అమల్లోకి క్యూర్‌ చట్టం | CURE Act comes into effect in Telangana | Sakshi
Sakshi News home page

అమల్లోకి క్యూర్‌ చట్టం

Oct 3 2026 5:40 AM | Updated on Oct 3 2026 5:40 AM

CURE Act comes into effect in Telangana

26 ఆఫ్‌ 2026 నంబర్‌తో గెజిట్‌ విడుదల 

గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలనకు కొత్త చట్టబద్ధ వ్యవస్థ 

ఆస్తి పన్ను, పౌర సేవలు తదితరాలకు కొత్త నిబంధనలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి పట్టణ పాలన­­లో కీలక మార్పులకు దారితీసే కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌ ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌) చట్టం–2026 అమల్లోకి వచి్చంది. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గెజిట్‌లో ఈ మేరకు చట్టం నంబర్‌ (26 ఆఫ్‌ 2026)ను ప్రకటించింది. సెప్టెంబర్‌ 22న ఇందుకు గవర్నర్‌ ఆమోదం లభించగా.. శుక్రవారం గెజిట్‌లో ప్రచురించారు. ఈ చట్టాన్ని క్యూర్‌లో పాలనకు సంబంధించిన చట్టాలను సమీకరించేందుకు రూపొందించారు. అయితే ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటివరకు హైదరాబాద్‌ మహానగర పాలనకు ప్రధాన ఆధారంగా ఉన్న పాత చట్టానికి బదులుగా క్యూర్‌ చట్టం రానుంది. క్యూర్‌ పరిధిలోని ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీగా నిర్వహించే కొత్త వ్యవస్థకు చట్టబద్ధత కల్పించింది. కొత్త చట్టంలో పట్టణ పాలనతో పాటు ఆస్తి పన్ను, అక్రమ నిర్మాణాల నియంత్రణ, పౌర సేవలు, సరస్సులు–నాలాల పరిరక్షణ, రోడ్లు, మౌలిక వసతుల సమన్వయం వంటి అనేక అంశాలకు సంబంధించి కొత్త నిబంధనలు ఉన్నాయి. క్యాపిటల్‌ వాల్యూ సిస్టమ్‌ (సీవీఎస్‌) ఆధారంగా ఆస్తి పన్ను విధానానికి కూడా మార్గం ఏర్పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలనలో నూతనాధ్యాయానికి ఇది అధికారికంగా నాంది పలికింది.  

ఆస్తి పన్ను లెక్కింపు విధానంలో మార్పు.. 
ఇప్పటివరకు ఉన్న వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ) ఆధారిత విధానం స్థానంలో ఆస్తి విలువ ఆధారంగా పన్ను లెక్కించే విధానం అమల్లోకి వస్తుంది. అయితే పాత ఇళ్లపై కొత్త పన్ను ఒక్కసారే పూర్తిగా పడదు. ప్రస్తుత పన్ను నుంచి కొత్త విధానంలో లెక్కించే పన్నుకు చేరే వరకు దశలవారీగా పెంచే విధానం ఉంటుంది. ఏటా అంతకుముందు ఏడాది చెల్లించిన పన్నులో గరిష్టంగా 10 శాతానికి మించకుండా చూస్తారు. ఉదాహరణ­కు ప్రస్తుతం ఒక ఇంటికి ఏడాదికి రూ.10 వేల పన్ను ఉంద­నుకుంటే.. కొత్త విధానం ప్రకారం ఆ ఆస్తికి ఎక్కువ పన్ను పడ్డా, అది ఒక్కసారే పెరగదు.

గరిష్టంగా 10శాతం పెంపుతో అంటే, రూ.11,000 వరకు మాత్రమే పెంచవచ్చు. తదుపరి ఏడాది కూ­డా రూ.11,000పై గరిష్టంగా 10 శాతం అంటే రూ.12,100 వరకు పెరుగుతుంది. ఇలా కొత్త విధానంలో ఆ ఆస్తికి నిర్ణయించే ‘బెంచ్‌మార్క్‌’పన్ను స్థాయికి చేరుకునే వరకు ఈ దశల వారీ పెంపు కొనసాగుతుంది. బెంచ్‌మార్క్‌ పన్ను అంటే కొత్త సీవీఎస్‌ ప్రకారం లెక్కిస్తే రావాల్సిన పన్నుమొత్త­మన్న మాట. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత ఆస్తి పూర్తిస్థాయి­లో కొత్త పన్ను విధానంలోకి వెళ్తుంది. ఒకవేళ ఆస్తి విలువ భవి­ష్యత్తులో పెరిగితే పన్ను కూడా మారే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement