బాపు ధ్యానమందిరంలో సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. మహేశ్‌కుమార్‌గౌడ్, పొంగులేటి, పొన్నం, అజహర్ తదితరులు
సర్వమత ప్రార్థనల్లో గవర్నర్, సీఎం
డిజిటల్ మ్యూజియం ప్రారంభం
లంగర్‌హౌస్ (హైదరాబాద్): జాతిపిత మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని శుక్రవారం లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బాపు సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బాపు ధ్యాన మందిరంలో సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడ ఉన్న పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించారు. తర్వాత బాపూఘాట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
డిజిటల్ మ్యూజియం
బాపుఘాట్‌లోని బాపు ధ్యాన మందిరంలో ఓ వైపు హాల్ ఏర్పాటుచేసి అందులో డిజిటల్ మ్యూజియం ఏర్పాటుచేశారు. గతంలో ఓ ప్రైవేట్ సంస్థ ఈ మ్యూజియం ఏర్పాటుకోసం ప్రయత్నించి విఫలమయ్యింది. కాగా గండిపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు బాపుఘాట్ పరిరక్షణ బాధ్యతలు తీసుకుని మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు. ఈ మ్యూజియాన్ని కూడా గవర్నర్, సీఎం ప్రారంభించారు. గాం«దీజీకి నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, నేతలు వి.హన్మంతరావు, షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, రాంచంద్ర నాయక్, నవీన్ యాదవ్, గద్వాల విజయలక్ష్మి, రోహిణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


