ఓయో రూమ్‌లలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతోంది? | Series of Murders in Hyderabad OYO Hotels Causes Alarm | Sakshi
Sakshi News home page

ఓయో రూమ్‌లలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతోంది?

Oct 3 2026 10:59 AM | Updated on Oct 3 2026 11:20 AM

Series of Murders in Hyderabad OYO Hotels Causes Alarm

హైదరాబాద్‌లోని ఓయో (OYO) మరియు బడ్జెట్ హోటళ్లలో వరుసగా మహిళలు హత్యకు గురవుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.  ముఖ్యంగా ఓయో పేరుతో బుకింగ్‌ జరిగే హోటల్‌ గదుల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూడటంతో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెప్టెంబర్‌ 21న మాదాపూర్‌లో షారోన్‌ నిఖిత, సెప్టెంబర్‌ 29న ఎస్‌ఆర్‌ నగర్‌లో బి. శిరీష, అక్టోబర్‌ 2న మియాపూర్‌లో పీజీ వైద్య విద్యార్థిని కోమటి సృజన హోటల్‌ గదుల్లో మృతిచెందారు. అయితే ఈ మూడు ఘటనలూ ఒకే తరహాలో ఉన్నాయని చెప్పేందుకు దర్యాప్తు పూర్తికావాల్సి ఉంది.

సెప్టెంబర్ 21 – షారోన్ నిఖిత (మాదాపూర్ ఓయో)
విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖిత, తన స్నేహితుడు రవి తేజతో కలిసి మాదాపూర్ సిద్దిక్ నగర్‌లోని ఒక ఓయో హోటల్ గదిలోకి చెక్-ఇన్ అయ్యారు. గదిలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రవి తేజ దాడి చేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని వైజాగ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.

సెప్టెంబర్ 29 – బి. శిరీష (ఎస్‌ఆర్ నగర్ ఓయో)
బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న శిరీష, ఎస్‌ఆర్ నగర్‌లోని ఓయో హోటల్‌లో శవమై కనిపించింది. పరిశీలించగా, శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి నకిలీ ఆధార్ కార్డులు (గణేష్, దుర్గ పేర్లతో) సమర్పించి హోటల్‌లో గది పొందినట్లు వెల్లడైంది. రాత్రి సమయంలో గొడవ జరగడంతో ఆమెను హత్య చేసి, తెల్లవారుజామున నిందితుడు పరారయ్యాడు.

అక్టోబర్ 2 – కోమటి సృజన (మియాపూర్ హోటల్)
మియాపూర్ పరిధిలోని హోటల్‌‌లో సృజన అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. హత్య కేసుగా నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement