హైదరాబాద్‌లో హైటెన్షన్‌.. హరీష్‌రావు, తలసాని హౌస్‌ అరెస్ట్‌ | Harish Rao And BRS Leaders House Arrested In Hyderabad Ahead Of TIMS Hospital Visit, More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో హైటెన్షన్‌.. హరీష్‌రావు, తలసాని హౌస్‌ అరెస్ట్‌

Aug 19 2026 10:18 AM | Updated on Aug 19 2026 11:20 AM

Harish Rao And BRS Leaders House Arrest Over TIMS Visit

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌(TIMS) ఆసుపత్రి పరిశీలనకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కోకాపేటలోని హరీష్‌రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ఈ క్రమంలో హౌస్‌ అరెస్ట్‌పై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్బంధాలు, హౌస్‌ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రుల్లోని వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. TIMS ఆసుపత్రుల పనితీరు, అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం ముదిరే అవకాశం కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement