ఆ విమానాలు నిలిపివేయడమే మంచిది | Air India 787 flight to faces technical troubles | Sakshi
Sakshi News home page

ఆ విమానాలు నిలిపివేయడమే మంచిది

Jun 23 2025 12:26 AM | Updated on Jun 23 2025 12:26 AM

Air India 787 flight to faces technical troubles

ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787–8 విమానాలపై అత్యధికుల ఆందోళన 

సమస్యలు పరిష్కారమయ్యేవరకు నిలిపివేయాలని 56 శాతం మంది సూచన 

అహ్మదాబాద్‌ ప్రమాదం తర్వాత లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787–8 రకం విమానాల్లో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వాటి సర్వీసులను నిలిపివేయడమే మంచిదని విమాన ప్రయాణాలు సాగించేవారిలో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787–8 రకం విమానం ఈ నెల 12న అహ్మదాబాద్‌లో కూలిపోవటంతో 270 దుర్మరణం చెందారు. ఈ ఘటన తర్వాత విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించి ఏయే అంశాలపై ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారన్నది తెలుసుకునేందుకు లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ దేశవ్యాప్తంగా 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.

ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా తాము ప్రయాణించబోయేది ఏ రకం విమానం అన్నదానికి ప్రయాణికులు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది. 41 శాతం మంది తాము ఏ రకమైన విమానంలో ప్రయాణించబోతున్నాము.. అది ఏ కంపెనీది అన్నది కూడా చూస్తున్నారు. సర్వేలోని కొన్ని ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు..

Advertisement
 
Advertisement
Advertisement