2016 సెప్టెంబర్‌లో మాత్రమే లభించింది. అదీ 1937 నాటి విమాన నిబంధనలోని 42–ఎ సెక్షనుకు సవరణ తీసుకురావడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఎయిర్ ఇండియా విమాన సురక్షిత నిబంధనలను తుంగలో తొక్కుతున్నా డీజీసీఏ వాటిని కప్పిపుచ్చుతూ వచ్చిందని దీనిద్వారా స్పష్టమవుతోంది. డీజీíసీఏ, ఎయిర్ ఇండియా అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతూ నేను చాలా క్రిమినల్ కేసులు పెట్టాను. విమాన సురక్షిత ప్రమాణాలు ఉల్లంఘనలకు లోనవుతున్న సంగతిని ట్రయల్ కోర్టు అయినా పట్టించుకుంటుందని ఆశతో ఆ పని చేశాను. ఎందుకంటే, ఆ లోపాలు ప్రయాణికులు, విమాన సిబ్బంది... ఇద్దరి ప్రాణాలకూ ముప్పు తెచ్చేవిగా ఉన్నాయి. కనీసం ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం తర్వాతనైనా, కోర్టు మేల్కొని, విమాన సురక్షిత నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించిన సంబంధిత డీజీసీఏ, ఎయిర్ ఇండియా అధికారులపై కఠిన చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నాను.-వ్యాసకర్త ఎయిర్ ఇండియా మాజీ సీనియర్ అధికారి, కె.వి.జె. రావు- (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)కారణాలు ఏమిటి?అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఏఐ 171 కూలిపోయి కొన్ని గంటలే అవుతోంది. దాదాపు 260 మందికి పైగా బలిగొన్న ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలపై ఊహాగానాలు అప్పుడే జోరందుకున్నాయి. కొన్ని సమాచార సాధనాలు దీన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తు న్నాయి. ఈ విషాదకర ఘటనపై నా అభిప్రాయాలు తెలుపవలసిందని ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ కోరింది. నేను అందుకు అంగీకరించి, ‘‘దీనిపై ఊహాగానాలకు పాల్పడటం తొందరపాటు అవుతుంది’’ అని మాత్రమే చెబుతానన్నాను. ఫలితంగా, వారు నాతో ఆ ఇంటర్వ్యూను జరపనే లేదు. ఊహాగానాలు చేసేందుకు నేను విముఖంగా ఉండటమే బహుశా అందుకు కారణం కావచ్చు.ఈ ఘోర విపత్తుకు కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని అందరిలాగా నాకూ కుతూ హలం ఉంది. కానీ ఇంత త్వరగా బాహాటంగా ఊహాగానాలు చేయడం–అందులోనూ ఆధారాలు స్వల్పంగా ఉన్న సమయంలో–ఎవరికీ ప్రయోజనకారి కాదనిపించింది. అది హానికరం కూడా! పురాతన తవ్వకాల మాదిరిగా... మొదట అగ్ని జ్వాలలను ఆర్పి, బతికున్న వారికోసం అన్వేషణ పూర్తయిన పిదపనే వైమానిక ప్రమాద దర్యాప్తులు ప్రారంభమవుతాయి. అలాంటి దుర్ఘటనలు జరిగినపుడు ప్రాణాలతో ఉన్నవారు, క్షతగాత్రుల గురించి మొదట పట్టించు కోవాలి. తర్వాత, ప్రమాద స్థలికి వెళితే సురక్షితమేనని, ఇబ్బందేమీ ఉండదని ప్రకటించాలి. అనంతరం, చనిపోయిన వారిని గుర్తించడం ఆరంభమవుతుంది. ప్రమాదంపై దర్యాప్తునకు సమాంతరంగా, బాధితులను గుర్తించే పనిని వేరే సంస్థ చూసుకుంటుంది. దర్యాప్తులో పాలుపంచుకునేది కేవలం ప్రభుత్వ అధికారులే కాదు, సదరు విమానాన్ని తయారు చేసిన సంస్థ (ప్రస్తుత సందర్భంలో బోయింగ్) దర్యాప్తునకు సహాయపడేందుకు తన ప్రతినిధులను పంపుతుంది. ప్రయాణికులు ఏయే దేశాలకు చెందినవారో ఆ యా దేశాలు కూడా కొందరిని పంపవచ్చు. ప్రమాదం సంభవించిన దేశంలోని పరిశో ధకులు, వైమానిక దుర్ఘటనలపై దర్యాప్తు చేయడంలో మరింత అనుభవం ఉన్న ఇతర దేశాలకు చెందినవారి సహాయాన్ని కూడా అర్థించవచ్చు. ఇన్వెస్టిగేటర్లు శిథిలాల నుంచి బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డాటా రికార్డర్లు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్)లను వెతికి పట్టుకోవడాన్ని ప్రాథమిక బాధ్యతగా భావిస్తారు (అహ్మదాబాద్‌లో వైద్య కళాశాల హాస్టల్ మెస్ పైకప్పు మీద బ్లాక్‌బాక్స్‌ను గుర్తించారు). విమానం గురించిన డేటా కూడా వీటిల్లోఉంటుంది. విమానం ఎలా పని చేస్తోందో, పైలెట్లు ఏం చెబుతున్నారో తెలుస్తుంది. బ్లాక్ బాక్స్‌లను వెలికి తీసినంత మాత్రాన విమానం కూలిన ఘట నలో దర్యాప్తు పూర్తయినట్లు కాదు. విమాన ప్రమాద దర్యాప్తు పురావస్తు తవ్వకాల లాంటిదే! ఒక పద్ధతి ప్రకారం, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి చేయాల్సిన పని అది. ఆధారాలను సేకరించి తదుపరి విశ్లేషణకు వాటిని భద్రపరచకపోతే, విలు వైన ఆధారాలను ఎప్పటికీ కోల్పోయినట్లే లెక్క. దర్యాప్తు అధికారులు సాక్షుల వాఙ్మూలాలను, ఆ ఘటనకు సంబంధించి వారు ఏవైనా వీడి యోలు తీసి ఉంటే వాటిని సేకరిస్తారు. వారి విశ్లేష ణను కంపెనీ డాక్యుమెంటేషన్, శిక్షణ, నియంత్రణ సంస్థ పేర్కొన్న నియమ నిబంధనలను పాటించడం గురించిన సమాచారంతో పోల్చి చూసుకుంటారు. విమాన ప్రమాదాలలో దాదాపు 80 శాతానికి ‘మానవ అంశాలే’ కారణం. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పేర్కొంటున్న మానవఅంశాలు: మానవుల సామర్థ్యాలు, గుణగణాలు, పరిమితులు, వారు ఉపయోగించే విధివిధానాలు, పరికరాలు, ఎలాంటి వాతావరణంలో పనిచేస్తు న్నారు లాంటివి! ఈ దుర్ఘటనపై పూర్తి ఫోరెన్సిక్ దర్యాప్తు సమగ్ర రూపంలో చేతికందడానికి కొన్నేళ్ళు పట్టవచ్చు. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో 2023లో సీ వరల్డ్ హెలికాప్టర్ కూలిన ఘటనపై తుది నివేదిక ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైంది. ఊహాగానాలు–నిందలువిమాన ప్రమాదానికి కారణం కాగల అంశాలపై హానికరమైన ప్రజా ఊహాగానాలకు సంబంధించి సుదీర్ఘ చరిత్రేఉంది. మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్–370 విమానం 2014 మార్చి 8న గగనతలం నుంచి అదృశ్యమైంది. ఆ ఘటనకు దాని చీఫ్ పైలట్ జహారీ అహ్మద్ షాయే బాధ్యుడంటూ ప్రచారం జరిగింది. షాతోపాటు ఆ ఘటనలో 238 మంది చనిపోయారు. ఆ ప్రచారం తనను చాలా బాధకు గురిచేస్తోందని షా సోదరి సకీనబ్ షా 2016లో సి.ఎన్.ఎన్.కు ఇచ్చినఇంటర్వ్యూలో వాపోయారు. ఆ ప్రమాదానికి తన సోదరుడిని ‘బలిపశువును’ చేస్తున్నారని ఆమె అన్నారు. ఇదమిత్థంగా కారణాలు తెలియకుండానే, ప్రమాదాలకు అలా ఎవరెవరినో బాధ్యులుగా భావించిన దృష్టాంతాలను చాలా చూపవచ్చు. ఒక రకం విమానాలను నడిపేవారికి అదే రకానికి చెందిన కొత్త మోడల్ విమానాలను ఇచ్చి (ఈ కొత్త విమానాలను నడపడంలో పైలట్లకు సిములేటర్‌లో తగినంత శిక్షణ ఇవ్వకుండానే) నడిపేయమనడం కూడా విమానయాన సంస్థలకు కొత్తేమీ కాదు. ఫలితంగా జరగరానిది ఏదైనా జరిగితే వచ్చే అపనిందల వల్ల పైలట్లు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రతిష్ఠ దెబ్బతింటుంది. వారి కుటుంబ సభ్యులు పడే వేదన వర్ణనాతీతం.బహిరంగంగా ఊహాగానాలు చేయడం దర్యాప్తు ప్రక్రియకు ఏ విధంగానూ దోహదపడదు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. సునిశితమైన అంశాలను కనుగొనడానికి వీలుగా బాహ్య ఒత్తిడులు ఏమీ లేకుండా ఇన్వెస్టిగేటర్లను వారి పనిని వారిని చేసుకోనివ్వాలి. ఈ ప్రక్రియను గౌరవించడం, నిజాయతీతో వ్యవహరించనివ్వడం ముఖ్యం. మాటలకందని విషాదాన్ని అనుభవిస్తున్న అనేక మందికి మనం అండగా నిలవాలి. -వ్యాసకర్త యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్ ల్యాండ్ బ్యాచిలర్ ఆఫ్ ఏవియేషన్‌కు ప్రోగ్రామ్ డైరెక్టర్, నటాషా హీప్(‘ది కాన్వర్సేషన్’ సౌజన్యంతో) -
‘మా అమ్మ ఆచూకీ తెలిస్తే చెప్పండన్న’.. కూలిన ఎయిరిండియా విమానం కింద..
గాంధీ నగర్: ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌లో తన తల్లి శార్లాబెన్ ఠాకూర్, రెండేళ్ల కుమార్తె ఆధ్య ఉన్నారు. పెను విషాదంపై సమాచారం అందుకున్న బాధితుడు తన అమ్మ, కుమార్తెతో పాటు అక్క ఆచూకీ కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.ప్రమాదంలో చెల్లాచెదురైన ప్రయాణికుల మృత దేహాల్ని గుర్తిస్తున్న అధికారుల్ని.. తనని నవ మాసాలు కనిపెంచిన అమ్మ.. తాను కన్న కూతురు, అక్క చనిపోయారని ఓవైపు కీడు శంకిస్తున్నా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ బాధితుడు ..‘సార్ .. మా అమ్మ, కూతురు,అక్క ఎక్కడ ఉన్నారో.. ఏమో? వాళ్ల ఆచూకీ తెలిస్తే చెప్పండన్నా అంటూ అమాయకంగా.. బాధతో ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుడి వేడుకోలుతో అధికారులు అతని తల్లి,కుమార్తె ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.VIDEO | Ahmedabad air crash: Ravindra Thakore mourns the loss of his mother and daughter, who were working at the canteen of the medical college hostel on which the ill-fated aircraft crashed. He says, “I want the authorities to check inside the building. I want to go by myself.… pic.twitter.com/9b5FRVHJWr— Press Trust of India (@PTI_News) June 13, 2025 ఎయిరిండియా కుప్పకూలిన హాస్టల్ భవనాలు కింద వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకున్నారు. బాధితుడి తల్లి బీజే మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భోజనం వండేది. భోజనం, చపాతీలు, గుజరాతీ వంటలు చేయగా.. వాటిని, ఆమె కుమారుడు ప్రతీ రోజు కళాశాల క్యాంపస్‌లో డెలివరీ చేసేవాడు. తిరిగి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌కు వచ్చేవారు. ఎప్పటిలాగే కుమార్తెను తన తల్లి దగ్గర వదిలేసి పక్కనే ఉన్న సివిల్ ఆస్పత్రిలో లంచ్ బాక్స్‌లు ఇచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగింది. ఈ విషాదంపై శార్లాబెన్ కుమారుడు రవీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్‌కు టిఫిన్ బాక్సులు అందించటానికి వెళ్లాను. ఎప్పటిలాగే ప్రతి రోజు భోజనం ఇచ్చినట్లుగా జూన్ 12న నేను మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ సిబ్బందికి, హాస్టల్‌కు భోజనం అందించడానికి వెళ్లాను. తిరిగి రావడంతో ఓ విమానం మెస్‌లో దూసుకొచ్చిందని విన్నాను. విమానం కూలిన ప్రదేశంలో మా అమ్మ కూర్చుంది. ఆ ప్రదేశం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మా అమ్మ, కుమర్తె, అక్కడ ఉన్నారని కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ల ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించేందుకు మరో 72 గంటలు వేచి చూడాలని చెప్పారని వాపోయారు. This Baby Girl and her mother both are missing from mess building since plane crash Guys I know her father personally Please Contact me through Comments if found 🙏🙏🙏 Ahmedabad Gujarat pic.twitter.com/oJLEn6nr77— DTS (@Sharma17_05) June 13, 2025ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత సివిల్ హాస్పిటల్లో వైద్యులు మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్‌లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుడు రవి చెప్పిన ప్రాంతం అంతా మనుషుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు బాధితుల కుటుంబసభ్యుల డీఎన్ఏని సేకరిస్తున్నారు. బాధితుడి రవి కూడా తన వాళ్ల ఆచూకీ దొరుకుతుందేమోనని విషాదం నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నాడు. -
బోయింగ్ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఇంజనీరు
-
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్‌లైన్స్ డ్రీమ్‌లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. In light of the AI-171 accident on 12.06.2025, DGCA issues directives to Air India to carry out additional maintenance actions on B787-8/9 aircraft equipped with Genx engines with immediate effect.@RamMNK @mohol_murlidhar @dgca pic.twitter.com/L8YCJ1FVVT— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025 -
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్,ఆర్యన్,మనవ్ జయ్ ప్రకాష్‌లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్‌లో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్ కాలేజీ హాస్టల్ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్‌పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్లో లోపల ఉన్న టేబుల్ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్’
విమానయానంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులోని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాక్‌పిట్(పైలట్లు కుర్చునే ప్రదేశం) కమ్యూనికేషన్లను విశ్లేషించడం కీలకంగా మారుతుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్డీఆర్)పై ఆధారపడుతుంటారు. సాధారణంగా వీటిని బ్లాక్‌బాక్స్ అని పిలుస్తారు. పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా ప్రోటోకాల్స్‌ను మెరుగుపరిచేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్‌బాక్స్‌లోని వివరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రమాదం జరిగినచోట ఈ బ్లాక్‌బాక్స్‌ను ఇంకా గుర్తించాల్సి ఉంది.బ్లాక్బ్లాక్స్లోని వివరాల విశ్లేషణలో కీలక దశలుబ్లాక్బాక్స్ రికవరీప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్‌బాక్స్‌ను ముందుగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీవీఆర్, ఎఫ్డీఆర్ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్ డేటాను దీని నుంచి సేకరిస్తాయి.ఆడియో విశ్లేషణకాక్ పిట్ ఆడియోను ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు సాగిన కమ్యునికేషన్‌ను విశ్లేషిస్తారు. కీలక క్షణాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్లేషన్లు, అలారం, ప్రమాద నేపథ్య శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాద పరిస్థితుల్లో ఒత్తిడి స్థాయులు, కమాండ్ స్పష్టత, ప్రతిస్పందన సమయాన్ని వెల్లడిస్తుంది. ఇది సిబ్బంది సదరు పరిస్థితిని ఎలా నిర్వహించారో నిర్ణయించడానికి అవసరం అవుతుంది.ఎఫ్డీఆర్ నివేదికఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్ ఎఫ్డీఆర్ రిపోర్ట్‌లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్ ఇన్పుట్స్ వంటి పారామీటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది.హెచ్చరికలు గుర్తించడంహెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్‌బాక్స్ ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఫైర్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్‌తో సహా అగ్ని సంబంధిత వార్నింగ్‌లను విశ్లేషించేందుకు ఇది సాయం చేస్తుంది.సమన్వయాన్ని అంచనా వేయడంఅత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయాన్ని అంచనా వేయడానికి పైలట్ కమ్యూనికేషన్ కీలకం. కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ పనులను సరిగ్గా నిర్వర్తించారా.. నిబంధనలను పాటించారా.. అనే వివిధ అంశాలను పరిశీలిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి గ్రౌండ్ సిబ్బంది అందించిన కమ్యూనికేషన్లను, అత్యవసర ప్రకటనలను విమాన సిబ్బంది అనుసరించారా లేదా అని గమనిస్తారు.ఇదీ చదవండి: సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతిసిస్టమ్ వైఫల్యాలను పరిశీలించడంఒకవేళ విద్యుత్ లేదా మెకానికల్ లోపం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లయితే సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించేందుకు బ్లాక్‌బాక్స్ ఉపయోగపడుతుంది. అందులోని ఆన్‌బోర్డ్ సెన్సార్లు, మెయింటెనెన్స్ రికార్డ్‌లు కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. డిజైన్ లోపాలు లేదా పట్టించుకోని భద్రతా సమస్యలు సంఘటనకు దోహదపడ్డాయా అని పరిశోధకులు అన్వేషిస్తారు. -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఎయిర్ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాల్ అనంతరం, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి.. విమానంలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BIG BREAKING NEWS 🚨 Air India flight AI 379 makes emergency landing in Thailand after bomb threat. Thailand Official said "Passengers being escorted from the plane, flight AI 379, in line with emergency plans"There were 156 passengers on the flight, and the bomb threat was… pic.twitter.com/ollnR7ltxa— Times Algebra (@TimesAlgebraIND) June 13, 2025 -
ఇరాన్ ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు.. విమానాల దారి మళ్లింపు
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ముంబై నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చింది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5:39 గంటలకు ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. మూడు గంటల ప్రయాణం తర్వాత రాడార్‌లో సిగ్నల్స్ సమస్య తలెత్తింది. దీంతో, సదరు విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా ఈ విషయం నిర్ధరణ అయ్యింది. రాడార్ సిగ్నల్స్ సమస్య కారణంగానే విమానం వెనక్కి మళ్లినట్లు సమాచారం.Air India flight bound for London returns to Mumbai after 3 hours in air, says Flightradar24 pic.twitter.com/YcaxXG0lh2— NDTV (@ndtv) June 13, 2025ఇక, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్.. తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో, పలు దేశాలకు చెందిన విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. అనేక విమాన సర్వీసులకు దారి మళ్లిస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలను కూడా దారి మళ్లిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా స్పందిస్తూ..‘ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులకు వసతి కల్పించడంతో సహా అన్ని వసతులు కల్పలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.విమాన సర్వీసుల వివరాలు:AI130 - లండన్ హీత్రో-ముంబై - వియన్నాకు మళ్లించబడిందిAI102 - న్యూయార్క్-ఢిల్లీ - షార్జాకు మళ్లించబడిందిAI116 - న్యూయార్క్-ముంబై - జెడ్డాకు మళ్లించబడిందిAI2018 - లండన్ హీత్రో-ఢిల్లీ - ముంబైకి మళ్లించబడిందిAI129 - ముంబై-లండన్ హీత్రో - ముంబైకి తిరిగి వెళ్ళడంAI119 - ముంబై-న్యూయార్క్ - ముంబైకి తిరిగి వెళ్ళడంAI103 - ఢిల్లీ-వాషింగ్టన్ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI106 - న్యూవార్క్-ఢిల్లీ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI188 - వాంకోవర్-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI101 - ఢిల్లీ-న్యూయార్క్ - ఫ్రాంక్ఫర్ట్/మిలన్కు మళ్లించడంAI126 - చికాగో-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI132 - లండన్ హీత్రో-బెంగళూరు - షార్జాకు మళ్లించబడిందిAI2016 - లండన్ హీత్రో-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI104 - వాషింగ్టన్-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI190 - టొరంటో-ఢిల్లీ - ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించబడిందిAI189 - ఢిల్లీ-టొరంటో - ఢిల్లీకి తిరిగి రాక. #TravelAdvisoryDue to the emerging situation in Iran, the subsequent closure of its airspace and in view of the safety of our passengers, the following Air India flights are either being diverted or returning to their origin:AI130 – London Heathrow-Mumbai – Diverted to Vienna…— Air India (@airindia) June 13, 2025 -
పది నిమిషాల ఆలస్యం.. నేను ప్రాణాలతో ఉన్నా: భూమి చౌహాన్
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాద సమయంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని ఆమె చెప్పుకొచ్చింది.వివరాల ప్రకారం.. భూమి చౌహాన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా (Air India) ఫ్లైట్ AI171 బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. దీంతో ఆమెకు పదినిమిషాల ఆలస్యం అయింది. అప్పటికే ఆ ఫ్లైట్ టేకాఫ్ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. దీంతో, ఈ ప్రమాదంపై భూమి చౌహన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా..‘ట్రాఫిక్ కారణంగా నేను విమానం మిస్ అయ్యాను. ఇదే సమయంలో నేను వెళ్లాల్సిన విమానం కుప్పకూలిందనే విషయం తెలిసిన వెంటనే షాక్‌కు గురయ్యా. ఆ ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. ఈ ప్రమాద ఘటనపై మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. గణపతి బప్పానే నన్ను కాపాడాడు. పది నిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయాను. విమాన ప్రమాద విషయాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025ఇక, పది నిమిషాల ఆలస్యంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం చేరుకున్న చౌహాన్.. మధ్యాహ్నం 1.30 గంటకు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. 1.38 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని నివాసప్రాంతంలో కుప్పకూలింది. లండన్‌లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చింది.ఇదిలా ఉండగా.. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడడంతో అందులో ఉంటున్న 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. -
మట్టి నిండిన భోజనం!
అహ్మదాబాద్: సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం కావటంతో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్లో హడావిడి మొదలైంది. ఆకలిమీద ఉన్న రెసిడెంట్ వైద్యులు నచ్చిన ఆహారం వడ్డించుకొని డైనింగ్ టేబుల్స్‌పై కూర్చొని ముచ్చట్లు చెప్పుకొంటూ.. ఇష్టంగా తింటున్నారు. అంతలోనే ఒక్కసారిగా భారీ శబ్దం.. బీటలువారి కూలిపోతున్న భవనం గోడలు.. ఆ వెంటనే దూసుకొచ్చిన రాకాసి అగ్నికీలలు.. కన్నుమూసి తెరిచేంతలో అంతా బూడిదమయం.అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశంలో దృశ్యాలు ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో చెప్పకనే చెప్పాయి. దుమ్ముతో నిండిపోయిన డైనింగ్ టేబుల్స్.. వాటిపై నిండుగా భోజనంతో పొందికగా ఉన్న ఆహారం పేట్లు.. పక్కనే మంచినీటి గ్లాసులు.. మసిబారిపోయిన క్యాంటీన్.. కొన్నిచోట్ల చిందరవందరగా పడిపోయిన సామగ్రి ఆ ఘోర ప్రమాదానికి సాక్ష్యంగా నిలిచాయి. ఆ హాస్టల్ భవనంలో రెసిడెంట్ వైద్యులు నివాసం ఉంటారు. నేరుగా భవనంపైనే కూలిన విమానం.. సాంకేతిక లోపంతో విమానం కిందికి దూసుకొచ్చి నేరుగా హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తులోకి దూసుకెళ్లింది. దీంతో భవనం ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. భవనానికి భారీ రంధ్రం ఏర్పడింది. భారీగా మంటలు చెలరేగటంతో భవనం గోడలు మొత్తం నల్లగా మారిపోయాయి. ఆ భవనం చుట్టూ ఉన్న చెట్లు నిలువునా కాలిపోయిన నల్లని మొద్దులు మాత్రమే మిగిలాయి. విమాన ఫ్యూజ్‌లేజ్‌లు (ప్రధాన బాడీలోని కొన్ని భాగాలు) భవనం గోడల్లోనే ఇరుక్కుపోయాయి. విమానం టైర్లు తల్లకిందులై భవనంలో వేలాడుతూ కనిపించాయి. విమానం తాకిన వేగానికి ఎంతో బలమైన భవనం పిల్లర్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. ఆరంతస్తుల భవనం బయటి గోడలు మొత్తం ధ్వంసమైపోయి బిల్డింగ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. -
మహా విషాదం.. 265 మంది దుర్మరణం
అహ్మదాబాద్: మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్‌వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని యిర్ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగింది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు. హాస్టల్లోకి చొచ్చుకెళ్లిన విమానం పైలట్ ‘మే డే’ అలర్ట్ విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్ గేర్ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ‘మే డే’ కాల్ చేశారు. ‘‘ఏటీసీ తక్షణం స్పందించి తిరిగి కాల్ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజన్లలో టేకాఫ్‌కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ‘‘విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు’’ అని హరేశ్ షా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం! ఎవరినీ కాపాడలేకపోయాం: అమిత్ షా ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ‘‘అదంతా ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రమైన మంటలు చెలరేగి భరించలేనంత వేడి పుట్టుకొచ్చింది. దాంతో ఎవరినీ కాపాడే అవకాశం లేకుండా పోయింది’’ అని చెప్పారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అనంతరం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. ‘‘డీఎన్ఏ శాంపిళ్లను ఇప్పటికే సేకరించారు. గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాయి’’అని తెలిపారు. సెకెనుకు 4 లీటర్ల ఇంధనం విమాన ఇంధనాన్ని జెట్ ఫ్యూయల్ లేదా జెట్ ఏ1 అని పిలుస్తారు. బోయింగ్ 747 విమానం నడవాలంటే భారీగా ఇంధనం కావాలి. సెకెనుకు 4 లీటర్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి 240 లీటర్లు, గంటకు 14,400 లీటర్లు కావాలన్నమాట. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు సుమారు 6,859 కి.మీ. దూరానికి 9 గంటలపైనే ప్రయాణం. ఎయిరిండియా విమానంలో అంత భారీగా ఇంధనం ఉండటానికి అదే కారణం. విమానం వేగంగా, బలంగా నేలను తాకగానే అంత ఇంధనం ఒకే మండిపోయింది. దాంతో భారీగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తేలాల్సి ఉంది. విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు విమాన కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్ భవనాలు తదితరాల కింద చాలామంది వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకుని ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) తెలిపింది. వారిని వెలికితీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మృతదేహాలను సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని ఎఫ్ఏఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివ్యాన్‡్ష సింగ్ అన్నారు. వెలికితీసిన మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పారు. -
ఇటీవలే పెళ్లి, భర్త కోసం లండన్‌కు నవ వధువు.. నిమిషాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు
గాంధీనగర్: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్ని తీవ్ర విషాదాన్ని నింపింది. వారిలో నవ వధువు ఖుష్బూ రాజ్‌పురోహిత్ ఉన్నారు. ఆమె లండన్‌లో ఉంటున్న తన భర్తను కలిసేందుకు ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. కానీ అంతలోనే అనుకోని విషాదం.. నిమిషాల వ్యవధిలోనే తన భర్తను కలవాలన్న ఆమె కలను చిదిమేసింది. ఖుష్బూ రాజస్థాన్‌లోని బాలోటరా జిల్లాలోని అరాబా గ్రామ వాసి ఖుష్బూ రాజ్‌పురోహిత్ . ఆమెకు ఇటీవల మన్ఫూల్ సింగ్‌తో వివాహం జరిగింది. వివాహం తర్వాత తొలిసారి లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భర్తను కలిసేందుకు అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. విమాన ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్టులో ఖుష్బూ రాజ్ పురోహిత్ కుమార్తె తన తండ్రి మదన్ సింగ్‌తో దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రిమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలో జనావాస్లాల్లో దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 11 మంది ఈ విమానంలో ఉన్నారు. వారిలో ఇద్దరు యూకేలో చెఫ్‌గా పని చేయడానికి వెళ్తున్న పురుషులు , ఒక మార్బుల్ వ్యాపారి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, ఏడు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో ఒక్కే ఒక్క ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, రమేష్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,ఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఘోర విమాన ప్రమాదంలో ఎయిరిండియా విమానంలోని 242 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రమాదంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం తనని కలిచి వేసిందన్న ప్రధాని మోదీ.. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విమాన ప్రమాదంపై రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన హృదయ విదారకరమైంది.ప్రధాని మోదీ, భారత్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంఘీభావం. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో నా సహచరుడు ప్రధాని మోదీ, భారత ప్రజలకు అండగా నిలుస్తాం. 242 మంది పురుషులు, మహిళలు, పిల్లల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని నేను బాధపడ్డాను’అని అన్నారు.ఈరోజు అహ్మదాబాద్‌లో జరిగిన అత్యంత విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ గురయ్యా. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. బాధితుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రాణాలతో బయటపడిన వారి వివరాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ప్రమాదంలో అందరు సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాను’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. -
టాటా గ్రూపునకు మాయని మచ్చ..
టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారంప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్‌ను సమీక్షించడంలో టాటా గ్రూప్ నిబద్ధతను చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్రటాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్ నిర్మించింది.జేఆర్డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాను 1932లో జేఆర్డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్‌బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్ డాలర్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.మెగా విలీనం - 2024 నవంబర్‌లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్‌ప్రెస్‌తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి. -
ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా.. ప్రకటించిన టాటా గ్రూప్
ఢిల్లీ,సాక్షి: ఎయిరిండియా ప్రమాద మృతులకు టాటా గ్రూప్ రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు టాటా గ్రూప్ రూ. 1 కోటి అందిస్తున్నట్లు తెలిపింది. గాయపడిన బాధితులకు అయ్యే వైద్య ఖర్చులను భరిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు వారికి అవసరమైన సంరక్షణ, మద్దతు అందిస్తామన్నది. అదనంగా, ఎయిరిండియా విమానం కూలిన బీజే మెడికల్ హాస్టల్‌ను పుననిర్మిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ నోట్‌ను విడుదల చేశారు. Tata Group will provide Rs 1 crore to the families of each person who has lost their life in this tragedy. We will also cover the medical expenses of those injured and ensure that they receive all necessary care and support. Additionally, we will provide support in the building… pic.twitter.com/jBPxfmo4at— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 12, 2025 -
మృత్యుంజయుడు రమేశ్
అహ్మదాబాద్: రమేశ్ విశ్వాస్ కుమార్ బుచార్వాడ.. అత్యంత అదృష్టవంతుడంటే ఇతడే. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డాడు. 38 ఏళ్ల రమేశ్ బ్రిటీష్ జాతీయుడు. తన సోదరుడితో కలిసి లండన్‌కు పయనమయ్యాడు. ఏఐ171 విమానంలో 11ఏ సీట్లో కూర్చున్నాడు. అత్యవసర ద్వారానికి వెనుకే ఈ సీటు ఉంది. విమానం నేలకూలి మంటల్లో చిక్కుకున్న తర్వాత రమేశ్ గాయాలతో బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కొందరు వ్యక్తుల సాయంతో అంబులెన్స్ వద్దకు చేరుకున్నాడు. విమానంలోని ఇతర ప్రయాణికుల గురించి జనం అతడిని ఆరా తీశారు. చాలామంది రమేశ్ చుట్టూ గుమికూడారు. ప్రయాణికులంతా అక్కడే(ఘటనా స్థలంలో) ఉన్నారు అంటూ బలహీన స్వరంతో బదులిచ్చాడు. విమానం ఒక్కసారిగా పేలిపోయిందని, తన చుట్టూ శకలాలే కనిపించాయని చెప్పాడు. ప్రమాదం నుంచి బయటపడిన రమేశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జి.ఎస్.మాలిక్ తెలిపారు. (రమేష్ విశ్వకుమార్ కుమార్ ఎయిరిండియా విమానం టికెట్)ప్రయాణం వాయిదాతో బతికాడుఇదే విమానంలో వెళ్లాల్సిన శావ్జీభాయి తింబాడియా చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం అతడి పాలిట వరంగా మారింది. లండన్‌లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లడానికి ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. కుమారుడే విమానం టికెట్ బుక్ చేశాడు. విమానంలో సీటు కూడా తింబాడియాకు కేటాయించారు. కానీ, తింబాడియా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. తన ప్రయాణాన్ని నాలుగు రోజులపాటు వాయిదా వేసుకున్నాడు. అదే ఆయన ప్రాణాన్ని కాపాడింది. గురువారం జరిగిన ప్రమాదం గురించి తెలిసి తింబాడియా దిగ్భ్రాంతి చెందాడు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. తాను నమ్మే దైవమైన స్వామి నారాయణ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు.Miracle amidst tragedy!!!Ramesh Vishwashkumar, seated on 11A, is the sole survivor of the Air India crash in Ahmedabad. He jumped out and walked away injured. He’s currently undergoing treatment at the hospital.#AhmedabadPlaneCrash #Ahmedabad pic.twitter.com/pWIHUD7kG5— Shivangi Thakur (@thakur_shivangi) June 12, 2025 -
కేంద్రం హెచ్చరికను పెడ చెవిన పెట్టి.. 242 మంది మృతికి ఎయిరిండియానే కారణమా?
గాంధీ నగర్: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు మరణించిన జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఎయిరిండియా?నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కూలిన విమానం ఇప్పటికే గతంలో పలు మార్లు మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్‌లో పొగలు కమ్ముకున్నాయి. గతవారం ఇదే విమానం ప్యారిస్ వెళ్తుండగా మొరాయించడంతో పైలెట్ షార్జాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానానికి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు,ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. -
‘విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదు’: సీపీ
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిరిండియా ఘోర విమానం ప్రమాదంలో మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడారు. విమానం జనావాసాల్లో కూలిపోవడంతో స్థానికులు మరణించినట్లు చెప్పారు. అయితే, ఆ మరణాలు సంఖ్య ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు.


