ఆలయంలో దుండగుడి దుశ్చర్య | Santoshi Mata Temple Incident in Dilsukhnagar | Sakshi
Sakshi News home page

ఆలయంలో దుండగుడి దుశ్చర్య

Oct 3 2026 8:36 AM | Updated on Oct 3 2026 8:36 AM

Santoshi Mata Temple Incident in Dilsukhnagar

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌డిపో సమీపంలో సంతోషిమాత దేవాలయంలోకి చొరబడిన డుండగుడు కర్రతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయటంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైతన్యపురి పోలీసులు తెలిపిన మేరకు.. శుక్రవారం ఉదయం ఆలయంలో భక్తులు పూజలు చేస్తున్న సమయంలో ఓ అగంతకుడు గర్భగుడిలోకి వెళ్లి  కర్రతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. పూజారి, భక్తులు వెంటనే  నిందితుడిని పట్టుకొని తాళ్లతో కట్టివేసి పోలీసులకు సమాచారం అందజేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు సిబ్బందితో వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.  

స్థానికుల ఆందోళనలు, రాస్తారోకో 
ఈ విషయం తెలుసుకున్న బీజేపి, వీహెచ్‌పి, బజరంగ్‌దల్‌ నాయకులు, కాలనీవాసులు దేవాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అనంతరం దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌ చౌక్‌ వద్ద జాతీయ రహదారిపై బైటాయించి దర్నా నిర్వహించారు. ట్రాఫిక్‌జాం కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. మెట్రో స్టేషన్, చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ వద్ద కూడా ఆందోళనకు దిగారు.  

చర్యలు తీసుకుంటాం 
ఆలయ చైర్మన్‌ శ్రీనివాసయాదవ్‌ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎల్‌బీనగర్‌ ఇంచార్జి ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. నిందితుడు సంగారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తించామని,  దిల్‌సుఖ్‌నగర్‌లో కుటుంబంతో నివసిస్తున్నట్లు  గుర్తించామన్నారు. సంతోíÙమాత ఆలయాన్ని శుక్రవారం రాత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు సందర్శించి సంఘటనగురించి ఆరా తీశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement