ఆభరణాలు తిరిగి ఇస్తానని నమ్మించి... | Incident at Miyapur hotel: Telangana | Sakshi
Sakshi News home page

ఆభరణాలు తిరిగి ఇస్తానని నమ్మించి...

Oct 3 2026 6:00 AM | Updated on Oct 3 2026 6:02 AM

Incident at Miyapur hotel: Telangana

మియాపూర్‌ హోటల్‌లో వైద్యవిద్యార్థిని హత్య 

వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ రప్పించిన వైనం 

చంపేసి గదికి తాళం వేసి.. పారిపోయినట్లు పోలీసుల అనుమానం

మియాపూర్‌: హోటల్‌ గదిలో ఓ వైద్య విద్యార్థిని హత్యకు గురై మృత్యువాత పడిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మియాపూర్‌ ఎస్‌హెచ్‌వో జయరాం తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌కు చెందిన కోమటి భూమయ్య రెండవ కుమార్తె కోటమి సృజన(27) మహబూబ్‌నగర్‌లోని ప్రభు త్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ వైద్య విద్యను పూర్తిచేసుకుని వరంగల్‌ హనుమకొండలో పీజీ చేస్తోంది. 

హనుమకొండలో తన స్నేహితులతో కలిసి ఉంటూ ఓ ఆస్పత్రిలో పీడి యాట్రీషన్‌గా పనిచేస్తోంది. సృజన మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న సమయంలో మహబూబ్‌నగర్‌ అమర చింతల్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ రవి కుమార్‌(30)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా రవి కుమార్‌ సరిగ్గా పనిచేయకుండా జులాయిగా తిరుగుతూ అప్పులు చేశాడు. అప్పులు తీర్చు తానని చెప్పి సృజన వద్ద నుంచి బంగారం తీసుకున్నాడు.

బంగారు ఆభరణాలు ఇస్తాననిచెప్పి 
రవికుమార్‌ గతనెల 29న తన స్నేహితుడుతో కలిసి మియాపూర్‌ న్యూ హఫీజ్‌పేటలోని మార్తాండనగర్‌లోని గ్రాండ్‌ బ్రోహోలిక్‌ లగ్జరీ హోటల్‌లో రూమ్‌ తీసుకున్నారు. ఆ రాత్రి ఉన్న స్నేహితుడు మరుసటి రోజు వెళ్లిపోయాడు. అదేరోజు సృజనకు ఫోన్‌ చేసి మాట్లాడుకుందామని.. బంగారు ఆభరణాలు ఇస్తానని చెప్పి హైదరాబాద్‌కు రమ్మన్నాడు. దీంతో సృజన 30న హైదరాబాద్‌ వచ్చి రవికుమార్‌తోపాటు హోటల్‌కు వెళ్లింది. ఆరోజు రాత్రి వారి మధ్య గొడవ జరిగి ఉంటుందని, నిద్రిస్తున్న సమయంలో సృజనను రవికుమార్‌ హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ క్రమంలో బంగారు ఆభరణాలు తీసుకురావడానికి హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పిందని, ఫోన్‌ చేసినా స్పందించడం లేదని స్నేహితులు సృజన తండ్రి భూమయ్యకు చెప్పడంతో ఆయన çహనుమకొండలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా మార్తాండనగర్‌ కాలనీలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం హనుమకొండ పోలీసులు మియాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. 

వారు వెళ్లి చూడగా హోటల్‌ గది బయటనుంచి తాళం వేసి ఉంది. మరో తాళంతో తలుపులు తెరిచి చూసేసరికి సృజన బెడ్‌పై విగతజీవిగా పడిఉంది. సీసీ కెమెరాలు పరిశీలించగా సృజనతో పాటు రవికుమార్‌ కూడా వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. రవికుమార్‌ సృజనను హత్యచేసి పరారై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని మియాపూర్‌ పోలీసులు స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement