వికారాబాద్‌: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం.. నలుగురి దుర్మరణం | Vikarabad Bus Accident Latest News, Four Killed And Over 15 Injured In Ananthagiri Ghat Road Crash, Check Details Inside | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

Oct 3 2026 10:55 AM | Updated on Oct 3 2026 11:25 AM

Vikarabad Ananthagiri Bus Accident Latest News Updates

సాక్షి, వికారాబాద్‌/నల్లగొండ: తెలంగాణలో ఇవాళ జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 15 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

శనివారం ఉదయం యాచారం నుంచి బానూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు.. అదుపు తప్పి పక్కకి పడిపోయింది. క్షతగాత్రుల్ని రక్షించేందుకు స్థానికులు, పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.

ఇటు చౌటుప్పల్‌ మండలం తుప్రాన్‌పేట వద్ద మరో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో.. ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement